హోరాహోరీగా ఎడ్ల పోటీలు
హోరాహోరీగా ఎడ్ల పోటీలు
Published Fri, Jan 20 2017 10:07 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM
హోరాహోరీగా ఎడ్ల పోటీలు
జాతీయస్థాయి, ఎద్దులు, పోటీలు,
national, ox, compitions
national cows compitions
నాలుగు పళ్ల విభాగంలో తెలుగురాష్ట్రాల ఎడ్ల విజయం
ఐదు స్థానాలను కైవసం చేసుకున్న గుంటూరు జిల్లా గిత్తలు
చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని పాత పశువుల సంత ఆవరణలో జరుగుతున్న జాతీయ స్థాయి ఎడ్ల పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. నాలుగు పళ్ల విభాగంలో సంయుక్తంగా పోటీల్లో పాల్గొన్న ఏపీ, తెలంగాణ గిత్తలు రికార్డు స్థాయి దూరాన్ని లాగి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. మిగిలిన ఐదు స్థానాలను గుంటూరు జిల్లా ఎడ్లు సాధించాయి. ఈ విభాగంలో తెలంగాణలోని హుజూరునగర్‌కు చెందిన సుంకి సురేంద్రరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లోని ఘంటసాలకు చెందిన వేమూరి మౌర్యచంద్ర ఎడ్ల జత 4733.09 అడుగుల మేర బండను లాగి సరికొత్త రికార్డు నెలకొల్పాయి. రెండో స్థానంలో నరసరావుపేట మండలం పెట్రుపాలేనికి చెందిన మోజాల వెంకటదుర్గారావు, దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన నెల్లూరి రామారావు గిత్తలు 4179 అడుగుల దూరాన్ని లాగి రెండో స్థానంలో నిలిచాయి. దాచేపల్లి మండలం పెదగార్లపాడుకు చెందిన తోట బ్రహ్మనాయుడు గిత్తలు 4143.4, మంగళగిరి మండలం నవలూరుకు చెందిన బత్తుల సరోజినిదేవి ఎడ్లు 4135.03, ప్రత్తిపాడుకు చెందిన రోహిత్ వెంకటకృష్ణయాదవ్ ఎడ్లు 3439, తాళ్ల చెరువు గ్రామానికి చెందిన తుమ్మా అనుహిత రెడ్డి ఎడ్ల జత 3350 అడుగుల మేర దూరాన్ని లాగి వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరో స్థానాలు సాధించాయి. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.
ఆరు పళ్ల విభాగంలో ...
శుక్రవారం ఆరుపళ్ల విభాగంలో జరిగిన పోటీలో కేసానుపల్లికి చెందిన కావ్వా నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ గిత్తలు 3708.08 అడుగుల దూరాన్ని ముందంజలో కొనసాగుతున్నాయి. గాదెవారిపల్లె గ్రామానికి ఎదురూరి లక్ష్మారెడ్డి ఎడ్లు 3300 అడుగులు, సజ్జాపురం గ్రామానికి చెందిన తేలప్రోలు స్వాములు చౌదరి ఎడ్లు ఆ తరువాత స్థానాల్లో కొనసాగుతున్నాయి.
20సికెపిటి14–13020008: నాలుగుపళ్ల విభాగం విజేత
Advertisement
Advertisement