
మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి ఖరారు
హైదరాబాద్: మెదక్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆమె పేరును ఖరారు చేసింది. మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఏకగ్రీవంగా సునీత లక్ష్మారెడ్డికి మద్దతు పలికారు. కాగా టికెట్ కోసం పోటీ పడ్డ మాజీ విప్ జగ్గారెడ్డి నిరుత్సాహానికి గురైనట్టు సమాచారం.
టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు మెదక్ ఎంపీ, గజ్వేల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి సునీత శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.