భవిష్యత్ తరాల కోసం ఆర్టీసీని కాపాడేందుకు వైఎస్సార్సీపీ ఉద్యమం చేపడుతుందని వైఎస్సార్‌సీపీ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.
నందికొట్కూరు (కర్నూలు) : భవిష్యత్ తరాల కోసం ఆర్టీసీని కాపాడేందుకు వైఎస్సార్సీపీ ఉద్యమం చేపడుతుందని వైఎస్సార్‌సీపీ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐలయ్య స్వగృహంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆరోపించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.