కుస్తీ పోటీలకు విద్యార్థుల ఎంపిక
కుస్తీ పోటీలకు విద్యార్థుల ఎంపిక
Published Fri, Sep 16 2016 10:19 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
కారంపూడి: జాతీయ స్థాయి రెజ్లింగ్ (కుస్తీ) పోటీలకు గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు ఐదుగురు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ బి.సుధాకర్ శుక్రవారం తెలిపారు. ఇటీవల కృష్ణా జిల్లా తేలప్రోలులో నిÆృ‡్వహించిన స్కూల్ గేమ్స్ టోర్నమెంటులో వీరు గోల్డ్ మెడల్స్ సాధించి నేషనల్స్‌కు క్వాలిఫై అయ్యారు. ఢిల్లీ, పూనే నగరాల్లో నిర్వహించే జాతీయ పోటీలకుృఅర్హత సాధించారు. అండర్14 బాలుర విభాగంలో పి.నరసింహారావు, అండర్17 విభాగంలో ఎ.సిద్ధార్థ, పి.నాగరాజు, సబ్ జూనియర్స్ విభాగంలో ఎ వెంకటేష్, డి.బాలకృష్ణ ఎంపికయ్యారు. ఎ.అంజిబాబు, ఎల్.రాకేష్, ఆర్.ఆంజనేయులునాయక్, రాజేష్ బ్రాంజ్ మెడల్స్, గ్రీకో రోమన్ విభాగంలో ఎం.వంశీ, ఎం.రత్నకుమార్ సిల్వర్ మెడల్స్ సాధించారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన పీడీ భూషణం, పీఈటీ ఎం.శ్రీనివాసులను ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ వెస్లీ అధ్యాపకులు అభినందించారు.
Advertisement
Advertisement