రాష్ట్రస్థాయి క్యారమ్స్ పోటీలు ప్రారంభం
రాష్ట్రస్థాయి క్యారమ్స్ పోటీలు ప్రారంభం
Published Thu, Jul 28 2016 9:46 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని సీఆర్ క్లబ్‌లో రాష్ట్రస్థాయి సెకెండ్ ర్యాంకు క్యారమ్స్ పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. పోటీలను క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మద్ది లక్ష్మయ్య, పావులూరి శ్రీనివాసరావు ప్రారంభించారు. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పురుషుల విభాగంలో 128 మంది , మహిళల విభాగంలో 12 మంది హాజరైనట్లు క్లబ్ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. పోటీలు ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. తొలి రెండు రోజులు రాష్ట్ర స్థాయిలో పోటీలు జరుగుతాయన్నారు. చివరి రెండు రోజులు సౌత్ ఇండియా స్థాయిలో నిర్వహిస్తామన్నారు. సీఆర్ క్లబ్ స్థాపించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షుడు జక్కంపూడి శ్రీనివాసరావు, కోశాధికారి నన్నపనేని వెంకట రామయ్య , కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement