compitions
-
హోరాహోరీగా టెన్నిస్ పోటీలు
చిలకలూరిపేట : పట్టణంలోని సీఆర్ క్లబ్లో ఇన్విటేషనల్ టెన్నిస్ పోటీలు ఆదివారం రెండోరోజు హోరాహోరీగా సాగాయి. 50 ఏళ్ల లోపు, 50ఏళ్లు పైబడి విభాగాల్లో నిర్వహిస్తున్నారు. గుంటూరు, ప్రకా«శం, కృష్ణాజిల్లాలకు చెందిన సుమారు 50 జట్లు పాల్గొంటున్నాయి. పోటీలు అర్ధరాత్రి వరకూ జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. -
హోరాహోరీగా ఎడ్ల పోటీలు
హోరాహోరీగా ఎడ్ల పోటీలు జాతీయస్థాయి, ఎద్దులు, పోటీలు, national, ox, compitions national cows compitions నాలుగు పళ్ల విభాగంలో తెలుగురాష్ట్రాల ఎడ్ల విజయం ఐదు స్థానాలను కైవసం చేసుకున్న గుంటూరు జిల్లా గిత్తలు చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని పాత పశువుల సంత ఆవరణలో జరుగుతున్న జాతీయ స్థాయి ఎడ్ల పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. నాలుగు పళ్ల విభాగంలో సంయుక్తంగా పోటీల్లో పాల్గొన్న ఏపీ, తెలంగాణ గిత్తలు రికార్డు స్థాయి దూరాన్ని లాగి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. మిగిలిన ఐదు స్థానాలను గుంటూరు జిల్లా ఎడ్లు సాధించాయి. ఈ విభాగంలో తెలంగాణలోని హుజూరునగర్కు చెందిన సుంకి సురేంద్రరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లోని ఘంటసాలకు చెందిన వేమూరి మౌర్యచంద్ర ఎడ్ల జత 4733.09 అడుగుల మేర బండను లాగి సరికొత్త రికార్డు నెలకొల్పాయి. రెండో స్థానంలో నరసరావుపేట మండలం పెట్రుపాలేనికి చెందిన మోజాల వెంకటదుర్గారావు, దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన నెల్లూరి రామారావు గిత్తలు 4179 అడుగుల దూరాన్ని లాగి రెండో స్థానంలో నిలిచాయి. దాచేపల్లి మండలం పెదగార్లపాడుకు చెందిన తోట బ్రహ్మనాయుడు గిత్తలు 4143.4, మంగళగిరి మండలం నవలూరుకు చెందిన బత్తుల సరోజినిదేవి ఎడ్లు 4135.03, ప్రత్తిపాడుకు చెందిన రోహిత్ వెంకటకృష్ణయాదవ్ ఎడ్లు 3439, తాళ్ల చెరువు గ్రామానికి చెందిన తుమ్మా అనుహిత రెడ్డి ఎడ్ల జత 3350 అడుగుల మేర దూరాన్ని లాగి వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరో స్థానాలు సాధించాయి. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఆరు పళ్ల విభాగంలో ... శుక్రవారం ఆరుపళ్ల విభాగంలో జరిగిన పోటీలో కేసానుపల్లికి చెందిన కావ్వా నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ గిత్తలు 3708.08 అడుగుల దూరాన్ని ముందంజలో కొనసాగుతున్నాయి. గాదెవారిపల్లె గ్రామానికి ఎదురూరి లక్ష్మారెడ్డి ఎడ్లు 3300 అడుగులు, సజ్జాపురం గ్రామానికి చెందిన తేలప్రోలు స్వాములు చౌదరి ఎడ్లు ఆ తరువాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. 20సికెపిటి14–13020008: నాలుగుపళ్ల విభాగం విజేత -
ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు
గుంటూరు స్పోర్ట్స్ : జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఖేలో ఇండియా అండర్–14, 17 బాలబాలికల రాష్ట్ర స్థాయి బాక్సింగ్ టోర్నమెంట్ ప్రారంభమైంది. టోర్నమెంట్లో 12 జిల్లాలకు చెందిన 300 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. అండర్–14 బాలబాలికల విభాగంలో 46 కేజీల నుంచి 64 కేజీలలో 5 కేటగిరిలలో, అండర్–17 బాలబాలికల విభాగంలో 48 కేజీల నుంచి 68 కేజీలలో 5 కేటగిరిలలో పోటీలు జరుగుతాయి. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పోటీలను ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మూడు రోజుల పాటు జరిగే బాక్సింగ్ పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు ఉచిత, భోజన సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ షేక్ జానీమూన్, ఎమ్మెల్సీ రామకృష్ణ, డీఎస్డీఓ బి.శ్రీనివాసరావు, మార్కెట్ యార్డు డైరెక్టర్ మన్నవ సుబ్బారావు, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ లాల్ వజీర్, ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి సంపత్ కుమార్, బాక్సింగ్ కోచ్ విశ్వనా«థ్ క్రీడాకారులు, శిక్షకులు పాల్గొన్నారు. -
జాతీయ ఫొటోగ్రఫీ పోటీలో ప్రథమ బహుమతి
జాతీయ ఫొటోగ్రఫీ పోటీలో ప్రథమ బహుమతి జాతీయ, ఫొటోగ్రఫీ, పోటీలు national, photography, compitions 03జీఎన్టిడి 09 పాపికొండల్లో బ్రహ్మ తీసిన ఫొటో 03జీఎన్టిడి 10 ఐక్యూ.బ్రహ్మ గుంటూరు(అరండల్‌పేట) :తెలంగాణా రాష్ట్రంలోని భద్రాచలం పాపికొండల వద్ద ఇటీవల జరిగిన 8వ జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ వర్క్‌షాపులో నగరానికి చెందిన ఐక్యూ.బ్రహ్మ ప్రథమ బహుమతికి ఎంపికయ్యారు. ఈ విషయం మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. పాపికొండలు జనరల్ విభాగంలో పాపికొండల్లో తీసిన ఫొటోకు ఈ బహుమతి లభించినట్టు పేర్కొన్నారు -
ఉత్కంఠగా క్రికెట్ టోర్నమెంట్
గుంటూరు స్పోర్ట్స్: తాడికొండ మండలం లాం చలపతి ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న ఏఎన్‌యూ అంతర కళాశాలల నార్త్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్కంఠభరింతంగా సాగుతోంది. శుక్రవారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో నర్సరావుపేటకు చెందిన పీఎస్సీ అండ్ కెఆర్ జట్టు 8 వికెట్ల తేడాతో హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన హిందూ కాలేజ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన పీఎస్సీ జట్టు 2 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి విజయం సాధించింది. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో తాడికొండకు చెందిన బీఎస్‌ఎస్‌బీ జట్టు 3 పరుగుల తేడాతో నర్సరావుపేటకు చెందిన ఎంఏఎం ఫార్మసీ కళాశాల జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన బీఎస్‌ఎస్‌బీ జట్టు 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఫార్మసీ కళాశాల జట్టు నిర్ణీత ఓవర్లలో 7వికెట్లు 109 పరుగులు చేసి ఓటమి చెందింది. -
కవులు, రచయితలకు పోటీలు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : టీఎస్ యూటీఎఫ్ రెండో రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని కవులు, రచయితలకు పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.జంగయ్య, సాహిత్య, సంస్కృతిక కన్వీనర్ ఆర్.నర్సింహులు తెలిపారు. కార్యక్రమ నిర్వహణ రచయితల కమిటీని ఆదివారం ఏర్పాటు చేశారు. జిల్లా కన్వీనర్‌గా ఆర్.నర్సిములు, కో కన్వీనర్‌గా వి.జనార్దన, 13మంది సభ్యులను ఎన్నుకున్నారు. కథలు, కవితలు, వ్యాసాలు, పాటలు, నాటికలు, బుర్రకథలు, పల్లెసుద్దులు, పద్యసంకలనము, బాలసాహిత్యము, విద్య, అక్షరాస్యత, మూఢనమ్మకాలు–శాస్త్రీయ ఆలోచన, అభివృద్ధి–అవినీతి, పేదరికం–వలసలు, దేశ సమైక్యత, మహిళలు–బాలికల సమస్యలు, ప్రపంచీకరణ– సమాజంపై ప్రభావము తదితర అంశాలపై పోటీలు ఉంటాయని తెలిపారు. తాలూకాస్థాయిలో 21, 22 తేదీలో సమావేశం నిర్వహిస్తామని, రచనలకు అక్టోబర్ 5 చివరితేదీగా నిర్ణయించామని, ఉత్తమ రచనలకు నగదు పురస్కారం అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కవులు జనార్దన, కృష్ణయ్య, లక్ష్మణమూర్తి, వెంకటయ్య, సత్యం పాల్గొన్నారు.