రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు జయ్యారం విద్యార్థులు
Published Thu, Sep 29 2016 12:34 AM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM
మరిపెడ : మండలంలోని జయ్యా రం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 18న హన్మకొం డలో జరిగిన ఎంపిక పోటీల్లో బానోతు శారద, ఆకుల మహేష్ ప్రతిభ చూపగా 32వ రాష్ట్ర స్థాయి సీనియర్స్ ఖోఖో పోటీలకు ఎంపిక చేసినట్లు హెచ్‌ఎం అనుమాండ్ల రమేష్‌కుమార్ తెలిపారు. ఈనెల 30నుంచి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో జరగనున్న పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను హెచ్‌ఎంతో పాటు పీఈటీ ఆవారి శ్రీనివాస్, గుడిçపూడి నవీ¯ŒS, ఖోఖో జిల్లా అసోసియేష¯ŒS ప్రధాన కార్యదర్శి తోట శ్యాంప్రశాద్, ఎస్‌ఎంసీ చైర్మ¯ŒS నరిగె కృష్ణ, ఉపాధ్యాయులు తేజోన్నతరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వీరన్న, భాస్కర్, మురళి, సరేఖ, సునీత, మంజుల, పద్మలత అభినందించారు.
Advertisement
Advertisement