రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలు ప్రారంభం
రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలు ప్రారంభం
Published Sat, Oct 8 2016 11:32 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
కల్లూరు: స్తానిక డీఎస్‌ఏ స్విమ్మింగ్‌పూల్‌లో 62వ రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలను శనివారం.. ఎంపీ టీజీ వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భఃగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల నుంచి నగరంలో నిర్వహిస్తున్న పోటీల్లో వెయ్యి మంది బాలబాలికలు వివిధ క్రీడాంశాలలో పాల్గొనడం హర్షణీయమన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పడాలన్నారు. క్రీడాకారుల అభ్యున్నతికి తోడ్పాటునందిస్తామన్నారు. అంతకుముందు అవుట్‌డోర్ స్టేడియంలో రాష్ట్ర అథ్లెటిక్స్ 100 మీటర్ల పరుగులో విజేతలైన చిన్నబాబు (వెస్ట్‌గోదావరి), మోహిద్దీన్ (కృష్ణా), రాజేషకుమార్ (నెల్లూరు), జ్యోతి (వైజాగ్), రమ్య (శ్రీకాకుళం), రజియా (కర్నూలు)లకు పతకాలు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులు భాస్కర్‌రెడ్డి, షాజహాన్, నిర్వహక కార్యదర్శి ఎల్. చలపతి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు విజయకుమార్, రామాంజనేయులు, పీడీలు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement