కవులు, రచయితలకు పోటీలు
Published Mon, Sep 19 2016 12:57 AM | Last Updated on Thu, Oct 4 2018 5:44 PM
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : టీఎస్ యూటీఎఫ్ రెండో రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని కవులు, రచయితలకు పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.జంగయ్య, సాహిత్య, సంస్కృతిక కన్వీనర్ ఆర్.నర్సింహులు తెలిపారు. కార్యక్రమ నిర్వహణ రచయితల కమిటీని ఆదివారం ఏర్పాటు చేశారు. జిల్లా కన్వీనర్‌గా ఆర్.నర్సిములు, కో కన్వీనర్‌గా వి.జనార్దన, 13మంది సభ్యులను ఎన్నుకున్నారు. కథలు, కవితలు, వ్యాసాలు, పాటలు, నాటికలు, బుర్రకథలు, పల్లెసుద్దులు, పద్యసంకలనము, బాలసాహిత్యము, విద్య, అక్షరాస్యత, మూఢనమ్మకాలు–శాస్త్రీయ ఆలోచన, అభివృద్ధి–అవినీతి, పేదరికం–వలసలు, దేశ సమైక్యత, మహిళలు–బాలికల సమస్యలు, ప్రపంచీకరణ– సమాజంపై ప్రభావము తదితర అంశాలపై పోటీలు ఉంటాయని తెలిపారు. తాలూకాస్థాయిలో 21, 22 తేదీలో సమావేశం నిర్వహిస్తామని, రచనలకు అక్టోబర్ 5 చివరితేదీగా నిర్ణయించామని, ఉత్తమ రచనలకు నగదు పురస్కారం అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కవులు జనార్దన, కృష్ణయ్య, లక్ష్మణమూర్తి, వెంకటయ్య, సత్యం పాల్గొన్నారు.
Advertisement
Advertisement