సత్తా చాటుతూ..
సత్తా చాటుతూ..
Published Wed, Feb 22 2017 10:55 PM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM
ఇన్నోవేషన్ ఫెలోస్‌కు జేఎన్‌టీయూకే, గైట్ కళాశాల విద్యార్థులు
బాలాజీచెరువు(కాకినాడ) : సాంకేతిక యూనివర్సిటీలో అగ్రగామిగా నిలుస్తున్న జేఎన్‌టీయూకే ఇప్పుడు తన వర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్ విద్యార్థులను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వర్సిటీలతో పోటీపడి ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే ఒక బ్యాచ్ అర్హత సాధించి సిలికాన్ వ్యాలీ సదస్సులో పాల్గొనగా.. మరో నలుగురు విద్యార్థులు నవంబర్‌లో జరిగే సదస్సుకు హాజరుకానున్నారు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ హస్పోప్లాటర్న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్(డీస్కూల్) కల్పించే యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలోస్‌కు(యూఐఎఫ్) జేఎన్‌టీయూకే విద్యార్థులు ఎంపికయ్యారు. సీఎస్‌ఈ విభాగం నుంచి చైతన్య, ప్రతిభాంకిత, ఈసీఈ నుంచి సౌమ్య,తేజస్వినీలు ఎంపికైన వారిలో ఉన్నారు.
గైట్ విద్యార్థులు కూడా..
వెలుగుబంద (రాజానగరం) : యూఎస్‌ఏలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగే ఇన్నోవేషన్ ఫెలోస్ కార్యక్రమానికి స్థానిక గైట్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారని కళాశాల ఎండీ కె. శశికిరణ్‌వర్మ తెలిపారు. బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ గూగల్, స్టా¯ŒS ఫోర్టు యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయన్నారు. ఎంపికైన వారిలో బీటెక్ తృతీయ సంవత్సర విద్యార్థులు రచన పారుపూడి, మెండ్రోటి వెంకటసత్యసాయిసిద్దార్థ (ఈసీఈ), గ్నషాకేర్ సహాని (సీఎస్‌ఈ), బీటెక్ సెకండియర్ విద్యార్థి సుందరిజాహ్నవి మావూరి (సీఎస్‌ఈ) ఉన్నారు. దేశవ్యాప్తంగా 224 మంది విద్యార్థులు ఎంపిక కాగా వారిలో గైట్ నుంచి నలుగురు ఉండడం హర్షణీయమన్నారు. మార్చి 9 నుంచి 12 వరకు జరిగే సిలికాన్ వాలీ మీటప్‌లో పాల్గొని, వివిధ కార్యక్రమాలకు హాజరవుతారన్నారు. యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలోస్ కార్యక్రమం మన దేశంలోని ఉన్నత విద్యలో మార్పును తీసుకువచ్చేలా విద్యార్థి నాయకులను తయారు చేయడానికి, విద్యార్థుల శక్తిని మార్పునకు అనుగుణంగా మార్చడానికి ఉపయోగపడుతుందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.లక్షీ్మశశికిరణ్ అన్నారు. సమావేశంలో సీఈఓ డాక్టర్ డీఎల్‌ఎన్ రాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ డి.రామ్మూర్తి, డీన్ డాక్టర్ వరప్రసాదరావు, వైస్ ప్రిన్సిపాల్ పీవీజీకే జగన్నాథరాజు, జీఎం డాక్టర్ పి.సుబ్బరాజు, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎకనామిక్ కన్సల్టెంట్ టీవీ రావు, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement