statelevel
-
ఉత్కంఠగా ఎడ్ల పందేలు
వేమవరం (మాచవరం) : మండలంలోని వేమవరం గ్రామంలో లక్ష్మీతిరుపతమ్మ 25వ కల్యాణ మహోత్సవం సందర్భంగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు సోమవారం రసవత్తరంగా సాగాయి. జత పళ్ల విభాగంలో నర్సరావుపేట రూరల్ ఇస్సపాలెం గ్రామానికి చెందిన విట్టె వెంకట రామాంజనేయులు , శావల్యాపురం మండలం పిచకల పాలెంనకు చెందిన పొట్ల పద్మావతి చౌదరి కంబైన్డ్ ఎడ్ల జత 3083.11 అడుగుల దూరాన్ని లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. పిడుగురాళ్లకు చెందిన కోనాల రామకోటయ్య ఎడ్ల జత 3083,6 అడుగుల దూరాన్ని లాగి రెండో స్థానం దక్కించుకున్నాయి. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం వై.వి. పాలెంనకు చెందిన వై.ఎన్.పి.రెడ్డి బుల్స్ ఎడ్ల జత 2864.3 అడుగులు, మాచవరం మండలం మోర్జంపాడు గ్రామ వాసి మచ్చాల వెంకటేశ్వరావు పిల్లుట్ల గ్రామానికి చెందిన షేక్ నబూలమ్మ కంబైన్డ్ జత 2600 అడుగులు, నాదెండ్ల మండలం గణపవరానికి చెందిన కామేపల్లి బ్రహ్మనాయుడు , సత్తెనపల్లి రూరల్ వెన్నాదేవి కి చెందిన జాస్తి కోటేశ్వరావు కంబైన్డ్ జత 2447.10 అడుగుల దూరాన్ని లాగి మూడు, నాలుగు, ఐదు వరుస బహుమతులు దక్కించుకున్నాయి. -
8న విజయనగరంలో రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు
రాజమహేంద్రవరం సిటీ : నవ్యాంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేష¯ŒS ఆధ్వర్యంలో ఈ నెల 8న విజయనగరం గురజాడ కళాక్షేత్రంలో రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేష¯ŒS అ««దl్యక్షుడు అడ్డూరి వీరభద్రరావు సోమవారం ప్రకటనలో తెలిపారు. క్రీడాకారుల శరీర బరువును అనుసరించి 8 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు.40 సంవత్సరాలు పైబడిన వారికి మాస్టర్స్ విభాగంలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మిస్టర్ ఆంధ్రప్రదేశ్‌తో పాటు నాలుగు టైటిళ్లు, నగదు బహుమతులు ఇస్తామన్నారు. ఒక్కో జిల్లా నుంచి 20 మంది క్రీడాకారులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన 20 మంది క్రీడాకారులను ఫిబ్రవరిలో బెంగళూరులో జరిగే అఖితభారత బాడీ బిల్డింగ్ పోటీలకు పంపుతామన్నారు. -
రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలు ప్రారంభం
భానుగుడి(కాకినాడ) : ఏపీ పాఠశాలల సమాఖ్య 62వ అంతర్ జిల్లాల స్కేటింగ్ పోటీలు శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. కాకినాడ కుళాయిచెరువు పార్కు స్కేటింగ్ ప్రాంగణంలో జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు ఈ పోటీలను ప్రారంభించి ప్రసంగించారు. రాష్ట్రస్థాయి క్రీడలకు జిల్లా ఆతిథ్యమివ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. పోటీల్లో పశ్చిమ, తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. 262 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 48 మంది క్రీడాకారులను జాతీయ స్థాయిలో కర్ణాటక గుల్బర్్గలో నిర్వహించే పోటీలకు ఎంపిక చేశామని పాఠశాల క్రీడల కార్యదర్శి పప్పుల శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. క్రీడాకారులు తమ స్కేటింగ్ ప్రదర్శనలతో ఆహూతులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, డీఎస్డీఓ పి.మురళీదర్, జిల్లావిద్యాశాఖ ఏడీ విజయలక్ష్మి, స్టేట్ అబ్జర్వర్ బాబూరావు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
రాష్ట్ర సైకిల్ పోటీల్లో ప్రథమం ‘అల్లం’
చెరుకుపల్లి : రాష్ట్ర స్థాయి సైకిల్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండల పరిధిలోని రాంబోట్లవారిపాలెం గ్రామంలో శ్రీబండ్లమ్మ తల్లి యూత్ పగడం వారి పాలెం వారి ఆధ్వర్యంలో ఈ సైకిల్ వేగం పోటీలు నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచి సైకిల్ వేగం పోటీల్లో 30 మంది పాల్గొన్నారు. మొదటి బహుమతి అల్లం సుబ్బారెడ్డి (దుండిపాలెం) రూ.20,116 , రెండో బహుమతి గంజరబోయిన కుమారస్వామిరెడ్డి (దుండిపాలెం) రూ.15,116, మూడో బహుమతి వారె నాగరాజు రెడ్డి (పొన్నపల్లి) రూ.10,116, నాలుగో బహుమతి గణేష్ యూత్ (పొన్నపల్లి) రూ.6,116, ఐదో బహుమతి కుక్కల మణికంఠరెడ్డి (దుండిపాలెం) రూ.5,116, ఆరో బహుమతి నక్కా సూరిబాబు (పిట్లవానిపాలెం) రూ.3,116 అందుకున్నారు. జెడ్పీటీసీ సభ్యులు పిట్టు శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు చీరాల ప్రసాదరెడ్డి, కిరణ్‌కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంఆర్‌కె మూర్తి, కుమారస్వామి పాల్గొన్నారు. -
నేడు రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు ప్రారంభం
కల్లూరు : జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అండర్ 14 బాల బాలికల రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు నగర శివారులోని ఇండస్ స్కూల్ ఆవరణలో ప్రారంభమవుతున్నాయని ఫెడరేషన్ కార్యదర్శి పవన్‌కుమార్ గురువారం తెలిపారు. డీఈఓ రవీంద్రనాథ్ రెడ్డి శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. జట్టు క్రీడాకారులను అభినందించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాల క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. అనంతరం క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ ప్రతినిధి నరసయ్య, సంఘం కార్యదర్శి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలు ప్రారంభం
కల్లూరు: స్తానిక డీఎస్ఏ స్విమ్మింగ్‌పూల్‌లో 62వ రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలను శనివారం.. ఎంపీ టీజీ వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భఃగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల నుంచి నగరంలో నిర్వహిస్తున్న పోటీల్లో వెయ్యి మంది బాలబాలికలు వివిధ క్రీడాంశాలలో పాల్గొనడం హర్షణీయమన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పడాలన్నారు. క్రీడాకారుల అభ్యున్నతికి తోడ్పాటునందిస్తామన్నారు. అంతకుముందు అవుట్డోర్ స్టేడియంలో రాష్ట్ర అథ్లెటిక్స్ 100 మీటర్ల పరుగులో విజేతలైన చిన్నబాబు (వెస్ట్‌గోదావరి), మోహిద్దీన్ (కృష్ణా), రాజేషకుమార్ (నెల్లూరు), జ్యోతి (వైజాగ్), రమ్య (శ్రీకాకుళం), రజియా (కర్నూలు)లకు పతకాలు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులు భాస్కర్‌రెడ్డి, షాజహాన్, నిర్వహక కార్యదర్శి ఎల్. చలపతి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు విజయకుమార్, రామాంజనేయులు, పీడీలు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి క్రీడలు ప్రారంభం
గుంటూరు స్పోర్ట్స్ : క్రీడలు ఉద్యోగులకు శారీరక దారుధ్యాన్ని, మానసిక వికాసాన్ని పెంపొందించేందుకు దోహదపడుతాయని విజయవాడ చీఫ్ ఇంజినీర్ కె.రాజ బాపయ్య అన్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి టెన్నిస్, బాస్కెట్‌బాల్ పోటీలు సోమవారం స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఏపీ జెన్కో క్రీడలలో పలుపంచుకోవటం ఆనందదాయకమన్నారు. విద్యుత్ శాఖ జిల్లా ఎస్ఈ జయభారతరావు మాట్లాడుతూ క్రీడలలో రాష్ట్రం నలుమూలల నుంచి మొత్తం 150 మందితో కూడిన 20 జట్లు తలపడుతున్నాయన్నారు. జాతీయ స్థాయి పోటీలలో రాణిస్తున్న క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. కార్యక్రమంలో స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా ఎస్ఈ ఎం.విజయకుమార్, ఏపీ ట్రాన్స్‌కో క్రీడాధికారి టి.డి.కుమార వడివేలు, బాస్కెట్ బాల్ అబ్జర్వర్ డి.బాబు రావు, డీఈలు టి.శ్రీనివాసబాబు, యు.హనుమయ్య, ఎం.శివప్రసాదరెడ్డి, ఏ రాందాస్, క్రీడల కార్యదర్శి ఎ.వి.యస్.యస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తొలి రోజు మ్యాచ్‌ల ఫలితాలు.. బాస్కెట్ బాల్ తొలి మ్యాచ్‌లో వైఎస్సార్ కడప జట్టు 28–18 స్కోర్‌తో ఒంగోలు జట్టుపై, విజయవాడ ఎన్టీటీపీఎస్ జట్టు 27–24 స్కోర్‌తో నెల్లూరు జట్టుపై విజయం సాధించాయి. టెన్నిస్ సింగిల్స్ విభాగంలో సురేష్ (తిరుపతి) 6–2 స్కోర్‌తో గోవిందయ్య (నెల్లూరు)పై, కె.మహేష్ (గుంటూరు) 6–1 స్కోర్‌తో జాదరాయ(ఒంగోలు)పై విజయం సాధించారు. డబల్స్ విభాగంలో కెవిఎల్ఎన్.మూర్తి, కె.మహేష్(గుంటూరు) జంట 6–2 స్కోర్‌తో థామస్, ఉదయ్(ఒంగోలు) జంటపై విజయం సాధించారు. -
రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక
చౌటుప్పల్: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 17నుంచి 19వరకు వికారాబాద్‌లో జరిగిన జోనల్ క్రీడా పోటీల్లో చౌటుప్పల్‌లోని బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు 25మంది పాల్గొని పలు బహుమతులను సాధించారు. వీరిని మంగళవారం ప్రిన్సిపాల్ పి.విద్యాసాగర్ మంగళవారం అభినందించారు. ఇందులో 15మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. త్రోబాల్‌లో మొదటి బహుమతిని సాధించి ఏడుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు, షటిల్ బ్యాడ్మింటన్‌లో రెండో స్థానాన్ని సాధించి ఝాన్సీ, దీపికలు రాష్ట్ర స్థాయి పోటీలకు, కబడ్డీలో రాష్ట్ర జట్టుకు అరుణ, సునితలు, ఖోఖోలో రాష్ట్ర జట్టుకు ఇందు, శ్రావణిలు, వాలీబాల్ రాష్ట్ర జట్టుకు జి.కీర్తి, పరుగు పందెం పోటీలకు జి.శ్రావణిలు ఎంపికైనట్టు తెలిపారు. -
హోరాహోరీగా సబ్ జూడో పోటీలు
నందికొట్కూరు: స్థానిక మార్కెట్ యార్డులో రాష్ట్రస్థాయి సబ్జూడో పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. శనివారం పోటీలను మార్కెట్ యార్డు చైర్మన్ గుండం రమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో స్నేహ సంబంధాలు మెరుగు పడతాయన్నారు. గెలుపోటమలు సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాలన్నారు. ఎంపీపీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ పట్టుదలతో సాధన చేసి క్రీడల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. సబ్జూడో పోటీల్లో 12 జిల్లాలకు చెందిన బాలబాలికలు పాల్గొన్నారు. శనివారం పోటీల్లో మొదటి స్థానంలో అనంతపురం జిల్లా, రెండో స్థానంలో కర్నూలు జిల్లా, మూడో స్థానంలో చిత్తూరు జిల్లాలు నిలిచాయి. రాష్ట్ర జూడో అధ్యక్షుడు వెంకట్, కార్యదర్శి బాబు, జిల్లా కార్యదర్శి శ్రీధర్, వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్. రవికుమార్, నాగరాజు, రిటైర్డు పీడీ శివశంకరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఇద్దరి విద్యార్థులకు గాయాలు.. పోటీల్లో చిత్తూరు జిల్లా బైరాగిపట్టెడ మహత్మాగాంధీ మున్సిపాల్ కార్పొరేషన్ హైస్కూల్ విద్యార్థి వినోద్‌కు కుడి చేయి విరిగింది. వెస్ట్ గోదావరికి చెందిన శివగణేష్‌కు కుడి భుజం బోను విరిగింది. పట్టణంలోని వాసవి వైద్యశాల్లో తాత్కాలిక చికిత్సలు నిర్వహించారు. అనంతరం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు మెరుగైన వైద్యం కోసం 108 ద్వారా విద్యార్థులను తరలించారు. -
త్వరలో టీటీ అకాడమీ
ప్రైవేటు రంగంలో మూడు నెలల్లో ఏర్పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపకల్పన రూ.కోటిన్నర వ్యయం ఏపీ టీటీఏ అధ్యక్షుడుభాస్కరరామ్ వెల్లడి∙ ముగిసిన రాష్ట్ర స్థాయి ర్యాకింగ్ టీటీ పోటీలు రాజమహేంద్రవరం సిటీ/ కోటగుమ్మం : నగరం నుంచి అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేయాలన్న లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో టేబుల్ టెన్నిస్ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.భాస్కరరామ్ తెలిపారు. రూ.కోటి వ్యయంతో ప్రైవేటు రంగంలో మూడు నెలల్లో దీనిని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. స్థానిక ఎస్వీ ఫంక్షన్ హాలులో మూడు రోజులపాటు జరిగిన రెండో రాష్ట్రస్థాయి ర్యాకింగ్ టీటీ పోటీలు శనివారం ముగిశాయి. ముగింపు సభలో భాస్కరరామ్ మాట్లాడుతూ, అకాడమీ ఏర్పాటుకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హామీ ఇచ్చిందన్నారు. డిసెంబర్లో ప్రారంభం కానున్న ఈ టీటీ అకాడమీకి చీఫ్ రిఫరీ వేణుగోపాల్‌ను ఇన్చార్జిగా నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ అకాడమీలో సుమారు 12 టీటీ టేబుళ్లు ఏర్పాటు చేయనున్నామని, క్రీడాకారులు నిరంతరాయంగా శిక్షణ పొందేందుకు నిష్ణాతులైన కోచ్‌లను నియమిస్తామని భాస్కరరామ్ ప్రకటించారు. క్రీడాకారులకు నిరంతర శిక్షణ ఇచ్చేందుకు వీలుగా.. రాజమహేంద్రవరం, విశాఖ, పశ్చిమ గోదావరి టీటీ అసోసియేన్లకు రూ.3 లక్షల విలువైన ఆరు టీటీ టేబుళ్లను జిల్లాకు రెండు చొప్పున ఆయన అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రోటరీ క్లబ్ అధ్యక్షుడు రంకిరెడ్డి గోపాలకృష్ణ మాట్లాడుతూ, అకాడమీలు ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయి లో శిక్షణ ఇచ్చినప్పుడే రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులు వెలుగులోకి వస్తారన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచినవారికి గోపాలకృష్ణతోపాటు డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. అంతర్జాతీయ యూత్ టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైన శైలు నూర్‌బాషా, బంగి నాగశ్రావణిలకు రూ.10 వేల చొప్పున భాస్కరరామ్ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ చాంపియన్‌గా ఎదిగిన రాజమహేంద్రవరానికి చెందిన ఆచంట ఉమేష్ కుమార్‌ను ఘనంగా సత్కరించారు. డైరెక్టర్ ఆఫ్ టోర్నమెంట్ వీఆర్ ముక్కామల, చీఫ్ రిఫరీ వేణుగోపాల్, రిఫరీలు అర్జున్, చలపతి, రాజమహేంద్రవరం కోచ్ వీటీవీ సుబ్బారావు తదితరులను కూడా సత్కరించారు. నంబర్–1గా కాజోల్ సునార్, జగదీష్ కృష్ణ ఇప్పటివరకూ ఉన్న రాష్ట్రస్థాయి నంబర్–1 ర్యాంక్‌ను బాలికల విభాగంలో కాజోల్ సునార్(విజయవాడ), బాలుర విభాగంలో ఆచంట జగదీష్‌కృష్ణ (గుంటూరు) తిరిగి నిలబెట్టుకున్నారు. బాలికల విభాగం నుంచి సబ్ జూనియర్, జూనియర్, యూత్, మహిళ విభాగంలో కాజోల్ ప్రథమ స్థానంలో నిచిలింది. అలాగే బాలుర విభాగంలో జగదీష్‌కృష్ణ పురుషులు, యూత్ విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. కాగా, ఆర్.సాయిస్వరూప్ (విజయవాడ) బాలుర విభాగంలో విజేతగా నిలిచాడు. యూత్, పురుషుల విభాగాల్లో ద్వితీయ స్థానం దక్కించుకున్నాడు. ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ టేబుల్ టెన్నిస్ అకాడమీకి చెందిన కాజోల్ సునార్ నాలుగు విభాగాల్లో విజయం సాధించి ఛాంపియన్‌గా నిలవడంతో విజయవాడ క్రీడాకారులు సంబరాలు చేసుకున్నారు. నాలుగు మెడల్స్ సాధించిన ఆనందంతో కోచ్ బి.శ్రీనివాసరావు, కాజోల్ సునార్ క్రీడాప్రాంగణాన్ని ముద్దాడారు. వివిధ విభాగాల్లో విజేతలు వీరే.. కేడెట్ బాలికలు : టి.హాసిని(అనంతపురం)పై బుడ్డా శ్రేష్ట (అనంతపురం) విజయం సాధించింది. కేడెట్ బాలుర విభాగం : ఎం.వెంకట కార్తికేయ(విజయవాడ)పై కృష్ జైన్ (విజయవాడ). స»Œ జూనియర్ బాలికలు : నజీరబాయ్ నూర్‌బాషా(విజయవాడ)పై ఆర్.కాజోల్ సునార్ (విజయవాడ). సబ్ జూనియర్ బాలురు : ఆకాష్ వర్ధన్(విజయవాడ)పై టి.సూర్యతేజ (కాకినాడ). జూనియర్ బాలికలు : శైలు నూర్‌బాషా(విజయవాడ)పై ఆర్.కాజోల్ సునార్ (విజయవాడ). జూనియర్ బాలురు : జి.పవన్ తేజ(విశాఖపట్నం)పై ఆర్.సాయిస్వరూప్ (విజయవాడ). యూత్ బాలికలు : బంగి నాగ శ్రావణి(అనంతపురం)పై ఆర్.కాజోల్ సునార్ (విజయవాడ). యూత్ బాలురు : ఆర్.సాయిస్వరూప్(విజయవాడ)పై ఆచంట జగదీష్‌కృష్ణ (గుంటూరు). మహిళలు : బంగి నాగశ్రావణి(అనంతపురం)పై ఆర్.కాజోల్ సునార్ (విజయవాడ). పురుషులు : ఆర్.సాయిస్వరూప్(విజయవాడ)పై ఆచంట జగదీష్‌కృష్ణ (గుంటూరు). దేశానికి పేరు తేవాలని ఉంది దేశం తరఫున అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొని దేశ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేస్తాం. రాష్ట్రస్థాయి పోటీల్లో ఛాంపియన్లుగా నిలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ విజయం వెనుక మా కోచ్‌లు, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది. సెప్టెంబర్ 25 నుంచి 30 తేదీల మధ్య ఇండోర్‌లో ఆలిండియా పోటీలు, అక్టోబర్‌లో విశాఖపట్నం, నవంబర్‌లో ఆలిండియా ఈస్ట్ జోన్ పోటీల్లో పాల్గొంటున్నాం. – ఆర్.కాజోల్ సునార్, ఆచంట జగదీష్‌కృష్ణ -
రాష్ట్రస్థాయి పరీక్షకు ఎంపిక
భువనగిరి: మండలంలోని వడాయిగూడెం గ్రామంలో ఉన్న ప్రెసిడెన్సీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఎం. నిషిత జాతీయ భౌతిక రసాయన శాస్త్రనైపుణ్య పరీక్షలో రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పరీక్షల కమిటీ సమన్వయ కర్తలు భరణి, నరసింహాచారి తెలిపారు. ఈ మేరకు శనివారం పాఠశాల కరస్పాండెంట్ దిడ్డి బాలాజీ విద్యార్థిని నిషితకు రూ.వెయ్యి నగదును అందజేసి అభినందించారు. ఈ నెల 14న పట్టణ శివారులో ఉన్న వెన్నెల బీఈడీ కళాశాలలో అఖిల భారత భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులచే నిర్వహించిన జిల్లా స్థాయిలో పరీక్షలో నిషిత ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు వారు చెప్పారు. -
కొవ్వూరులో బ్యాడ్మింటన్ సందడి
కొవ్వూరు : రియో ఒలింపిక్స్‌నకు ముందే కొవ్వూరులో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల సందడి మొదలైంది. గురువారం ప్రారంభమైన ఈ పోటీలు శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగాయి. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు నువ్వానేనా అన్నట్టు రాకెట్లతో షటిల్‌కాక్ కే చెమటలు పట్టించారు. వినూత్నమైన షాట్లతో సైనా నెహ్వాల్, సింధు, శ్రీకాంత్‌లను మరిపించారు. కోర్టు నలుదిక్కుల షార్ట్‌లు కొడుతూ క్రీడాభిమానులకు కనువిందు చేశారు. కొవ్వూరు సత్యవతినగర్‌లోని అల్లూరి వెంకటేశ్వరరావు, మునిసిపల్ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టులో రాష్ట్రస్థాయిæబ్యాడ్మింటన్ అండర్–17 పోటీలు నిర్వహిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి 63 మంది క్రీడాకారులు హాజరు కాగా ఎనిమిది మందిని రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ సింగిల్స్ పోటీలకు, డబుల్స్ విభాగంలో ఎనిమిది జట్లును ఎంపిక చేసినట్టు టోర్నమెంట్ చీఫ్ రిఫరీ, నేషనల్ రిఫరీ కె.రమేష్ తెలిపారు. శుక్రవారం నుంచి ప్రారంభమైన రాష్ట్రస్థాయి పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నట్టు చెప్పారు. శని, ఆదివారాలు కూడా పోటీలు కొనసాగుతాయని బ్యాడ్మింటన్ అసోసియోషన్ అధ్యక్ష, కార్యదర్శులు సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్, పొట్రు మురళీకృష్ణ తెలిపారు. సింగిల్స్‌లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు ఎస్.అబ్దుల్ రెహమాన్(వైఎస్సార్ కడప), ఎం.సాయికిరణ్, పి.చంద్రరాజ్ పట్నాయక్ (విశాఖ పట్నం), బి.రోహిత్‌కుమార్(విశాఖపట్నం), ఎ.వంశీకష్ణంరాజు, ఎస్వీ రాయుడు (తూర్పుగోదావరి), పి.చంద్ర గోపీనాథ్, కె.చరణ్‌నాయక్(గుంటూరు) ఎంపికయ్యారు. డబుల్స్ విభాగంలో... కె.వరప్రసాద్ (విజయనగరం), ఎం.శ్రీకర్(శ్రీకాకుళం), ఎం.సాయికిరణ్(విశాఖపట్నం), పి.గోపీనాథ్(ప్రకాశం), బి.రోహిత్‌కుమార్, ఎస్.సౌరభ్‌కుమార్(విశాఖపట్నం), పి.సునీల్, టి.పార్ధసారథి( తూర్పుగోదావరి), కె.చరణ్ నాయక్, పి.విజయసాయి రెడ్డి(గుంటూరు), ఎ.వంశీ కష్ణ, ఎస్.శైలేష్‌కుమార్(పశ్చిమ గోదావరి), పి.చంద్ర గోపీనా«థ్(గుంటూరు), ఎస్వీ రాయుడు(తూర్పుగోదావరి) ఎంపికయ్యారు. -
సమస్యలపై జర్నలిస్టుల ఆందోళన బాట
ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయం కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : జర్నలిస్టుల సమస్యలపై ఆందోళనబాట పట్టేందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్సు ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజెఎఫ్) రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. ప్రభుత్వం అందించే హెల్త్ కార్డులపై వైద్యం అందేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి, అక్రిడియేషన్లు, జర్నలిస్టుల పిల్లలకు విద్యా రాయితీల అమలు వంటి సమస్యలపై ఆందోళన చేయనున్నట్టు స్పష్టం చేసింది. స్థానిక జగదీశ్వరి హోటల్లో గురువారం ఏపీడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన హెల్త్ కార్డులపై ప్రయివేటు, కార్పొరేట్ వైద్యశాలల్లో వైద్యం అందడం లేదని, దీనివల్ల చాలా మంది జర్నలిస్టులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్త్ కార్డులపై వైద్యం అందించే విషయంలో ఎదరవుతున్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు వివిధ స్థాయిల్లో ఆందోళన కార్యక్రమాలను ఇప్పటికే చేపట్టినట్టు వివరించారు. ఆ ఆందోళనను మరింత ఉధృతం చేసి, రాష్ట్రస్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేటు, కార్పొరేట్ విద్య సంస్థల్లో ఫీజు రాయితీకి సంబంధించి డీఈవోల నుంచి లేఖలు కాకుండా రాష్ట్రస్థాయిలో ఒకపాలసీ అమలు చేసే విధంగా జీవో తీసుకువచ్చేలా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కె పరమేశ్వరరావు కోశాధికారి శాంతి, బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్సు అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర, ప్రధాన కార్యదర్శి ప్రియచౌదరి, వర్కింగ్ జర్నలిస్ట్స్ ఎడిటర్ కోటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్ మంజరి,ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి నవీన్‌రాజ్, సభ్యులు డీఎ లింకన్, రాజమహేంద్రవరం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ స్వామినాయుడు, ఎన్ శ్రీనివాస్, సభ్యులు నాని, వెంకటేష్, వివిధ జిల్లాల నుంచి అధ్యక్ష, కార్యదర్శులు సమావేశంలో పాల్గొన్నారు. -
రసవత్తరంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు
బాపట్ల : మండలంలోని మరుప్రోలువారిపాలెం గ్రామంలో రాష ్ట్రస్థాయి ఎడ్లపందేలు గురువారం రసవత్తరంగా సాగాయి. 15 ఎడ్ల జతలు ఈ పోటీల్లో పాల్గొనగా 3 క్వింటాళ్ల ఎద్దులు మాత్రమే పోటీల్లో పాల్గొన్నాలనే నిబంధన పెట్టారు. పోలురాద పద్ధతిలో బండిచక్రాలు కదలకుండా కట్టి ఎక్కువ దూరంగా ఏ ఎడ్ల జత లాగితే వారికి బహుమతులు ఇచ్చే విధంగా పోటీలు నిర్వహించారు. న్యాయనిర్ణేతగా రాధాకృష్ణ వ్యవహరించగా గురువారం రాత్రి మూడు జతలు మాత్రమే పోటీల్లో పాల్గొన్నాయి. రాత్రికి కూడా పోటీలు నిర్వహించి శుక్రవారం బహుమతులు ఇచ్చేవిధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పోటీల నిర్వాహకులుగా గవిని వెంకటేశ్వర్లు, మరుప్రోలు చెన్నకేశ్వరెడ్డి, కోకి శ్రీనివాసరెడ్డి, నాయుడు శ్రీరామమూర్తిరెడ్డి, సత్యంరెడ్డి, మంచాల శ్రీనివాసరెడ్డి, కావూరు రామకృష్ణారెడ్డి, మామిడాల ఏడుకొండలరెడ్డి, కావూరు శేషారెడ్డి వ్యవహరించారు. పోటీలు చూసేందుకు ఆయా గ్రామాల నుంచి వచ్చిన అభిమానులతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది.