కర్నూలు కల్చరల్: ముంబైలోని ప్రఖ్యాత టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్‌ఎస్)లోని స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ లేబర్ స్టడీస్ వారి హ్యూమన్ రీసోర్సెస్ మేనేజ్ మెంట్ అండ్ లేబర్ రిలేషన్స్ (హెచ్‌ఆర్‌ఎంఎల్‌ఆర్)లో జిల్లాకు చెందిన తొగురు సిరి సింధూర సీటు సాధించారు. 1936లో స్థాపింపచబడిన టీఐఎస్‌ఎస్ ఆసియాలోనే సామాజిక స్పృహ (సోషల్ సెన్సిటివిటి)తో కూడిన ప్రొఫెషనల్ కోర్సెస్ అందించే ఉన్నత విశ్వవిద్యాలయం.
ప్రతి సంవత్సరం 40 వేల మంది టీఐఎస్‌ఎస్‌లోని నాలుగు క్యాంపస్‌ల్లో చేరడానికి దరఖాస్తు చేసుకుంటారు. ఇందులో కేవలం 68 మంది మాత్రమే హెచ్‌ఆర్‌ఎంఎల్‌ఆర్ ప్రోగ్రాంకు ఎంపికవువుతారు. ఇందులో జిల్లాకు చెందిన సిరి సింధూర ఎంపిక కావడం గర్వకారణం.
నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ కుమార్తె అయిన ఈమె కర్నూలు ఎన్నార్ పేట సెయింట్ జోషప్ పాఠశాలలో పాఠశాల విద్య, హైదరాబాద్ కూకట్ పల్లి నారాయణ కళాశాలలో ఇంటర్ చదివారు. 2015లో ఐఐటీ గౌహతిలో బీఈ (బ్యాచిలర్ ఆఫ్ డిజైన్) పూర్తి చేశారు. ఇగ్నోలో ఎంఏ సోషియాలజీ పూర్తి చేశారు. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న సిరి సింధూర టీఐఎస్‌ఎస్‌కు ఎంపిక కావడంపై ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment