select
-
ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా?
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైల్లో ఉన్నంత వరకూ మేయర్ ఎన్నిక వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రిసైడింగ్ అధికారిని నామినేట్ చేసే హక్కు ఎల్జీకి ఉన్నప్పటికీ, ప్రిసైడింగ్ అధికారిగా ఎవరిని నామినేట్ చేయాలనే విషయంలో సీఎం సూచన తప్పనిసరి. సీఎం జైలులో ఉన్నందున సంబంధిత ఫైలును ఢిల్లీ ప్రధాన కార్యదర్శి ఎల్జీ కార్యాలయానికి పంపించాల్సి వచ్చింది.ప్రిసైడింగ్ అధికారిని నామినేట్ చేయకపోవడంతో ఏప్రిల్ 26న మేయర్ ఎన్నిక జరగలేదు. దీంతో ప్రస్తుత మేయర్ షెల్లీ ఒబెరాయ్ తన బాధ్యతలను కొనసాగించనున్నారు. ఆమె ఎంసీడీ సాధారణ సమావేశాలను నిర్వహించడాన్ని కొనసాగిస్తునే ఉంటారు. అయితే ఇటువంటి సందర్భాల్లో ఆర్థిక, విధానపరమైన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. -
రాజస్థాన్ సీఎం ఎంపికకు ఛత్తీస్‌గఢ్ ఫార్ములా?
రాజస్థాన్ తదుపరి సీఎం ఎవరు? రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించినప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ సీఎం ఎంపికకు మల్లగుల్లాలు పడుతోంది. రాజస్థాన్‌కు కొత్త సీఎంను ఎంపిక చేసే బాధ్యతను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో సహా ముగ్గురు పరిశీలకులకు పార్టీ హైకమాండ్ అప్పగించింది. ఈ నేపధ్యంలో వారు జైపూర్ చేరుకుని, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. అయితే ఇంతలోనే ఛత్తీస్‌గఢ్‌లో కొత్త సీఎం పేరును బీజేపీ ప్రకటించింది. దీంతో రాజస్థాన్‌లో సీఎంను ఎంపిక చేసేందుకు బీజేపీ ఛత్తీస్‌గఢ్ ఫార్ములాను అనుసరించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన సామాజిక వర్గానికి చెందిన విష్ణు దేవ్‌సాయిని ముఖ్యమంత్రిగా నియమించిన బీజేపీ తన భవిష్యత్ వ్యూహానికి సంబంధించిన అనేక లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సావో, జనరల్ కేటగిరీ నుంచి వచ్చిన విజయ్ శర్మలను డిప్యూటీలుగా నియమించడం ద్వారా పార్టీలోని సామాజిక, రాజకీయ, అంతర్గత సమీకరణాలను చక్కదిద్దేందుకు బీజేపీ తన వంతు కృషి చేసింది. ఈ విధమైన ఫార్ములా ద్వారా లోక్‌సభ- 2024 ఎన్నికల వ్యూహానికి అనుగుణమైన రహదారిని ఏర్పాటు చేసింది. బీజేపీ తన ప్రత్యేక వ్యూహంలో భాగంగా గిరిజన సమాజాన్ని అక్కున చేర్చుకుంది. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్నో కార్యక్రమాలను కూడా చేపట్టింది. ద్రౌపది ముర్ముని రాష్ట్రపతిని చేయడం లేదా బిర్సా ముండా జన్మదినాన్ని గిరిజన దినోత్సవంగా ప్రకటించడం, తాజాగా గిరిజన ముఖ్యమంత్రిని ఎంచుకోవడం.. ఇవన్నీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటి వరకు రాజస్థాన్‌లో వసుంధర రాజే, బాబా బాలక్‌నాథ్‌లు సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారనే వాదన వినిపించింది. అయితే ఈ రేసులో నుంచి తాను తప్పుకుంటున్నట్లు బాబా బాలక్‌నాథ్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు వసుంధర రాజేను సీఎం చేసే విషయమై పార్టీ ఇంతవరకూ ఏమీ తేల్చలేదు. మరోవైపు సీఎం రేసులో అశ్విని వైష్ణవ్, కిరోరి లాల్ మీనా, రాజ్యవర్ధన్ రాథోడ్, గజేంద్ర సింగ్ షెకావత్, ఓం బిర్లా, దియా కుమారి, అర్జున్ రామ్ మేఘ్వాల్, సీపీ జోషి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. రాజస్థాన్‌లో జాట్ జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ ఆ కమ్యూనిటీకి చెందిన ఏ నేత కూడా ముఖ్యమంత్రి పదవికి చేరుకోలేకపోయాడనే అసంతృప్తి ఆ వర్గంలో ఉంది. గతంలో జాట్ కమ్యూనిటీకి చెందిన నేతల పేర్లు సీఎం రేసులో వినిపించాయి. అయితే చివరి నిముషంలో వారెవరికీ అవకాశం దక్కలేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల విషయంలో ఇదే జరిగింది. 1973లో రామ్నివాస్ మిర్ధా, 1998లో పరశ్రమ్ మదెర్నా, 2008లో శిశ్రామ్ ఓలా.. ఇలా ఈ ముగ్గురూ నాడు సీఎం పదవికి పోటీదారులుగా నిలిచారు. కానీ వారికి ఎమ్మెల్యేల నుంచి మద్దతు లభించలేదు. ఈసారి కూడా జాట్ నేతను సీఎం చేయాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. దీనికి మద్దతుగా ఒక హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. రాజస్థాన్‌లోని 10 జిల్లాల్లో దాదాపు 65 స్థానాలపై జాట్ ఓటర్లు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తున్నారు. అలాగే 100 సీట్లపై నిర్ణయం తీసుకునే కీల పాత్ర పోషిస్తున్నారు. అందుకే రాజస్థాన్ శాసనసభా పక్ష సమావేశంలో బీజేపీ నేతలు ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇది కూడా చదవండి: జమ్ము కశ్మీర్‌కు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు: అమిత్ షా -
భర్తకు కూరగాయల ఎంపిక పరీక్ష.. పాసవుతాడా?
ప్రతీ ఇంటిలో భార్యాభర్తల మధ్య గొడవలనేవి సాధారణంగా వస్తూనే ఉంటాయి. దంపతుల మధ్య గొడవలనేవి లేకపోతే మాధుర్యమే ఉండదని అనేవారు కూడా ఉన్నారు. ముఖ్యంగా దంపతుల మధ్య ఇంటిలోని వస్తువులను కొనుగోలు చేసే విషయంలో గొడవలు వస్తుంటాయి. భార్యాభర్తలు మార్కెట్‌కు వెళ్లి, వస్తువులు కొనుగోలు చేస్తున్నప్పుడు వారి మధ్య వాదనలు చోటుచేసుకుంటాయి. అలాగే భార్య.. భర్తకు లిస్టు ఇచ్చి, ఏమైనా సరుకులు తీసుకురమ్మని చెప్పినప్పుడు, భర్త ఏదైనా మరచిపోతే వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. తాజాగా ఇలాంటి ఒక ఉదంతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక భార్య.. మార్కెట్‌కు వెళ్లి, తీసుకురావాల్సిన కూరగాయల లిస్టును భర్తకు ఇచ్చింది. దానిలో తీసుకురావాల్సిన కూరగాయల గురించి రాసింది. అవి ఏ రీతిలో ఉండాలో క్షుణ్ణంగా రాసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లిస్టును చూసినవారికి తల తిరిగిపోతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ కూరగాయల లిస్టులో ముందుగా టమాటాలు ఎలా ఉండాలో తెలిపింది. టొమాటాలు పసుపు, ఎరుపు రంగులోనే ఉండాలని, వాటికి పగుళ్లు ఉండకూడదని రాసింది. తరువాత ఉల్లిపాయల విషయానికొస్తే.. ఈ జాబితాను రూపొందించిన భార్య ఉల్లిపాయ బొమ్మ గీసి, ఎలాంటి ఉల్లిపాయలను ఎంచి తీసుకురావాలో వివరించింది. అదేవిధంగా బంగాళాదుంపల ఎంపిక వివరాలు కూడా ఉన్నాయి. అలాగే మిరపకాయలు, పాలకూర, లేడీ ఫింగర్.. ఇలా వీటి కొనుగోలుకు సంబంధించిన వివరణాత్మక సమాచారం ఆ చీటీలో ఉంది. జాబితా చివరలో ఇవి కూరగాయల వ్యాపారి దగ్గరి నుంచి తీసుకురావాలని ఆ భార్య గుర్తుచేసింది. ఈ పోస్ట్ @trolls_official అనే పేజీ ద్వారా Instagramలో షేర్ చేశారు. ఈ జాబితాను చూసిన నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఒక యూజర్ ఇలా రాశాడు ‘ఆ మహిళకు అవార్డు ఇవ్వాల్సిందే’ అనగా, మరో యూజర్ ఈ మహిళ ఆమె పనిచేస్తున్న కార్యాలయంలో మంచి ఎక్స్‌ప్లైనర్ అయివుంటుందని రాశారు. ఇది కూడా చదవండి: ఆమె రూ. 6 లక్షలుపెట్టి బొమ్మలను ఎందుకు కొంది? డైపర్లు ఎందుకు మారుస్తుంది? -
22నుంచి గ్రూప్-1 ఇంటర్వ్యూలు
సాక్షి, అమరావతి, ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 ఇంటర్వ్యూలు ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 20వ తేదీ వరకు జరుగుతాయి. ఈ ఇంటర్వ్యూల నిర్వహణ కోసం 18మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది. కాగా, మొత్తం 152 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. -
మెకానిక్ కూతురు ఎస్ఐ
కర్నూలు (సిటీ): కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని ఓ మెకానిక్ కుమార్తె నిరూపించారు. కల్లూరు ఎస్టేట్‌లోని భగవాన్ నగర్‌కు చెందిన దాసరి దాసప్ప, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె లలిత ఇటీవల పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన సబ్ఇన్స్పెక్టర్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించారు. ఈ దంపతులకు నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు. దాసప్ప కార్ల మెకానిక్ షెడ్లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెద్ద కుమార్తెకు వివాహమైంది. రెండో కుమార్తె జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. మూడో కుమార్తె లలిత సబ్ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యారు. ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు కల్లూరు ఎస్టేట్‌లోని శ్రీశాంతి నికేతన్ స్కూలులో, ఇంటర్ టౌన్ మోడల్ జూనియర్ కళాశాల, డిగ్రీ కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో చదివారు. అనంతరం పీజీ బయో కెమిస్ట్రీ ఎస్వీ యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఆర్థిక ఇబ్బందులతో సుదూర ప్రాంతాలకు వెళ్లి కోచింగ్ తీసుకోలేకపోయారు. లలిత ఇబ్బందులను గుర్తించి కర్నూలు నగరంలోని వివేక్ అకాడమీ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు ఉచితంగా కోచింగ్ అందించారు. ఇటీవల నిర్వహించిన పోలీసు శాఖ నిర్వహించిన పరీక్షల్లో 206 మార్కులతో (హాల్ టిక్కెట్ నెంబర్ 5095999) సులువుగా విజయం సాధించారు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో నాలుగో జోన్ పరిధిలో మొత్తం 39 మంది ఎంపికయ్యారు. వీరిలో 16 మంది కర్నూలు జిల్లాకు చెందినవారు ఉండటం, వారిలోను పది మంది మహిళలు ఉండటం గమనార్హం. చాలా ఆనందంగా ఉంది: లలిత మా నాన్న మా కోసం పడుతున్న కష్టాన్ని చూసి పట్టుదలతో చదివాను. 2015 నుంచి వివేక్ అకాడమీ డైరెక్టర్ సలహా మేరకు గ్రూప్–2 శిక్షణ తీసుకున్నాను. ఉచితంగానే శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రత్యేకంగా సలహాలు, సూచనలు ఇవ్వడంతో ఉద్యోగ సాధనకు ఎంతో ఉపయోగపడింది. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టును మొదటి ప్రయత్నంలోనే సాధించడం చాలా ఆనందంగా ఉంది. -
బాలల కెబినెట్ ఎన్నిక
గద్వాల న్యూటౌన్ : స్వచ్ఛ విద్యాలయలో భాగంగా శుక్రవారం పట్టణంలోని బుర్దపేట ఉన్నత పాఠశాలలో బాలల క్యాబినెట్ ఎన్నుకున్నట్లు ప్రధానోపాధ్యాయుడు గోపీనాథ్ తెలిపారు. ప్రతి తరగతి నుంచి ముగ్గురు విద్యార్థినులు, ఇద్దరు విద్యార్థుల చొప్పున అయిదు తరగతులకు 25 మంది ప్రతినిధులను ఎన్నుకున్నారు. ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి, విద్యా, పర్యావరణ, తాగునీరు, పారిశుధ్యం, ఆహారం, క్రీడలు, ఆరోగ్యం, నైతిక విలువలు తదితర మంత్రిత్వ శాఖలకు ఎన్నికలు నిర్వహించారు. ప్రధాన మంత్రిగా విద్యార్థి చంద్రశేఖరాచారి, ఉప ప్రధానిగా జగదీశ్వరి ఎన్నికయ్యారు. బాలల క్యాబినెట్ ద్వారా పాఠశాల మరింత అభివద్ధి చెందుతుందని హెచ్ఎం పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు భానుప్రకాష్, ఏఎన్ చారి, కష్ణకుమార్, శ్రీనివాసులు, కష్ణయ్య, జ్యోత్సS్న, అనిత తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ చెస్ పోటీలకు ఎంపిక
గుంటూరు రూరల్ : విద్యతోపాటు క్రీడల్లో ప్రావీణ్యత పెంపొందించుకుంటే ఉన్నత స్థాయికి ఎదగగలమని తమ పాఠశాల విద్యార్థి నిరూపించాడని కేంద్రియ విద్యాలయం ప్రిన్సిపల్ ఎమ్ రాజేశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ చెస్ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికయిన 9వ తరగతి విద్యార్థి జి.హరిసూర్యభరద్వాజ్కు గురువారం నల్లపాడు గ్రామంలోని కేంద్రియ విద్యాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత ఏడాది జరిగిన ఎస్జీఎఫ్ఐ జాతీయ స్థాయి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి భరద్వాజ్ స్పెషల్ ప్లేయర్‌గా బోర్డ్ విన్నర్ ప్రై జ్ను కైవశం చేసుకున్నాడన్నారు. జమ్మూకాశ్మీర్‌లో ఈవారం జరిగే అంతర్జాతీయస్థాయి సౌత్ ఏషియన్ అమ్మీటర్ చెస్ చాంపియన్ షిప్ పోటీలకు ఎంపికయ్యాడని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా భరద్వాజ్‌ను పాఠశాల పీఈటీ కిరణ్‌రెడ్డి, అధ్యాపకులు అభినందించారు. -
రాష్ట్ర స్థాయి సెమినార్‌కు కొంపెల్లి విద్యార్థిని ఎంపిక
మునుగోడు : ఈ నెల 30న ౖహె దరాబార్‌లో జరిగే రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి కొంపల్లి పాఠశాల విద్యార్థిని అనిత ఎంపికైంది. ఈ నెల 10న జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్ పోటీలు జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో నిర్వహించగా పాల్గొని సుశృత పప్పు దినుసుల సాగు విధానం, సవాళ్లపై సెమినార్ ఇచ్చిం ది. ఆమె సెమినార్ పై జిల్లాస్థాయి నుంచి ఎంపిక చేసి శనివారం రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు డిప్యూటీ ఈఓ చేతుల మీదు గా ఎంపిక పత్రంతో పాటు ప్రశంస పత్రా న్ని అందించారు. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యాదగిరి తదితరులు అనితను అభినందించారు. -
వైఎస్సార్ సీపీ మండలాధ్యక్షుల ఎంపిక
15 మండలాలకు నూతన అధ్యక్షుల నియామకం పేర్లు ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకింత్రెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల పేర్లు ఖరారయ్యాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి మండల అధ్యక్షుల పేర్లను అధికారికంగా ప్రకటించారు. అధ్యక్షులుగా ఎంపికైనవారిలో ఎన్.శ్రీకాంత్‌గౌడ్(తాండూరు), పల్ల వెంకటేశం (పెద్దేముల్), కూర విశ్వనాథం (బషీరాబాద్), పి.గోపాల్ (యాలాల), జి.చంద్రయ్య (గండేడ్), దేశ్‌ముఖ్ రాంచందర్‌రావు(ధారూరు), పంతాల శ్రీకాంత్‌రెడ్డి (బంట్వారం), ఎం.శ్రీనివాస్‌రెడ్డి (మర్పల్లి), అజీజ్పటేల్ (మోమిన్‌పేట్), జె.కిష్టయ్య (కందుకూరు), యండీ.అక్రంఖాన్(శంషాబాద్), ఏ.రాజిరెడ్డి (మేడ్చల్), పరకాల డానిల్ (శామీర్‌పేట్), యు.సోమన్న (కీసర), బి.శ్రీనివాస్ (ఘట్కేసర్) ఉన్నారు. -
కిక్‌బాక్సింగ్ పోటీలకు వనపర్తి విద్యార్థులు
కిక్‌బాక్సింగ్ పోటీలకు వనపర్తి విద్యార్థులు వనపర్తి: ఏపీ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న వాకోఇండియా జాతీయస్థాయి కిక్‌బాక్సింగ్ పోటీల్లో వనపర్తికి చెందిన గొజూరియో కరాటేఅండ్ కిక్‌బాక్సింగ్ అకాడమి విద్యార్థులు పాల్గొననున్నారు. 85 కేజీల విభాగంలో ఎస్. ఉదయ్, 55 కేజీల విభాగంలో ఎస్. రాజశేఖర్, 45 కేజీల విభాగంలో ఎస్.వరుణ్, 60 కేజీల విభాగంలోఎ. చంద్రకుమార్ పాల్గొంటారని మాస్టర్ శేఖర్ తెలిపారు. మంగళవారం వారు వనపర్తి నుంచి బయల్దేరి వెళ్లారు. -
గూగుల్ స్టార్టప్ ప్రొగ్రామ్‌కు... మై మెడికేర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మై మెడికేర్ సార్టప్ గూగుల్ స్టార్టప్ ప్రొగ్రామ్‌కు ఎంపికైంది. ఈనెల 28న క్యాలిఫోర్నియాలో జరగనున్న ఈ కార్యక్రమంలో 80 దేశాల్లోని 200 నగరాల నుంచి 50 ఉత్తమ కంపెనీలు పాల్గొననున్నాయి. ఆ 50 కంపెనీల్లో మై మెడికేర్ ఒకటని సంస్థ సీఈఓ శ్రీనివాస్ తుమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మై మెడికేర్ పనేంటంటే.. వైద్యులను, క్లినిక్స్, మందుల దుకాణాలను, డయోగ్నస్టిక్ సెంటర్లను ఒకే వేదిక తీసుకొచ్చింది. దీంతో పేషెంట్లు తమకు అవసరమైన సేవలను క్లిక్ దూరంలోనే వినియోగించుకోవచ్చన్నమాట. -
కోల్ ఇండియా చైర్మన్‌గా సుతీర్థ భట్టాచార్య
సాక్షి, హైదరాబాద్: కోల్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి సుతీర్థ భట్టాచార్య ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కోల్ ఇండియా కొత్త చైర్మన్ పోస్టుకు సెలెక్షన్ బోర్డు మంగళవారం కోల్‌కతాలో ఇంటర్వ్యూలు నిర్వహించింది. ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన సీనియర్ అధికారులతోపాటు మొత్తం పన్నెండు మంది పోటీపడగా.. సుతీర్థ భట్టాచార్యను చైర్మన్ పోస్టు వరించింది. దీంతో ఈ పోస్టును వరుసగా ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారులే దక్కించుకున్నట్లయింది. గతంలో కోల్ ఇండియా సీఎండీగా పనిచేసిన నర్సింగరావు మే నెలలోనే రాష్ట్రానికి తిరిగి వచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. నర్సింగరావు కూడా ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి కావటం విశేషం. అంతకు ముందు ఆయన కూడా సింగరేణి కాలరీస్ సార థిగా వ్యవహరించారు. 1985 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన భట్టాచార్య 2012 మే నుంచి సింగరేణి సీఎండీగా ఉన్నారు. ఆయన హయాంలో సింగరేణి కాలరీస్ అభివృద్ధిపథంలో సాగింది. ఏటేటా 55 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుంది. అందుకే సెలక్షన్ బోర్డు ఆయన నియామకానికి మొగ్గు చూపినట్లు సమాచారం. -
మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి
-
మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి ఖరారు
హైదరాబాద్: మెదక్ లోక్‌సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆమె పేరును ఖరారు చేసింది. మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఏకగ్రీవంగా సునీత లక్ష్మారెడ్డికి మద్దతు పలికారు. కాగా టికెట్ కోసం పోటీ పడ్డ మాజీ విప్ జగ్గారెడ్డి నిరుత్సాహానికి గురైనట్టు సమాచారం. టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు మెదక్ ఎంపీ, గజ్వేల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి సునీత శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. -
రాజధాని ఎంపికపై 24న తొలి భేటీ
-
రాజధాని ఎంపికపై 24న తొలి భేటీ
ఢిల్లీలో సమావేశం కానున్న శివరామకృష్ణన్ కమిటీ ఐఏఎస్, ఐపీఎస్‌ల పంపిణీకి రేపు ప్రత్యూష సిన్హా కమిటీ సమావేశం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఎంపికకు ఏర్పాటైన కమిటీ తొలిసారిగా ఈ నెల 24న ఢిల్లీలో సమావేశం కానుంది. పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి కె.సి.శివరామకృష్ణన్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ కొత్త రాజధాని ఎంపికకు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించనుంది. రాజ్‌భవన్, సచివాలయం, శాసనసభ, శాసన మండలి, హైకోర్టు, అతిథి గృహాలు, ఇతర నిర్మాణాలతోపాటు సహజ వనరులు, నీటి వసతి, రవాణా తదితర విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని మార్గదర్శకాల్లో స్పష్టంచేశారు. వీటిని అనుసరించి కొత్త రాజధాని ఏర్పాటుకు అనువైన ప్రాంతాలు ఏమిటో కమటీ చర్చించనుంది. అదేవిధంగా అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీపై ఏర్పాటైన ప్రత్యూష సిన్హా కమిటీ సమావేశం మంగళవారం జరగనుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీ మార్గదర్శకాలను ఈ సమావేశంలో ఖరారు చేయవచ్చని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. డెరైక్ట్ రిక్రూట్మెంట్ అధికారులను ఏ ప్రాంతానికి చెందిన వారిని ఆ ప్రాంతానికి, మిగతా వారిని రోస్టర్ విధానంలో కేటాయించాలని ప్రత్యూష సిన్హా కమిటీ నిర్ణయానికి వచ్చింది. మంగళవారం జరిగే సమావేశంలో దీనికి తుదిరూపం ఇవ్వనుంది. రాష్ట్ర కేడర్ ఉద్యోగుల పంపిణీకి ఏర్పాటైన కమలనాథన్ కమిటీ బుధవారం ఢిల్లీలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర కేడర్ ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలకు తుదిరూపు ఇవ్వనున్నారు. అలాగే రాష్ట్ర పున ర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న పలు అంశాలపై కేంద్రం తీసుకోవాల్సిన అంశాలపై కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే ఈనెల 24న సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలన్నింటిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ప్రసన్నకుమార్ మహంతి పాల్గొననున్నారు. ఇందుకోసం ఆయన సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీ భవన్ శబరి బ్లాక్ ఆంధ్రాకు,స్వర్ణముఖి తెలంగాణకు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ పంపిణీ కోసం రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్యాంబాబు, సాధారణ పరిపాలన శాఖ (ప్రొటోకాల్) ప్రత్యేక కార్యదర్శి రమణారెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. వీరు 19 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఏపీ భవన్‌ను సందర్శించి ఇరు ప్రాంతాలకు పంపిణీ చేయాల్సిన బ్లాక్‌లు, గదులపై బ్లూప్రింట్‌ను రూపొందించి, గవర్నర్‌కు ఇవ్వనున్నారు. ఇక్కడి శబరి బ్లాక్‌ను ఆంధ్రప్రదేశకు, సర్వముఖి బ్లాక్‌ను తెలంగాణకు కేటాయించాలని అధికారులు ప్రతిపాదించారు. గోదావరి బ్లాకులో ఉన్న గదులను జనాభా నిష్పత్తి ప్రకారం ఇరు రాష్ట్రాలకు కేటాయించనున్నారు. అంబేద్కర్ ఆడిటోరియాన్ని ఇరు రాష్ట్రాలు ఉమ్మడిగా వినియోగించుకోవాలని ప్రతిపాదించనున్నారు. ఆదాయ వనరులపై నేడు కేంద్ర అధికారులతో ఎస్.పి. సింగ్ భేటీ ఆదాయ వనరుల పంపిణీకి అనుసరించాల్సిన విధానంపై చర్చించేందుకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.పి.సింగ్ సోమవారం ఢిల్లీలో కేంద్ర అధికారులతో భేటీ కానున్నారు. అలాగే ఇరు రాష్ట్రాల్లో ఆదాయ వనరుల సమీకరణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై అధ్యయనం చేయడానికి ఆయన 24వ తేదీన పాట్నా, 29న రాయ్‌పూర్ వెళ్లనున్నారు. ఈ మేరకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. -
రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
ఆర్మూర్ టౌన్, న్యూస్‌లైన్: పట్టణంలోని జావీద్ భాయ్ మినీ స్టేడియంలో గురువారం అండర్-21 జూనియర్ బాలుర విభాగంలో రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో పాల్గొననున్న జిల్లా జట్టును ఎంపిక చేశారు. జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యం లో ఈ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వి హరీష్, బి సుధీర్, కె ఉదేశ్, ఎన్ శ్రీకాంత్, కె రవి, వి వంశీ, కె ప్రవీణ్, కె యోగి, యు శ్రీకాంత్, జి బాలాజీ రెడ్డి, బి సాయి తేజ, వి సుజిన్, ఎన్ సాయి చరణ్, కె రాహూల్, ఎం అజయ్, కెబి హరత్లు అండర్-21 బాలుర జట్టుకు ఎంపిక చేశారు. వీరంతా ఈ నెల 22, 23, 24 తేదీల్లో అనంతపురం జిల్లా ధర్మవరంలో నిర్వహించనున్న రాష్ట్ర పోటీల్లో జిల్లా తరపున ప్రతినిధ్యం వహించనున్నట్లు కార్యనిర్వాహక కార్యదర్శి కె అంజు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జీవీ నర్సిం హారెడ్డి, కార్యదర్శి రమణ, టీచర్లు అభినందించారు.