రాష్ట్ర సైకిల్ పోటీల్లో ప్రథమం ‘అల్లం’
చెరుకుపల్లి : రాష్ట్ర స్థాయి సైకిల్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండల పరిధిలోని రాంబోట్లవారిపాలెం గ్రామంలో శ్రీబండ్లమ్మ తల్లి యూత్ పగడం వారి పాలెం వారి ఆధ్వర్యంలో ఈ సైకిల్ వేగం పోటీలు నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచి సైకిల్ వేగం పోటీల్లో 30 మంది పాల్గొన్నారు. మొదటి బహుమతి అల్లం సుబ్బారెడ్డి (దుండిపాలెం) రూ.20,116 , రెండో బహుమతి గంజరబోయిన కుమారస్వామిరెడ్డి (దుండిపాలెం) రూ.15,116, మూడో బహుమతి వారె నాగరాజు రెడ్డి (పొన్నపల్లి) రూ.10,116, నాలుగో బహుమతి గణేష్ యూత్ (పొన్నపల్లి) రూ.6,116, ఐదో బహుమతి కుక్కల మణికంఠరెడ్డి (దుండిపాలెం) రూ.5,116, ఆరో బహుమతి నక్కా సూరిబాబు (పిట్లవానిపాలెం) రూ.3,116 అందుకున్నారు. జెడ్పీటీసీ సభ్యులు పిట్టు శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు చీరాల ప్రసాదరెడ్డి, కిరణ్‌కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంఆర్కె మూర్తి, కుమారస్వామి పాల్గొన్నారు.