పెళ్లి కూతురుకు కరోనా, పెళ్లి వాయిదా | Marriage postpones after bride tests positive for coronavirus in Kurnool District | Sakshi
Sakshi News home page

పెళ్లి కూతురుకు కరోనా, పెళ్లి వాయిదా

Published Sun, Jul 26 2020 9:17 AM | Last Updated on Sun, Jul 26 2020 12:15 PM

Marriage postpones after bride tests positive for coronavirus in Kurnool District - Sakshi

సాక్షి, కర్నూలు: అయితే ఆ ఇంట్లో వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. తెల్లారితే పెళ్లి వేడుకలు జరగాల్సి ఉంది. అంతలోనే పెళ్లి కూమార్తెకు కరోనా పాజిటివ్‌ అని రిపోర్టు రావడంతో... దీంతో చేసేదేమీ లేక వివాహం వాయిదా వేసుకోవాల్సిన  వచ్చింది ఈ సంఘటన కర్నూలు జిల్లా నందికొట్కూరులోనూ చోటుచేసుకుంది. (పెళ్లింట్లో కరోనా కలకలం..)

వివరాల్లోకి వెళితే నందికొట్కూరు పట్టణానికి చెందిన చెంచు కాలనీకి చెందిన ఓ యువతకి వివాహం నిశ్చయమైంది. 25న ముహూర్తం, 26న తలంబ్రాలు పెట్టుకున్నారు. అయితే కోవిడ్‌-19 నిబంధనల ప్రకారం పెళ్లికి మూడు రోజుల ముందు వధూవరులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. శనివారం ఉదయం పెళ్లి కూతురికి పాజిటివ్‌ అని నివేదిక రావడంతో అధికారులు హుటాహుటీన ఆ యువతి ఇంటికి చేరుకుని విషయం చెప్పారు. అధికారుల సూచన మేరకు ఇరు కుటుంబాలు మాట్లాడుకుని పెళ్లి వాయిదా వేసుకున్నారు. మరోవైపు నందికొట్కూరులో కరోనా విజృంభించింది. ఈ నెల 22న కోటా హైస్కూల్‌ వద్ద 378మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, వందమందికి పాజిటివ్‌ వచ్చింది. (రోనా అంతానికి నుమాన్ చాలీసా..)

ఇలాంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. కొత్తపేటకు చెందిన  పెళ్లి కుమారుడికి కరోనా పాజటివ్‌ అని నిర్ధారణ కావడంతో పెళ్లి వాయిదా పడింది. పెండ్లి తంతులో భాగంగా గురువారం పెండ్లి కుమారుడిని చేయగా అదే రోజు టెస్ట్‌ రిపోర్టు పాజిటివ్‌గా  రావడంతో పెళ్లి నిలిచిపోయింది. (పెళ్లింట్లో కరోనా కలకలం..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement