రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక
చౌటుప్పల్: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 17నుంచి 19వరకు వికారాబాద్‌లో జరిగిన జోనల్ క్రీడా పోటీల్లో చౌటుప్పల్‌లోని బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు 25మంది పాల్గొని పలు బహుమతులను సాధించారు. వీరిని మంగళవారం ప్రిన్సిపాల్ పి.విద్యాసాగర్ మంగళవారం అభినందించారు. ఇందులో 15మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. త్రోబాల్‌లో మొదటి బహుమతిని సాధించి ఏడుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు, షటిల్ బ్యాడ్మింటన్‌లో రెండో స్థానాన్ని సాధించి ఝాన్సీ, దీపికలు రాష్ట్ర స్థాయి పోటీలకు, కబడ్డీలో రాష్ట్ర జట్టుకు అరుణ, సునితలు, ఖోఖోలో రాష్ట్ర జట్టుకు ఇందు, శ్రావణిలు, వాలీబాల్ రాష్ట్ర జట్టుకు జి.కీర్తి, పరుగు పందెం పోటీలకు జి.శ్రావణిలు ఎంపికైనట్టు తెలిపారు.