ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు
ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు
Published Tue, Jan 3 2017 10:02 PM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM
గుంటూరు స్పోర్ట్స్ : జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఖేలో ఇండియా అండర్–14, 17 బాలబాలికల రాష్ట్ర స్థాయి బాక్సింగ్ టోర్నమెంట్ ప్రారంభమైంది. టోర్నమెంట్‌లో 12 జిల్లాలకు చెందిన 300 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. అండర్–14 బాలబాలికల విభాగంలో 46 కేజీల నుంచి 64 కేజీలలో 5 కేటగిరిలలో, అండర్–17 బాలబాలికల విభాగంలో 48 కేజీల నుంచి 68 కేజీలలో 5 కేటగిరిలలో పోటీలు జరుగుతాయి. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పోటీలను ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మూడు రోజుల పాటు జరిగే బాక్సింగ్ పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు ఉచిత, భోజన సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, ఎమ్మెల్సీ రామకృష్ణ, డీఎస్‌డీఓ బి.శ్రీనివాసరావు, మార్కెట్ యార్డు డైరెక్టర్ మన్నవ సుబ్బారావు, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ లాల్ వజీర్, ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి సంపత్ కుమార్, బాక్సింగ్ కోచ్ విశ్వనా«థ్ క్రీడాకారులు, శిక్షకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement