పట్టణంలోని జావీద్ భాయ్ మినీ స్టేడియంలో గురువారం అండర్-21 జూనియర్ బాలుర విభాగంలో రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో పాల్గొననున్న జిల్లా జట్టును ఎంపిక చేశారు.
ఆర్మూర్ టౌన్, న్యూస్‌లైన్: పట్టణంలోని జావీద్ భాయ్ మినీ స్టేడియంలో గురువారం అండర్-21 జూనియర్ బాలుర విభాగంలో రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో పాల్గొననున్న జిల్లా జట్టును ఎంపిక చేశారు. జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యం లో ఈ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వి హరీష్, బి సుధీర్, కె ఉదేశ్, ఎన్ శ్రీకాంత్, కె రవి, వి వంశీ, కె ప్రవీణ్, కె యోగి, యు శ్రీకాంత్, జి బాలాజీ రెడ్డి, బి సాయి తేజ, వి సుజిన్, ఎన్ సాయి చరణ్, కె రాహూల్, ఎం అజయ్, కెబి హరత్‌లు అండర్-21 బాలుర జట్టుకు ఎంపిక చేశారు. వీరంతా ఈ నెల 22, 23, 24 తేదీల్లో అనంతపురం జిల్లా ధర్మవరంలో నిర్వహించనున్న రాష్ట్ర పోటీల్లో జిల్లా తరపున ప్రతినిధ్యం వహించనున్నట్లు కార్యనిర్వాహక కార్యదర్శి కె అంజు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జీవీ నర్సిం హారెడ్డి, కార్యదర్శి రమణ, టీచర్లు అభినందించారు.