కర్నూలు : నందికొట్కూరు మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ సాయిఈశ్వరుడు హత్యకేసుతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని బైరెడ్డి రాజశేఖరరెడ్డి సతీమణి బైరెడ్డి భారతి అన్నారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేకనే తన భర్తపై హత్యకేసు నమోదు చేశారని ఆమె మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు.
కాగా సాయి ఈశ్వరుడు హత్యకేసులో బైరెడ్డి రాజశేఖరరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 15న సాయి ఈశ్వరుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యపై 16వ తేదీన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక బైరెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన తన గన్మెన్లను వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాంతో బైరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరోవైపు యాక్షన్ ప్రాంతంగా ముద్ర పడిన నందికొట్కూరు నియోజకవర్గంలో తమ ఆధిపత్యం చూపించుకునేందుకు ప్రత్యర్థులు నందికొట్కూరు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ సాయి ఈశ్వరుడిని అంతమొందించినట్లు తెలుస్తోంది.కొన్ని వ్యవహారాల్లో అంతర్గతంగా అడ్డుపడుతున్నాడనే కారణంతోపాటు తమ సత్తాను చాటుకునేందుకు దారుణానికి పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెరైడ్డి రాశేఖరరెడ్డి ముఖ్య అనుచరుడుగా 1989 నుంచి 2002 వరకు కొనసాగిన సాయి ఈశ్వరుడిపై ముచ్చుమర్రి స్టేషన్‌లో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
సాయి ఈశ్వరుడు ఫ్యాక్షన్‌కు దూరంగా దశాబ్ద కాలంపాటు కర్నూలులోనే ఉంటూ ప్రశాంత జీవితం గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన హత్యకు గురికావడం జిల్లా వ్యాప్తంగా సంచలనమైంది. ఎన్నికల వేళ ఫ్యాక్షన్ హత్యతో స్థానిక నాయకులు వణికిపోతున్నారు. పదేళ్లుగా ఒక్కొక్కరు ఫ్యాక్షన్ రక్కసి నుంచి బయటపడిన నాయకులు ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో ఈ హత్యతో బరిలో నిలిచేందుకు కూడా జంకుతున్నారు. మరో వైపు గతంలో తమపై ఉన్న పాత కేసులు తవ్వుతారేమోనని భయాందోళన చెందుతున్నారు.
'ఆ హత్యకేసులో మాకెలాంటి సంబంధం లేదు'
Published Tue, Mar 18 2014 2:20 PM | Last Updated on Sat, Sep 2 2017 4:52 AM
Advertisement
Advertisement