భౌపెడుతున్నాయి
అల్లిపురం: కుక్కలు రెచ్చిపోతున్నాయి. మంగళవారం ఉదయం సౌత్‌జైలురోడ్డులో విధులకు వెళుతున్న ఓ వ్యక్తిపై దాడి చేశాయి. స్థానికులు స్పందించి అతనిని కేజీహెచ్‌కు తరలించారు. చికెన్ సెంటర్ల నిర్వాహకులు వ్యర్థాలను కాలువల్లో పడేయటంతో వాటి కోసం కుక్కలు ఎగబడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రోడ్డు మీద నడవలేకున్నాం..
ఎక్కడ పడితే ఆక్కడ కుక్కలు గుంపులు, గుంపులుగా తిరుగుతున్నాయి. ఒంటరిగా వెళ్లేవారిపై దాడులు చేస్తున్నాయి. చాలా భయంగా ఉంది. జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలి.
–పిల్లా జగదీశ్వరరావు, బాధితుడు, అమ్మవారివీధి