జూడో విజేత అనంతపురం
Published Sun, Sep 18 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
– రెండు స్థానంలో కర్నూలు, మూడో స్థానంలో చిత్తూరు
నందికొట్కూరు: రాష్ట్ర స్థాయి సబ్ జూడో పోటీల్లో అనంతపురం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. నందికొట్కూరు పట్టణంలోని మార్కెట్ యార్డులో మూడు రోజులుగా ఉత్కంఠగా జరుగుతున్న పోటీలు ఆదివారం ముగిశాయి. శ్రీకాకుళం మినహా మిగతా 12 జిల్లాలో దాదాపు 288 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. పలు విభాగాల్లో నిర్వహించిన బాలురు, బాలికల పోటీల్లో అనంతపురం క్రీడాకారులు సత్తా చాటి విజేతగా నిలిచారు. కర్నూలు జిల్లా క్రీడాకారులు రెండో స్థానంలో, చిత్తూరు జిల్లా క్రీడాకారులు మూడో స్థానంలో నిలిచారు. వచ్చే నెల 13వ తేదీ నుంచి బీహార్ రాష్ట్రం పాట్నాలో జాతీయ స్థాయి సబ్ జూడో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీ జూడో అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్ నాంశెట్టి చెప్పారు. రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఈనెల 20వ తేదీ నుంచి అనంతపురంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో విద్యాసంస్థల అధినేతలు కట్టమంచి జనార్దన్‌రెడ్డి, పుల్లయ్య, శ్రీనివాసరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ గుండం రమణారెడ్డి, ఎంపీపీ ప్రసాదరెడ్డి, మాలమహానాడు డివిజన్ అధ్యక్షులు అచ్చన్న, టీడీపీ యూత్ డివిజన్ నాయకులు రవికుమార్‌రెడ్డి, జవ్వాజి సుంకన్నగౌడు సేవా సమితి అధ్యక్షులు శ్రీకాంత్‌గౌడు, వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్.రవికుమార్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement