అంతర్జాతీయ చెస్ పోటీలకు ఎంపిక
అంతర్జాతీయ చెస్ పోటీలకు ఎంపిక
Published Thu, Sep 1 2016 10:28 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
గుంటూరు రూరల్ : విద్యతోపాటు క్రీడల్లో ప్రావీణ్యత పెంపొందించుకుంటే ఉన్నత స్థాయికి ఎదగగలమని తమ పాఠశాల విద్యార్థి నిరూపించాడని కేంద్రియ విద్యాలయం ప్రిన్సిపల్ ఎమ్ రాజేశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ చెస్ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికయిన 9వ తరగతి విద్యార్థి జి.హరిసూర్యభరద్వాజ్‌కు గురువారం నల్లపాడు గ్రామంలోని కేంద్రియ విద్యాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత ఏడాది జరిగిన ఎస్‌జీఎఫ్‌ఐ జాతీయ స్థాయి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి భరద్వాజ్ స్పెషల్ ప్లేయర్‌గా బోర్డ్ విన్నర్ ప్రై జ్‌ను కైవశం చేసుకున్నాడన్నారు. జమ్మూకాశ్మీర్‌లో ఈవారం జరిగే అంతర్జాతీయస్థాయి సౌత్ ఏషియన్ అమ్మీటర్ చెస్ చాంపియన్ షిప్ పోటీలకు ఎంపికయ్యాడని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా భరద్వాజ్‌ను పాఠశాల పీఈటీ కిరణ్‌రెడ్డి, అధ్యాపకులు అభినందించారు.
Advertisement