ఉత్కంఠగా ఎడ్ల పందేలు
వేమవరం (మాచవరం) : మండలంలోని వేమవరం గ్రామంలో లక్ష్మీతిరుపతమ్మ 25వ కల్యాణ మహోత్సవం సందర్భంగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు సోమవారం రసవత్తరంగా సాగాయి. జత పళ్ల విభాగంలో నర్సరావుపేట రూరల్ ఇస్సపాలెం గ్రామానికి చెందిన విట్టె వెంకట రామాంజనేయులు , శావల్యాపురం మండలం పిచకల పాలెంనకు చెందిన పొట్ల పద్మావతి చౌదరి కంబైన్డ్ ఎడ్ల జత 3083.11 అడుగుల దూరాన్ని లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. పిడుగురాళ్లకు చెందిన కోనాల రామకోటయ్య ఎడ్ల జత 3083,6 అడుగుల దూరాన్ని లాగి రెండో స్థానం దక్కించుకున్నాయి. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం వై.వి. పాలెంనకు చెందిన వై.ఎన్.పి.రెడ్డి బుల్స్ ఎడ్ల జత 2864.3 అడుగులు, మాచవరం మండలం మోర్జంపాడు గ్రామ వాసి మచ్చాల వెంకటేశ్వరావు పిల్లుట్ల గ్రామానికి చెందిన షేక్ నబూలమ్మ కంబైన్డ్ జత 2600 అడుగులు, నాదెండ్ల మండలం గణపవరానికి చెందిన కామేపల్లి బ్రహ్మనాయుడు , సత్తెనపల్లి రూరల్ వెన్నాదేవి కి చెందిన జాస్తి కోటేశ్వరావు కంబైన్డ్ జత 2447.10 అడుగుల దూరాన్ని లాగి మూడు, నాలుగు, ఐదు వరుస బహుమతులు దక్కించుకున్నాయి.