పరుగో.. పరుగు
పరుగో.. పరుగు
Published Sun, Mar 26 2017 10:36 PM | Last Updated on Tue, Sep 5 2017 7:09 AM
ఉత్కంఠభరితంగా రాష్ట్రస్థాయి ఎడ్లపరుగు పోటీలు
సీనియర్స్ విజేత విశాఖ
జూనియర్స్ విజేత తూర్పుగోదావరి
గొల్లప్రోలు : గొల్లప్రోలులోని మాదేపల్లి రంగబాబు మెమోరియల్ రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు ప్రదర్శన పోటీలు ఆదివారం ఉత్కంఠభరితంగా సాగాయి. స్థానిక గోదావరికాలువ గట్టుపై నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాతో పాటు పశ్చిమగోదావరి, ప్రకాశం, కృష్ణ, విశాఖ, విజయనగరం జిల్లాలకు చెందిన 47 జతల ఎడ్లు పాల్గొన్నాయి. రైతులు మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా చెట్లు, వరిచేలగట్లపై నిల్చొని పోటీలను ఆసక్తిగా తిలకించారు.
* సీనియర్స్ విభాగంలో ఏడు జతల ఎడ్లు పోటీల్లో పాల్గొన్నాయి. విజేతగా విశాఖజిల్లా చుక్కపల్లికి చెందిన అద్దేపల్లి పాలవల్లికి చెందిన ఎడ్లు(5నిమిషాలు–54సెకన్లు–37పాయింట్లు), ద్వితీయస్థానంలో విశాఖజిల్లా చుక్కపల్లికి చెందిన మజ్జి రాజేష్ ఎడ్లుజత(5–54–44), అల్లవరం మండలం బెండమూర్లంకకు చెందిన గుర్రం రాణిశ్రీయుక్తకు చెందిన ఎడ్లు(6–05–87) తృతీయస్థానంలో నిలిచాయి.
* జూనియర్స్ విభాగంలో 30జతల ఎడ్లు పాల్గొనగా, విజేతగా గండేపల్లి మండలం నాయకంపల్లికి చెందిన చెరుకూరి రామసూర్యవర్షిత్ ఎడ్లుజత(4 నిమిషాలు, 39సెంకడ్లు––28పాయింట్లు) , ద్వితీయస్థానంలో పిఠాపురం మండలం బి ప్రత్తిపాడుకు చెందిన బొజ్జా లక్ష్మీఅపర్ణకు చెందిన ఎడ్లు జత(4–49–25) , తృతీయస్థానంలో ప్రకాశంజిల్లా పంగులూరుకు చెందిన పెండ్యాల రాంబాబు ఎడ్లుజత(4–49–37) నిలిచాయి.
విజేతలకు బహుమతులు
సీనియర్స్‌లో విజేతకు లింగం రాజు రూ.15వేలు నగదు, ద్వితీయవిజేతకు నాగలక్ష్మిసీడ్స్ అధినేత గట్టెం విష్ణు రూ.12వేలు, తృతీమబహుమతిని పీఎంఆర్ విద్యామందిర్ అధినేత మాదేపల్లి వినీల్ రూ10వేలు, జూనియర్స్ విజేతకు మాధురివిద్యాలయ అధినేత కడారి తమ్మయ్యనాయుడు రూ.12వేలు, ద్వితీయబహుమతిని శివసాయి ఏజన్సీస్ అధినేత తెడ్లపు చిన్నారావు రూ.10వేలు, తృతీయ బహుమతిని అధమాకంపెనీ రూ.8వేలు ఆర్థికసహాయం అందజేశారు. విజేతలకు ఎమ్మెల్యే వర్మ బహుమతులు, మెమెంటోలు, శివసాయి ఏజన్సీస్ అధినేత చిన్నారావు ప్రత్యేక మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాదేపల్లి వినీల్, నగరపంచాయతీ చైర్మన్ శీరం మాణిక్యం, నీటి సంఘం అధ్యక్షులు కడారి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. పోటీలకు న్యాయనిర్ణేతలగా సిద్ధా నానాజీ వ్యవహరించారు. ఏర్పాట్లను రంగబాబు మెమోరియల్ కమిటీ పర్యవేక్షించింది. శ్రీశ్రీనివాసా ఏజన్సీస్ అధినేత కేదారిశెట్టినానాజీ మజ్జిగ పంపిణీ చేశారు.
Advertisement
Advertisement