ఉత్కంఠగా క్రికెట్ టోర్నమెంట్
ఉత్కంఠగా క్రికెట్ టోర్నమెంట్
Published Fri, Nov 11 2016 8:36 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM
గుంటూరు స్పోర్ట్స్: తాడికొండ మండలం లాం చలపతి ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న ఏఎన్‌యూ అంతర కళాశాలల నార్త్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్కంఠభరింతంగా సాగుతోంది. శుక్రవారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో నర్సరావుపేటకు చెందిన పీఎస్‌సీ అండ్ కెఆర్ జట్టు 8 వికెట్ల తేడాతో హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన హిందూ కాలేజ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన పీఎస్‌సీ జట్టు 2 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి విజయం సాధించింది. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో తాడికొండకు చెందిన బీఎస్‌ఎస్‌బీ జట్టు 3 పరుగుల తేడాతో నర్సరావుపేటకు చెందిన ఎంఏఎం ఫార్మసీ కళాశాల జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన బీఎస్‌ఎస్‌బీ జట్టు 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఫార్మసీ కళాశాల జట్టు నిర్ణీత ఓవర్లలో 7వికెట్లు 109 పరుగులు చేసి ఓటమి చెందింది.
Advertisement
Advertisement