రజత రజనికి స్వాగతం | Grand Welcome To Women hockey Team Captain Rajani | Sakshi
Sakshi News home page

రజత రజనికి స్వాగతం

Published Sat, Sep 8 2018 11:11 AM | Last Updated on Sat, Sep 8 2018 11:11 AM

Grand Welcome To Women hockey Team Captain Rajani - Sakshi

రజనీని సన్మానిస్తున్న శ్రీపద్మావతీ వర్సిటీ వీసీ దుర్గాభవాని, రెక్టార్‌ ఉమా, జిల్లా క్రీడాపాధికార సంస్థ సీఈఓ లక్ష్మి, తుడా చైర్మన్‌ నరసింహయాదవ్‌

రజని.. మన జిల్లా క్రీడారత్నం. హాకీలో రాణించి జిల్లాకు, దేశానికి పేరు తెచ్చిన ఆణిముత్యం. ఎర్రావారిపాళెం మండలం ఎనుములవారి పల్లె నుంచి అంతర్జాతీయ క్రీడా యవనికపై కీర్తి పతాకాన్ని ఎగరేసిన అమ్మాయి. పల్లె నుంచి ‘ఆట’ంకాలు అధిగమించి ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్తూ తాజాగా ఆసియా క్రీడల్లోనూ అపూర్వ ప్రతిభ కనబరిచిందీమె.  ఇండియా జట్టు కీపరుగా స్వర్ణావకాశం తప్పినా రజత పతకం సాధించడంలో కీలక భూమిక పోషించింది. జకార్తాలో జరిగిన క్రీడల్లో గెలిచాక శుక్రవారం తొలిసారి తిరుపతి చేరుకున్న ఈమెకు క్రీడాభిమానులు.. వివిధ సంఘాలు ఘనంగా స్వాగతం పలికాయి. ఈమెకు ప్రభుత్వం     రూ.6 లక్షల నగదు ప్రోత్సాహాన్ని ప్రకటించింది. తిరుపతిలో స్వచ్ఛభారత్‌కు రజని బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికైంది.

చిత్తూరు, తిరుపతి సిటీ:  2020లో జరిగే ఒలింపిక్స్‌లో భార త్‌ మహిళల హాకీ జట్టు తరఫున ఆడి, విజేతగా నిలిచి పతకం సాధించడమే లక్ష్యమని భారత్‌ మహిళల హాకీ జట్టు గోల్‌ కీపర్‌ యతిమరపు రజని తెలిపారు. ఏషియన్‌ గేమ్స్‌లో పాల్గొని సి   ల్వర్‌ మెడల్‌ సాధించి శుక్రవారం మొట్టమొదటి సారిగా తిరుపతికి విచ్చేసిన రజనికి జిల్లా క్రీడాపాధికార సంస్థ అధ్వర్యంలో అధికారులు, క్రీడా సం ఘాల ప్రతినిధులు  శ్రీపద్మావతి మహిళ వర్సిటీలో పౌర సన్మానం చేశారు. ఈ సందర్భంగా రజని మాట్లాడుతూ 20 ఏళ్ల తరువాత హాకీలో సిల్వర్‌ మెడల్‌ సాధించినట్లు తెలిపారు. 2016లో ఒకసారి మహిళా వర్సిటీకి వచ్చానని, తిరిగి 2020లో ఒలింపిక్స్‌లో పతకం సాధించి మళ్లీ ఇక్కడికి వస్తానని విద్యార్థులకు తెలిపారు.

ప్రభుత్వం తరపున రూ.6 లక్షలు
ఏషియన్‌ గేమ్స్‌లో సిల్వర్‌ పతకం సాధించిన రజ నికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.6 లక్షలు జిల్లా కలెక్టర్‌ ప్రకటించారని జిల్లా క్రీడాపాధికార సంస్థ సీఈఓ లక్ష్మీ తెలిపారు. విద్యార్థులు రజనీని స్ఫూర్తిగా తీసుకుని చదువులో, క్రీడల్లో రాణిం చాలని కోరారు.  తుడా చైర్మన్‌ నరసింహయాదవ్, ఒలింపిక్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్‌రెడ్డి, మహిళ వర్సిటీ వీసీ దుర్గాభవాని, రెక్టార్‌ ఉమ మాట్లాడుతూ మారుమూల గ్రామానికి  చెందిన రజని నేడు ఇండియా హాకీ జట్టులో స్థానం సంపాదించడం ఎంతో గర్వకారణమన్నా రు. అంతకు ముందు రజనీని మున్సిపల్‌ కమిషనర్‌ విజయరామరాజు దుశ్శాలువతో సత్కరించి శ్రీవారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌ఏ చీఫ్‌ కోచ్‌ సుదర్శనం నాయుడు, రెజ్లింగ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ మిట్టపల్లి సురేంద్రరెడ్డి, ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి శ్రీధర్, బాడీ బిల్డర్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి పాండ్రవేటి గిరి, కబడ్డీ కోచ్‌ బాలాజీ, హాకీ కోచ్‌లు వెంకటరమణ, లక్ష్మీ నారాయణ, జూడో కోచ్‌ గోపి, రజనీ తల్లిదండ్రులు పాల్గొన్నారు.

విమానాశ్రయంలో ఘన స్వాగతం
రేణిగుంట:  భారత హాకీ జట్టు గోల్‌కీపర్‌ రజనీకి శుక్రవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఒంటి గం టకు ఆమె రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్, జిల్లా క్రీడా సాధికార సంస్థ, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆయా సంస్థల ప్రతినిధులు, విద్యార్థినులు పుష్పగుచ్ఛాలను అందించి స్వాగతం పలికారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు ఆసక్తిని కనబరిచారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసియా క్రీడల్లో సిల్వర్‌ మెడల్‌ సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పతకం కోసం తాను పది సంవత్సరాల పాటు శ్రమించానన్నారు. ఈ స్థాయికి వచ్చాక అందరూ గుర్తిస్తున్నారే కానీ, కొన్నేళ్లపాటు తాను ఎన్నో ఇబ్బందులు, కష్టాలను ఎదుర్కొన్నానని తెలిపారు.

స్మార్ట్‌ సిటీ అంబాసిడర్‌గా రజని
తిరుపతి తుడా: ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి స్మార్ట్‌ సిటీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా అంతర్జాతీయ హాకీ ప్లేయర్‌ రజనీ నియమితులయ్యారు. జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న, కమిషనర్‌ విజయ్‌రామరాజు చర్చించి ఆమెను తిరుపతి స్మార్ట్‌ సిటీ బ్రాండ్‌ అం బాసిడర్‌గా నియమించారు. అలానే స్వచ్ఛ తిరుపతికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించారు. హాకీలో అంతర్జాతీయ స్థాయిలో రాణించిన రజనీని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించడంపై కమిషనర్‌ విజయ్‌రామరాజు హర్షం వ్యక్తం చేశారు. ‘సాక్షి’తో కమిషనర్‌ మాట్లాడుతూ రజనీని విద్యా ర్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తిరుపతి పరపతిని మరింత ఇనుమడింప చేసేందుకు, స్వచ్ఛతపై ప్రజల్లో చైతన్య పరిచేందుకు రజనీ సేవలను వినియోగించుకుంటామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement