సాక్షి, నందికొట్కూరు : పట్టణానికి చెందిన నాగరాజు, లలితమ్మ కుమారుడు పాలిటెక్నిక్ పూర్తి చేసిన నవీన్(22) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ వెంకటరెడ్డి తెలిపిన వివరాలు.. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఇటీవల ఫైనలియర్ పరీక్షలు రాశాడు. ఉదయం తండ్రి కూరగాయలు విక్రయించేందుకు వెళ్లగా, తల్లి వైఎస్‌ఆర్ బీమా పథకంలో పని చేస్తుండడంతో విధులకు వెళ్లింది. సాయంత్రం తల్లి ఇంటికి చేరుకోగా కుమారుడు ఉరికి విగతజీవిగా వేలాడుతూ కనిపిండంతో బోరున విలపించింది. పోలీసులు అక్కడికి చేరుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటరెడ్డి తెలిపారు. చదవండి: ఫాతిమాగా తప్పిపోయి.. స్వప్నగా తిరిగొచ్చింది
Comments
Please login to add a commentAdd a comment