రసవత్తరంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు
రసవత్తరంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు
Published Thu, Jul 21 2016 9:58 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
బాపట్ల : మండలంలోని మరుప్రోలువారిపాలెం గ్రామంలో రాష ్ట్రస్థాయి ఎడ్లపందేలు గురువారం రసవత్తరంగా సాగాయి. 15 ఎడ్ల జతలు ఈ పోటీల్లో పాల్గొనగా 3 క్వింటాళ్ల ఎద్దులు మాత్రమే పోటీల్లో పాల్గొన్నాలనే నిబంధన పెట్టారు. పోలురాద పద్ధతిలో బండిచక్రాలు కదలకుండా కట్టి ఎక్కువ దూరంగా ఏ ఎడ్ల జత లాగితే వారికి బహుమతులు ఇచ్చే విధంగా పోటీలు నిర్వహించారు. న్యాయనిర్ణేతగా రాధాకృష్ణ వ్యవహరించగా గురువారం రాత్రి మూడు జతలు మాత్రమే పోటీల్లో పాల్గొన్నాయి. రాత్రికి కూడా పోటీలు నిర్వహించి శుక్రవారం బహుమతులు ఇచ్చేవిధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పోటీల నిర్వాహకులుగా గవిని వెంకటేశ్వర్లు, మరుప్రోలు చెన్నకేశ్వరెడ్డి, కోకి శ్రీనివాసరెడ్డి, నాయుడు శ్రీరామమూర్తిరెడ్డి, సత్యంరెడ్డి, మంచాల శ్రీనివాసరెడ్డి, కావూరు రామకృష్ణారెడ్డి, మామిడాల ఏడుకొండలరెడ్డి, కావూరు శేషారెడ్డి వ్యవహరించారు. పోటీలు చూసేందుకు ఆయా గ్రామాల నుంచి వచ్చిన అభిమానులతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది.
Advertisement