సీఆర్డీఏ షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ‘గోదావరి’ హవా
సీఆర్డీఏ షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ‘గోదావరి’ హవా
Published Wed, Oct 26 2016 9:17 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
తెనాలి : తెనాలిలోని ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ బాలబాలికల షటిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ –2016లో రెండోరోజైన బుధవారం మధ్యాహ్నానికి క్వాలిఫైయింగ్ రౌండ్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం నుంచి పోటీలు ప్రారంభమయ్యాయి. రాత్రికి బాలికల క్వార్టర్ ఫైనల్స్ రౌండు ఫలితాల్లో ఉభయ గోదావరి జిల్లాల క్రీడాకారిణిలు ఆధిక్యతలో ఉన్నారు. బాలికల అండర్–15 డబుల్స్ విభాగంలో వి.అమత–వి.అర్షిత, ఐ.ఆకాంక్ష–ఎంపీ వెన్నెల (పశ్చిమగోదావరి), కేపీ ఫణిశ్రీ–వై.రోహిణి (పశ్చిమగోదావరి), జి.హరిణి–పి.పూజిత (తూర్పుగోదావరి) విజేతలుగా నిలిచారు. అండర్ 13 బాలికల డబుల్స్ విభాగంలో కె.మనస్వి–కె.ప్రగతి (తూర్పుగోదావరి), గ్రేస్ వందన–ప్రణీత (కర్నూలు), సీహెచ్ నవ్యశ్రీ–వి.అమత జంటలు ప్రత్యర్ధి జట్లపై విజయం సాధించాయి. సింగిల్స్ విభాగంలో అండర్–13 బాలికల విభాగంలో జి.జయగీతిక (కడప), ఎస్.జ్యోత్స్య (విశాఖ), జి.నేహా (కష్ణా), డి.దివ్యారెడ్డి (చిత్తూరు), వి.సజన (అనంతపురం), డి.పల్లవి, కేపీఎస్ ప్రజ్ఞ (విశాఖ), ప్రణీత (కర్నూలు) గెలుపొందారు. అండర్ 15 బాలికల సింగిల్స్‌లో ఎన్.జాహన్నవి, ఐ.ఆకాంక్ష (పశ్చిమగోదావరి), ఎం.ఫణివెన్నెల, ఎంఎస్‌ఎస్ దివ్య (తూర్పుగోదావరి), జీటీఎస్ త్రిపాఠి (విశాఖ), వి.సృజన (అనంతపురం), టి.సూర్యచరిష్మా (కష్ణా), కేపీఎస్ ప్రజ్ఞ (విశాఖ) విజేతలుగా నిలిచారు. అంతకుముందు ముగిసిన క్వాలిఫైయింగ్ పోటీల్లో అండర్–13లో బాలురు 16 మంది, బాలికలు 8 మంది, అండర్–15లో బాలురు 16, బాలికలు 8 మంది క్వాలిఫై అయినట్టు నిర్వాహకులు ప్రకటించారు. పోటీలను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు స్టేడియంలో స్థలం సరిపోకపోవటంతో బయట సిమెంటు బెంచీలు వేసి, స్క్రీన్లు ఏర్పాటుచేశారు.
Advertisement
Advertisement