కూతురు ఎంపీ.. తండ్రి పెత్తనం | Internal Conflicts Between TDP Leaders in Nandikotkur | Sakshi
Sakshi News home page

కుమారై టీడీపీలో చేరినంత మాత్రాన ఈయన టీడీపీ అవుతారా?

Published Tue, Jul 30 2024 11:39 AM | Last Updated on Tue, Jul 30 2024 1:39 PM

Internal Conflicts Between TDP Leaders in Nandikotkur

కొరకరాని కొయ్యలా బైరెడ్డి 

టీడీపీలో లేకపోయినా చక్రం తిప్పుతున్న నేత 

చెల్లని కాసులుగా మాండ్ర, ఎమ్మెల్యే జయసూర్య 

ఫిర్యాదులను పెద్దగా పట్టించుకోని     అధిష్టానం 

మున్సిపల్‌ చైర్మన్‌ చుట్టూ ‘రాజకీయం’ 

రెండు నెలలకే అధికార పారీ్టలో    విభేదాల రగడ

ఒకరు రాజకీయంగా కనుమరుగయ్యారని భావిస్తున్న తరుణంలో కుమారై పదవితో తనదైన రాజకీయానికి తెరతీశారు.. జీవితంలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి మరొకరు. వీరిద్దరి కంటే ముందు నుంచి నందికొట్కూరు రాజకీయాన్ని అన్నీ తానై నడిపిస్తున్న నేత ఇంకొకరు. అధికారం దక్కి 50రోజులు ముగియకనే ఈ ముగ్గురు నేతల మధ్య విభేదాలు వీధికెక్కాయి. సైకిల్‌ పారీ్టతో సంబంధం లేని బైరెడ్డి నందికొట్కూరులో పెత్తనం చేస్తుంటే.. పెత్తనం చేయడానికి బైరెడ్డి ఎవరు? ఆయనకు టీడీపీతో సంబంధం ఏంటని ఎమ్మెల్యే జయసూర్య ధ్వజమెత్తుతున్నారు. మాండ్ర శివానందరెడ్డి పెత్తనం చెలాయించాలని చూస్తున్నా అధిష్టానం సహకరించకపోవడంతో పార్టీ పరువు బజారున పడుతోంది. చివరకు ఈ పంచాయతీ అధిష్టానం వద్దకు చేరినా పరిష్కారం చూపలేక చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నందికొట్కూరు ‘తమ్ముళ్ల’ విభేదాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 

సాక్షి ప్రతినిధి కర్నూలు: బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి. మోతుబరి రాజకీయనాయకుడే. రాజకీయం, ఆయనపై ఫ్యాక్షన్‌  ఆరోపణలు వెరసి ‘సీమ’రాజకీయాల్లో కీలకంగా ఎదిగారు. తెలుగుదేశం పారీ్టలో సుదీర్ఘంగా పనిచేసిన ఆయన 2012లో విభేదించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్‌ భుజానికెత్తుకున్నట్లు ‘రాయలసీమ పరిరక్షణ సమితి’ పేరుతో రాజకీయ పార్టీ స్థాపించి ప్రత్యేక రాయలసీమ వాదాన్ని వినిపించారు. ఎలక్షన్‌లో పోటీ చేసి అట్టరఫ్లాప్‌ అయ్యారు. ఆపై కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ దెబ్బతో బైరెడ్డి రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితం ముగిసిందని అంతా భావించారు. అయితే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. సమకాలీన రాజకీయాల్లో బైరెడ్డి ప్రస్తావన లేకుండానే 2014, 2019లో కర్నూలు ఎన్నికలు ముగిశాయి. 2024లో తనతో పాటు బీజేపీలో ఉన్న కుమార్తె శబరిని టీడీపీలోకి పంపారు. ఈ చేరికలో శబరి మాత్రకమే ‘పచ్చకండువా’ వేసుకున్నారు. బైరెడ్డి వేసుకోలేదు. నంద్యాల ఎంపీగా శబరి గెలుపొందారు. 

పేరుకే శబరి.. అంతా బైరెడ్డే! 
ఎన్నికల తర్వాత బైరెడ్డి నందికొట్కూరుపై తిరిగి పట్టుకోసం ప్రయతి్నస్తున్నారు. మునిసిపల్‌ చైర్మన్‌ సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్లను టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహా్వనించారు. ఆపై మిడుతూరు, పగిడ్యాలలో ఎంపీటీసీ, సర్పంచ్‌లకు ‘పచ్చకండువా’ వేశారు. దీనిపై జయసూర్య తీవ్రస్థాయిలో స్పందించారు. ‘టీడీపీలో చేర్చుకోవడానికి బైరెడ్డి ఎవరు? ఆయన టీడీపీ వ్యక్తి కాదు. టీడీపీలో చేరలేదు. సభ్యత్వం లేదు. కుమారై టీడీపీలో చేరినంత మాత్రాన ఈయన టీడీపీ అవుతారా?’ అని ఘాటుగా స్పందించారు. ఆ తర్వాత బైరెడ్డి కూడా అదేస్థాయిలో స్పందించారు. ‘నందికొట్కూరు తమ అడ్డా అని, కొందరు వస్తుంటారు.. పోతుంటారు!’ అని ఎమ్మెల్యేను తేలిగ్గా కొట్టిపారేశారు. ఈ వ్యవహారం తర్వాత బైరెడ్డిపై జయసూర్య మాండ్ర శివానందరెడ్డితో కలిసి టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ తతంగం తర్వాత కూడా ఆదివారం బైరెడ్డి శివపురం ఎంపీటీసీ, మరికొందరికి కండువా వేసి టీడీపీలోకి ఆహా్వనించారు. ఒక్కమాటలో చెప్పాలంటే తానే ఎంపీ అనే భావనలో నందికొట్కూరులో బైరెడ్డి రాజకీయం సాగిస్తున్నారు 

మునిసిపల్‌ చైర్మన్‌ మార్పు బైరెడ్డికి  చెక్‌ పెట్టేందుకేనా? 
బైరెడ్డికి చెక్‌పెట్టేందుకు మాండ్రశివానందరెడ్డి కొత్త ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీ నుంచి చేరిన సుధాకర్‌రెడ్డి టీడీపీ వ్యక్తి కాదని, అలాంటి వ్యక్తిని మునిసిపల్‌ చైర్మన్‌గా కొనసాగించొద్దని ఎమ్మెల్యే, మాండ్ర అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే 4ఏళ్ల వరకూ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టలేని పరిస్థితి. ఈక్రమంలో సుధాకర్‌రెడ్డి నిజంగా టీడీపీపై విశ్వాసంతో పారీ్టలో చేరి ఉంటే చైర్మన్‌ పదవికి రాజీనామా చేసి పారీ్టలో కొనసాగాలే ఆదేశించాలని పార్టీ పెద్దలకు చెప్పినట్లు సమాచారం. రాజీనామా చేస్తే చైర్మన్‌ పదవి ఖాళీ అవుతుంది. అప్పుడు టీడీపీ కౌన్సిలర్‌ను చైర్మన్‌ చేయొచ్చు అనేది మాండ్ర ఎత్తుగడ. ఇందుకు నాలుగేళ్ల వరకు ఆగాల్సిన పని కూడా లేదు. ఇదే జరిగితే బైరెడ్డికి చెక్‌ పెట్టినట్లే. లేదంటే మాండ్రతో పాటు దళిత ఎమ్మెల్యే జయసూర్యను టీడీపీ లైట్‌గా తీసుకున్నట్లే!!  

ఎమ్మెల్యే, మాండ్రకు టీడీపీ   ప్రాధాన్యత ఇవ్వడం లేదా? 
బైరెడ్డి చర్యలను పట్టించుకోకపోవడం చూస్తే టీడీపీ పరోక్షంగా ఆయనను సమరి్థంచినట్లే కనపడుతోంది. 
మొన్నటి ఎన్నికల్లో మాండ్ర శివానందరెడ్డి నంద్యాల ఎంపీ టిక్కెట్‌ ఆశించి భంగపడ్డారు.  
శబరికి ఎంపీ టిక్కెట్‌ ఇచ్చే సందర్భంలో నందికొట్కూరు టిక్కెట్‌ మాండ్ర చెప్పిన వారికే ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఆ మేరకు జయసూర్య ఎమ్మెల్యే అయ్యారు. 
ఇప్పుడు బైరెడ్డి చర్యలను టీడీపీ సమర్థిస్తూ, జయసూర్యను పట్టించుకోవం లేదంటే మాండ్రను పక్కనపెట్టినట్లేనని టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. 
ఒకవేళ ఈ వివాదానికి చెక్‌ పెట్టాలనుకుంటే బైరెడ్డిని టీడీపీలో చేరాలని అధిష్టానం సూచించాలి. అదీ చేయలేదు.  
చేరికల సమయంలో ఎమ్మెల్యేను కలుపుకుని వెళ్లాలని చెప్పాలి. అలా కూడా జరగలేదు. 
టీడీపీలోని ముఖ్య నేతలందరితో బైరెడ్డికి సంబంధాలు ఉన్నాయి. అందువల్లే ఆయన ముందు జయసూర్య తేలిపోతున్నారు.  
పైగా జయసూర్య దళిత ఎమ్మెల్యే కావడంతో బైరెడ్డి లెక్కపెట్టడం లేదని తెలుస్తోంది.  
టీడీపీ కూడా అదే కోణంలో చూస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
రెండేళ్ల తర్వాత డీలిమిటేషన్‌లో రిజర్వేషన్లు మారితే జయసూర్యకు రాజకీయ భవితవ్యం కూడా ఉండదనే ప్రచారం బైరెడ్డి వర్గం చేస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement