కర్నూలు జిల్లా నందికొట్కూరులో మంగళవారం కుక్కలు స్వైర విహారం చేశాయి.
కర్నూలు : కర్నూలు జిల్లా నందికొట్కూరులో మంగళవారం కుక్కలు స్వైర విహారం చేశాయి. రహదారిపై నిలుచున్న రెండేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేసి... తీవ్రంగా గాయపరిచాయి. దాంతో అతడి తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సదరు బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో నందికొట్కూరులో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దాంతో స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.