nandikotkur
-
Andhra Pradesh: ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థిని దారుణ హత్య
నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం బైరెడ్డి నగర్లో దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించలేదన్న కోపంతో ఓ ప్రేమోన్మాది బాలికపై సోమవారం తెల్లవారుజామున పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన బాలిక అక్కడికక్కడే మరణించగా.. ఇదే ఘటనలో ప్రేమోన్మాదికి కూడా 40 శాతం గాయాలయ్యాయి. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఓ బాలిక సామూహిత హత్యాచారం ఘటన మరకముందే నందికొట్కూరు పట్టణంలోని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యచేసిన సంఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది.ఏం జరిగిందంటే..కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని రామళ్లకోట గ్రామానికి చెందిన రామకృష్ణ, లక్ష్మి దంపతుల కుమార్తె లహరి (17). చిన్నతనంలో లహరి తండ్రి చనిపోవడంతో బాలిక అవ్వాతాతలు ఆమెను తమవద్దే ఉంచుకుని ఉన్నత చదువులు చదివిస్తామని నందికొట్కూరుకు తీసుకొచ్చి నంది జూనియర్ కళాశాలలో ఇంటర్లో చేర్పించారు. ప్రస్తుతం ఆమె రెండో సంవత్సరం చదువుతోంది. ఆదివారం రాత్రి లహరి అవ్వాతాత ఓ గదిలో పడుకోగా, చదువుకుంటానంటూ లహరి మరో గదిలో నిద్రించింది. ఏమైందో ఏమో ఆదివారం తెల్లవారుజామున లహరి ఉన్న గదిలోంచి ఒక్కసారిగా పొగలు, మంటలు వచ్చాయి. దీంతో లహరి అవ్వాతాత వెంటనే గట్టిగా కేకలు వేశారు. ఇరుగుపొరుగు వారు వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి చూసేసరికి లహరి పూర్తిగా కాలిపోయి అక్కడే మృతిచెందింది. అదే గదిలో వెల్దుర్తి మండలం కలుగోట్ల గ్రామానికి చెందిన బోయ ఆకుల సుబ్బారాయుడు, గిరిజా దంపతుల కుమారుడు రాఘవేంద్ర 40 శాతం కాలిన గాయాలతో కనిపించాడు. దీంతో పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 108 వాహనంలో రాఘవేంద్రకు ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం అందించేందుకు నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలోనే మృతిచెందిన లహరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.టెన్త్ వరకు ఇద్దరూ కలిసి చదువుకున్నారు..ఇక లహరి, రాఘవేంద్ర ఇద్దరూ 10వ తరగతి వరకు రామళ్లకోటలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో కలిసి చదువుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాఘవేంద్ర బాలికను ప్రేమించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన లహరి తల్లి తన కుమార్తెను తన తల్లిదండ్రుల వద్దకు పంపినట్లు సమాచారం. మరోవైపు.. పదో తరగతితో చదువు ఆపేసిన రాఘవేంద్ర ప్రస్తుతం పెళ్లిళ్లకు డెకరేషన్ పనులు పనిచేస్తున్నాడు. తరచూ నందికొట్కూరులోని బాలిక వద్దకు రాత్రి వేళ్లల్లో వచ్చిపోయేవాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. రెండు మూడ్రోజుల క్రితం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం అర్థరాత్రి కూడా బాలిక వద్దకు వచ్చిన రాఘవేంద్ర తెల్లవారుజామున ఆమెపై పెట్రోల్ పోసి చంపేశాడని బంధువుల చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ రామాంజునాయక్, సీఐలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్ఐలు చంద్రశేఖర్, సురేష్‌బాబు, ఓబులేసు పరిశీలించారు. అలాగే, నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా కూడా నందికొట్కూరులో లహరి ఉంటున్న ఇంటిని సందర్శించారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంఘటనపై సమగ్ర విచారణ చేపడతామన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి వాస్తవాలను వెల్లడిస్తామని చెప్పారు.వాడిని చంపేయండి..నా మనరాలిని పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేసిన వాడిని పోలీసులే చంపేయాలి. మీతో కాకపోతే వాడిని మాకు అప్పగించండి. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాం. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయాల్సిన నా మనవరాలిని అన్యాయంగా చంపేశాడు. అమ్మాయిలపై దాడులు చేసేవారిని పోలీసులు వదలకుండా కాల్చియాలి. వాడి మరణం చూసి ఎవరికీ ఇలాంటి ఆలోచనలు రాకూడదు. – పార్వతమ్మ, లహరి అవ్వ -
టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేల ఆధిపత్య పోరు
-
కూతురు ఎంపీ.. తండ్రి పెత్తనం
ఒకరు రాజకీయంగా కనుమరుగయ్యారని భావిస్తున్న తరుణంలో కుమారై పదవితో తనదైన రాజకీయానికి తెరతీశారు.. జీవితంలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి మరొకరు. వీరిద్దరి కంటే ముందు నుంచి నందికొట్కూరు రాజకీయాన్ని అన్నీ తానై నడిపిస్తున్న నేత ఇంకొకరు. అధికారం దక్కి 50రోజులు ముగియకనే ఈ ముగ్గురు నేతల మధ్య విభేదాలు వీధికెక్కాయి. సైకిల్ పారీ్టతో సంబంధం లేని బైరెడ్డి నందికొట్కూరులో పెత్తనం చేస్తుంటే.. పెత్తనం చేయడానికి బైరెడ్డి ఎవరు? ఆయనకు టీడీపీతో సంబంధం ఏంటని ఎమ్మెల్యే జయసూర్య ధ్వజమెత్తుతున్నారు. మాండ్ర శివానందరెడ్డి పెత్తనం చెలాయించాలని చూస్తున్నా అధిష్టానం సహకరించకపోవడంతో పార్టీ పరువు బజారున పడుతోంది. చివరకు ఈ పంచాయతీ అధిష్టానం వద్దకు చేరినా పరిష్కారం చూపలేక చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నందికొట్కూరు ‘తమ్ముళ్ల’ విభేదాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి ప్రతినిధి కర్నూలు: బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి. మోతుబరి రాజకీయనాయకుడే. రాజకీయం, ఆయనపై ఫ్యాక్షన్ ఆరోపణలు వెరసి ‘సీమ’రాజకీయాల్లో కీలకంగా ఎదిగారు. తెలుగుదేశం పారీ్టలో సుదీర్ఘంగా పనిచేసిన ఆయన 2012లో విభేదించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ భుజానికెత్తుకున్నట్లు ‘రాయలసీమ పరిరక్షణ సమితి’ పేరుతో రాజకీయ పార్టీ స్థాపించి ప్రత్యేక రాయలసీమ వాదాన్ని వినిపించారు. ఎలక్షన్లో పోటీ చేసి అట్టరఫ్లాప్ అయ్యారు. ఆపై కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ దెబ్బతో బైరెడ్డి రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితం ముగిసిందని అంతా భావించారు. అయితే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. సమకాలీన రాజకీయాల్లో బైరెడ్డి ప్రస్తావన లేకుండానే 2014, 2019లో కర్నూలు ఎన్నికలు ముగిశాయి. 2024లో తనతో పాటు బీజేపీలో ఉన్న కుమార్తె శబరిని టీడీపీలోకి పంపారు. ఈ చేరికలో శబరి మాత్రకమే ‘పచ్చకండువా’ వేసుకున్నారు. బైరెడ్డి వేసుకోలేదు. నంద్యాల ఎంపీగా శబరి గెలుపొందారు. పేరుకే శబరి.. అంతా బైరెడ్డే! ఎన్నికల తర్వాత బైరెడ్డి నందికొట్కూరుపై తిరిగి పట్టుకోసం ప్రయతి్నస్తున్నారు. మునిసిపల్ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్లను టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహా్వనించారు. ఆపై మిడుతూరు, పగిడ్యాలలో ఎంపీటీసీ, సర్పంచ్‌లకు ‘పచ్చకండువా’ వేశారు. దీనిపై జయసూర్య తీవ్రస్థాయిలో స్పందించారు. ‘టీడీపీలో చేర్చుకోవడానికి బైరెడ్డి ఎవరు? ఆయన టీడీపీ వ్యక్తి కాదు. టీడీపీలో చేరలేదు. సభ్యత్వం లేదు. కుమారై టీడీపీలో చేరినంత మాత్రాన ఈయన టీడీపీ అవుతారా?’ అని ఘాటుగా స్పందించారు. ఆ తర్వాత బైరెడ్డి కూడా అదేస్థాయిలో స్పందించారు. ‘నందికొట్కూరు తమ అడ్డా అని, కొందరు వస్తుంటారు.. పోతుంటారు!’ అని ఎమ్మెల్యేను తేలిగ్గా కొట్టిపారేశారు. ఈ వ్యవహారం తర్వాత బైరెడ్డిపై జయసూర్య మాండ్ర శివానందరెడ్డితో కలిసి టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ తతంగం తర్వాత కూడా ఆదివారం బైరెడ్డి శివపురం ఎంపీటీసీ, మరికొందరికి కండువా వేసి టీడీపీలోకి ఆహా్వనించారు. ఒక్కమాటలో చెప్పాలంటే తానే ఎంపీ అనే భావనలో నందికొట్కూరులో బైరెడ్డి రాజకీయం సాగిస్తున్నారు మునిసిపల్ చైర్మన్ మార్పు బైరెడ్డికి చెక్ పెట్టేందుకేనా? బైరెడ్డికి చెక్‌పెట్టేందుకు మాండ్రశివానందరెడ్డి కొత్త ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీ నుంచి చేరిన సుధాకర్‌రెడ్డి టీడీపీ వ్యక్తి కాదని, అలాంటి వ్యక్తిని మునిసిపల్ చైర్మన్‌గా కొనసాగించొద్దని ఎమ్మెల్యే, మాండ్ర అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే 4ఏళ్ల వరకూ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టలేని పరిస్థితి. ఈక్రమంలో సుధాకర్‌రెడ్డి నిజంగా టీడీపీపై విశ్వాసంతో పారీ్టలో చేరి ఉంటే చైర్మన్ పదవికి రాజీనామా చేసి పారీ్టలో కొనసాగాలే ఆదేశించాలని పార్టీ పెద్దలకు చెప్పినట్లు సమాచారం. రాజీనామా చేస్తే చైర్మన్ పదవి ఖాళీ అవుతుంది. అప్పుడు టీడీపీ కౌన్సిలర్‌ను చైర్మన్ చేయొచ్చు అనేది మాండ్ర ఎత్తుగడ. ఇందుకు నాలుగేళ్ల వరకు ఆగాల్సిన పని కూడా లేదు. ఇదే జరిగితే బైరెడ్డికి చెక్ పెట్టినట్లే. లేదంటే మాండ్రతో పాటు దళిత ఎమ్మెల్యే జయసూర్యను టీడీపీ లైట్‌గా తీసుకున్నట్లే!! ఎమ్మెల్యే, మాండ్రకు టీడీపీ ప్రాధాన్యత ఇవ్వడం లేదా? ⇒ బైరెడ్డి చర్యలను పట్టించుకోకపోవడం చూస్తే టీడీపీ పరోక్షంగా ఆయనను సమరి్థంచినట్లే కనపడుతోంది. ⇒ మొన్నటి ఎన్నికల్లో మాండ్ర శివానందరెడ్డి నంద్యాల ఎంపీ టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. ⇒ శబరికి ఎంపీ టిక్కెట్ ఇచ్చే సందర్భంలో నందికొట్కూరు టిక్కెట్ మాండ్ర చెప్పిన వారికే ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఆ మేరకు జయసూర్య ఎమ్మెల్యే అయ్యారు. ⇒ ఇప్పుడు బైరెడ్డి చర్యలను టీడీపీ సమర్థిస్తూ, జయసూర్యను పట్టించుకోవం లేదంటే మాండ్రను పక్కనపెట్టినట్లేనని టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ⇒ ఒకవేళ ఈ వివాదానికి చెక్ పెట్టాలనుకుంటే బైరెడ్డిని టీడీపీలో చేరాలని అధిష్టానం సూచించాలి. అదీ చేయలేదు. ⇒ చేరికల సమయంలో ఎమ్మెల్యేను కలుపుకుని వెళ్లాలని చెప్పాలి. అలా కూడా జరగలేదు. ⇒ టీడీపీలోని ముఖ్య నేతలందరితో బైరెడ్డికి సంబంధాలు ఉన్నాయి. అందువల్లే ఆయన ముందు జయసూర్య తేలిపోతున్నారు. ⇒ పైగా జయసూర్య దళిత ఎమ్మెల్యే కావడంతో బైరెడ్డి లెక్కపెట్టడం లేదని తెలుస్తోంది. ⇒ టీడీపీ కూడా అదే కోణంలో చూస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ⇒ రెండేళ్ల తర్వాత డీలిమిటేషన్లో రిజర్వేషన్లు మారితే జయసూర్యకు రాజకీయ భవితవ్యం కూడా ఉండదనే ప్రచారం బైరెడ్డి వర్గం చేస్తోంది. -
ముచ్చుమర్రిలో మైనర్ బాలిక ఆచూకీపై వీడని సందిగ్ధత
-
షాడో ఎంపీగా బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి..?
ఎస్సీ రిజర్వ్డ్ అయిన నందికొట్కూరు నియోజకవర్గంలోని టీడీపీలో నిప్పు లేకుండానే ‘పచ్చ’గడ్డి భగ్గుమంటోంది. అగి్నకి ఆజ్యం తోడైనట్లు ఎన్నికల వేళ ఏర్పడిన విభేదాలకు ఇప్పుడు అధికార దర్పం చాటేందుకు ఇరువర్గాలు పోటాపోటీ పడుతున్నాయి. నియోజకవర్గంలో పెత్తనం చెలాయించేందుకు నాయకులు లోలోపల పావులు కదుపుతున్నారు. ఓ వైపు బైరెడ్డి రాజశేఖరరెడ్డి పట్టు సాధించేందుకు చక్రం తిప్పుతుండగా మాండ్ర శివానందరెడ్డి వర్గం చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. సాక్షి, నంద్యాల: నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, మాండ్ర శివానందరెడ్డి మధ్య వర్గపోరు భగ్గుమంటోంది. సాధారణ ఎన్నికల నుంచి వీరి మధ్య విభేదాలు మరింత ముదిరాయి. రెండు వర్గాల మధ్య మొదటి నుంచి విభేదాలు ఉన్నా గత ఎన్నికల్లో టీడీపీ ఎంపీ టికెట్ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కుమార్తె బైరెడ్డి శబరికి, నందికొట్కూరు అసెంబ్లీ టికెట్ మాండ్ర శివానందరెడ్డి వర్గానికి చెందిన జయసూర్యకు దక్కాయి. రెండు వర్గాలు టీడీపీలో ఉన్నా ఒకరినొకరు సహకరించుకున్న పరిస్థితి లేదు. ఎవరి ప్రచారం వారే చేసుకున్నారు. ప్రత్యర్థుల్లానే వ్యవహరించారు. ఎన్నికల ఫలితాల అనంతరం అదే ధోరణి వ్యవహరిస్తుండటంతో వ్యవహారం తారా స్థాయి చేరుకుంటుంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రెండు వర్గాల మధ్య రగడకు దారి తీశాయి. మాండ్ర వర్గం బైరెడ్డి ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో చంద్రబాబు సమక్షంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అప్పటి నుంచే రెండు వర్గాలు ఉప్పు.. నిప్పులా.. వ్యవహరిస్తూ వస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఎంపీ ఓటు ‘నీకు ఇష్టమొచ్చిన వారికి వేసుకోవచ్చని’ మాండ్ర వర్గం బాహటంగానే పిలుపునిచ్చింది. అలాగే ‘ఎమ్మెల్యే ఓటు మీకు నచ్చిన వారికి వేసుకొని ఎంపీ ఓటు శబరికి వేయండి’ అంటూ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి లోలోపల ప్రచారం చేశారు. మొత్తానికి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మాండ్ర వర్గానికి చెందిన జయసూర్య, ఎంపీగా బైరెడ్డి శబరి ఇద్దరూ గెలుపొందారు. అప్పటి నుంచి నియోజకవర్గంపై పెత్తనం కోసం రెండు వర్గాలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు నియోజకవర్గంలో శాంతిభద్రతల సమస్యకు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బైరెడ్డి వ్యాఖ్యలు కలకలం.. ఇటీవల బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఓ సందర్భంలో మాట్లాడుతూ.. వలంటీర్లు, మధ్యాహ్న భోజనం కార్మికుల ఉద్యోగాలకు కొంత మంది నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. టీడీపీకి చెడ్డ పేరు వచ్చేలా నియోజకవర్గంలో ఎవరైనా ప్రవర్తిస్తే ‘తోలు ఒలిచి ఉప్పుకారం పెడతానని’ ఘాటుగా హెచ్చరించారు. ఎమ్మెల్యే జయసూర్యను ఉద్దేశించే బైరెడ్డి హెచ్చరికలు చేశారని పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ సాగింది. దీతో వారి మధ్య దూరం మరింత పెరిగింది. షాడో ఎంపీగా బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి..? నంద్యాల ఎంపీగా బైరెడ్డి శబరి గెలిచి నప్పటికీ ఆమెను డమ్మీని చేసి జిల్లాలో రాజకీయం మొత్తం తన చేతుల్లోకి తీసుకోవాలని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఫలితాలు వెలువడిన నాటి నుంచి జిల్లా అధికారులతో పాటు నియోజకవర్గ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికే తీసుకొని రావాలని అధికారులకు సూచిస్తున్నట్లు సమాచారం. టీడీపీ సభ్యత్వమే తీసుకోకుండా టీడీపీ నాయకులపై బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పెత్తనం చేస్తుండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నంద్యాల షాడో ఎంపీగా వ్యవహరిస్తున్న బైరెడ్డిపై సొంత పార్టీ నేతలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ముదిరిన వివాదం తాజాగా శుక్రవారం నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ సుధాకర్‌రెడ్డితో పాటు మరో 12 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పారీ్టలో చేరారు. ఈ చేరికలపై ఎమ్మెల్యే గిత్తా జయసూర్యకు కనీస సమాచారం ఇవ్వలేదు. బైరెడ్డి మొత్తం చక్రం తిప్పారు. తనకు తెలియకుండా టీడీపీలో కౌన్సిలర్లు చేరడంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సభ్యత్వం లేని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పెత్తనాన్ని సహించేది లేదని బహిరంగంగానే ఎమ్మెల్యే తేలి్చచెబుతున్నారు. నా సత్తా ఏమిటో చూపిస్తా.. ఎమ్మెల్యే జయసూర్య ఇంత వరకు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి తెలుగుదేశం పారీ్టలో సభ్యత్వమే లేదని, అలాంటి వ్యక్తి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను, చైర్మర్ను టీడీపీలో ఎలా చేర్చుకుంటారని ఎమ్మెల్యే జయసూర్య విలేకరుల సమావేశంలో ఘాటుగా స్పందించారు. బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి టీడీపీకి చెందిన వ్యక్తి కాదని, బైరెడ్డి ఇప్పటి వరకు కండువా కూడా కప్పుకోలేదని, అలాంటి వ్యక్తి వేరే వాళ్లకు ఎలా కండువ కప్పి పారీ్టలో చేర్చుకుంటారని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో అవినీతి చేసిన వ్యక్తులను కాపాడేందుకే బైరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పాదయాత్ర సందర్భంగా మున్సిపాలిటీలో జరిగిన అవినీతిని నారా లోకేష్ రెడ్ బుక్‌లో రికార్డు చేశారన్నారు. బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆడుతున్న డ్రామా ఇది అన్నారు. ఎన్నికల్లో తనను ఓడించేందుకు కృషి చేసిన వ్యక్తుల్లో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఒకరన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో పెత్తనం చేయాలంటే కుదరదని, ‘నా సత్తా ఏమిటో చూపిస్తా’ అంటూ సమావేశంలో వ్యాఖ్యానించారు. ఎవరికి భయపడొద్దు.. మీకు నేను ఉన్నా : బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ‘ఎవరి బెదిరింపులకు భయపడవద్దు. అందరం కలిసికట్టుగా పేదల అభ్యున్నతికి పని చేద్దాం. నేను మీకు అండగా ఉంటా’ అంటూ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ చైర్మన్ సుధాకర్‌రెడ్డితో పాటు 12మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ నుండి టీడీపీలో చేరిన సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను రెండు సార్లు నందికొట్కూరు ఎమ్మెల్యేగా పని చేశానని, ఆ సమయంలో తాను నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధే నేటికి అందరికీ కనబడుతుందన్నారు. తమ కుటుంబం ఇప్పటికీ ప్రజల్లో ఉండేందుకు అప్పట్లో చేసిన అభివృద్ధే కారణమన్నారు. ఎంపీ శబరి ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి నందికొట్కూరు నియోజకవర్గానికి ఎక్కువ నిధులు సాధించి మరింత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. -
జయసూర్య Vs బైరెడ్డి: నందికొట్కూరు టీడీపీలో రచ్చ రచ్చ
సాక్షి, నంద్యాల జిల్లా: నందికొట్కూరు టీడీపీలో వర్గ విభేదాలు భగ్గమన్నాయి. టీడీపీ సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య సవాల్ విసిరారు.బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి టీడీపీకి చెందిన వ్యక్తి కాదని.. బైరెడ్డి టీడీపీ కండువా కప్పుకోలేదు.. నందికొట్కూరు రాజకీయంలో తలదూర్చి పెత్తనం చెలాయిస్తే చూస్తూ ఊరుకోం’’ అంటూ జయసూర్య హెచ్చరించారు. నా ఓటమికి కృషి చేసిన వ్యక్తులలో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఒకరు. ఎంపీ తండ్రిగా నియోజకవర్గంలో పెత్తనం చేయాలంటే కుదరదు. నియోజకవర్గ పరిధిలోని నా సత్తా ఏంటో చూపిస్తా అంటూ బైరెడ్డికి జయసూర్య సవాల్ విసిరారు. -
సీడ్ పార్క్ శిలాఫలకాన్నే మరిచిపోయిన చంద్రబాబు
-
ముంబై టీఐఎస్ఎస్లో సీటు సాధించిన తొగురు సిరి సింధూర
కర్నూలు కల్చరల్: ముంబైలోని ప్రఖ్యాత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్)లోని స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ లేబర్ స్టడీస్ వారి హ్యూమన్ రీసోర్సెస్ మేనేజ్ మెంట్ అండ్ లేబర్ రిలేషన్స్ (హెచ్ఆర్ఎంఎల్ఆర్)లో జిల్లాకు చెందిన తొగురు సిరి సింధూర సీటు సాధించారు. 1936లో స్థాపింపచబడిన టీఐఎస్ఎస్ ఆసియాలోనే సామాజిక స్పృహ (సోషల్ సెన్సిటివిటి)తో కూడిన ప్రొఫెషనల్ కోర్సెస్ అందించే ఉన్నత విశ్వవిద్యాలయం. ప్రతి సంవత్సరం 40 వేల మంది టీఐఎస్ఎస్లోని నాలుగు క్యాంపస్‌ల్లో చేరడానికి దరఖాస్తు చేసుకుంటారు. ఇందులో కేవలం 68 మంది మాత్రమే హెచ్ఆర్ఎంఎల్ఆర్ ప్రోగ్రాంకు ఎంపికవువుతారు. ఇందులో జిల్లాకు చెందిన సిరి సింధూర ఎంపిక కావడం గర్వకారణం. నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ కుమార్తె అయిన ఈమె కర్నూలు ఎన్నార్ పేట సెయింట్ జోషప్ పాఠశాలలో పాఠశాల విద్య, హైదరాబాద్ కూకట్ పల్లి నారాయణ కళాశాలలో ఇంటర్ చదివారు. 2015లో ఐఐటీ గౌహతిలో బీఈ (బ్యాచిలర్ ఆఫ్ డిజైన్) పూర్తి చేశారు. ఇగ్నోలో ఎంఏ సోషియాలజీ పూర్తి చేశారు. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న సిరి సింధూర టీఐఎస్ఎస్కు ఎంపిక కావడంపై ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. -
టీడీపీ సభ్యులపై ఆర్థర్ ఫైర్
-
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్థర్‌కు అరుదైన గౌరవం
కర్నూలు(రాజ్‌విహార్): నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్‌కు అరుదైన గౌరవం దక్కింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో నియోజకవర్గంలో ఆయన తన వంతుగా సేవలందించారు. ప్రజలకు అందుబాటులో ఉండటం, కరోనా బాధితులను పరామర్శించడం, సొంత నిధులతో కూలీలు, కార్మికులకు శానిటైజర్లు, మాస్కులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సేవలను గుర్తించిన లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ ‘సర్టిఫికెట్ ఆఫ్ కమిట్మెంట్’ ఇచ్చేందుకు ఆయనను ఎంపిక చేసింది. త్వరలో నందికొట్కూరులో జరగే కార్యక్రమంలో ఎమ్మెల్యేను సన్మానించి సర్టిఫికెట్ అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతరం శ్రమించారన్నారు. ఆయన సూచనల మేరకు తాను నియోజకవర్గంలో నిత్యం ప్రజల మధ్య ఉంటూ కోవిడ్ నివారణకు కృషి చేశానన్నారు. అధికారులను సమన్వయం చేస్తూ లాక్డౌన్ అమలు, కరోనాపై ప్రజలకు అవగాహన కలి్పంచామన్నారు. -
మొసలి కలకలం
-
పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, నందికొట్కూరు : పట్టణానికి చెందిన నాగరాజు, లలితమ్మ కుమారుడు పాలిటెక్నిక్ పూర్తి చేసిన నవీన్(22) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపిన వివరాలు.. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఇటీవల ఫైనలియర్ పరీక్షలు రాశాడు. ఉదయం తండ్రి కూరగాయలు విక్రయించేందుకు వెళ్లగా, తల్లి వైఎస్ఆర్ బీమా పథకంలో పని చేస్తుండడంతో విధులకు వెళ్లింది. సాయంత్రం తల్లి ఇంటికి చేరుకోగా కుమారుడు ఉరికి విగతజీవిగా వేలాడుతూ కనిపిండంతో బోరున విలపించింది. పోలీసులు అక్కడికి చేరుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు. చదవండి: ఫాతిమాగా తప్పిపోయి.. స్వప్నగా తిరిగొచ్చింది -
పెళ్లి కూతురుకు కరోనా, పెళ్లి వాయిదా
సాక్షి, కర్నూలు: అయితే ఆ ఇంట్లో వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. తెల్లారితే పెళ్లి వేడుకలు జరగాల్సి ఉంది. అంతలోనే పెళ్లి కూమార్తెకు కరోనా పాజిటివ్ అని రిపోర్టు రావడంతో... దీంతో చేసేదేమీ లేక వివాహం వాయిదా వేసుకోవాల్సిన వచ్చింది ఈ సంఘటన కర్నూలు జిల్లా నందికొట్కూరులోనూ చోటుచేసుకుంది. (పెళ్లింట్లో కరోనా కలకలం..) వివరాల్లోకి వెళితే నందికొట్కూరు పట్టణానికి చెందిన చెంచు కాలనీకి చెందిన ఓ యువతకి వివాహం నిశ్చయమైంది. 25న ముహూర్తం, 26న తలంబ్రాలు పెట్టుకున్నారు. అయితే కోవిడ్-19 నిబంధనల ప్రకారం పెళ్లికి మూడు రోజుల ముందు వధూవరులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. శనివారం ఉదయం పెళ్లి కూతురికి పాజిటివ్ అని నివేదిక రావడంతో అధికారులు హుటాహుటీన ఆ యువతి ఇంటికి చేరుకుని విషయం చెప్పారు. అధికారుల సూచన మేరకు ఇరు కుటుంబాలు మాట్లాడుకుని పెళ్లి వాయిదా వేసుకున్నారు. మరోవైపు నందికొట్కూరులో కరోనా విజృంభించింది. ఈ నెల 22న కోటా హైస్కూల్ వద్ద 378మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, వందమందికి పాజిటివ్ వచ్చింది. (కరోనా అంతానికి హనుమాన్ చాలీసా..) ఇలాంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. కొత్తపేటకు చెందిన పెళ్లి కుమారుడికి కరోనా పాజటివ్ అని నిర్ధారణ కావడంతో పెళ్లి వాయిదా పడింది. పెండ్లి తంతులో భాగంగా గురువారం పెండ్లి కుమారుడిని చేయగా అదే రోజు టెస్ట్ రిపోర్టు పాజిటివ్‌గా రావడంతో పెళ్లి నిలిచిపోయింది. (పెళ్లింట్లో కరోనా కలకలం..) -
ఈ ఎన్నికల్లో టీడీపీ ఖాళీ అవుతుంది
సాక్షి, కర్నూలు: దేశంలోనే ఎక్కడా లేని విధంగా పోలింగ్ కంటే ముందే మద్యం షాపులు మూసివేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే ఆర్థర్ అన్నారు. గ్రామాల్లో ఎక్కడా డబ్బులు, మద్యం పంపిణీ లేకుండా ఎన్నికలు జరగాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. మంగళవారం నందికొట్కూర్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పలువురు టీడీపీ నాయకులు ఎమ్మెల్యే ఆర్థర్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తుందని, టీడీపీ ఖాళీ అవుతుందన్నారు. కొన్ని కోట్ల రూపాయలతో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఇక జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నందికొట్కూర్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అందరం కలిసికట్టుగా అన్ని స్థానాలను కైవసం చేసుకుని సీఎం జగన్‌కు బహుమతిగా అందిద్దామని పిలుపునిచ్చారు. టీడీపీకి షాక్: వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు -
ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్సీపీలోనే..
సాక్షి, కర్నూలు : ‘‘నేను పార్టీ మారుతున్నట్లు ‘పచ్చ’ మీడియాతో ఓ వర్గం నాయకులు ప్రచారం సృష్టించారు. ఊపిరి ఉన్నంత వరకు నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను, జగనన్నతోనే నడుస్తాను’’ అని వైఎస్సార్సీపీ నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం కర్నూలులోని తన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. తనకు, ఎమ్మెల్యే ఆర్థర్‌కు విభేదాలున్నాయని ప్రచారం చేస్తున్నారు, ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవన్నారు. తనకు రెండు రాష్ట్రాల్లో గుర్తింపును వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కల్పించారని, పార్టీ మారాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. వేరే పార్టీలో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కార్యకర్తలకు న్యాయం చేయాలన్న తపన తనదని, అయితే కొందరు నందికొట్కూరులో పెత్తనం చెలాయిస్తున్నానని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చి..మూడు నెలలైందని, తాను రెండు నెలలు నియోజకవర్గంలోనే లేనని, ఆధిపత్యం ఎలా చెలాయిస్తానని ప్రశ్నించారు. అధికారులు ఎవరికీ ఫలాన పని చేయాలంటూ ఫోన్ చేసిన సందర్భాలు లేవన్నారు. తనపై తెర వెనుక భారీ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తాను దళిత వ్యతిరేకి అనే ప్రచారం చేయొచ్చన్నారు. గత ప్రభుత్వ హయాంలో తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని, కుటుంబ సభ్యులను, తన వెంట ఉండే కార్యకర్తలనూ ఇబ్బందులకు గురి చేశారన్నారు. మిడుతూరు మండలానికి హంద్రీ–నీవా నీరు తీసుకురావడం, శ్రీశైలం ముంపు బాధితులకు న్యాయం చేసేందుకు జీఓ నంబర్ 98 కింద ఉద్యోగాల కల్పన, మున్సిపాలిటీలో పెంచిన పన్ను భారాన్ని తగ్గించడం, నందికొట్కూరు రోడ్డు విస్తరణలో నష్టపోయిన బాధితులకు పరిహారం ఇప్పించడం.. తన ముందున్న లక్ష్యాలని పేర్కొన్నారు. పార్టీ కోసం సమష్టిగా పని చేసి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో నందికొట్కూరులో వైఎస్ఆర్సీపీ జెండాను ఎగురవేస్తామని స్పష్టం చేశారు. -
కాలి బూడిదైన కోల్డ్‌స్టోరేజీ
సాక్షి, నందికొట్కూరు(కర్నూలు) : నందికొట్కూరు మండలం 10 బొల్లవరం గ్రామ సమీపంలోని శ్రీ చక్ర కోల్డ్‌స్టోరేజీలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు యజమాని చెబుతున్నారు. అందులో ఉన్న వ్యవసాయోత్పత్తులు కాలి బూడిదయ్యాయి. దీంతో సుమారు రూ.5 కోట్ల దాకా నష్టం వాటిల్లింది. తహసీల్దార్ హసీనా సుల్తానా తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒంగోలుకు చెందిన రమేష్ అనే వ్యక్తి శ్రీచక్ర కోల్డ్ స్టోరేజీని కొత్తగా నిర్మించారు. ఇంకా కొన్ని పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇందులో రమేష్‌తో పాటు మరో ఐదుగురికి చెందిన వ్యవసాయోత్పత్తులు నిల్వ చేశారు. ఎండు మిర్చి 25 టన్నులు, కందులు 25 టన్నులు, శనగలు 50 టన్నుల వరకు నిల్వ చేసినట్లు తెలుస్తోంది. అయితే..కోల్డ్‌స్టోరేజీలో మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడున్న కూలీలు గమనించి 10 బొల్లవరం గ్రామస్తులకు తెలియజేశారు. వారు కర్నూలులోని అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే..భారీఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో రాత్రి ఎనిమిది గంటల సమయానికి గానీ అదుపులోకి రాలేదు. మొత్తం నాలుగు ఫైరింజన్లను వినియోగించాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో వ్యవసాయోత్పత్తులన్నీ కాలి బూడిదయ్యాయి. కోల్డ్ స్టోరేజీ కూడా దెబ్బతింది. రూ.5 కోట్ల దాకా నష్టం జరిగినట్లు యాజమాని రమేష్ ఫిర్యాదు చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. సంఘటన స్థలాన్ని సీఐ సుధాకరరెడ్డి, ఎస్ఐలు చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాసులు, ఆర్ఐ సత్యనారాయణ, వీఆర్వో పవిత్ర తదితరులు పరిశీలించారు. కాగా..ఈ ప్రమాదంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్సూరెన్స్ కోసమే ఇలా చేసి ఉంటారని అంటున్నారు. -
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై పోలీసుల వేధింపులు
-
నందికొట్కూర్ ప్రచార సభలో వైఎస్ జగన్
-
దోచుకుని దేశంలో ధనిక సీఎం అయ్యారు: వైఎస్ జగన్
సాక్షి, కర్నూలు: చంద్రబాబు నాయుడి ఐదేళ్ల పాలనలో పేదల బతుకులు ఏమాత్రం మారలేదని.. ఆయన మాత్రం దేశంలో అత్యంత ధనిక సీఎం అయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సీఎంగా రైతులకు, నిరుద్యోగులను ఆదుకోవడం పక్కన పెట్టి పేదలసొమ్ముని దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు మాత్రం అత్యంత ధనికుడని, కానీ రాష్ట్రంలోని రైతులు మాత్రం అత్యంత పేదలుగా మిగిలిపోయారని అన్నారు. దేశంలో ఎక్కువ రుణభారం మన రాష్ట్రానికి చెందిన రైతులపైనే ఉందని వైఎస్ జగన్ వెల్లడించారు. ఈ ప్రాంత రైతులను ఆదుకోవడానికి దివంగత వైఎస్సార్ చేసిన కృషి ఇప్పటివరకూ ఏ ఒక్క సీఎం కూడా చేయలేదని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడి అరాచక పాలనను అంతంచేసి.. రాజన్న రాజ్యం తీసుకువస్తామని వైఎస్ జగన్ హమీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టుల పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయని, రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారని.. ప్రత్యేక హోదాను ముందుగా ప్రకటించిన వారికే కేంద్రంలో మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా నందికొట్కూర్‌లో జరిగిన సభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఈ సందర్భంగా నందికొట్కూర్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న తొగురు ఆర్థర్ని, ఎంపీ అభ్యర్థి బ్రహ్మనందరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘గత ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక హమీలను ఇచ్చారు. ఐదేళ్ల కాలంలో ఏ ఒక్కటీ కూడా అమలుచేయ్యలేదు. రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కానీ ఉన్న ఉద్యోగాలు తీయించారు. సుమారు లక్షకు పైగా ఉద్యోగాలు తొలగించారు. ఉద్యోగాలు రాకపోతే నిరుద్యోభృతి ఇస్తామన్నారు. కానీ 57 నెలల మోసం చేసి.. ఎన్నికలకు చివరి మూడునెలలు భృతి ఇస్తామని మరోసారి మోసం చేయడానికి వస్తున్నారు. ఉద్యోగాలు వస్తాయని, మన బతుకులు మారుతాయని ఎంతో ఆశపడ్డం. కానీ ఇంతవరకు దాని ఊసేలేదు. స్థానికలకే 75శాతం ఉద్యోగాలు రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి.. ఇప్పటి వరకు మొత్తం రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయదు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతిఏటా జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేస్తాం. తొలిఏడాదే ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. రాష్ట్రాంలోని పరిశ్రమల్లో ఇప్పుడు చాలామంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. అన్ని పరిశ్రమల్లో స్థానికలకే 75శాతం ఉద్యోగాలు కల్పించే విధంగా శాసనసభలో చట్టం చేస్తాం. ఉద్యోగాలన్ని మన పిల్లలకే వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ కాంట్రాక్టులకు కూడా బీసీ, ఎస్టీ, ఎస్సీలకు వచ్చే విధంగా చట్టం చేస్తాం. ఐదేళ్ల కాలంలో ఆయన చేయని మోసం లేదు, ఆడని డ్రామాలేదు, అబద్ధంలేదు, చూపని సినిమా లేదు. ఎన్నికల సమీపిస్తున్న వేళ మరోసారి కుట్ర చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటుకు మూడు వేల రూపాయలు పంచుతున్నాడు. అక్రమంగా గెలవడానికి మూటల మూటల డబ్బు పంపుతా ఉన్నాడు. అందరూ అప్రమత్తంగా ఉండాలి. వైఎస్సార్ ఆశయాలను నెరవేరుస్తాం డ్వాక్రా మహిళను ఆదుకుంటాం. సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చి.వైఎస్సార్ ఆశయాలను నెరవేరుస్తాం. వచ్చేది మన ప్రభుత్వమే. అందరినీ ఆదుకుంటా.. పిల్లల్ని బడికి పంపితే చాలు ఏడాదికి 15వేలు చేతిలో పెడతాం. పేద పిల్లల్ని ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి పెద్దపెద్ద చదువులను చదవిస్తాం. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పొదుపు రుణాలను మాఫీ చేస్తాం. మళ్లీ రాజన్న రాజ్యం వచ్చే విధంగా సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాం. వైఎస్సార్ ఆశయాలను నెరవేరుస్తాం. వైఎస్సార్ చేయూత ద్వారా ఏడాదికి 75వేలు చేతిలో పెడతాం. పెట్టుబడి కోసం ప్రతి రైతుకు ఏడాదికి 15వేలు ఇస్తాం. రైతులకు గిట్టుబాటు ధరను కూడా కల్పిస్తాం. పెన్షన్లు పెంచుతాం. పేదలకు ఇళ్లు కట్టిస్తాం. నవరత్నాల ద్వార పేదల బతుకుల్లో మార్పు వస్తుందని నాకు నమ్మకం ఉంది’’ అని అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇద్దరు పిల్లలు సహా దంపతులు ఆత్మహత్య
-
ముస్లింలపై బాబుకు సవతి ప్రేమ
నందికొట్కూరు: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ముస్లింలపై సవతి ప్రేమ చూపుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య ఆరోపించారు. నందికొట్కూరు వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ సిద్ధార్థ రెడ్డితో కలిసి ఐజయ్య విలేకరులతో మాట్లాడారు. ముస్లింలపై అక్రమ కేసులు బనాయించి వారిని భయపెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. నాలుగు సంవత్సరాల కాలంలో ముస్లింలకు బాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మొన్న నంద్యాల ఉప ఎన్నికలలో మసీదులలో ఉన్న ఇమామ్‌లకు జీతాలు ఇస్తాను అని హామీఇచ్చి ఇప్పటివరకు పట్టించుకోలేదని గుర్తు చేశారు. సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ..చంద్రబాబు ముస్లింలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వారు భయపడరని, వారికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని తెలిపారు. అక్రమంగా అరెస్ట్ చేసిన ముస్లిం సోదరులను విడుదల చేసి కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. గుంటూరులో నారా హమారా-టీడీపీ హమారా అనే కార్యక్రమంలో నిరసన వ్యక్తం చేసిన ముస్లిం యువకులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పోలీసు స్టేషన్‌కు ర్యాలీగా చేరుకుని స్థానిక సీఐకి వినతిపత్రం సమర్పించారు. -
ప్రాణం తీసిన ‘నో క్యాష్’
-
ప్రాణం తీసిన ‘నో క్యాష్’
బ్యాంకులోనే కుప్పకూలిన వృద్ధుడు నందికొట్కూరు: నగదు కోసం బ్యాంక్‌కు వెళ్లి గుండెపోటుతో ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా నంది కొట్కూరులో చోటు చేసుకుం ది. పట్టణంలోని మద్దూరు సుబ్బారెడ్డినగర్‌లో నివాసం ఉంటున్న బాలరాజు(65) వెటర్నరీ డిపార్ట్మెంట్లో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేసి 2010లో పదవీ విరమణ ఛేశాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమా రులు. రెండవ కోడలు ఇటీవల డెలివరీ అయిన నేపథ్యంలో డబ్బు అవసరమై ఐదు రోజులుగా నగదు కోసం స్థానిక ఎస్బీఐ చుట్టూ తిరుగుతున్నాడు. రోజూ క్యూలో నిల్చోవడం.. డబ్బు లేదని బ్యాంకు అధికారులు చెప్పడంతో వెనుదిరగడం జరుగుతోంది. శుక్రవారం ఉదయం 9 గంటలకే బ్యాంకుకు చేరుకుని క్యూలో నిల్చోగా కౌంటర్ వద్దకు చేరుకునే లోపు బ్యాంకు అధికారులు నో క్యాష్ అని చెప్పడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. -
డబ్బు గెలిచింది.. రక్త సంబంధం ఓడింది !
- అనారోగ్యం పాలైన వ్యాపారి - వైద్యానికి డబ్బు ఇవ్వని కుటుంబీకులు - మనస్తాపంతో ఆత్మహత్య - శవాన్ని మున్సిపాల్టీకి అప్పగించండని సూసైడ్ నోట్ ధనం ముందు రక్త సంబంధాలు కూడా ఓడి పోతున్నాయనేందుకు విషాద ఘటన ఓ నిదర్శనం. ఓ వ్యాపారి తన కుటుంబం కోసం అహర్నిషలు కష్టపడ్డాడు. ఇల్లు అనక.. ఊరనక.. ఎక్కడెక్కడో తిరిగి ఎన్నో వ్యాపారాలు చేసి రూ. లక్షలు ఆర్జించాడు. ఓ బంధువును నమ్మి సంపాదించినంతా అతని చేతిలో పెట్టి అవసరానికి ఇవ్వమన్నాడు.ఽ అనారోగ్యంతో ఆసుపత్రి పాలైతే కుటుంబీకులు పైసా కూడా ఖర్చు పెట్టనీయలేదు. జీవితాంతం అతనుఽ తన వాళ్ల కోసం కష్టపడితే వాళ్లు మాత్రం ఆయన చావు కోసం ఎదురు చూశారు. తీవ్ర మనస్తాపానికి చెంది పోలీసులు అధికారులకు, మీడియాకు సూసైడ్ నోట్ పంపి బలవన్మరణానికి పాల్పడ్డాడు. - నందికొట్కూరు నందికొట్కూరు పట్టణంలో ఓ వ్యాపారి ఆత్మహత్య కలకలం రేపింది. ఆయన సూసైడ్ నోట్ వివరాల మేరకు.. పట్టణంలోని సుబ్బారావు పేటకు చెందిన వ్యాపారి సుబ్రమణ్యం (65)కు భార్య సాయి కృష్ణమ్మ, పెద్ద కుమారుడు శివకుమార్, చిన్న కుమారుడు కిషోర్‌కుమార్ ఉన్నారు. అతను చేపలు, నాపరాయి, పొగాకు, పత్తి తదితర వ్యాపారాలు చేస్తూ రూ. లక్షలు ఆర్జించాడు. 2001లో భార్య చిన్నాన్న లగిశెట్టి శ్రీనివాసులకు రూ. 12 లక్షలు ఇచ్చాడు. 2009లో సుబ్రమణ్యం అనారోగ్యానికి గురైతే ఆపరేషన్ చేయించేందుకు కూడా డబ్బులు ఇవ్వలేదు. శ్రీనివాసులు కూడా ఇవ్వకుండా అడ్డుకున్నారు. కొద్ది రోజుల తర్వాత కుల పెద్దల వద్ద పంచాయితీ పెడితే కుటుంబసభ్యులకు ఇచ్చినట్లు ఆయన చెప్పడం, వారు కూడా ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మొదటి నుంచి చేతిలో డబ్బులు ఉండటం చివరి దశలో అనారోగ్యంపాలై ఆసుపత్రిలో చూయించేందుకు డబ్బులు లేకపోవడంతో కుంగిపోయాడు. నమ్మిన బంధువు కూడా మోసం చేయడంతో తట్టుకోలేక పోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని ముందుగానే సూసైడ్‌నోట్ తయారు చేశాడు. కుటుంబీకుల మీద కోపంతో చివరకు తన శవాన్ని వారికి ఇవ్వకుండా మున్సిపాలిటీకి ఇవ్వాలని అందులో పేర్కొన్నాడు. తనకు రూ, 2.38 లక్షల అప్పు ఉందని, తన పేరు మీద ఉన్న ఆస్తులను అమ్మి వారికి ఇవ్వాలని కోరాడు. పోలీసులు అధికారులకు, మీడియాకు సూసైడ్ నోట్ కొరియర్ పంపాడు. అది వారికి చేరేలోపే మంగళవారం తెల్లవారు జామున పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ లక్ష్మీనారాయణ సంఘటన స్థలానికి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులు అందజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఓడీఎఫ్ నియోజకవర్గంగా నందికొట్కూరు
– అభివృద్ధి చేస్తానన్న ఎమ్మెల్యే ఐజయ్య కర్నూలు(అగ్రికల్చర్): బహిరంగ మల విసర్జనలేని( ఓడీఎఫ్) నియోజకవర్గంగా నందికొట్కూరును అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే ఐజయ్య ప్రకటించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌ను కలిసి నియోజకవర్గానికి సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించారు. దత్తత తీసుకొని ఓడీఎఫ్ నియోజకవర్గంగా నందికొట్కూరును మార్చవచ్చుకదా అని కలెక్టర్ అనడంతో ఎమ్మెల్యే అందుకు అంగీకరించారు. రానున్న ఏడాదిలోపు నియోజకవర్గాన్ని ఆ మేరకు తీర్చిదిద్దుతానని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ... నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లోని ఎస్సీ కాలనీలు దయనీయంగా ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఉన్నా పట్టించుకోవడంలేదని తెలిపారు. అన్ని ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, కాల్వలు తక్షణం నిర్మించాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. అధికారులు తమకు కమీషన్లు వచ్చే పనులు మాత్రమే చేస్తున్నారని, మిగిలిన పనులను పట్టించుకోవడం లేదని వివరించారు. పంచాయతీ రాజ్ అధికారులు, ఎన్ఆర్ఇజీఓస్ అధికారులు బీసీ కాలనీల్లో అభివద్ధి పనుల నిర్వహణపై ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారని తెలిపారు. దామగట్లతో పాటు వివిధ చెరువులను హంద్రీనీవా నీటితో నింపాలని కోరారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రవాసాంధ్రులతో వీడీయో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన చర్చాగోష్టి రాష్ట్రంలోని అన్ని వర్గాల వారిని అకట్టుకుందని తెలిపారు. -
జూడో విజేత అనంతపురం
– రెండు స్థానంలో కర్నూలు, మూడో స్థానంలో చిత్తూరు నందికొట్కూరు: రాష్ట్ర స్థాయి సబ్ జూడో పోటీల్లో అనంతపురం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. నందికొట్కూరు పట్టణంలోని మార్కెట్ యార్డులో మూడు రోజులుగా ఉత్కంఠగా జరుగుతున్న పోటీలు ఆదివారం ముగిశాయి. శ్రీకాకుళం మినహా మిగతా 12 జిల్లాలో దాదాపు 288 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. పలు విభాగాల్లో నిర్వహించిన బాలురు, బాలికల పోటీల్లో అనంతపురం క్రీడాకారులు సత్తా చాటి విజేతగా నిలిచారు. కర్నూలు జిల్లా క్రీడాకారులు రెండో స్థానంలో, చిత్తూరు జిల్లా క్రీడాకారులు మూడో స్థానంలో నిలిచారు. వచ్చే నెల 13వ తేదీ నుంచి బీహార్ రాష్ట్రం పాట్నాలో జాతీయ స్థాయి సబ్ జూడో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీ జూడో అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్ నాంశెట్టి చెప్పారు. రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఈనెల 20వ తేదీ నుంచి అనంతపురంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో విద్యాసంస్థల అధినేతలు కట్టమంచి జనార్దన్‌రెడ్డి, పుల్లయ్య, శ్రీనివాసరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ గుండం రమణారెడ్డి, ఎంపీపీ ప్రసాదరెడ్డి, మాలమహానాడు డివిజన్ అధ్యక్షులు అచ్చన్న, టీడీపీ యూత్ డివిజన్ నాయకులు రవికుమార్‌రెడ్డి, జవ్వాజి సుంకన్నగౌడు సేవా సమితి అధ్యక్షులు శ్రీకాంత్‌గౌడు, వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్.రవికుమార్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా సబ్ జూడో పోటీలు
నందికొట్కూరు: స్థానిక మార్కెట్ యార్డులో రాష్ట్రస్థాయి సబ్జూడో పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. శనివారం పోటీలను మార్కెట్ యార్డు చైర్మన్ గుండం రమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో స్నేహ సంబంధాలు మెరుగు పడతాయన్నారు. గెలుపోటమలు సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాలన్నారు. ఎంపీపీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ పట్టుదలతో సాధన చేసి క్రీడల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. సబ్జూడో పోటీల్లో 12 జిల్లాలకు చెందిన బాలబాలికలు పాల్గొన్నారు. శనివారం పోటీల్లో మొదటి స్థానంలో అనంతపురం జిల్లా, రెండో స్థానంలో కర్నూలు జిల్లా, మూడో స్థానంలో చిత్తూరు జిల్లాలు నిలిచాయి. రాష్ట్ర జూడో అధ్యక్షుడు వెంకట్, కార్యదర్శి బాబు, జిల్లా కార్యదర్శి శ్రీధర్, వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్. రవికుమార్, నాగరాజు, రిటైర్డు పీడీ శివశంకరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఇద్దరి విద్యార్థులకు గాయాలు.. పోటీల్లో చిత్తూరు జిల్లా బైరాగిపట్టెడ మహత్మాగాంధీ మున్సిపాల్ కార్పొరేషన్ హైస్కూల్ విద్యార్థి వినోద్‌కు కుడి చేయి విరిగింది. వెస్ట్ గోదావరికి చెందిన శివగణేష్‌కు కుడి భుజం బోను విరిగింది. పట్టణంలోని వాసవి వైద్యశాల్లో తాత్కాలిక చికిత్సలు నిర్వహించారు. అనంతరం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు మెరుగైన వైద్యం కోసం 108 ద్వారా విద్యార్థులను తరలించారు. -
కోల్‌కతా ఫ్లైఓవర్ కింద తెలుగు వ్యక్తి సమాధి
కోల్‌కతాలో ఫ్లైఓవర్ కూలిన ఘటనలో కర్నూలు జిల్లా నందికొట్కూర్‌కు చెందిన ఓ కార్మికుడు సజీవ సమాధి అయ్యాడు. అబ్దుల్ రజాక్ (31) లారీ క్లీనర్‌గా పనిచేస్తుండగా... కర్ణాటక నుంచి అల్లం సరుకును కోల్‌కతా నగరానికి తీసుకెళ్లి దిగుమతి చేసి వస్తున్నారు. వీరి లారీ ఫ్లైఓవర్ కింద చిక్కుకుపోవడంతో అబ్దుల్ రజాక్ ప్రాణాలు కోల్పోయాడు. -
యువకుడి అనుమానాస్పద మృతి
నందికొట్కూరు (కర్నూలు) : కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం వడ్డెమాను గ్రామంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గ్రామానికి చెందిన భాస్కర్(25) మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని మృతి చెందాడు. కడుపునొప్పి తాళలేకనే అతడు ఉరి వేసుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతుండగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నందికొట్కూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
'ఆర్టీసీ పరిరక్షణకు వైఎస్సార్సీపీ ఉద్యమం'
నందికొట్కూరు (కర్నూలు) : భవిష్యత్ తరాల కోసం ఆర్టీసీని కాపాడేందుకు వైఎస్సార్సీపీ ఉద్యమం చేపడుతుందని వైఎస్సార్సీపీ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐలయ్య స్వగృహంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆరోపించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరికలు
నందికొట్కూరు (కర్నూలు) : కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం 10 బొల్లవరం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ఐజయ్య సమక్షంలో గ్రామంలో గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో బీరం కాంతారెడ్డి ఆధ్వర్యంలో బీరం శేషారెడ్డి, వెంకటరామిరెడ్డితో పాటు 50 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారిని పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. -
కాలువలో పసికందు మృతదేహం
అప్పుడే పుట్టిన పసికందు గుర్తుతెలియని వ్యక్తులు కాలువలో పడేశారు. దీంతో చిన్నారి మృతిచెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం శికారిపేట వద్ద ఆదివారం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని కాలువలో అప్పుడే పుట్టిన బాబును వదిలి వెళ్లడంతో.. బాబు మృతిచెందాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి శిశువు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు,వ్యాన్ ఢీ: 9మందికి తీవ్రగాయాలు
నందికొట్కూరు (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం కొత్తూరు-బొల్లవరం మధ్య కర్నూలు జాతీయ రహదారిలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మకూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన ఆల్విన్ వ్యాన్ ఢీకొనడంతో ఆల్విన్ డ్రైవర్ సహా 9మంది తీవ్రంగా గాయపడ్డారు. వ్యాన్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్, కండక్టర్‌తో పాటు ఆరుగురు ప్రయాణికులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. ప్రమాదం జరిగినపుడు బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. నందికొట్కూరు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నందికొట్కూరులో చిన్నారిపై కుక్కల దాడి
కర్నూలు : కర్నూలు జిల్లా నందికొట్కూరులో మంగళవారం కుక్కలు స్వైర విహారం చేశాయి. రహదారిపై నిలుచున్న రెండేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేసి... తీవ్రంగా గాయపరిచాయి. దాంతో అతడి తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సదరు బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో నందికొట్కూరులో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దాంతో స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. -
కర్నూలులో నవవధువు దారుణ హత్య
-
నందికొట్కూరులో వీస్తున్న ఫ్యాన్ గాలి
మెరవని ‘రత్నం’ లబ్బీకి అసంతృప్తుల సెగ ప్రచారంలో దూసుకుపోతున్న ఐజయ్య సాక్షి, కర్నూలు: అరుదైన ‘బట్టమేక ’ పక్షికి స్థావరమైన నందికొట్కూరు నియోజకవర్గం 1952లో ఏర్పడింది. పునర్విభజనలో భాగంగా 2009లో ఎస్సీ రిజర్వుడ్‌గా మారింది. ఇక్కడ అంతర్గత కుమ్ములాటలతో తెలుగుదేశం సతమతమవుతోంది. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. ఉద్యమాలతో ప్రజల్లోకి దూసుకెళ్లిన వైఎస్సార్సీపీ బలంగా కనిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానం, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకం వైఎస్సార్సీపీ గెలుపునకు దోహదపడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలో(1955) నందికొట్కూరు ద్విసభ్య నియోజకవర్గంగా కొనసాగింది. ఈ సమయంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన అయ్యపురెడ్డి, ఎన్‌కె.లింగం విజయం సాధించారు. అంతకుముందు 1952లో కమ్యూనిస్టు పార్టీ నేత చండ్ర పుల్లారెడ్డి ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. నందికొట్కూరు శాసనసభకు 13 సార్లు ఎన్నికలు జరగ్గా మొత్తం 8 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించారు. మరో మూడు సార్లు తెలుగుదేశం, రెండు సార్లు ఇండిపెండెంట్లు, ఒకసారి సీపీఐ గెలుపొందింది. 1972లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మద్దూరు సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా గెలుపొందడం విశేషం. నందికొట్కూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వై. ఐజయ్య బరిలో ఉన్నారు. ఈయన పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో ఎక్కువగా ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీలున్నారు. దివంగత నేత వైఎస్. రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108, ఇందిరమ్మ గృహాలు, పింఛన్లు వంటి సంక్షేమ పథకాలతో చాలా మంది లబ్ధిపొందారు. వీరంతా వైఎస్సార్సీపీ వైపు ఉన్నారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫేస్టోను నమ్ముతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో వైఎస్సార్సీపీ క్రీయాశీలక పాత్రను ప్రశంసిస్తూ ఆ పార్టీవెంటే తామంతా అంటూ నడుస్తున్నారు. ఐజయ్యకు అండగా నిలుస్తున్నారు. దీంతో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. -
మాట తప్పినవారికి ఓటుతో బుద్ధి చెప్పండి
ప్రజలకు గౌరు వెంకటరెడ్డి పిలుపు వైఎస్సార్సీపీని ఆదరించాలని విజ్ఞప్తి నందికొట్కూరు, న్యూస్‌లైన్: కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు అన్నదమ్ముల్లా ఉండే తెలుగువారిని నిలువునా విభజించాయని, మాట తప్పి ప్రవ ర్తించిన ఆ పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించి రాష్ట్రంలో రైతు రాజ్యాన్ని తెస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి అన్నారు. ఐజయ్య వైఎస్సార్సీపీ నందికొట్కూరు అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమానికి గౌరు వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులనుద్దేశించి ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమం జగనన్నతోనే సాధ్యమవుతుందన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో గౌరు చరితారెడ్డి పాలనలో ఎత్తిపోతల పథకాలు మంజూరయ్యాయని ఆయన గుర్తుచేశారు. ఆ పథకాలను లబ్బి వెంకటస్వామి పూర్తి చేయలేక బురదజల్లే మాట లు మాట్లాడడం హస్యాస్పదంగా ఉందన్నారు. అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసే రకమని లబ్బిని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేగా పదవులను అలంకరించిన లబ్బికి సార్వత్రిక ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి బలపరిచిన అభ్యర్థి ఐజయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. వైఎస్సార్ ఆశయ సాధనకు కృషి చేస్తా : ఐజయ్య వైఎస్సార్ ఆశయ సాధనకు కృషి చేస్తానని వైఎస్సార్సీపీ అభ్యర్థి ఐజయ్య అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి పెండింగ్ ప్రాజెక్ట్‌లు, పనులు పూర్తి చేయిస్తామన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఐజయ్యను అఖండ మెజార్టీతో గెలిపించాలని పార్టీ నాయకుడు మాండ్ర శివానందరెడ్డి పిలుపునిచ్చారు. బ్రాహ్మణకొట్కూరు గ్రామానికి చెందిన లబ్బి వెంకటస్వామి ముఖ్య అనుచరుడు మద్దూరు నరహరిరెడ్డి గౌరు వెంకటరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.కార్యక్రమానికి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కస్వా శంకర్‌రెడ్డి, శ్రీనాథరెడ్డి, జిల్లా నాయకులు గౌరు మురళీధర్‌రెడ్డి, మాండ్ర ఉమ, నందికొట్కూరు, మిడుతూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, పాములపాడు, కొత్తపల్లి మండలాల కన్వీనర్లు అబ్దుల్ మునాఫ్, ఓబుల్‌రెడ్డి, పలుచాని మహేశ్వరరెడ్డి, పురుషోత్తంరెడ్డి, కాతా రమేష్‌రెడ్డి, గోవిందగౌడ్, పల్లె శివానందరెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్ మురళీమోహన్‌రెడ్డి, నాయకులు ఎల్.నరసింహారెడ్డి, శెట్టి వీరన్న, జయసింహారెడ్డి, తిమ్మారెడ్డి, లింగస్వామిగౌడ్, జయరామిరెడ్డి, బుడగజంగాల మధు తదితరులున్నారు. నామినేషన్ వేసిన ఐజయ్య నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఐజయ్య గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన జనసందోహం మధ్య ఆయన ర్యాలీగా తరలివచ్చి తహశీల్దార్ కార్యాలయంలో 11.40గంటలకు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి జయకుమార్‌కు అందజేశారు. ఆయనతో పాటు పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, నాయకులు మాండ్ర శివానందరెడ్డి తదితరులు ఉన్నారు. -
మూగనోము!
సాక్షి, కర్నూలు: పురపాలక సంఘాలు.. నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రచారానికి తెర పడింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయానికి మైకులన్నీ మూగబోయాయి. నాయకులు రహస్య భేటీలు.. చర్చల్లో తలమునకలవుతున్నారు. నగదు, వస్తువులు, మద్యం తదితరాల పంపిణీని గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేస్తున్నారు. పార్టీలోని అసంతృప్తి నేతలు.. ముఖ్య కార్యకర్తలను బుజ్జగించేందుకు చివరి ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలను బుట్టలో వేసుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. నంద్యాల, డోన్, ఆదోని, ఎమ్మిగనూరు పురపాలక సంఘాలు.. ఆళ్లగడ్డ, ఆత్మకూరు, బనగానపల్లె, నందికొట్కూరు, గూడూరు నగర పంచాయతీల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారంలో విస్తృతంగా పాల్గొనగా.. విభజన భయంతో కాంగ్రెస్, టీడీపీ నేతలు అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జిల్లాలో నాలుగు రోజుల పాటు చేపట్టిన ప్రచారం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. ఇదే సమయంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనకు.. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలను పోల్చి చూపడం ప్రజలను ఆలోచింపజేసింది. ప్రజల్లోకి వెళ్లలేకనే చంద్రబాబు కర్నూలు నగరంలో మాత్రమే ప్రజాగర్జన చేపట్టారనే చర్చ జరుగుతోంది. ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి.. ప్రచార కమిటీ సారథి, సినీ నటుడు చిరంజీవి గురువారం కర్నూలుకు వచ్చినా నాయకులు, శ్రేణుల్లో కనీస ఉత్సాహాన్ని నింపలేకపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీదారులు అంతంత మాత్రమే కావడం కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. బీజేపీ, సీపీఎం, సీపీఐ తమదైన శైలిలో ప్రచారం చేపట్టాయి. వైఎస్ఆర్సీపీ తరఫున నంద్యాలలో ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, నందికొట్కూరులో పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త గౌరు చరిత.. డోన్, ఆత్మకూరు, ఆదోని, గూడూరులో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు బుగ్గన రాజారెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, వై.సాయిప్రసాద్‌రెడ్డి, మణిగాంధీ తదితరులు విస్తృత ప్రచారం నిర్వహించారు. బనగానపల్లె నగర పంచాయతీ ఏర్పాటు నిబంధనలకు విరుద్ధమంటూ హైకోర్టు తీర్పునివ్వడంతో ఇక్కడ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకుండాపోయింది. ఇదిలాఉండగా టీడీపీలోకి విభజనకు కారణమైన కాంగ్రెస్ నేతలు చేరడంతో.. ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారోననే చర్చ జరుగుతోంది. ప్రలోభాలపర్వం ప్రచారపర్వం ముగియడంతో ప్రలోభాలకు తెరలేచింది. పోలింగ్‌కు ఒక్క రోజు మాత్రమే గడువు ఉండటంతో ఓటర్లను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కొన్ని మున్సిపాలిటీల్లో అభ్యర్థులు పోటీ పడి పంపకాలకు సిద్ధమయ్యారు. ఎమ్మిగనూరులో రియల్ఎస్టేట్ వ్యాపారులు బరిలో ఉండటంతో డబ్బు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఒక్కో ఓటుకు రూ.500 చొప్పున చెల్లించినట్లు తెలుస్తోం ది. డోన్ బరిలోని అభ్యర్థులు కొం దరు పరస్పర అవగాహనతో రూ.300 చొప్పున పంపిణీ చేసేందుకు ఒప్పందం చేసుకోవడం గమనార్హం. ఆత్మకూరులోనే ఇదే తంతు కొనసాగింది. ఆదోనిలో శుక్రవారం నలుగురు వ్యక్తులు ఓటర్లకు పంచుతున్న రూ.33వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల, బనగానపల్లెలో 16 మంది సారా విక్రేతలపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. -
వైఎస్సార్ హయాంలోనే ముస్లింల సంక్షేమం
నందికొట్కూరు, న్యూస్‌లైన్: దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ముస్లింల సంక్షేమం సాధ్యమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి అన్నారు. గురువారం నందికొట్కూరులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్ఆర్కే దక్కిందన్నారు. ముస్లిం పేద విద్యార్థుల కోసం స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను వర్తింపజేశారన్నారు. రానున్న అన్ని ఎన్నికల్లో ముస్లింలు ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వైఎస్ఆర్ హయాంలో అమలు చేసిన పథకాలన్నీ తిరిగి అమలు జరగాలంటే వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని పేర్కొన్నారు. హఫీజ్‌ఖాన్ ముస్లింలకు అందుబాటులో ఉండి సేవలందిస్తారని చెప్పారు. టీడీపీకి ఓటు వేస్తే బీజేపీని గెలిపించినట్లే : హఫీజ్‌ఖాన్ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసినట్లయితే అది పరోక్షంగా బీజేపీని గెలిపించినట్లేనని వైఎస్సార్సీపీ జిల్లా మైనార్టీసెల్ కన్వీనర్ హఫీజ్‌ఖాన్ అన్నారు. తాను వైఎస్ఆర్సీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. కొన్ని పత్రికలు పనిగట్టుకొని అవాస్తవాలను ప్రచురిస్తున్నాయని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి గౌరు సమక్షంలోనే పనిచేస్తున్నానన్నారు. జగన్మోహన్రెడ్డిని సీఎం చేసేందుకు తమవంతు కృషి చేస్తానని అన్నారు. టీడీపీ కాంగ్రెస్ పార్టీగా మారిందని ఆరోపించారు. టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేననే విషయాన్ని ముస్లింలు గుర్తించి వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంతియాజ్, అలీఖాన్, ఎండీ.బాషా, మాలిక్, నజీర్‌ఖాన్, అరిఫ్‌ఖాన్, రమణ, సోహైల్ తదితరులు ఉన్నారు. -
విజయవంతం వైఎస్ విజయమ్మ పర్యటన సక్సెస్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రచారం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. జిల్లాలో నాలుగు రోజుల పాటు సాగిన పర్యటన విజయవంతమైంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 20న అనంతపురం జిల్లా నుంచి నేరుగా బనగానపల్లెకు చేరుకున్న విజయమ్మ ఆళ్లగడ్డ, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు, డోన్, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపాలిటీల్లో పర్యటించారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి వస్తున్నారని తెలుసుకున్న ఆయా గ్రామాల ప్రజలు ప్రధాన రహదారుల వెంట బారులు తీరారు. అడుగడుగున పూల వర్షం కురిపించి అభిమానం చాటుకున్నారు. బహిరంగ సభలకు జనం పోటెత్తారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలను గెలుపొందించడం ద్వారా వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోగలిగితే వైఎస్ సువర్ణయుగం మళ్లీ చూడగలమన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ సంక్షేమ పాలనను.. చంద్రబాబు, కిరణ్‌ల ప్రజా వ్యతిరేక పాలనను కళ్లకు కట్టినట్లు వివరించడం ప్రజలను ఆలోచింపజేసింది. రాష్ట్రాన్ని ముక్కలు చేయడంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు తీసుకున్న నిర్ణయంపై విరుచుకుపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఈ మూడు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మొత్తంగా విజయమ్మ పర్యటన ప్రత్యర్థి పార్టీల నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. ఆమె ప్రసంగాలు తాజా మాజీ ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు పట్టించగా.. ఆయా ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపు నల్లేరు మీద నడకేననే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రచారం చేపట్టిన పలు మున్సిపాలిటీల్లో ప్రధానమైన నాయకులు పార్టీలో చేరడం శ్రేణులకు మరింత బలాన్నిస్తోంది. చివరి రోజు నాలుగు మున్సిపాలిటీల్లో ప్రచారం వైఎస్ విజయమ్మ చివరి రోజు ఆదివారం డోన్, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె ప్రచారానికి ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రోడ్‌షోలకు విశేష స్పందన లభించింది. డోన్ పట్టణంలో బహిరంగ సభకు ఇసుకేస్తే రాలనంత జనం పాల్గొన్నారు. గూడూరులో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మణిగాంధీ, ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో సభకు పల్లెల నుంచి ప్రజలు పోటెత్తారు. ఎమ్మిగనూరు, ఆదోనిలోనూ రోడ్‌షోలు, బహిరంగ సభల్లో విజయమ్మ ప్రసంగం ఆకట్టుకుంది. కార్యక్రమంలో పార్టీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుక, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, కొత్తకోట ప్రకాష్‌రెడ్డి.. డోన్, కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు బుగ్గన రాజేంధ్రనాథ్‌రెడ్డి, మణిగాంధీ, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, మంత్రాలయం నాయకుడు వై.ప్రదీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం ముగించుకున్న విజయమ్మ హైదరాబాద్‌కు బయలుదేరారు -
'ఆ హత్యకేసులో మాకెలాంటి సంబంధం లేదు'
కర్నూలు : నందికొట్కూరు మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ సాయిఈశ్వరుడు హత్యకేసుతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని బైరెడ్డి రాజశేఖరరెడ్డి సతీమణి బైరెడ్డి భారతి అన్నారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేకనే తన భర్తపై హత్యకేసు నమోదు చేశారని ఆమె మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. కాగా సాయి ఈశ్వరుడు హత్యకేసులో బైరెడ్డి రాజశేఖరరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 15న సాయి ఈశ్వరుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యపై 16వ తేదీన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక బైరెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన తన గన్మెన్లను వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాంతో బైరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు యాక్షన్ ప్రాంతంగా ముద్ర పడిన నందికొట్కూరు నియోజకవర్గంలో తమ ఆధిపత్యం చూపించుకునేందుకు ప్రత్యర్థులు నందికొట్కూరు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ సాయి ఈశ్వరుడిని అంతమొందించినట్లు తెలుస్తోంది.కొన్ని వ్యవహారాల్లో అంతర్గతంగా అడ్డుపడుతున్నాడనే కారణంతోపాటు తమ సత్తాను చాటుకునేందుకు దారుణానికి పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెరైడ్డి రాశేఖరరెడ్డి ముఖ్య అనుచరుడుగా 1989 నుంచి 2002 వరకు కొనసాగిన సాయి ఈశ్వరుడిపై ముచ్చుమర్రి స్టేషన్లో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. సాయి ఈశ్వరుడు ఫ్యాక్షన్‌కు దూరంగా దశాబ్ద కాలంపాటు కర్నూలులోనే ఉంటూ ప్రశాంత జీవితం గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన హత్యకు గురికావడం జిల్లా వ్యాప్తంగా సంచలనమైంది. ఎన్నికల వేళ ఫ్యాక్షన్ హత్యతో స్థానిక నాయకులు వణికిపోతున్నారు. పదేళ్లుగా ఒక్కొక్కరు ఫ్యాక్షన్ రక్కసి నుంచి బయటపడిన నాయకులు ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో ఈ హత్యతో బరిలో నిలిచేందుకు కూడా జంకుతున్నారు. మరో వైపు గతంలో తమపై ఉన్న పాత కేసులు తవ్వుతారేమోనని భయాందోళన చెందుతున్నారు. -
పదేళ్ల పగ
ఫ్యాక్షన్ ప్రాంతంగా ముద్ర పడిన నందికొట్కూరు నియోజకవర్గంలో తమ ఆధిపత్యం చూపించుకునేందుకు ప్రత్యర్థులు నందికొట్కూరు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ సాయి ఈశ్వరుడిని అంతమొందించినట్లు తెలుస్తోంది. కొన్ని వ్యవహారాల్లో అంతర్గతంగా అడ్డుపడుతున్నాడనే కారణంతోపాటు తమ సత్తాను చాటుకునేందుకు దారుణానికి పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెరైడ్డి రాశేఖరరెడ్డి ముఖ్య అనుచరుడుగా 1989 నుంచి 2002 వరకు కొనసాగిన సాయి ఈశ్వరుడిపై ముచ్చుమర్రి స్టేషన్లో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అతని ఎదుగుదలను ఓర్వలేని కొందరుగతంలో దాడి చేయించి కొనప్రాణంతో వదిలివేశారు. అనంతరం అతని ఇంటి పైకప్పును పెకలించి ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఆ ఇంటి మొండి గోడలు ఆ సంఘటనకు సాక్ష్యాలుగా మిగిలి ఉన్నాయి. ఆయన ఫ్యాక్షన్‌కు దూరంగా దశాబ్ద కాలంపాటు కర్నూలులోనే ఉంటూ ప్రశాంత జీవితం గడుపుతున్నారు. ఈ క్రమంలో హత్యకు గురికావడం జిల్లా వ్యాప్తంగా సంచలనమైంది. ఎన్నికల వేళ ఫ్యాక్షన్ హత్యతో స్థానిక నాయకులు వణికిపోతున్నారు. పదేళ్లుగా ఒక్కొక్కరు ఫ్యాక్షన్ రక్కసి నుంచి బయటపడిన నాయకులు ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో ఈ హత్యతో బరిలో నిలిచేందుకు కూడా జంకుతున్నారు. మరో వైపు గతంలో తమపై ఉన్న పాత కేసులు తవ్వుతారేమోనని భయాందోళన చెందుతున్నారు. అంతా నిశ్శబ్దం : సాయి ఈశ్వరుడు హత్యోదంతంతో ముచ్చుమర్రిలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. గ్రామంలో ప్రజలు మరొకరితో మాట్లాడేందుకు కూడా భయపడుతున్నారు. హత్య జరిగిన స్థలంలో లభించిన సెల్‌ఫోన్ గ్రామానికి చెందిన చికెన్ బాషదిగా వెలుగు చూడటంతో బెరైడ్డి సిద్ధార్థరెడ్డి ముఖ్య అనుచరులు అజ్ఞాతంలోకి వెళ్లారు. స్పెషల్ పార్టీ పోలీసు బలగాలు ముచ్చుమర్రిలోని ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నాయి. ఉదయం నుంచి గ్రామంలో కవాతు చేస్తూ ప్రజలు గుంపులుగా లేకుండా చెదరగొడుతున్నాయి. హత్య స్థలంలో దొరికిన సెల్‌ఫోన్ ఆధారంగా పోలీసులు గ్రామంలో అనుమానితులుగా శ్రీనివాసరెడ్డిని విచారించారు. బెరైడ్డి సిద్ధార్థరెడ్డి కారు డ్రైవర్ హరినాథ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన వెంటనే దుండగులు ఓ ఆటోలో పారిపోగా ఆ ఆటో డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు. ఆత్మకూరు డీఎస్పీ నరసింహారెడ్డి ఆదివారం ముచ్చుమర్రిని సందర్శించారు. గ్రామంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని స్పెషల్ పార్టీ బలగాలను ఆయన ఆదేశించారు. -
ఉలిక్కిపడ్డ ముచ్చుమర్రి
నందికొట్కూరు మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ దారుణ హత్య పదేళ్లుగా కర్నూలులోనే నివాసం కాపుకాసి కడతేర్చిన ప్రత్యర్థులు మృతుడు గతంలో బెరైడ్డి ప్రధాన అనుచరుడు హత్యతో నిర్మానుష్యమైన గ్రామం జూపాడుబంగ్లా/పగిడ్యాల న్యూస్‌లైన్: నందికొట్కూరు మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ సాయిఈశ్వరుడుక(55) హత్యోదంతంతో ఆయన స్వగ్రామమైన ముచ్చుమర్రి ఉలిక్కిపడింది. శని వారం సాయంత్రం కర్నూలు నగరం రెవెన్యూ కాలనీలోని ఇంటి నుంచి శకుంతల కల్యాణ మం డపం వద్దకు నడుచుకుంటూ వస్తుండగా కాపుకాసిన ప్రత్యర్థులు వేటకొడవళ్లు, గండ్ర గొడ్డళ్లతో దారుణంగా నరికి చంపారు. తెలుగు మల్లమ్మ, బాలన్న దంపతులకు ఇద్దరు కుమార్తెలు, సాయి ఈశ్వరుడు సంతానం. గ్రామంలో వీరికి 10 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్న ఈశ్వరుడు కొంతకాలం గ్రామ డీలర్‌గా ఉన్నారు. ఇతనికి భార్యతో పాటు ఓ కుమార్తె, ఇరువురు కుమారులు సంతానం. 2002 సంవత్సరానికి ముందు ఈయన గ్రామంలో ఓ సామాన్య వ్యక్తి. గ్రామంలో ఆధిపత్య పోరుకు ఆకర్షితుడై 1989లో ప్రస్తుత రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి వర్గంలో చేరాడు. క్రమేణా ఆయనకు కుడిభుజంగా ఎదిగాడు. బెరైడ్డి శేషశయనారెడ్డితో తలెత్తిన మనస్పర్థలతో జూన్ 13, 2002న సాయి ఈశ్వరుడిపై జరిగిన దాడిలో ప్రాణాపాయం నుంచి త్రుటిలో బయటపడ్డాడు. అప్పట్లో బెరైడ్డి శేషశయనారెడ్డితో పాటు నాగరాజు, మద్దిలేటి, ఎలిమ క్రిష్ణయ్య, హనుమన్న, బోయ శివన్న, కుంటి రేవన్నలపై ముచ్చుమర్రి పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు నాలుగేళ్ల క్రితం కోర్టులో కొట్టేశారు. ఆ దాడి అనంతరం సాయి ఈశ్వరుడు గౌరు వర్గంలో చేరి ముచ్చుమర్రికి దూరంగా కర్నూలులోని రెవెన్యూ కాలనీలో నివాసం ఏర్పర్చుకున్నాడు. ఈ మార్పుతో గ్రామంలోని ఆయన ఇంటిని ప్రత్యర్థులు ధ్వసం చేశారు. పదేళ్లుగా కర్నూలులో ఉంటున్న ఈయన తన పొలాన్ని రంగడు అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చాడు. కౌలుదారునిపైనా గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల దాడి చేసి గాయపర్చారు. బాధితుని ఫిర్యాదు మేరకు ముచ్చుమర్రి పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. 2004లో గౌరు వర్గంలో చేరిన సాయి ఈశ్వరుడు.. 2009 ఎన్నికల్లో లబ్బి వెంకటస్వామి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం ఆయన వెంట నడిచాడు. ఈ నేపథ్యంలో 2013లో నందికొట్కూరు మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ పదవిని దక్కించుకున్నాడు. ముఖ్యమైన పని ఉంటే తప్ప ఆయన నందికొట్కూరుకు వచ్చేవాడు కాదని తెలుస్తోంది. సాయి ఈశ్వరుడి హత్యతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని గ్రామస్తులు ఇళ్లలో నుంచి బయటకు రాకపోవడంతో వీధులన్నీ నిర్మానుష్యమయ్యాయి. ముందుజాగ్రత్తగా గ్రామంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
రైతుల కోసం దేనికైనా సిద్ధం
నందికొట్కూరుటౌన్/రూరల్, న్యూస్‌లైన్: కేసీ ఆయకట్టు రైతుల సంక్షేమం కోసం దేనికైనా సిద్ధమని నంద్యాల ఎమ్పీ ఎస్పీవై రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ఎమ్పీతో పాటు రైతులు మల్యాల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. కేసీకి సకాలంలో నీరు విడుదల కాని పక్షంలో హంద్రీనీవా కాల్వ నుంచి మళ్లించే విషయమై చర్చించారు. రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో హంద్రీనీవాకు నీటి పంపింగ్‌ను అధికారులు నిలిపివేశారు. ఈ సందర్భంగా కొందరు రైతులు కాల్వకు గండి కొట్టి పైపుల ద్వారా నీరు ఇవ్వాలని పట్టుబడటంతో ఎమ్పీ వారిని వారించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుంకేసుల నుంచి శనివారం 15 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని, ఇప్పటికే కర్నూలు దాటి ఉంటాయన్నారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు 10 రోజులకు ఒక్కసారి నీటిని విడుదల చేస్తే రైతుల పంటలు దాదాపు చేతికి అందుతాయన్నారు. ఆతర్వాత మార్చిలో 1 టీఎంసీ నీరు అవసరం ఉంటుందని, ప్రభుత్వంతో పోరాడి విడుదల చేయిస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. ఒక వేళ నీరు రాకపోతే హంద్రీకాల్వ గురించి ఆలోచన చేద్దామన్నారు. కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలో ఆరుతడి పంటలు సాగు చేయాలని, నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులు సకాలంలో పూర్తయింటే రైతులు సాగునీటి కష్టాలు తప్పేవన్నారు. తమ పొలాలకు నీరివ్వకుండా అనంతపురానికి తరలిస్తే సహించేది లేదని రైతులు నినాదాలు చేశారు. ఎమ్పీ వెంట పాటు కేడీసీపీ మాజీ చైర్మన్ కాతా అంకిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రచార కన్వీనర్ ఐజయ్య, నాయకులు మాండ్ర శివానందరెడ్డి, బండి జయరాజు, పిడతల దేవరాజు, కట్టమంచి జనార్దనరెడ్డి ఉన్నారు. పోలీసుల బందోబస్తు: హంద్రీనీవా కాల్వకు గండి కొట్టి కేసీకీ నీటిని మళ్లిస్తామని ముందు నుంచి రైతులు చెబుతుడటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్పీతో పాటు భారీగా రైతులు మల్యాల ఎత్తిపోతల పథకానికి చేరుకున్నట్లు సమాచారం అందుకున్న ట్రైనింగ్ డీఎస్పీ నర్మద, ఎస్ఐ గంగానాథ్బాబు, 15 పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అధికారులతో మాట్లాడి సమస్యను సామరష్యంగా పరిష్కరించుకోవాలని రైతులకు సూచించారు. -
మళ్లీ లిల్లీపుట్స్ పుకారు
నందికొట్కూరుటౌన్, న్యూస్‌లైన్: లిల్లీపుట్స్ ఉన్నారనే పుకారులు మంగళవారం కూడా షికార్లు చేశాయి. దీంతో నందికొట్కూరులోని వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో కాలేజీ సమీపంలోని ఖాళీ ప్రదేశానికి వచ్చారు. అక్కడ ఏమీ కనిపించకపోవడంతో నిరాశతో వెనుతిరిగి పోయారు. అయితే వీరిని అదుపు చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. లిల్లీపుట్స్ ఉన్నాయన్నదే పుకార్లు మాత్రమేనని వారికి నచ్చచెప్పి పోలీసులు పంపించారు. -
నందికొట్కూరులో లిల్లీపుట్స్
కర్నూలు(విద్య)/నందికొట్కూరుటౌన్, న్యూస్‌లైన్:బాలీవుడ్ నటుడు హృతిక్‌రోషన్ నటించిన సినిమా ‘కోయి మిల్ గయా’ లాంటి కథ నందికొట్కూరులో నడిచింది. ఈ సినిమాలో ఒక పిల్ల గ్రహాంతర జీవి తప్పిపోయి భూమిపైకి చేరుతుంది. ఆ జీవి బుద్ధిమాంద్యం కలిగిన హీరో హృతిక్‌రోషన్‌కు కనిపిస్తుంది. దానిని అతను ఇంట్లో జాగ్రత్తగా దాచిపెట్టి, ప్రతిరోజూ ఆడుకుంటాడు. తనతో పాటు స్నేహితులకూ చూపి కలిసి ఆడుకుని తద్వారా అపారశక్తిని సంపాదిస్తాడు. భైరవద్వీపం సినిమాలోని ఒక పాటలో బాలకృష్ణ పైకి పది అంగుళాలు ఉండే లిల్లీపుట్(మరుగుజ్జు)లు ఎక్కి, దిగడం చేస్తుంటారు. ఇలాంటి జీవులు, లిల్లీపుట్ లాంటి పది అంగుళాల మనుషులు అక్కడి చిన్నారులకు కనిపించారట. ఈ ప్రచారం ఊరంతా పాకడంతో అక్కడ సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు హడావుడి ఏర్పడింది. గ్రహాంతర వాసులు కనిపించారంటూ నగరంలో విస్తృతంగా ప్రచారం జరగడంతో జనంలో ఒకింత ఆశ్చర్యం, మరికొంత భయాందోళన నెలకొంది. నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ రోడ్డులోని శ్రీ వాణి స్కూల్‌కు చెందిన కొందరు విద్యార్థులు పాఠశాల వెనుకవైపు ముళ్లకంప వద్దకు మూత్రవిసర్జనకు వెళ్లారు. అదే సమయంలో పది అంగుళాల ఎత్తు ఉండే వింత జీవులు వారికి కనిపించాయట. విద్యార్థులను చూసి అవి పక్కనే ఉన్న పాఠశాల ప్రహరీ సందుల్లోకి వెళ్లిపోయాయట. వెంటనే ఆ పిల్లలు ఘటనను పాఠశాల ఉపాధ్యాయులకు వివరించారు. ఉపాధ్యాయులు ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. వారు చెప్పిన తీరుపై నమ్మకం కలగడంతో పాఠశాల యాజమాన్యానికి, పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులకు సమాచారమందించారు. అంతే.. నందికొట్కూరుకు గ్రహాంతర వాసులు వచ్చారన్న వార్త నిమిషాల్లో దావానలంలా పాకింది. సాయంత్రం 6 గంటల సమయానికి ఆ ప్రాంతంలో వందల మంది గుమిగూడారు. కొందరు యువకులు ఒకింత సాహసం చేసి విద్యార్థులు చెప్పిన చోటుకు వెళ్లి పరిశీలించారు. గోడలో ఏమైనా గ్రహాంతర వాసులు దాక్కున్నారేమోనని ఒక్కో రాయిని మెల్లగా కదిలించి చూశారు. ఇలా కొందరు యువకులు రావడం.. రాళ్లను కదిలించిఏమీ లేదని చెప్పడం, మరికొందరు రావడం ఇంకొన్ని రాళ్లను పెకిలించడం రాత్రి వరకు జరిగింది. రాత్రి పొద్దుపోయే వరకు ఆ ప్రాంతానికి నందికొట్కూరులోని ప్రజలు వస్తూనే ఉన్నారు. గ్రహాంతరవాసులకు సంబంధించిన సినిమాలు పిల్లలు చూసి, వాటి గురించే ఆలోచించడం వల్ల ఇలాంటి భ్రమలు కలుగుతుంటాయని స్థానికులు చర్చించుకున్నారు.