అప్పుడే పుట్టిన పసికందు గుర్తుతెలియని వ్యక్తులు కాలువలో పడేశారు. దీంతో చిన్నారి మృతిచెందాడు.
అప్పుడే పుట్టిన పసికందు గుర్తుతెలియని వ్యక్తులు కాలువలో పడేశారు. దీంతో చిన్నారి మృతిచెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం శికారిపేట వద్ద ఆదివారం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని కాలువలో అప్పుడే పుట్టిన బాబును వదిలి వెళ్లడంతో.. బాబు మృతిచెందాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి శిశువు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.