
పెర్త్: ప్రపంచ రెండో ర్యాంకర్ ఆస్ట్రేలియాతో జరిగిన చివరిదైన రెండో మ్యాచ్‌లో భారత హాకీ జట్టు 2–5తో పరాజయం చవిచూసింది. ఈ పర్యటనను ఓటమితో ముగించింది. ఆస్ట్రేలియా తరఫున ట్రెంట్ మిటన్ (11వ, 24వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... ఫ్లిన్ ఒగిల్వి (3వ నిమిషంలో), బ్లేక్ గోవర్స్ (28వ నిమిషంలో), టిమ్ బ్రాండ్ (43వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. భారత్ తరఫున నీలకంఠ శర్మ (12వ నిమిషంలో), రూపిందర్ పాల్ సింగ్ (53వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment