విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి క్రీడలు ప్రారంభం
విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి క్రీడలు ప్రారంభం
Published Mon, Oct 3 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
గుంటూరు స్పోర్ట్స్ : క్రీడలు ఉద్యోగులకు శారీరక దారుధ్యాన్ని, మానసిక వికాసాన్ని పెంపొందించేందుకు దోహదపడుతాయని విజయవాడ చీఫ్ ఇంజినీర్ కె.రాజ బాపయ్య అన్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి టెన్నిస్, బాస్కెట్‌బాల్ పోటీలు సోమవారం స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఏపీ జెన్‌కో క్రీడలలో పలుపంచుకోవటం ఆనందదాయకమన్నారు. విద్యుత్ శాఖ జిల్లా ఎస్‌ఈ జయభారతరావు మాట్లాడుతూ క్రీడలలో రాష్ట్రం నలుమూలల నుంచి మొత్తం 150 మందితో కూడిన 20 జట్లు తలపడుతున్నాయన్నారు. జాతీయ స్థాయి పోటీలలో రాణిస్తున్న క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. కార్యక్రమంలో స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా ఎస్‌ఈ ఎం.విజయకుమార్, ఏపీ ట్రాన్స్‌కో క్రీడాధికారి టి.డి.కుమార వడివేలు, బాస్కెట్ బాల్ అబ్జర్వర్ డి.బాబు రావు, డీఈలు టి.శ్రీనివాసబాబు, యు.హనుమయ్య, ఎం.శివప్రసాదరెడ్డి, ఏ రాందాస్, క్రీడల కార్యదర్శి ఎ.వి.యస్.యస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తొలి రోజు మ్యాచ్‌ల ఫలితాలు..
బాస్కెట్ బాల్ తొలి మ్యాచ్‌లో వైఎస్సార్ కడప జట్టు 28–18 స్కోర్‌తో ఒంగోలు జట్టుపై, విజయవాడ ఎన్‌టీటీపీఎస్ జట్టు 27–24 స్కోర్‌తో నెల్లూరు జట్టుపై విజయం సాధించాయి. టెన్నిస్ సింగిల్స్ విభాగంలో సురేష్ (తిరుపతి) 6–2 స్కోర్‌తో గోవిందయ్య (నెల్లూరు)పై, కె.మహేష్ (గుంటూరు) 6–1 స్కోర్‌తో జాదరాయ(ఒంగోలు)పై విజయం సాధించారు. డబల్స్ విభాగంలో కెవిఎల్‌ఎన్.మూర్తి, కె.మహేష్(గుంటూరు) జంట 6–2 స్కోర్‌తో థామస్, ఉదయ్(ఒంగోలు) జంటపై విజయం సాధించారు.
Advertisement
Advertisement