లిల్లీపుట్స్ ఉన్నారనే పుకారులు మంగళవారం కూడా షికార్లు చేశాయి. దీంతో నందికొట్కూరులోని వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో కాలేజీ సమీపంలోని ఖాళీ ప్రదేశానికి వచ్చారు.
నందికొట్కూరుటౌన్, న్యూస్‌లైన్: లిల్లీపుట్స్ ఉన్నారనే పుకారులు మంగళవారం కూడా షికార్లు చేశాయి. దీంతో నందికొట్కూరులోని వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో కాలేజీ సమీపంలోని ఖాళీ ప్రదేశానికి వచ్చారు. అక్కడ ఏమీ కనిపించకపోవడంతో నిరాశతో వెనుతిరిగి పోయారు. అయితే వీరిని అదుపు చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. లిల్లీపుట్స్ ఉన్నాయన్నదే పుకార్లు మాత్రమేనని వారికి నచ్చచెప్పి పోలీసులు పంపించారు.