ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్నారు
మా ఇంటి ముంగిటకే సీఎం జగన్ పింఛన్ అందిస్తున్నారు. నెలకు రూ.1000 మాత్రమే చంద్రబాబు ఇస్తే సీఎం జగన్ రూ.3 వేలు ఇస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగనన్నకే మా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. – మేకా శ్రీనివాస్, బుద్దాలపాలెం, మచిలీపట్నం
జగనన్న మేలు మరువలేం
సీఎం వైఎస్ జగన్ మేలు మరువలేం. గతంలో ఎన్నడూ లేని విధంగా రేషన్ బియ్యం, ఒకటో తేదీనే పింఛన్లు వలంటీర్లు ఇంటివద్దకే వచ్చి అందిస్తున్నారు. పేద ప్రజలకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది? గ్రామ సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలు ఇంటికే పంపిస్తున్నారు. – ఎం.కృష్ణారెడ్డి, డీఎన్ పాలెం, రంపచోడవరం
జగనన్నకే మా మద్దతు
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేశారు. 99 శాతం హామీలు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రీ నెరవేర్చిన దాఖలాలు లేవు. 86 శాతం ప్రజలకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తోంది. మేనిఫెస్టోను వెబ్‌సైట్‌లో నుంచి తొలగించిన ప్రబుద్ధులు కూడా ఉన్నారు. వారు ప్రజల్లోకి ఎలా వెళ్లగలుగుతారు? – కరుటూరి ఉమాదేవి, తణుకు
ముఖ్యమంత్రి సేవలు శ్లాఘనీయం
సీఎం జగన్ సేవలు అద్భుతంగా ఉన్నాయి. సంక్షేమ పథకాల ద్వారా రూ.2.5 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లోకి వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన దాఖలాలు లేవు. గతంలో నగదు అంతా ఏమైందో ప్రజలు ఆలోచించాలి. చంద్రబాబు దీనికి బదులు చెప్పాలి. – కంభం రాణి అయ్యంకి, పామర్రు నియోజకవర్గం
డ్వాక్రా రుణాలు మాఫీ చేశారు
డ్వాక్రా రుణాలు మాఫీ చేసి సీఎం మహిళలకు చేయూత అందిస్తున్నారు. ఒక్కొక్క మహిళకు రూ.5 వేల నుంచి రూ. లక్ష వరకు రుణాల మాఫీ జరిగింది. వైఎస్సార్ చేయూత ద్వారా మరో రూ.18,750 అందించి మహిళలకు ఆసరాగా నిలుస్తున్నారు. గతంలో చంద్రబాబు పసుపు–కుంకుమ పేరుతో మోసం చేశాడు.
– ఉడతా రమణ, చిన్నాయగూడెం, గోపాలపురం నియోజకవర్గం
రైతులను ఆదుకుంటున్నారు
గ్రామాల్లో సుమారు రూ.1 కోటి వ్యయంతో గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, బల్క్ మిల్క్ సెంటర్లు, వెల్ నెస్ సెంటర్లు నిర్మించారు. రైతులకు అందుబాటులో ఎరువులు, సబ్సిడీ విత్తనాలు, యంత్రాలు, పనిముట్లు, ట్రాక్టర్లు సబ్సిడీపై అందిస్తున్నారు. గ్రామాల్లోనే ఆధునిక వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చారు.
– జి.ముసలయ్య, బావయ్యపాలెం, ఉంగుటూరు
అర్హులైన పేదవారందరికీ ఇళ్ల స్థలాలు అందించారు
భారత దేశ చర్రితలో కనీవినీ ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అర్హులైన పేదవారందరికీ 33 లక్షల ఇళ్ల స్థలాలు అందించారు. గత పాలకులు ఎవరూ భూమి కొని ఇళ్ల స్థలాలు అందించిన దాఖలాలు లేవు. పేదవానికి ఇంటి స్థలం, నిర్మాణానికి రుణం అందించారు. విద్యుత్, రోడ్లు, నీటి సౌకర్యంతో మరో ఊరు నిర్మాణం చేపడుతున్నారు. – కాటి నాగరాజు, ఉప సర్పంచ్, అప్పాపురం, మండవల్లి, కైకలూరు
ప్రతిపక్షాల మాటలు నమ్మం
జగనన్న సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు రాష్ట్రం శ్రీలంకలా అయిపోతుందని ప్రతిపక్ష నాయకులు ప్రచారం చేశారు. ఇప్పడు అవే పథకాలు ఇస్తానని చెబుతున్న చంద్రబాబు.. మరి ఇప్పుడు సింగపూర్ అవుతుందా అనే ప్రశ్నకు జవాబివ్వాలి. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రతిపక్షాల మాటలు నమ్మం. – బొజ్జా రామకృష్ణ సోమేశ్వరరావు, అచ్యుతాపురం, మండపేట నియోజకవర్గం
నమ్మకానికి ప్రతీక జగన్
సీఎం వైఎస్ జగన్ దూరదృష్టితో ప్రజలు, రాష్ట్రం బాగు కోసం శ్రమిస్తారు. చంద్రబాబు కేవలం వ్యాపార దృక్పథంతో పాలన చేస్తారు. జగన్ నమ్మకానికి ప్రతీక. రాష్ట్ర ప్రజలంతా ఏకపక్షంగా ఆయన్ని మరోసారి ముఖ్యమంత్రిని చేయడం ఖాయం. 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించి చరిత్ర సృష్టిస్తారు. – ఘంటా శ్రీలక్ష్మి, ఎంపీపీ, ఉంగుటూరు
యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు
గ్రామ సచివాలయాల ద్వారా 2.30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఏకైక సీఎం జగన్ మాత్రమే. వైద్య ఆరోగ్య శాఖలో వేలాది మందికి ఉపాధి కల్పించారు. వలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వీరు కరోనా సమయంలో ప్రజలకు బాసటగా నిలిచారు. – వై.నర్సింహారావు, పెదపాడు, దెందులూరు నియోజకవర్గం
మరింత అభివృద్ధి
కరోనా ప్రభావం లేకపోయినా, రాష్ట్రం విడిపోకపోయినా ఏపీ ఎంతో అభివృద్ధి జరిగేది. ప్రత్యేక పరిస్థితుల్లో సీఎం జగన్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రం విడిపోయి కేంద్రం ఆర్థికంగా మద్దతు ఇవ్వకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిలుపు చేయలేదు. యథావిధిగా కొనసాగించారు.
– ఇళ్ల సాయిబాబా, పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా
ఏ ప్రాంతంలో చూసినా ఒకే తరహాలో ఆదరణ
సీఎం జగన్‌కు ఏ ప్రాంతంలో చూసినా ఒకే తరహాలో ఆదరణ లభిస్తుంది. తండ్రి బాటలో పయనిస్తూ ఇచ్చిన హామీని మాట తప్పకుండా అమలు చేస్తున్నారు. ఇక ప్రజలు ఏ రకంగా మరొక వ్యక్తికి అవకాశం ఇస్తారు? జగనే మరోసారి ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం. – కె.కృష్ణ, పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా
చంద్రబాబు ఇచ్చే హామీలు ఎవరూ నమ్మరు
ఎన్నికల ముందు చంద్రబాబు ఓట్ల కోసం ఇచ్చే హామీలను ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్ని సామాజిక వర్గాల ప్రజలకూ న్యాయం చేస్తున్నారు. ఎవరికి ఏ పథకం అవసరమో గతంలో నిర్వహించిన పాదయాత్రలోనే తెలుసుకున్నారు. సమ సమాజ స్థాపనే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పనిచేస్తోంది. – బాబూరావు, గన్నవరం, కృష్ణాజిల్లా
నూతన ఒరవడి సృష్టించారు
వైఎస్ జగన్ రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించారు. విద్యావంతులు, వివిధ రంగాల్లో నిష్ణాతులను ప్రజాప్రతినిధులుగా ఎంచుకున్న తీరే పాలనపై ఆయనకు ఉన్న ప్రణాళికను తెలి యజేసింది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతారు. – దేవబత్తుల శిరీష, ఉప్పులూరు, ఉండి నియోజకవర్గం
ఇంతకన్నా మార్పు ఏం కావాలి?
ఏ ముఖ్యమంత్రి హయాంలోనైనా ఎమ్మెల్యేలు ఇంటింటా తిరిగినా దాఖలాలు లేవు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఎమ్మెల్యేలు, మంత్రులను సైతం ఇంటింటికీ పంపారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తున్నారు. ఇంతకన్నా మార్పు ఏం కావాలి? – కె.రోజావాణి, పి.గన్నవరం, తూర్పుగోదావరి జిల్లా
నేరుగా నగదు బదిలీ
సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి నేటి వరకు ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేశారు. సంక్షేమం లబ్ధి అందని వారికి సైతం ఒకటికి, రెండు సార్లు అవకాశం కల్పించారు. ఇలాంటి సీఎం ఏ రాష్ట్రంలోనైనా ఉంటారా? – చిట్టూరి శివప్రసాద్, పి.గన్నవరం, తూర్పుగోదావరి జిల్లా
ప్రజలకు వారధిగా ప్రణాళిక
ప్రజలకు ప్రజాప్రతినిధులు వారధిగా ఉండేలా సీఎం ప్ర ణాళికను రూపొందించారు. తద్వారా రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టించారు. ప్రజలకు, అభివృద్ధి పనులకు మధ్య దళారీలు ఉండకుండా నగదు బదిలీని అమలు చేస్తున్నారు. – ఎన్.సూర్యకుమారి, ఉండి నియోజకవర్గం
Comments
Please login to add a commentAdd a comment