
సియోల్:ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో భాగంగా దక్షిణకొరియాతో ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో భారత మహిళలు శుభారంభం చేశారు. చివరివరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత మహిళలలు 1-0తో విజయం సాధించారు. మ్యాచ్ ఐదో నిమిషంలో భారత క్రీడాకారిణి లాల్రేమ్‌షియామి గోల్ చేసి భారత్‌ను ఆధిక్యంలో నిలిపింది. ఆ తరువాత దక్షిణకొరియా గోల్ చేయడానికి చివరివరకూ యత్నించినా ఫలితం దక్కలేదు. భారత రక్షణశ్రేణిని ఛేదించలేకపోయిన దక్షిణకొరియా జట్టు గోల్ చేయడంలో విఫలమైంది.
భారత జట్టుకు మరో గోల్ చేసే అవకాశం వచ్చినా దాన్ని దక్షిణకొరియా అడ్డుకుంది. ఆట రెండో క్వార్టర్‌లో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకోలేపోయింది. దక్షిణకొరియా గోల్ కీపర్ మిజిన్ సమర్ధవంతంగా పెనాల్టీ కార్నర్‌ను గోల్ పోస్ట్‌లోకి వెళ్లకుండా ఆపి భారత్ స్కోరును మరింత పెరగకుండా నిలువరించింది. కాగా, ఆట ముగిసే సమయానికి భారత్ ఆధిక్యంలో నిలవడంతో సిరీస్‌లో తొలి గెలుపును అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment