ox
-
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని ఎద్దు మృతి..
చింతకాని: సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ వద్ద శనివారం సాయంత్రం అర్ధగంటపాటు నిలిచిపోయింది. విశాఖపట్నం వెళ్తున్న ఈ రైలు నాగులవంచ రైల్వేస్టేషన్ సమీపంలోకి వచ్చేసరికి.. పట్టాలపైకి వచ్చిన ఎద్దును ఢీకొంది. ఎద్దు అక్కడికక్కడే మృతి చెందగా, రైలు ఇంజిన్ ముందు భాగం కొంతమేర దెబ్బతింది. దీంతో రైలును నిలిపివేసిన లోకో పైలట్లు.. లోపాన్ని సరిదిద్దాక అర్ధగంట అనంతరం బయలుదేరారు. చదవండి: గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు.. -
మొన్న పిల్లి.. నేడు ఆబోతు..
చిలుకూరు: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పోలీసులు కొద్దిరోజుల క్రితం పిల్లిపోరును తీర్చగా, తాజాగా సోమవారం చిలుకూరు పోలీసులు ఓ ఆబోతు పంచాయితీని పరిష్కరించారు. చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామస్తులు ఆరేళ్ల క్రితం రామాలయం నిర్మించి గుడిపేరిట ఓ ఆబోతును వదిలేశారు. నెల రోజులుగా అది కనిపించకపోవడంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల చిలుకూరులో ఆ ఆబోతును గంగిరెద్దు మాదిరిగా ఆడిస్తుండటంతో గమనించిన గ్రామస్తులు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. రెండు గ్రామాల పెద్దల సమక్షంలో పోలీసులు పంచాయితీ నిర్వహించారు. గంగిరెద్దులవారు రూ. 30 వేల జరిమానా చెల్లించి ఆబోతును అప్పగించారు. -
పుంగనూరు గిత్తలా.. మజాకా!
మామిడికుదురు: పుంగనూరు జాతికి చెందిన కవల గిత్తలను కొనేందుకు పలు ప్రాంతాల నుంచి రైతులు క్యూ కడుతున్నారు. ఒక్కో గిత్తను రూ.లక్షకు కొనేందుకు కూడా వారు వెనుకాడటం లేదు. తూర్పుగోదావరి జిల్లా పాశర్లపూడికి చెందిన రైతు అడబాల నాగేశ్వరరావుకు చెందిన దేశవాళీ ఆవు మొదటి ఈతలో పుంగనూరు జాతికి చెందిన కవల గిత్తలకు జన్మనిచ్చింది. అచ్చమైన తెలుపు వర్ణంలో ఉండటంతో వాటికి ఎనలేని డిమాండ్ వచ్చింది. మూడు నెలల వయస్సున్న ఒక్కో కవల కోడె దూడ ధర రూ.లక్ష పలుకుతోంది. ఆ కవల గిత్తలను కొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడకు వస్తున్నారు. చెన్నై, భీమవరం, రాజమహేంద్రవరం, సఖినేటిపల్లి, బెండమూర్లంక తదితర ప్రాంతాల నుంచి రైతులు క్యూ కట్టారు. కానీ వాటిని అమ్మేందుకు రైతు నాగేశ్వరరావు విముఖత చూపుతున్నారు. పుంగనూరు గిత్తల వీర్యానికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలోనే వాటిని కొనేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. -
‘బాహుబలి’లో బల్లాల దేవుడిలా బిల్డప్ ఇచ్చాడు.. కానీ చివరకి
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని కొన్ని వీడియోలు మన మనసుకు హత్తుకుంటాయి. మరికొన్ని ఆహ్లాదాన్నిస్తాయి. ఇంకొన్నిసార్లు షాకింగ్‌ని కలిగిస్తాయి.కానీ కొంత మంది సోషల్ మీడియా పాపులర్ అయ్యేందుకు ఎలాంటి సాహసానికైనా తెగిస్తున్నారు. చివరికి ప్రాణాల మీదకు సైతం తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు అలాంటి ప్రయత్నమే చేశాడు. బాహుబలి సినిమాలో బల్లాల దేవుడిలా ఎద్దును లొంగదీసుకునేందుకు ప్రయత్నం చేశాడు. కానీ ఆతని ప్రయత్నం బెడిసికొట్టింది. ఎద్దు కొమ్ములు పట్టుకుని వంచేందుకు ప్రయత్నిస్తుండగా దానికి ఒక్కసారిగా కోపం వచ్చి ఎత్తి పడేసింది. ఈ మొత్తం సంఘటనను తన స్నేహితులు సెల్ఫోన్లో రికార్డు చేశారు.అదృష్టవశాత్తూ అతడుకి ఎటువంటి గాయాలు కాలేదు. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతుంది.ఈ వీడియో పై నెటిజన్లు స్పందిస్తూ .. నీవు ఏమైనా బహుబలి సినిమాలో బల్లాల దేవుడివి అనుకుంటున్నావా అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రాణాలు జాగ్రత్త.. ఏదైనా అతి చేస్తే.. పర్యావసనాలు ఇలానే ఉంటాయని మరి కొందరు హెచ్చరిస్తున్నారు. -
రైతుల కన్నా పశుపోషకుల ఆదాయం ఎక్కువ
తెలంగాణకు తలమానికం వంటి పశు జాతి ‘పొడ తూర్పు’. తూర్పు కనుమల్లోని అమ్రబాద్ టైగర్ రిజర్వ్ నల్లమల అటవీ ప్రాంతంలో విరాజిల్లుతున్న పశు జాతి ఇది. నాగర్‌కర్నూల్ (పాత మహబూబ్‌నగర్) జిల్లాలోని తూర్పు భాగాన రైతులు, పశుపోషకులు అయిన లంబాడాలు, గొల్లలు, చెంచులకు తరతరాలుగా జీవనాధారంగా నిలుస్తున్నందున ఈ పశుజాతికి ‘తూర్పు’ అనే మాట వచ్చింది. ఈ జాతి పశువుల దేహంపై పొడ మచ్చలు ఉండటంతో ‘పొడ తూర్పు’ అని పేరు వచ్చింది. స్థానికులు ‘పొడ ఎడ్లు’ అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ జాతి ఎడ్లు మెట్ట రైతులకు వ్యవసాయంలో పెద్ద భరోసాగా నిలుస్తున్నాయి. మెట్ట పొలాలను దున్నటంతో పాటు మాగాణుల్లో దమ్ము చేయడానికి, ఇతర వ్యవసాయ పనుల్లో పొడ ఎడ్లు బాగా పనిచేస్తాయి. ఎంత కష్టమైన పనైనా విసుగు విరామం లేకుండా కొనసాగించి పూర్తి చేయటం, చీటికి మాటికి జబ్బుపడకుండా ఉండటం, తక్కువ మేత, తక్కువ నీటితో కూడా మనగలగడం ఈ పశు జాతి ఎడ్లకున్న సుగుణాలు. అందుకే నాగర్‌కర్నూల్ ప్రాంత పశుపోషకులకు, రైతులకు పొడ ఎడ్లంటే అంత మక్కువ. వారి పండుగలు జాతర్లలో ఈ పశువులకు ప్రాధాన్యం ఉంటుంది. పొడ జాతి ఆవులు పాలు తక్కువగా ఇస్తాయి. అందుకే ఆ పాలను కూడా పూర్తిగా దూడలకే వదిలేసే పశుపోషకులు కూడా ఈ ప్రాంతంలో కనిపిస్తారు. మూడేళ్ల క్రితం వాసన్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పొడ తూర్పు పశు జాతి విశిష్టతల గురించి, స్థానిక పశు సంరక్షక, వ్యవసాయ కుటుంబాల వారు తరతరాలుగా ఈ పశుజాతిని పరిరక్షించుకుంటూ పొట్టపోసుకుంటున్న వైనం గురించి రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. 2016లో, 17లో పొడ ఎడ్ల మేళాలను ఏర్పాటు చేయటంతో ఈ జాతి ఎడ్లంటే వివిధ ప్రాంతాల, రాష్ట్రాల రైతులకున్న మక్కువ వెల్లడైంది. దీంతో తెలంగాణ పశుసంవర్థక శాఖ పొడ తూర్పు జాతి పశు జాతి జన్యు స్వచ్ఛతను కాపాడాలని సంకల్పించింది. కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్లు చెయ్యడం నిలిపివేసింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన 44వ పశుజాతి ఆ తర్వాత రెండేళ్ల పాటు ఈ జాతి పశు సంపద స్థితిగతులపై అధ్యయనం జరిగింది. స్థానిక రైతులు, పశుపోషకుల జీవితాలతో, వారి జీవనోపాదులతో ఈ పశు జాతి తరతరాలుగా ఎంత గాఢంగా పెనవేసుకొని ఉన్నదో అధికారికంగా గుర్తించడానికి ఈ అధ్యయనం తోడ్పడింది. సుమారు 450–500 వరకు లంబాడి, గొల్ల, ఎస్సీ కుటుంబాలు కేవలం పొడ తూర్పు పశు జాతి పోషణనే జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్నారు. ప్రస్తుతం ఈ జాతి పశువులు 15,076 ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా మేత వేయటం, దాణా పెట్టడం అవసరం లేదు. పచ్చిక బయళ్లలో, అటవీ ప్రాంతంలో మేసే మేతే చాలు. ప్రత్యేకంగా మేత, దాణా వేయక్కరలేదు. ఈ నెల 19న కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ పశు జన్యువనరుల బోర్డు(ఎన్.ఎ.పి.జి.ఆర్.) పొడ తూర్పు జాతి పశువులకు గుర్తింపునిస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలో ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఎన్.ఎ.పి.జి.ఆర్. ఇప్పటికే 43 భారతీయ పశుజాతులను గుర్తించింది. తాజాగా గుర్తింపు పొందిన ‘పొడ తూర్పు’ 44వది. రైతుల కన్నా పశుపోషకుల ఆదాయం ఎక్కువ నాగర్‌కర్నూల్, పాత మహబూబ్‌నగర్ ప్రాంతంలో వర్షాధార వ్యవసాయమే ఎక్కువ. తరచూ కరువు పరిస్థితులను చవిచూసే ఈ ప్రాంత రైతులు వ్యవసాయంపై పొందే ఆదాయం కన్నా ‘పొడ తూర్పు’ పశువులను పెంచుకుంటూ జీవించే కుటుంబాల ఆదాయం ఎక్కువగా ఉన్నట్లు వాసన్ అధ్యయనంలో తేలింది. 110 మంది పశుపోషకులపై అధ్యయనం చేశారు. వీరంతా కలిసి ‘అమ్రాబాద్ పొడ లక్ష్మి గోవు సంఘం’గా సంఘటితమయ్యారు. 80 నుంచి 120 పొడ తూర్పు ఆవులు, ఎద్దులు, దూడల మంద కలిగిన పశుపోషకుడు ఏటా 20 నుంచి 30 వరకు గిత్త దూడలను విక్రయిస్తూ, రూ. లక్షన్నర నుంచి రూ. 3 లక్షల వరకు ఆదాయం గడిస్తున్నారు. 8 నుంచి 15 నెలల గిత్త దూడల ధర రూ.8 వేల నుంచి 15 వేల వరకు పలుకుతోంది. రెండున్నర ఏళ్ల వయసు నుంచి 20 ఏళ్ల వయసు వరకు వ్యవసాయ పనుల్లో ఈ గిత్తలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఐదెకరాల మెట్ట భూమిలో వ్యవసాయం చేసే రైతులు సైతం రూ. 30 వేలకు మించి ఆదాయం పొందలేకపోతున్న ఆ ప్రాంతంలో పొడ తూర్పు పశువులను పెంచి గిత్త దూడలను అమ్ముకునే పశుపోషకుల ఆదాయం చాలా ఎక్కువగా ఉందని వాసన్ డైరెక్టర్ డా. సవ్యసాచిదాస్ ‘సాక్షి’తో చెప్పారు. మెట్ట ప్రాంత వ్యవసాయానికి చాలా అనువైన ఈ పశుజాతిని పరిరక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఇందుకు తోడ్పడుతుందని ఆయన అంటున్నారు. మేత కోసం నెలల తరబడి వలస దాదాపు 400 ఏళ్ల క్రితం నుంచి ఈ పశుజాతిని స్థానికులు పోషించుకుంటూ జీవనం గడుపుతున్నారని ఒక అంచనా. గతంలో నల్లమల అటవీ ప్రాంతంలో 15 కిలోమీటర్ల లోపలి వరకు వెళ్లి పశువులను మేపుకునే వారు. అయితే, అటవీ శాఖ అధికారులు ఇటీవలి కాలంలో మూడు కిలోమీటర్ల కన్నా లోపలికి అనుమతించడం లేదు. దీంతో శీతాకాలం నుంచే మేత దొరకడం గగనమైపోయింది. జనవరి నెల నుంచి మే, జూన్ నెల వరకు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కృష్ణాజిల్లాలకు పశువులతో వలస వెళ్లక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. పిల్లలతో సమానంగా ప్రేమిస్తాం! ముత్తాతల కాలం నుంచి పొడ(తూర్పు) ఎడ్లే మాకు జీవనాధారం. వీటితో మా జీవితాలకు విడదీయలేని అనుబంధం ఉంది. మా పిల్లలతో సమానంగా వీటిని మేం ప్రేమిస్తాం. మా తాతలు, తండ్రులు, మేము, మా పిల్లలు అందరం వీటిపైనే ఆధారపడి బతుకుతున్నాం. పిలిస్తే పలుకుతాయి మా ఎడ్లు. కొండలు, గుట్టలు ఎక్కి మేస్తాయి. విజిల్ వేస్తే చాలు చప్పున దిగి వస్తాయి. మా ప్రాంతంలో నెల క్రితమే మేత కరువైంది. మాకున్న 300 పొడ తూర్పు పశువులను తోలుకొని 15 రోజుల క్రితం గుంటూరు జిల్లాకు వలస వచ్చాం. ఇక్కడినుంచి కృష్ణా జిల్లాకు వెళ్తాం. మే, జూన్‌లో వర్షాలు కురిసి పచ్చిమేత మొలిచే వరకూ మాకు సంచార జీవనం తప్పదు. నేను గత పదిహేనేళ్లుగా ప్రతి ఏటా పశువులను తోలుకొని వలస వస్తూ ఉన్నాను. శ్రమ, ఖర్చు అయినా మాకు జీవనాధారమైన పశువులను రక్షించుకోవాల్సిందే. పొడ ఎడ్లకు ప్రభుత్వ గుర్తింపు రావటం సంతోషంగా ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహం కావాలి. మా పశువులకు, మాకు, జీతగాళ్లకు బీమా కల్పించాలి. – గంటల హనుమంతు (96525 21052), అధ్యక్షుడు, అమ్రాబాద్ పొడ లక్ష్మి గోవుల సంఘం, బీకే లక్ష్మీపుర్ తండా, నాగర్‌కర్నూల్ జిల్లా గుర్తింపు వల్ల ఒరిగేదెమిటి? పొడ తూర్పు పశుజాతికి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు రావడం వల్ల తరతరాలుగా ఈ పశుజాతిని పరిరక్షిస్తున్న స్థానిక గ్రామాల్లోని లంబాడాలు, గొల్లలు, చెంచులు, ఎస్సీలకు గ్రామ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీల (బి.ఎం.సి.ల) ద్వారా ఈ పశుజాతిపై ప్రత్యేక హక్కులు దఖలుపడతాయి. అందువల్ల ఈ పశువులను పెంచే వారికి ప్రభుత్వ పథకాలు వర్తింపజేయడానికి వీలవుతుంది. ఈ ఎడ్లను, ఆవులను కొనుగోలు చేసే రైతులు బ్యాంకుల నుంచి సబ్సిడీ రుణాలు తీసుకోవచ్చు. ఫలితంగా పశుపోషకుల ఆదాయం పెరుగుతుంది. అంతేకాదు.. అటవీ హక్కుల చట్టం కింద కూడా పొడ తూర్పు పశుపోషకులకు హక్కులు సంక్రమిస్తాయి. అటవీ శాఖ స్థానిక పశుపోషకుల హక్కులను గుర్తించేందుకు, సానుకూలంగా స్పందించడానికి అవకాశం ఉందని వాసన్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ డా. సవ్యసాచిదాస్ (94408 04860) ఆశాభావం వ్యక్తం చేశారు. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
వధువు గోవు.. వరుడు బసవన్న..
-తాటిపర్తిలో వైభవంగా వివాహ వేడుక -ఊరేగింపు, ఊరంతటికీ విందు గొల్లప్రోలు (పిఠాపురం) : సంరక్షణలేక వేలాది పశువులు మృత్యువాత పడుతున్న రోజులివి. కసాయి కత్తులకు బలవడానికి వేలాదిపశువులు కబేళాలకు తరలిపోతున్న రోజులివి. ఇలాంటి తరుణంలో పశువులకు కల్యాణం జరిపించి, వాటితో అనుబంధాన్ని, వాటి పరిరక్షణ అవసరాన్ని చాటారు మండలంలోని తాటిపర్తి గ్రామస్తులు. ఆవు–తాడిపెద్దు(బసవన్న)ల కల్యాణం బుధవారం అంగరంగ వైభవంగా జరిపించారు. ఆవును, బసవన్నను పెళ్లికుమార్తె, పెళ్లికుమారుడుగా అలంకరించి..నుదుటిని బాసికం కట్టి...శరీరంపై వస్త్రాలు పరచి పొరుగుగ్రామమైన శంఖవరానికి చెందిన రెండు తాడిపెద్దులు తోటి పెళ్లి కొడుకులుగా, గ్రామస్తులు పెళ్లిపెద్దలుగా హాజరై వేదమంత్రోచ్చారణల మధ్య కల్యాణం ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది. అనంతరం గ్రామస్తులు ఊరి బంతితో విందు ఆరగించారు. స్థానిక పెదరామాలయం వద్ద జరిగిన ఈ పెళ్లి తంతు మంగళవారం అర్ధరాత్రి నుంచే ప్రారంభమైంది. కాకినాడకు చెందిన భాగవతుల నాగమహాసయ తాడిపెద్దును చిన్నవయసులో ఉండగా స్థానిక అపర్ణాదేవి అమ్మవారికి కానుకగా ఇచ్చారు. ఇన్నాళ్లూ ఆలయసంరక్షణలో పెరిగిన తాడిపెద్దుకు పెళ్లిచేయాలనే సంకల్పంతో దైవజ్ఞరత్న ఆకొండి వెంకటేశ్వరశర్మ సూచనతో గ్రామానికి చెందిన గొల్లపల్లి శ్రీనివాసరావు, శేషారత్నం దంపతులు ఆవును కన్యాదానంగా చేయడానికి ముందుకు వచ్చారు. ముందుగా విఘ్నేశ్వరపూజ, లక్ష్మి పూజ నిర్వహించారు. అనంతరం తాడిపెద్దుకు దాసుడితో అచ్చు వేయించారు. వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో పూజాదికాలు నిర్వహించి, కల్యాణం జరిపించారు. అనంతరం ఆవు, తాడిపెద్దుల గ్రామోత్సవం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్ద ఆవు, తాడిపెద్దుల కాళ్లుకడిగి..నుదుట బొట్టుపెట్టి పూజలు చేశారు. దుస్తులు, తవుడు, బియ్యం వంటివి కానుకగా సమర్పించారు. తప్పెటగుళ్లు, శూలాల సంబరం వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా వెంకటేశ్వరశర్మ మాట్లాడుతూ తాటిపర్తిలో గతంలో తాడిపెద్దులకు కల్యాణం చేయించి, అచ్చు వేయించినట్టు చెప్పారు. పదేళ్ల తరువాత ఇప్పుడు ఈకార్యక్రమం జరిపించడం ఆనందంగా ఉందన్నారు. శ్రీకృష్ణుడు గోవర్థనగిరి పర్వతం ఎత్తే సమయంలో బసవన్నకు పూజలు చేశాడని దామాల కొండలరావు తెలిపారు. ప్రతి గ్రామానికి తాడిపెద్దు, రామాలయం, పెరుమాళ్ల స్తంభం ఉండాలని పురాణాలు చెబుతున్నాయన్నారు. -
చెరువులో కాడెడ్ల బండి బోల్తా
రైతు, ఎద్దు మృతి గొల్లప్రోలు (పిఠాపురం) : ఇరవై ఏళ్లుగా కాడేడ్లపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోన్న ఒక రైతును చెరువు మృత్యువు కబళించింది. చేబ్రోలులోని రథంబాట వీధికి చెందిన యాదాల సత్తిబాబు (46) ప్రమాదవశాత్తు గ్రామ శివారున ఉన్న కోటలంకవారి చెరువు (పెదచెరువు)లో పడి సోమవారం మృతి చెందాడు. అప్పటివరకు పొలంలో పట్టి చదును చేసిన ఆయన ఎడ్లకు నీరు పెట్టడానికి బండిని చెరువులోకి దించాడు. బండి అదుపు తప్పి బోల్తా పడింది. బండిపై ఉన్న సత్తిబాబు నీటిలో మునిగిపోయాడు. స్థానికులు అతడిని వెలికితీశారు. అప్పటికే అతడు మృతి చెందాడు. కాడెడ్లలో ఒక ఎద్దు ఊపిరాడక మృతి చెందింది. ఈ సంఘటన పలువురు హృదయాలను కలచివేసింది. విషయాన్ని తెలుసుకున్న ఎస్సై బి.శివకృష్ణ సంఘటనా స్థలాన్ని చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గ్రామంలో విషాద ఛాయలు రైతు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భార్య వెంకటలక్ష్మి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహంపై పడి రోధించిన తీరు పలువుర్ని కలచివేసింది. మృతుడికి భార్య, కుమారుడు సింహాదికర, కుమార్తె శివచక్రవేణి ఉన్నారు. ఇటీవల చెరువులో తవ్విన గోతులే ప్రాణాలు తీశాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు గట్టుకు సమీపంలో లోతైన గోతుల వల్ల తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని విమర్శిస్తున్నారు. -
మెడలే ‘బుల్’డోజర్లు.. గిట్టలే బుల్లెట్లు..
-మురమండలో ఉత్కంఠభరితంగా ఎడ్లపట్టు ప్రదర్శన -‘మీరా, మేమా’ అన్నట్టు తలపడ్డ 11 జతల నందులు –విజయకేతనం ఎగరేసిన మురమండ ఎడ్లు కడియం : ఈతలో ఆరితేరిన వారికైనా వరదలో వాలుఈత మాత్రమే తేలిక. అదే ఎదురీదమంటే..ఒక బార ఈదేసరికి పదిబారలు వెనక్కు నెట్టుకుపోతుంది ప్రవాహం. అలాంటి ఎదురీతే ఎడ్ల పట్టు ప్రదర్శన. చక్రాలను కదలకుండా కట్టేసి, నిర్ణీతదూరానికి బండిని లాక్కుని వెళ్లాలనన్న నిబంధనతో జరిగే ఈ ప్రదర్శన నందుల నిజమైన బలానికి గీటురాయి. మండలంలోని మురమండ గ్రామ శివార్లలో గల శ్రీ సందన్నబాబు తీర్థమహోత్సవాన్ని పురస్కరించుకుని ఎడ్ల పట్టు ప్రదర్శన బుధవారం ఉత్సాహంగా జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన 11 జతల ఎడ్లు తమ బలాన్ని ప్రదర్శించడంలో ‘మీరా, మేమా’ అన్నట్టు హోరాహోరీగా తలపడ్డాయి. చక్రాలు కట్టేసిన బండి (దాదాపు టన్ను బరువు)ని నిర్ణయించిన దూరం వరకూ లాక్కెళ్లడంలో తమ సత్తా చూపాయి. కాడి మోపిన మెడను ‘బుల్’డోజర్లా, నేల మీద ఆనిన గిట్టలను బుల్లెట్లలా చేసి.. ఎడ్ల జతలు బండ్లను ‘బరబరా’ లాగుతుంటే చూసే వారు ఉత్తేజభరితులయ్యారు. కేరింతలు, ఈలలతో ఈ ప్రాంతం మారుమోగిపోయింది. ప్రదర్శనలో పోటీ పడ్డ ఎడ్ల జతలన్నీ కొన్ని క్షణాల తేడాతోనే లక్ష్యాన్ని చేరుకుంటుండడంతో.. ఎవరి నందుల జంట గెలుపుగంట మోగిస్తుందోనన్న ఉత్కంఠ అందరిలో నిండింది. చివరికి మురమండ గ్రామానికి చెందిన మొగలపు సత్యనారాయణకు చెందిన ఎడ్ల జత నిర్ణీత దూరాన్ని 21.52 సెకన్లలో చేరుకుని మొదటి స్థానాన్ని దక్కించుకుంది. చింతల నామవరం గ్రామానికి చెందిన ఈలి మూసలయ్యకు చెందిన ఎడ్ల జత 22.45 సెకన్లలో, ఏడిద సావరం గ్రామానికి చెందిన టేకిమూడి సత్యనారాయణకు చెందిన ఎడ్ల జత 22.52 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ద్వితీ, తృతీయస్థానాల్లో నిలిచాయి. విజేతలకు నగదు ప్రోత్సాహకంతో పాటు, షీల్డులను నిర్వాహకులు అందజేశారు. -
పరుగో.. పరుగు
ఉత్కంఠభరితంగా రాష్ట్రస్థాయి ఎడ్లపరుగు పోటీలు సీనియర్స్ విజేత విశాఖ జూనియర్స్ విజేత తూర్పుగోదావరి గొల్లప్రోలు : గొల్లప్రోలులోని మాదేపల్లి రంగబాబు మెమోరియల్ రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు ప్రదర్శన పోటీలు ఆదివారం ఉత్కంఠభరితంగా సాగాయి. స్థానిక గోదావరికాలువ గట్టుపై నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాతో పాటు పశ్చిమగోదావరి, ప్రకాశం, కృష్ణ, విశాఖ, విజయనగరం జిల్లాలకు చెందిన 47 జతల ఎడ్లు పాల్గొన్నాయి. రైతులు మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా చెట్లు, వరిచేలగట్లపై నిల్చొని పోటీలను ఆసక్తిగా తిలకించారు. * సీనియర్స్ విభాగంలో ఏడు జతల ఎడ్లు పోటీల్లో పాల్గొన్నాయి. విజేతగా విశాఖజిల్లా చుక్కపల్లికి చెందిన అద్దేపల్లి పాలవల్లికి చెందిన ఎడ్లు(5నిమిషాలు–54సెకన్లు–37పాయింట్లు), ద్వితీయస్థానంలో విశాఖజిల్లా చుక్కపల్లికి చెందిన మజ్జి రాజేష్ ఎడ్లుజత(5–54–44), అల్లవరం మండలం బెండమూర్లంకకు చెందిన గుర్రం రాణిశ్రీయుక్తకు చెందిన ఎడ్లు(6–05–87) తృతీయస్థానంలో నిలిచాయి. * జూనియర్స్ విభాగంలో 30జతల ఎడ్లు పాల్గొనగా, విజేతగా గండేపల్లి మండలం నాయకంపల్లికి చెందిన చెరుకూరి రామసూర్యవర్షిత్ ఎడ్లుజత(4 నిమిషాలు, 39సెంకడ్లు––28పాయింట్లు) , ద్వితీయస్థానంలో పిఠాపురం మండలం బి ప్రత్తిపాడుకు చెందిన బొజ్జా లక్ష్మీఅపర్ణకు చెందిన ఎడ్లు జత(4–49–25) , తృతీయస్థానంలో ప్రకాశంజిల్లా పంగులూరుకు చెందిన పెండ్యాల రాంబాబు ఎడ్లుజత(4–49–37) నిలిచాయి. విజేతలకు బహుమతులు సీనియర్స్‌లో విజేతకు లింగం రాజు రూ.15వేలు నగదు, ద్వితీయవిజేతకు నాగలక్ష్మిసీడ్స్ అధినేత గట్టెం విష్ణు రూ.12వేలు, తృతీమబహుమతిని పీఎంఆర్ విద్యామందిర్ అధినేత మాదేపల్లి వినీల్ రూ10వేలు, జూనియర్స్ విజేతకు మాధురివిద్యాలయ అధినేత కడారి తమ్మయ్యనాయుడు రూ.12వేలు, ద్వితీయబహుమతిని శివసాయి ఏజన్సీస్ అధినేత తెడ్లపు చిన్నారావు రూ.10వేలు, తృతీయ బహుమతిని అధమాకంపెనీ రూ.8వేలు ఆర్థికసహాయం అందజేశారు. విజేతలకు ఎమ్మెల్యే వర్మ బహుమతులు, మెమెంటోలు, శివసాయి ఏజన్సీస్ అధినేత చిన్నారావు ప్రత్యేక మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాదేపల్లి వినీల్, నగరపంచాయతీ చైర్మన్ శీరం మాణిక్యం, నీటి సంఘం అధ్యక్షులు కడారి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. పోటీలకు న్యాయనిర్ణేతలగా సిద్ధా నానాజీ వ్యవహరించారు. ఏర్పాట్లను రంగబాబు మెమోరియల్ కమిటీ పర్యవేక్షించింది. శ్రీశ్రీనివాసా ఏజన్సీస్ అధినేత కేదారిశెట్టినానాజీ మజ్జిగ పంపిణీ చేశారు. -
ఉత్కంఠగా ఎడ్ల పందేలు
వేమవరం (మాచవరం) : మండలంలోని వేమవరం గ్రామంలో లక్ష్మీతిరుపతమ్మ 25వ కల్యాణ మహోత్సవం సందర్భంగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు సోమవారం రసవత్తరంగా సాగాయి. జత పళ్ల విభాగంలో నర్సరావుపేట రూరల్ ఇస్సపాలెం గ్రామానికి చెందిన విట్టె వెంకట రామాంజనేయులు , శావల్యాపురం మండలం పిచకల పాలెంనకు చెందిన పొట్ల పద్మావతి చౌదరి కంబైన్డ్ ఎడ్ల జత 3083.11 అడుగుల దూరాన్ని లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. పిడుగురాళ్లకు చెందిన కోనాల రామకోటయ్య ఎడ్ల జత 3083,6 అడుగుల దూరాన్ని లాగి రెండో స్థానం దక్కించుకున్నాయి. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం వై.వి. పాలెంనకు చెందిన వై.ఎన్.పి.రెడ్డి బుల్స్ ఎడ్ల జత 2864.3 అడుగులు, మాచవరం మండలం మోర్జంపాడు గ్రామ వాసి మచ్చాల వెంకటేశ్వరావు పిల్లుట్ల గ్రామానికి చెందిన షేక్ నబూలమ్మ కంబైన్డ్ జత 2600 అడుగులు, నాదెండ్ల మండలం గణపవరానికి చెందిన కామేపల్లి బ్రహ్మనాయుడు , సత్తెనపల్లి రూరల్ వెన్నాదేవి కి చెందిన జాస్తి కోటేశ్వరావు కంబైన్డ్ జత 2447.10 అడుగుల దూరాన్ని లాగి మూడు, నాలుగు, ఐదు వరుస బహుమతులు దక్కించుకున్నాయి. -
కాడెద్దులు కనుమరుగేనా!
-పదేళ్లలో గణనీయంగా తగ్గిన ఎడ్లు వాటి స్థానంలో ట్రాక్టర్లు, రోటావేటర్లు రాయవరం : ఒకనాడు వ్యవసాయంలో కాడెద్దులున్న రైతుకు ఎంతో దన్నుగా ఉండేది. పొలాలు దున్నాలన్నా, పంటలు ఇంటికి చేరాలన్నా వాటి అవసరం ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం జత ఎద్దులు కొనాలంటే రూ.లక్ష వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఇదే సమయంలో కాడెద్దుల స్థానంలో ట్రాక్టర్లు, కోత యంత్రాలు, రోటావేటర్లు పొలాల్లో దర్శనమిస్తున్నాయి. పల్లెల్లో ఎక్కడో ఒకరిద్దరు రైతుల వద్దే కాడెద్దులు కనిపిస్తున్నాయి. తగ్గిపోతున్న దేశవాళీ పశువులు.. పశు సంవర్ధక శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో పదేళ్ల కిందట దేశవాళీ పశువులు మూడు లక్షల దాకా ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 89,104కు పడిపోయింది. ఇందులో ఎద్దుల సంఖ్య కేవలం 3,154 మాత్రమే. దేశవాళీ పశువుల స్థానంలో హెచ్ఎఫ్, జెర్సీలాంటి పాలిచ్చే ఆవుల సంఖ్య పెరిగింది. యాంత్రీకకరణ నేపథ్యంలో రైతులు యంత్రాలనే ఎక్కువ వినియోగిస్తున్నారు. పశువులను మేపడం కూడా భారంగా మారడంతో ఎద్దుల వినియోగాన్ని తగ్గించేశారు. పాల ఆవుల సంఖ్య పెరిగే కొద్దీ కోడెలు, గిత్తలు, ఎద్దుల సంఖ్య క్రమేపీ తగ్గిపోయింది. ముఖ్యంగా ట్రాక్టర్లతోనే వ్యవసాయ పనులు జరుగుతుండడంతో ఎద్దుల అవసరం తగ్గింది. ప్రస్తుతం కేవలం మెట్ట, ఏజెన్సీ ప్రాంతంలో మాత్రమే కాడెద్దుల వినియోగం కనబడుతోంది. పెరిగిన రేట్లు కాడెద్దుల సంఖ్య తగ్గిపోవడంతో వీటికి డిమాండ్ భారీగా పెరిగింది. మంచి కాడెద్దుల జోడు కొనాలంటే రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకూ వెచ్చించాల్సి వస్తోంది. అవి కూడా ద్రాక్షారామ, పిఠాపురం, గొల్లప్రోలు, ద్వారపూడి, గోకవరం, రామవరం వారపు సంతల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. ఇంకా యాంఽత్రీకరణ జరగని ఉత్తరాంధ్ర జిల్లాల రైతులే కాడెద్దులు కొంటున్నారు. -
హోరాహోరీగా ఎడ్ల పోటీలు
హోరాహోరీగా ఎడ్ల పోటీలు జాతీయస్థాయి, ఎద్దులు, పోటీలు, national, ox, compitions national cows compitions నాలుగు పళ్ల విభాగంలో తెలుగురాష్ట్రాల ఎడ్ల విజయం ఐదు స్థానాలను కైవసం చేసుకున్న గుంటూరు జిల్లా గిత్తలు చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని పాత పశువుల సంత ఆవరణలో జరుగుతున్న జాతీయ స్థాయి ఎడ్ల పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. నాలుగు పళ్ల విభాగంలో సంయుక్తంగా పోటీల్లో పాల్గొన్న ఏపీ, తెలంగాణ గిత్తలు రికార్డు స్థాయి దూరాన్ని లాగి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. మిగిలిన ఐదు స్థానాలను గుంటూరు జిల్లా ఎడ్లు సాధించాయి. ఈ విభాగంలో తెలంగాణలోని హుజూరునగర్కు చెందిన సుంకి సురేంద్రరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లోని ఘంటసాలకు చెందిన వేమూరి మౌర్యచంద్ర ఎడ్ల జత 4733.09 అడుగుల మేర బండను లాగి సరికొత్త రికార్డు నెలకొల్పాయి. రెండో స్థానంలో నరసరావుపేట మండలం పెట్రుపాలేనికి చెందిన మోజాల వెంకటదుర్గారావు, దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన నెల్లూరి రామారావు గిత్తలు 4179 అడుగుల దూరాన్ని లాగి రెండో స్థానంలో నిలిచాయి. దాచేపల్లి మండలం పెదగార్లపాడుకు చెందిన తోట బ్రహ్మనాయుడు గిత్తలు 4143.4, మంగళగిరి మండలం నవలూరుకు చెందిన బత్తుల సరోజినిదేవి ఎడ్లు 4135.03, ప్రత్తిపాడుకు చెందిన రోహిత్ వెంకటకృష్ణయాదవ్ ఎడ్లు 3439, తాళ్ల చెరువు గ్రామానికి చెందిన తుమ్మా అనుహిత రెడ్డి ఎడ్ల జత 3350 అడుగుల మేర దూరాన్ని లాగి వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరో స్థానాలు సాధించాయి. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఆరు పళ్ల విభాగంలో ... శుక్రవారం ఆరుపళ్ల విభాగంలో జరిగిన పోటీలో కేసానుపల్లికి చెందిన కావ్వా నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ గిత్తలు 3708.08 అడుగుల దూరాన్ని ముందంజలో కొనసాగుతున్నాయి. గాదెవారిపల్లె గ్రామానికి ఎదురూరి లక్ష్మారెడ్డి ఎడ్లు 3300 అడుగులు, సజ్జాపురం గ్రామానికి చెందిన తేలప్రోలు స్వాములు చౌదరి ఎడ్లు ఆ తరువాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. 20సికెపిటి14–13020008: నాలుగుపళ్ల విభాగం విజేత -
ఈ ఆంబోతు ప్రాణం తీసింది..!
ఆంబోతు పొడిచిన ఘటనలో వృద్ధుడి మృతి ఫిరంగిపురం: ఆంబోతు దాడిలో వృద్ధుడు ప్రాణాలు విడిచిన ఘటన ఫిరంగిపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామంలోని అల్లంవారిపాలెంకు చెందిన పుసులూరి వెంకటేశ్వర్లు(70) ఎప్పటిలాగే ఉదయాన్నే సత్తెనపల్లి బస్టాండ్ సెంటర్లో టిఫిన్ చేసేందుకు వెళ్లాడు. ఆదే సమయంలో రోడ్డు పక్కన వున్న ఆంబోతు ఒక్కసారిగా పెద్దగా రంకెలు వేస్తూ భయభ్రాంతులకు గురిచేయడంతో స్థానికులు పరుగులు తీశారు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు పరుగు తీయలేక పోవడంతో ఆంబోతు దాడి చేసి పొట్టభాగంలో కొమ్ములతో పొడిచింది. వృద్ధుడు ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు కూడా తీవ్ర గాయమైంది. తేరుకున్న స్థానికులు ఆంబోతును తరిమేశారు. వెంకటేశ్వర్లును సమీపంలోని ప్రైౖ వేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే వృద్ధుడు మృతి చెందినట్లు∙వైద్యులు నిర్ధారించారు. ఊహించని ఘటనతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. గతంలో కూడా.... ఫిరంగిపురం, రేపూడి, గొల్లపాలెం గ్రామాలకు చెందిన వారు ఆవులు, ఎద్దులను దేవాలయాలకు మొక్కుబడుల్లో భాగంగా ఉచితంగా ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతిరోజు 20 వరకు ఆవులు, ఎద్దులు రోడ్డు వెంటనే తిరుగుతూ వాహనాల రాకపోకలకు అంతరాయంగా మారుతున్నాయి. గతంలో కూడా రోడ్డు వెంట నిలుచున్న, నడుచుకుంటూ వెళ్ళేవారి వెంట పడి పొడవడం, వెనుకవైపు నుంచి వచ్చి దాడిచేయడంతో కాళ్ళు, చేతులు విరిగిన వారు ఉన్నారు. ఇలా బాధితులుగా మారిన వారు 15 మందికి పైగా ఉంటారని అంచనా. ఇది సమస్యగా మారినా అటు దేవాదాయశాఖ గాని, పంచాయతీ అధికారులుగానీ ఎలాంటి చర్యలు చేపట్టక పోవడం విమర్శలకు దారితీస్తోంది. -
అనంతపురంలో ’గ్రామీణక్రీడ’