కుక్క పగబడితే ఇలా ఉంటుందా.. వైరల్ | Pit Bull Dog Attack On Boy In Delhi | Sakshi
Sakshi News home page

కుక్క పగబడితే ఇలా ఉంటుందా.. వైరల్

Published Mon, Apr 2 2018 12:06 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

Pit Bull Dog Attack On Boy In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నాకు కోపం వస్తే మనిషిని కాదు అంటుంటాం కదా​... మరి కుక్కకు కోపం వస్తే ఏమౌతుంది. మామూలు వీధికుక్క కరవడానికొస్తే రెండు దెబ్బలు కొడితే పారిపోతుంది. కానీ బలిష్టమైన పిట్‌ బుల్‌ డాగ్‌ పగబట్టినట్లు మీదకు దూకితే ఏమవుతుంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఢిల్లీలోని ఉత్తమ్‌ నగర్‌లో జరిగిన ఈ ఘటనను చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

ఆ కుక్క మొదట ఇంటి బయట కూర్చున్న పిల్లల వైపుగా దూసుకొచ్చింది. అక్కడున్న ఓ అబ్బాయిపై పగపట్టినట్లుగా దాడి చేసి కరవటం మొదలెట్టింది. ఓ మహిళ శాయశక్తులా విడిపించేందుకు యత్నించినా కుక్క వదిలి పెట్టలేదు. మరో మహిళ పెద్ద కర్రతో కొట్టి కుక్కను తరమాలనుకుంది. కర్రతో పలుమార్లు కుక్కను కొట్టి విడిపించే యత్నం చేసింది. ఈ క్రమంలో ఆ దెబ్బలు కుక్కకు కాకుండా ఆ అబ్బాయికే ఎక్కువగా తగిలాయి పాపం. దాడి గమనించిన మరోవ్యక్తి కుర్చీతో గట్టిగా కొట్టడంతో అబ్బాయిని వదిలిపెట్టింది. కానీ తనను కుర్చీతో కొట్టిన వ్యక్తిని కరించేందుకు వెంబడించింది. ఏమైందో ఏమో మళ్లీ తిరిగొచ్చిన కుక్క ఆ అబ్బాయిని మరోసారి కరిచేందుకు వెంబడించింది. కుక్క పగబడితే ఇలాగే ఉంటుందేమోనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement