పిచ్చికుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి | in dogs attack 15 sheeps dead | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి

Published Mon, Aug 15 2016 1:17 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

పిచ్చికుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి - Sakshi

పిచ్చికుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి

నడిగూడెం: పిచ్చికుక్కలు దాడి చేయడంతో 15 గొర్రెలు మృత్యువాత పడ్డ సంఘటన ఆదివారం తెల్లవారుజామున మండల కేంద్రంలో జరిగింది.  గుండెబోయిన బజారుకు చెందిన పశువుల కొట్టంలో తెల్లవారు జామున మూకుమ్మడిగా కుక్కలు గుంపుగా వచ్చి  గొర్రెలపై దాడి చేయడంతో అక్కడిక్కడే 15 గొర్రెలు మృతిచెందాయి. వాటి విలువ దాదాపు లక్షన్నర రూపాయలకు పైగా ఉంటుందని బాధితుడు తెలిపారు. తమ గొర్రెలు మృత్యువాత పడడంతో బజారు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై విలపించారు. మండల కేంద్రంలో గత కొద్ది రోజులుగా పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నా సంబంధిత గ్రామపంచాయతి సిబ్బంది పట్టించుకోవడంలేదని స్థానికులు పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement