హోరాహోరీగా సబ్ జూడో పోటీలు
హోరాహోరీగా సబ్ జూడో పోటీలు
Published Sat, Sep 17 2016 9:40 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM
నందికొట్కూరు: స్థానిక మార్కెట్ యార్డులో రాష్ట్రస్థాయి సబ్‌జూడో పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. శనివారం పోటీలను మార్కెట్ యార్డు చైర్మన్ గుండం రమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో స్నేహ సంబంధాలు మెరుగు పడతాయన్నారు. గెలుపోటమలు సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాలన్నారు. ఎంపీపీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ పట్టుదలతో సాధన చేసి క్రీడల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. సబ్‌జూడో పోటీల్లో 12 జిల్లాలకు చెందిన బాలబాలికలు పాల్గొన్నారు. శనివారం పోటీల్లో మొదటి స్థానంలో అనంతపురం జిల్లా, రెండో స్థానంలో కర్నూలు జిల్లా, మూడో స్థానంలో చిత్తూరు జిల్లాలు నిలిచాయి. రాష్ట్ర జూడో అధ్యక్షుడు వెంకట్, కార్యదర్శి బాబు, జిల్లా కార్యదర్శి శ్రీధర్, వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్. రవికుమార్, నాగరాజు, రిటైర్డు పీడీ శివశంకరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరి విద్యార్థులకు గాయాలు..
పోటీల్లో చిత్తూరు జిల్లా బైరాగిపట్టెడ మహత్మాగాంధీ మున్సిపాల్ కార్పొరేషన్ హైస్కూల్ విద్యార్థి వినోద్‌కు కుడి చేయి విరిగింది. వెస్ట్ గోదావరికి చెందిన శివగణేష్‌కు కుడి భుజం బోను విరిగింది. పట్టణంలోని వాసవి వైద్యశాల్లో తాత్కాలిక చికిత్సలు నిర్వహించారు. అనంతరం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు మెరుగైన వైద్యం కోసం 108 ద్వారా విద్యార్థులను తరలించారు.
Advertisement
Advertisement