competations
-
పతంజలి భారీ డిస్కౌంట్స్
సాక్షి, ముంబై : ఎఫ్ఎంసీజీ సెక్టార్లో దూసుకొచ్చిన దేశీయ సంస్థ బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి తొలిసారి కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ పలు ఉత్పత్తులపై పరిమిత కాలానికి ప్రత్యేక డిస్కౌంట్లను, కాంబో ఆఫర్లను అందిస్తోంది. గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా విక్రయాలు భారీగా పడిపోయిన నేపథ్యంలో వినియోగ దారులను ఆకట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా భారీగా విక్రయాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా అయిదారు రకాల ఆహారోత్పత్తులు, ఆయిల్స్, డ్రింక్స్, ఆటా, ఓట్స్, రడీ టూ ఈట్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తోంది. ఈ ఆఫర్లలో భాగంగా మూడు వస్తువులు కొంటే మూడు వస్తులను ఉచితంగా అందిస్తోంది. అలాగే కొన్ని ఆహార ఉత్పతులను ధరలను సగానికిపైగా తగ్గించి వినియోదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇంకా షాంపూలు, ఫేస్‌వాష్, ఇతర సౌందర్య సాధనాలపై కాంబో ఆఫర్లను అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకునేందుకు, వినియోగదారులకు భారీగా ఆకట్టుకునేందుకు తొలిసారిగా పతంజలి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విశేషం. కాగా రసాయన రహిత, సహజసిద్ద ఉత్పత్తులంటూ దేశీయ ఎఫ్ఎంసీజీ మార్కెట్లో ప్రవేశించిన పతంజలి ఆయుర్వేద సంస్థ అతి తక్కువ కాలంలోనే రూ.10వేల కోట్ల టర్నోవర్ సాధించిన భారతీయ రంగ సంస్థగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. కానీ బాలకృష్ణ సీఈవోగా హరిద్వార్ కేంద్రంగా నడుస్తున్న పతంజలి లాభాలను ఎన్డీయే సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్టీ దెబ్బ కొట్టింది. అలాగే విదేశీ కంపెనీలు పోటీగా నిలవడంతో అమ్మకాల్లో, లాభాల్లోనూ వెనకబడింది. సీఏఆర్ఈ నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2018లో వెయ్యికోట్ల రూపాయలు కోల్పోయింది. కంపెనీ 2016-17లో రూ.9030 కోట్లు అమ్మకాలు సాధించగా.. 2017-18లో రూ.8135కోట్లకు పడిపోయింది. -
పోటాపోటీగా ఎద్దుల బలప్రదర్శన
జంగమహేశ్వరపురం(గురజాల): జంగమహేశ్వరపురం గ్రామంలో పలనాటి తిరుమలగా ప్రసిద్ధి చెందిన శ్రీవేంకటేశ్వరస్వామి తిరునాళ్ల సందర్భంగా రైతు సంఘ కమిటీ వారు శుక్రవారం ఎద్దుల బండలాగు పోటీలను నిర్వహించారు. నాలుగు పళ్ల విభాగం, ఆరు పళ్లవిభాగం, సేద్యపు విభాగాలకు జాతీయ స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నామని, ప్రతి విభాగంలో ఐదు బహుమతులు అందిస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. నాలుగు పళ్ళ విభాగంలో : మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు ఎద్దులు 3568 అడుగుల లాగి రూ.20,000 మొదటి బహుమతిని, మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన పి.మురళి ఎద్దులు 3500 అడుగులు లాగి రూ.15,000 రెండవ బహుమతిని, అచ్చంపేట మండలం తాళ్లచెరువు గ్రామానికి చెందిన రజిత రెడ్డి ఎద్దులు 3250 అడుగులు లాగి రూ.12,000 మూడవ బహుమతిని, ప్రకాశం జిల్లా సంతమాగులూరుకు చెందిన సీహెచ్. గణేష్‌రెడ్డి ఎద్దులు 3058 అడుగులు లాగి రూ.8,000 నాల్గో బహుమతిని, దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామానికి చెందిన పెద్దిశెట్టి రాజశేఖర్ ఎద్దులు 2788 అడుగులు లాగి రూ. 5,000 ఐదో బహుమతిని గెలుపొందాయి. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. న్యాయనిర్ణేతలుగా పి.సుబ్బారెడ్డి, గూడ శ్రీనివాసరావు వ్యవహరించారు.కార్యక్రమంలో నిర్వహణ కమిటీ, చవ్వా చౌరెడ్డి, ,రెక్కల యలమందారెడ్డి, భవనాశి ఫకీర్రెడ్డి, ఎనుముల వెంకటరెడ్డి, అడుసుమల్లి కోటయ్య, ఎనుముల సుబ్బారెడ్డి, గొల్లపల్లి సత్యం, ఆవుల లక్ష్యారెడ్డి, గ్రామపెద్దలు పాల్గొన్నారు. ఎడ్లపోటీలను తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాలనుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. -
ఉత్కంఠగా ఎడ్ల పందేలు
వేమవరం (మాచవరం) : మండలంలోని వేమవరం గ్రామంలో లక్ష్మీతిరుపతమ్మ 25వ కల్యాణ మహోత్సవం సందర్భంగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు సోమవారం రసవత్తరంగా సాగాయి. జత పళ్ల విభాగంలో నర్సరావుపేట రూరల్ ఇస్సపాలెం గ్రామానికి చెందిన విట్టె వెంకట రామాంజనేయులు , శావల్యాపురం మండలం పిచకల పాలెంనకు చెందిన పొట్ల పద్మావతి చౌదరి కంబైన్డ్ ఎడ్ల జత 3083.11 అడుగుల దూరాన్ని లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. పిడుగురాళ్లకు చెందిన కోనాల రామకోటయ్య ఎడ్ల జత 3083,6 అడుగుల దూరాన్ని లాగి రెండో స్థానం దక్కించుకున్నాయి. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం వై.వి. పాలెంనకు చెందిన వై.ఎన్.పి.రెడ్డి బుల్స్ ఎడ్ల జత 2864.3 అడుగులు, మాచవరం మండలం మోర్జంపాడు గ్రామ వాసి మచ్చాల వెంకటేశ్వరావు పిల్లుట్ల గ్రామానికి చెందిన షేక్ నబూలమ్మ కంబైన్డ్ జత 2600 అడుగులు, నాదెండ్ల మండలం గణపవరానికి చెందిన కామేపల్లి బ్రహ్మనాయుడు , సత్తెనపల్లి రూరల్ వెన్నాదేవి కి చెందిన జాస్తి కోటేశ్వరావు కంబైన్డ్ జత 2447.10 అడుగుల దూరాన్ని లాగి మూడు, నాలుగు, ఐదు వరుస బహుమతులు దక్కించుకున్నాయి. -
పవర్ లిఫ్టింగ్‌లో బంగారు పతకాలు
మంగళగిరి : డిసెంబర్ 26 నుంచి 31వ తేదీ వరకు జార్ఖండ్ రాష్ట్రం జంషెడ్‌పూర్‌లో జరిగిన సుబ్రతా క్లాసిక్ ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలలో గుంటూరు జిల్లాకు చెందిన జి.సాయిరేవతి, బి.చంద్రిక బంగారు పతకాలు సాధించడం అభినందనీయమని జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వరరావు అన్నారు. పట్టణంలోని హెల్త్జిమ్లో సోమవారం వారిద్దరినీ ఆయన అభినందించారు. జి.సాయిరేవతి 357.5 కేజీల బరువును ఎత్తి, బి.చంద్రిక 339 కేజీల బరువును ఎత్తి గోల్డ్ మెడల్ సాధించినట్లు తెలిపారు. అభినందన కార్యక్రమంలో అసోషియేషన్ నాయకులు మహ్మద్ రఫీ, ఎన్.శేషగిరిరావు, ఎండీ ఖమురుద్దీన్, షేక్ సంధాని తదితరులు పాల్గొన్నారు. -
వాలీబాల్ పోటీలు ప్రారంభం
బాపట్ల : క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం, దాతలు ముందుకు రావాలని వేగేశన ఫౌండేషన్ చైర్మన్ వేగేశన నరేంద్రవర్మరాజు కోరారు. బాపట్ల మండలం వెదుళ్ళపల్లి కొత్తపాలెం గ్రామంలో వేగేశన ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి వాలీబాల్పోటీలను సోమవారం ఆట్టహాసంగా ప్రారంభించారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చిన జట్లును పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామపెద్దకాపు కోటా శ్రీరామిరెడ్డి, పెద్ది సుబ్రమణ్యం, కోటా వెంకటేశ్వరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి 9వ ఆహ్వాన నాటిక పోటీలు ఆరంభం
తెనాలి: పోలేపెద్ది నరసింహమూర్తి, తుమ్మల వెంకట్రామయ్య, నందమూరి తారక రామారావు కళా పరిషత్‌ల ఆధ్వర్యంలో 9వ రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు సోమవారం తెనాలిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రామలింగేశ్వరపేటలోని మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియంలో సాయంత్రం 6 గంటలకు పోటీలు మొదలయ్యాయి. తొలుత విశాఖపట్నం, మాతృశ్రీ కళానికేతన్ కళాకారులు సంగమేశ్వరరావు దర్శకత్వంలో 'మాకొద్దీ నాగరికత' నాటికను ప్రదర్శించారు. తర్వాత గ్రామీణ కళాకారుల ఐక్యవేదిక కళాకారులు వెనిగళ్ల దర్శకత్వంలో 'మధురస్వప్నం' నాటికను ప్రదర్శించారు. చివరగా వెలగనేరు థియేటర్ ఆర్ట్స్ కళాకారులు 'ఎవరికి ఎవరు' నాటికను ప్రదర్శించారు. ప్రారంభ సభకు కళా పరిషత్ కన్వీనర్ షేక్ జానిబాషా అధ్యక్షత వహించారు. అలపర్తి వెంకటేశ్వరరావు స్వాగత వచనం పలికారు. కౌన్సిలరు ముదిగొండ శైలజ జ్యోతి ప్రజ్వలన చేశారు. జేఎస్ఆర్ కృష్ణయ్య, కౌన్సిలర్ గుమ్మడి రమేష్, అభ్యుదయ కళాసమితి ప్రధాన కార్యదర్శి గరికపాటి సుబ్బారావు, క్యాపిటల్ స్టూడియో అధినేత ఎన్.మల్లికార్జునరావు పాల్గొన్నారు. -
హోరాహోరీగా మహిళల కబడ్డీ పోటీలు
గుంటూరు రూరల్ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల మహిళల కబడ్డీ పోటీలు గురువారం ముగిశాయి. తాడికొండ మండలం లాం గ్రామంలోని చలపతి ఫార్మశీ కళాశాల మైదానంలో రెండు రోజులుగా హోరాహోరీగా పోటీలు జరిగాయి. పోటీల్లో ఒంగోలు డీఎస్ ప్రభుత్వ కళాశాల, ఏఎన్‌యూ , నరసారావుపేట కృష్ణవేణి కళాశాల, గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాల జట్లు తలపడగా తుది పోరులో ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల, గుంటూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జట్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. నరసరావుపేటకు చెందిన కృష్ణవేణి డిగ్రీకళాశాల జట్టు ద్వితీయ స్థానం, ఒంగోలు డీఎస్ కళాశాల జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. ప్ర«థమ స్థానంలో నిలిచిన జట్లు సౌత్‌జోన్ కబడ్డీ టోర్నమెంట్లో ఏఎన్‌యూ తరఫున పోటీ చేస్తాయని చలపతి ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాదెండ్ల రామారావు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎక్స్పర్ట్ అకాడమీ డైరెక్టర్ పీ శివశంకరరావు, చలపతి విద్యా సంస్థల అధినేత వైవి.ఆంజనేయులు, ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల అధ్యాపకుడు బి ఇన్నయ్య, అధ్యాపకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా మహిళల కబడ్డీ పోటీలు
మహిళలు, కబడ్డీ, పోటీలు womens, kabbaddi, competations tension in womens kabbiddi గుంటూరు రూరల్ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల మహిళల కబడ్డీ పోటీలు గురువారం ముగిశాయి. తాడికొండ మండలం లాం గ్రామంలోని చలపతి ఫార్మశీ కళాశాల మైదానంలో రెండు రోజులుగా హోరాహోరీగా పోటీలు జరిగాయి. పోటీల్లో ఒంగోలు డీఎస్ ప్రభుత్వ కళాశాల, ఏఎన్‌యూ , నరసారావుపేట కృష్ణవేణి కళాశాల, గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాల జట్లు తలపడగా తుది పోరులో ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల, గుంటూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జట్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. నరసరావుపేటకు చెందిన కృష్ణవేణి డిగ్రీకళాశాల జట్టు ద్వితీయ స్థానం, ఒంగోలు డీఎస్ కళాశాల జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. ప్ర«థమ స్థానంలో నిలిచిన జట్లు సౌత్‌జోన్ కబడ్డీ టోర్నమెంట్లో ఏఎన్‌యూ తరఫున పోటీ చేస్తాయని చలపతి ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాదెండ్ల రామారావు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎక్స్పర్ట్ అకాడమీ డైరెక్టర్ పీ శివశంకరరావు, చలపతి విద్యా సంస్థల అధినేత వైవి.ఆంజనేయులు, ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల అధ్యాపకుడు బి ఇన్నయ్య, అధ్యాపకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్కంఠభరితంగా క్రికెట్ పోటీలు
నరసరావుపేట ఈస్ట్ : ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్–14 అంతర్ జిల్లాల ఎలైట్ గ్రూప్ పోటీలు బుధవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఎస్‌కేఆర్‌బీఆర్ కళాశాలలోని ఏసీఏ, ఎస్‌కేఆర్‌బీఆర్ క్రికెట్ మైదానంలో తొలి మ్యాచ్ చిత్తూరు, నెల్లూరు జట్ల మధ్య నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేపీ రంగారావు పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమాన్ని గ్రౌండ్ ఇన్చార్జ్ కేవీ పురుషోత్తమరావు పర్యవేక్షించారు. టాస్ గెలిచి నెల్లూరు జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన చిత్తూరు జట్టు 161 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో అత్యధికంగా ఎ.గౌతమ్ 68, కె.గౌతమ్ 40 పరుగులు చేశారు. నెల్లూరు జట్టుకు చెందిన ఎన్.మాధవ్ నాలుగు వికెట్లు, బి.శరత్ రెండు వికెట్లు, కె.అభిషేక్ రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నెల్లూరు జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 129 పరుగులతో పటిష్టమైన స్థితిలో ఉంది. ఈ జట్టు కెప్టెన్ కె.రేవంత్ రెడ్డి 60 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. జట్టులోని జితిన్ భరద్వాజ్ 36 పరుగులతో గట్టి పునాది వేశాడు. చిత్తూరు జట్టు బౌలర్లు పి.అచ్యుతానంద్‌కు రెండు, ఎ.విష్టువర్ధన్కు ఒక వికెట్ దక్కాయి. గురువారం కూడా మ్యాచ్ కొనసాగనుంది. పోటీలను జిల్లా మెన్ అండ్ ఉమెన్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి కె.శోభన్‌బాబు పరిశీలించారు. కోచ్ వి.కృష్ణ, క్యూరేటర్ బి.శ్రీనివాసరావు, అసిస్టెంట్ క్యూరేటర్ వై.మల్లికార్జునరెడ్డి మ్యాచ్‌కు సహాయ సహకారాలు అందించారు. -
సీఆర్డీఏ షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ‘గోదావరి’ హవా
తెనాలి : తెనాలిలోని ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ బాలబాలికల షటిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ –2016లో రెండోరోజైన బుధవారం మధ్యాహ్నానికి క్వాలిఫైయింగ్ రౌండ్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం నుంచి పోటీలు ప్రారంభమయ్యాయి. రాత్రికి బాలికల క్వార్టర్ ఫైనల్స్ రౌండు ఫలితాల్లో ఉభయ గోదావరి జిల్లాల క్రీడాకారిణిలు ఆధిక్యతలో ఉన్నారు. బాలికల అండర్–15 డబుల్స్ విభాగంలో వి.అమత–వి.అర్షిత, ఐ.ఆకాంక్ష–ఎంపీ వెన్నెల (పశ్చిమగోదావరి), కేపీ ఫణిశ్రీ–వై.రోహిణి (పశ్చిమగోదావరి), జి.హరిణి–పి.పూజిత (తూర్పుగోదావరి) విజేతలుగా నిలిచారు. అండర్ 13 బాలికల డబుల్స్ విభాగంలో కె.మనస్వి–కె.ప్రగతి (తూర్పుగోదావరి), గ్రేస్ వందన–ప్రణీత (కర్నూలు), సీహెచ్ నవ్యశ్రీ–వి.అమత జంటలు ప్రత్యర్ధి జట్లపై విజయం సాధించాయి. సింగిల్స్ విభాగంలో అండర్–13 బాలికల విభాగంలో జి.జయగీతిక (కడప), ఎస్.జ్యోత్స్య (విశాఖ), జి.నేహా (కష్ణా), డి.దివ్యారెడ్డి (చిత్తూరు), వి.సజన (అనంతపురం), డి.పల్లవి, కేపీఎస్ ప్రజ్ఞ (విశాఖ), ప్రణీత (కర్నూలు) గెలుపొందారు. అండర్ 15 బాలికల సింగిల్స్‌లో ఎన్.జాహన్నవి, ఐ.ఆకాంక్ష (పశ్చిమగోదావరి), ఎం.ఫణివెన్నెల, ఎంఎస్ఎస్ దివ్య (తూర్పుగోదావరి), జీటీఎస్ త్రిపాఠి (విశాఖ), వి.సృజన (అనంతపురం), టి.సూర్యచరిష్మా (కష్ణా), కేపీఎస్ ప్రజ్ఞ (విశాఖ) విజేతలుగా నిలిచారు. అంతకుముందు ముగిసిన క్వాలిఫైయింగ్ పోటీల్లో అండర్–13లో బాలురు 16 మంది, బాలికలు 8 మంది, అండర్–15లో బాలురు 16, బాలికలు 8 మంది క్వాలిఫై అయినట్టు నిర్వాహకులు ప్రకటించారు. పోటీలను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు స్టేడియంలో స్థలం సరిపోకపోవటంతో బయట సిమెంటు బెంచీలు వేసి, స్క్రీన్లు ఏర్పాటుచేశారు. -
రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
డోర్నకల్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు బుధవారం డోర్నకల్‌లో జిల్లా జట్టును ఎంపిక చేశారు. స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలోని పైకా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా జట్టు ఎంపిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలో ప్రతిభ కనబర్చి జిల్లాకు పేరు తేవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకపోతుల రమ్య, జడ్పీటీసీ సభ్యురాలు కేశబోయిన స్వరూప, సర్పంచ్ మాదా లావణ్య, పీఏసీఎస్ చైర్మెన్ రాయల వెంకటేశ్వర్రావు, ఎంఈఓ మధులత, మండల క్రీడాధికారి ఇమ్మానియల్, జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్జనరల్ సెక్రెటరీ కొత్త రాంబాబు, కో ఆప్షన్ సభ్యులు వాజీద్, ఎస్ఎంసీ చైర్మన్ దాసరి నాగేశ్వర్రావు, వెయిట్‌లిఫ్టింగ్ కోచ్ కొత్త కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గొర్ల సత్తిరెడ్డి పాల్గొన్నారు. బాలుర జట్టు.. 48 కేజీల విభాగంలో వి.గణేష్, ఎం వేణు, 56 కేజీల విభాగంలో ఎన్రాజేష్, 62 కేజీల విభాగంలో కె.హర్షిత్చక్రవర్తి, బి.కార్తీక్, 69 కేజీల విభాగంలో కె.సాయికుమార్, 77 కేజీల విభాగంలో ఎస్కె మదార్, 85 కేజీల విభాగంలో జి.గణేష్, ఎస్కె మెహరాజ్పాషా, ఎండీ అమీర్‌పాషా ఎంపికయ్యారు. బాలికల జట్టు.. 44 కేజీల విభాగంలో వి.వెన్నెల, కె.వైజయంతి, 48 కేజీల విభాగంలో ఎస్ మౌనిక, 53 కేజీల విభాగంలో బి.కావేరి, 58 కేజీల విభాగంలో పి.శ్రావణి, 63 కేజీల విభాగంలో బి.సింధు, 75 కేజీల విభాగంలో బి.అఖిల ఎంపికయ్యారు. -
24న జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలు
సికింద్రాబాద్‌లో ప్రారంభం తొలిరోజు షంషేర్ ఖాన్‌కు సన్మానం గుంటూరు స్పోర్ట్స్ : 3వ జాతీయస్థాయి మాస్టర్ స్విమ్మింగ్ టోర్నమెంట్ ఈ నెల 24, 25 తేదీలలో సికింద్రాబాద్‌లోని ఎంసీహెచ్ స్విమ్మింగ్ ఫూల్ నిర్వహిస్తున్నారని రాష్ట్ర మాస్టర్ స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి జె.లక్ష్మీనారాయణ చెప్పారు. శుక్రవారం బందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్డేడియంలో మాస్టర్ అథ్లెటిక్స్ భవన్లో విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర మాస్టర్ స్విమ్మింగ్ జట్టుకు ఎంపికైనా స్విమ్మర్స్ ఈ నెల 23 వlతేదీ సాయంత్రం 4గంటలలోగా రిపోర్ట్ చేయాలని సూచించారు. టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులకు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ప్రారంభోత్సవం రోజున షంషేర్ ఖాన్‌కు సత్కారం.... సాక్షి పత్రిక ద్వారా వెలుగులోకి వచ్చిన జిల్లాకు చెందిన తొలి ఒలింపియన్ స్విమ్మర్ షంషేర్ ఖాన్‌ను జాతీయస్థాయి స్విమ్మింగ్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఘనంగా సత్కరించనున్నట్లు జె.లక్ష్మినారాయణ వెల్లడించారు. 1956లో మెల్బోర్న్లో జరిగిన తొలి ఒలింపిక్స్ పోటీలలో 33 దేశాలకు చెందిన 235 మంది స్విమ్మర్లు పాల్గొన్నారని, అందులో షంషేర్ ఖాన్ అత్యంత ప్రతిభ కనబర్చి 5వ స్థానంలో నిలిచారని వివరించారు. ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి భారతీయుడు, తెలుగువాడైన షంషేర్ ఖాన్ ఆర్థికంగా ఇబ్బందులు పడటం బాధాకరమన్నారు. షంషేర్ ఖాన్‌ను ఆర్థికంగా అదుకునేందుకు రాష్ట్ర మాస్టర్ స్విమ్మింగ్‌తో పాటు ఇతర జిల్లాల సంఘాల వారు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. జిల్లా మాస్టర్ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కానాల అంజని శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా అసోసియేషన్ తరుపున రూ.10,116 ఇస్తామన్నారు. భవిష్యత్తులో ప్రతిభావంతులైన క్రీడాకారులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ స్డేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు, మాస్టర్ స్విమ్మింగ్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి బండ్లమూడి సుబ్బయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి తదితరులున్నారు. -
అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం
ఏఎన్‌యూ(గుంటూరు) : యూనివర్సిటీ స్థాయి అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పురుషుల, మహిళల పోటీలు శుక్రవారం ఏఎన్‌యూ క్రీడామైదానంలో ప్రారంభమయ్యాయి. పోటీలను ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆచార్య వై.కిషోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు నైపుణ్యాన్ని పెంపొందించుకుని రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కోరారు. యోగా కోర్సు కోఆర్డినేటర్ డి.సూర్యనారాయణ, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ కళాశాలల జట్ల మధ్య పోటీలు నిర్వహించారు. -
అంతర్జాతీయ చెస్ పోటీలకు ఎంపిక
గుంటూరు రూరల్ : విద్యతోపాటు క్రీడల్లో ప్రావీణ్యత పెంపొందించుకుంటే ఉన్నత స్థాయికి ఎదగగలమని తమ పాఠశాల విద్యార్థి నిరూపించాడని కేంద్రియ విద్యాలయం ప్రిన్సిపల్ ఎమ్ రాజేశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ చెస్ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికయిన 9వ తరగతి విద్యార్థి జి.హరిసూర్యభరద్వాజ్కు గురువారం నల్లపాడు గ్రామంలోని కేంద్రియ విద్యాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత ఏడాది జరిగిన ఎస్జీఎఫ్ఐ జాతీయ స్థాయి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి భరద్వాజ్ స్పెషల్ ప్లేయర్‌గా బోర్డ్ విన్నర్ ప్రై జ్ను కైవశం చేసుకున్నాడన్నారు. జమ్మూకాశ్మీర్‌లో ఈవారం జరిగే అంతర్జాతీయస్థాయి సౌత్ ఏషియన్ అమ్మీటర్ చెస్ చాంపియన్ షిప్ పోటీలకు ఎంపికయ్యాడని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా భరద్వాజ్‌ను పాఠశాల పీఈటీ కిరణ్‌రెడ్డి, అధ్యాపకులు అభినందించారు. -
రాష్ట్రస్థాయి క్యారమ్స్ పోటీలు ప్రారంభం
చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని సీఆర్ క్లబ్లో రాష్ట్రస్థాయి సెకెండ్ ర్యాంకు క్యారమ్స్ పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. పోటీలను క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మద్ది లక్ష్మయ్య, పావులూరి శ్రీనివాసరావు ప్రారంభించారు. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పురుషుల విభాగంలో 128 మంది , మహిళల విభాగంలో 12 మంది హాజరైనట్లు క్లబ్ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. పోటీలు ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. తొలి రెండు రోజులు రాష్ట్ర స్థాయిలో పోటీలు జరుగుతాయన్నారు. చివరి రెండు రోజులు సౌత్ ఇండియా స్థాయిలో నిర్వహిస్తామన్నారు. సీఆర్ క్లబ్ స్థాపించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షుడు జక్కంపూడి శ్రీనివాసరావు, కోశాధికారి నన్నపనేని వెంకట రామయ్య , కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
ఫెమీనా మెహెందీ పోటీలు