babe
-
పసికందును లాలించిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, తిరుపతి: శ్రీ పద్మావతి చిల్డ్రన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం భూమి పూజ చేశారు. అనంతరం శ్రీ పద్మావతి కార్డియాక్ ఆస్పత్రిలో చికిత్స పొందిన చిన్నారులు, వారి తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. ఓ పసికందును చేతిల్లోకి తీసుకుని ఆప్యాయంగా లాలించారు. చదవండి: చంద్రబాబు, ఎల్లోమీడియాపై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు.. అనంతరం టాటా ట్రస్ట్ సహకారంతో శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను సీఎం ప్రారంభించారు. టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.190 కోట్లతో 92 పడకల క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సంపూర్ణ సహకారం అందించింది. ఆస్పత్రి నిర్మాణానికి టీటీడీ అలిపిరి వద్ద 25 ఎకరాలు ఇచ్చింది. ఆస్పత్రి ప్రారంభంతో రాష్ట్రంలో క్యాన్సర్ రోగులకు తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో టాటా ట్రస్టు సౌజన్యంతో అలమేలు చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆసుపత్రిని శరవేగంగా నిర్మించారు. -
నడివీధిలో శైశవ గీతం!
మంటగలుస్తున్న మానవత్వం రోడ్డు పాలవుతున్న పసికందులు శిశువిహార్‌కి ఏటా వంద మందికి పైనే పదేళ్లలో 2346 మంది... సామాజిక-ఆర్థిక కారణాలే నేపథ్యంత పాపం, పుణ్యం, ప్రపంచమార్గం.. కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ.. ఏమీ ఎరుగని పూవుల్లారా,అరుుదారేడుల పాపల్లారా...తండ్రిసందిటా..తల్లి కౌగిటా ఉండాల్సిన..మీరు వీధి పాలవుతున్నారు... ఈ పాపం ఎవరిది..? ఈ అమానుషానికి అంతం ఎప్పుడు? ..మహానగరంలో మానవత్వం మంటగలుస్తోంది... పక్షానికో పసికందు రోడ్డు పాలవుతోంది...గడిచిన నెల రోజుల కాలంలోనే నలుగురు చిన్నారులు బోడ్డూడక ముందే పొత్తిళ్లకు దూరమై వార్తల్లోకి ఎక్కారు... వీరిని అక్కున చేర్చుకునే శిశువిహార్‌కు దశాబ్ద కాలంలో 2346 మంది చేరారు. వీరిలో బాలుర కంటే బాలికలే ఎక్కువగా ఉంటున్నారు. ఈ ఉదంతాల వెనుక సామాజిక, ఆర్థిక కారణాలు ఉన్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా వీధుల పాలవుతున్న వారిలో కొందరు బతికి బట్టకడుతుండగా... వీధి జంతువుల బారినపడి ప్రాణాలు వదులుతున్న సంఘటనలూ ఉన్నారుు. - సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో: నగరంలో వివిధ కారణాలతో రోడ్డు పాలవుతున్న పసిగుడ్డుల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువగా ఉంటున్నారు. ఆడపిల్ల అంటే చులకన భావన, భారం అనే ఉద్దేశం ఇప్పటికీ అనేక మందిలో ఉంది. కాస్త వైద్యపరమైన అవగాహన కలిగిన వారు గర్భస్థ దశలోనే స్కానింగ్ తదితరాలను ఆశ్రరుుంచడం ద్వారా పుట్టబోయేది ఎవరో తెలుసుకుంటున్నారు. ఇలాంటి పరీక్షలను ప్రభుత్వం నిషేధించిన ‘డిమాండ్’ను బట్టి జరుగుతూనే ఉన్నారుు. అలా పుట్టబోయే వారి వివరాలు తెలుసుకుంటున్న వారిలో అనేక మంది గర్భస్రావం వంటి వాటి వైపు మొగ్గుతూ భ్రూణ హత్యలు చేస్తున్నారు. ఇలాంటి పరిజ్ఞానం లేని దిగువ మధ్య తరగతి, కింది తరగతులకు చెందిన వారు బిడ్డ పుట్టే వరకు ఆగి ఆపై ఆడపిల్ల అరుుతే వీధుల పాలు చేస్తున్నారు. రోడ్డు పాలవుతున్న ఆడశిశువులతో పోలిస్తే మగ శిశువుల సంఖ్య 5 శాతం కూడా ఉండట్లేదు. కారణాలు అనేకం... మాతృత్వాన్ని మరిచి పుట్టిన బిడ్డల బొడ్డూడక ముందే నడిరోడ్డుపై వదిలేయడానికి అనేక కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. సామాజిక నేపథ్యం, ఆర్థిక కారణాలు, కుంటుంబ పరిస్థితులు వీటన్నింటి ప్రభావం ఉందని వివరిస్తున్నారు. ఆడపిల్లలను వదిలించుకోవాలనే భావన ప్రధాన కారణంగా ఉంది. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక, భార్యాభర్తల మధ్య స్పర్థలు, సక్రమంగా లేని కుటుంబ నేపథ్యాల కారణంగానూ మాతృత్వాన్ని మర్చిపోతున్నారు. దీనికి తోడు పుట్టిన బిడ్డలో వైకల్యాలు, గుండెకు రంధ్రం వంటి దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్నప్పుడూ వారిని వదిలించుకోవాలని చూస్తున్నట్లు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఫలానా బిడ్డ కావాలంటూ ఎదురు చూసిన తల్లిదండ్రులు ఆ ఫలితం లభించకపోరుునా వదిలించుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ సమస్య నగరాల కంటే దాని చుట్టుపక్కల విస్తరించి ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటోందని వివరిస్తున్నారు. అసాంఘికశక్తులుగా మారే ప్రమాదం... ఈ రకంగా వీధుల పాలవుతున్న శిశువులు పెరిగే కొద్దీ మానసికంగా ధ్వేషభావాన్ని పెంచుకునే అవకాశం ఉందని మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమాజంపై ఏహ్యభావం పెరగడం, ఆలనాపాలనా లేకపోవడం ఫలితంగా పెడదారులు పట్టి అసాంఘిక శక్తులుగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు. పెరిగే క్రమంలో ఎదుర్కొన్న అనుభవాల కారణంగా వీరిలో యాంటీ సోషల్ పర్సనాలిటీ డెవలప్ అవుతుందని, త్వరగా వ్యసనాలకు బానిసలు కావడంతో పాటు కరుడుగట్టిన వారిగానూ మారే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. ఇలా పసిగుడ్డులు రోడ్డు పాలు కావడంతో తల్లి తప్పు ఎంత ఉంటుందో... తండ్రి తప్పూ అదే స్థారుులో ఉంటుంది. శిశువిహార్‌కు 2346 మంది... నగరంతో పాటు శివారు జిల్లాల్లోనూ లభించే పసివాళ్లను సంరక్షణ నిమిత్తం అమీర్‌పేట ప్రాంతంలో ఉన్న శిశువిహార్‌కు పంపిస్తారు. ఈ కేంద్రానికి గడిచిన పదేళ్ళ కాలంలో 2346 మంది శిశువులు రాగా... వీరిలో 1720 మంది ఆడశిశువులే. స్పష్టంగా చూస్తే ఇక్కడా ‘వివక్ష’ కనిపిస్తోంది. ఆడపిల్లను స్వేచ్ఛగా బతకనీయలేని పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయని తెలుస్తోంది. ఈ కేంద్రం అధికారులు ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ఆడపిల్లలు కావడం, ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య స్పర్థల తదితర కారణాలతో రోడ్డు పాలైన శిశువులను అవసరమైన స్థారుులో సంరక్షిస్తాం. అర్హులను గుర్తించడం ద్వారా పదేళ్ళల్లో 1063 మందిని దత్తతిచ్చాం. మరో 229 మంది తల్లిదండ్రుల్ని గుర్తించి వారికి అప్పగించాం. ఇక్కడకు వచ్చిన శిశువుల్ని కంటికి రెప్పలా కాపాడటంతో పాటు వారి కాళ్ళపై వాళ్ళు నిలిచే వారకు తోడుగా ఉంటాం’ అని అన్నారు. అనేక సందర్భాల్లో పోలియోతో పాటు ఇతర వ్యాధులు సోకిన, అవయవాలు సరిగ్గా లేకండా పుట్టిన శిశువుల్ని ఇలా వదిలేయడం జరుగుతోందని అధికారులు చెప్తున్నారు. ఇవి హత్యలు కాదా? 19.04.2016: చిలకలగూడ ఠాణా పరిధిలోని మెట్టుగూడ ఆలుగడ్డ బావి నాలాలో నాలుగు రోజుల పసికందు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 16.05.2016: రెండు రోజుల వయస్సున్న ఆడ శిశువు మృతదేహాన్ని కవర్లో చుట్టి ఓ ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంక్ నుంచి ఎస్సార్‌నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్పెంటర్ శివ ఇచ్చిన సమాచారంతో ఇది వెలుగులోకి వచ్చింది. 04.07.2016: చిక్కడపల్లి ఠాణా పరిధిలోని హరినగర్‌లోని ఓ ఇంటి పై భాగంలో పడి ఉన్న ఆడ శిశువు మృతదేహాన్ని స్థానికుల సాయంతో పోలీసులు స్వాధీనం చేసకున్నారు. 6.10.2016: బాలానగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఐడీపీఎల్ కాలనీ వాటర్ ట్యాంక్ వద్ద పొదల్లో ఓ పసికందు ఏడుపు విని స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. అది వచ్చేసరికి శిశువు చనిపోరుుంది. వీటికి బాధ్యులెవరు? 18.05.2016:హుమాయున్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని కై లాష్ నగర్ వద్ద రోడ్డుపై వెళ్తున్న ఆటోలోంచి గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఆడ శిశువును గుడ్డల్లో చుట్టి పడేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు శిశువును ఆస్పత్రికి చేర్చారు. 07.08.2016: ఏడాదిన్నర వయస్సున్న ఓ పాపని గుర్తుతెలియని వ్యక్తులు గాంధీ ఆస్పత్రి వద్ద వదిలి వెళ్ళారు. వాహనాలు పార్క్ చేసే సెల్లార్లో ఈ పాపను గుర్తించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చి సమాచారం ఇచ్చాడు. పోలీయో సోకిందనే కారణంగానే పాపను వదిలినట్లు గుర్తించారు. 04.10.2016: హయత్‌నగర్ నుంచి కుంట్లూరు వెళ్ళే దారిలో పాపయ్య గూడ చౌరస్తా వద్ద చెట్ల పొదల్లో రెండు నెలల శిశువును పోలీసులు గుర్తించారు. పాప ఏడుపు విన్న స్థానికుల సమాచారంతో అక్కడకు వచ్చిన పోలీసులు శిశువును శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. 10.10.2016: పంజగుట్ట ఠాణా పరిధిలోని రాజ్‌భవన్ రోడ్డులోని అప్పయ్యగుడి వీధిలో ఓ చెత్తకుండీనే శిశువు పొత్తిళ్ళయ్యారుు. చెత్తకుప్ప సమీపంలో పసిగుడ్డు ఉండటాన్ని గుర్తించిన స్ధానికులు పోలీసులకు చెప్పడంతో వారు రెస్క్యూ చేశారు. అది నిర్ధారిస్తే నేరమే ‘పసివాళ్ళును ఇలా ఏలాంటి ఆధారం లేకుండా నిర్దాక్షణ్యంగా రోడ్లపై వదిలేయడం కూడా చట్ట ప్రకారం నేరమే. వీరితో పాటు వృద్ధుల కోసం కొన్నేళ్ళ క్రితం ప్రత్యేక చట్టం వచ్చింది. దీని ప్రకారం అలా అమానుషంగా వ్యవహరించే వారికి శిక్షించవచ్చు. అరుుతే ఇలాంటి కేసుల్లో ఆ శిశువుల్ని వదిలేసిన తల్లిదండ్రులు ఎవనేది గుర్తిచడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో ఈ చట్టం పూర్తిస్థారుులో అమలుకావట్లేదు. అవకాశం ఉన్నా అనేక సందర్భాల్లో విభాగాలు పట్టించుకోవట్లేదు.’ - రామకృష్ణ, మాజీ డీఎస్పీ -
ఏ తల్లి కన్నబిడ్డో..
వెల్దుర్తి: ముళ్లపొదల్లో పసికందును వదిలివెళ్లిన ఘటన మెదక్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వెల్దుర్తిలోని సెంట్రల్ బ్యాంకు వెనకాల చెట్లపొదల్లో గుర్తుతెలియని మహిళ పసికందును వదిలి వెళ్లింది. అక్కడి సమీపంలో పని చేస్తున్న కూలీలకు ముళ్లపొదల్లోంచి పసికందు ఏడుపు విని పించగా గమనించి పోలీసులకు సమాచారమిచ్చా రు. జెండర్ కమిటీ సభ్యురాలు ముక్తాబాయి, పోలీ సులు వచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ మల్లికార్జున్ , పీహెచ్ఎన్ మేరి శిరోమణి, స్టాఫ్ నర్స్ శిల్ప పాపను శుభ్రం చేసి, ఒంటికి గుచ్చుకున్న ముళ్లను తొలగించి వైద్యం చేశారు. ఆడ శిశువు ఆరోగ్యంగా ఉందని, కిలోంపావు బరువు ఉందని డాక్టర్ తెలిపారు. జిల్లా ఐసీడీఎస్ పీడీకి ముక్తాబాయి సమాచారం ఇవ్వడంతో సంగారెడ్డి శిశువిహార్‌కు తరలించాలని సూచించారు. అంగన్వాడీ కార్యకర్తలు దేవలత, మంజుల సంగారెడ్డికి పాపను తీసుకెళ్ళారు. -
మూసీలో పసికందు మృతదేహం
చాదర్‌ఘాట్: రెండు రోజుల పసికందు మృతదేహం మూసీలో లభ్యమైంది. చాదర్‌ఘాట్ ఎస్ఐ సాయికుమార్ కథనం ప్రకారం...వాహెద్‌నగర్ ప్రాంతంలోని మూసీకాలువలో సోమవారం మగశిశువు మృతదేహం పడి ఉండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు వెలికి తీయించి పోస్టుమార్టం కోసం తరలించారు. శిశువు చనిపోతే ఎవరైనా కాలువలో పడేశారా? లేక బతికుండగానే కావాలని నీటిలోకి విసిరేశా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డుప్రమాదంలో 5 నెలల బాలుడి మృతి
తూప్రాన్ మండలం బైపాస్ రోడ్డు మార్గంలో పెద్దచెరువుకట్ట సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న వారిని టిప్పర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 నెలల పసి బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. బాలుడి మేనమామ, అమ్మమ్మలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలుడి మృతితో ఇస్లాంపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నారు. -
చైన్ స్నాచర్ దాడిలో పసికందు మృతి
గొలుసు దొంగల దాడిలో గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతిచెందింది. నగరంలోని నేరెడ్మెట్ రామకృష్ణాపురంలో నివాసముంటున్న ఓ మహిళ ఇంటి ముందు నిల్చొని ఉన్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లడానికి యత్నించారు. ఆ సమయంలో మహిళ చేతిలో ఉన్న 23 రోజుల పసికందు కింద పడి మృతిచెందింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర గాయాలైన మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పసికందు మృతదేహం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మహిళ మెడపై చైన్ లాగిన ఆనవాళ్లతో పాటు కత్తి గాటుకూడా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. నగలను లాక్కెళ్లే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగిందా..? లేక మరేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు. -
నాలాలో పసికందు మృతదేహం
కరీంనగర్ జిల్లా గోదావరిఖని పట్టణంలోని మార్కండేయ కాలనీలో మురికి కాల్వలో పసికందు మృతదేహం బయటపడింది. శనివారం ఉదయం చెత్త పారబోయడానికి వెళ్లిన ఒకరు పసికందు మృతదేహాన్ని చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. కాగా.. పసికందును ఎవరు పడేసి వెళ్లారు అనే విషయం తెలియ రాలేదు. -
కాలువలో పసికందు మృతదేహం
అప్పుడే పుట్టిన పసికందు గుర్తుతెలియని వ్యక్తులు కాలువలో పడేశారు. దీంతో చిన్నారి మృతిచెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం శికారిపేట వద్ద ఆదివారం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని కాలువలో అప్పుడే పుట్టిన బాబును వదిలి వెళ్లడంతో.. బాబు మృతిచెందాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి శిశువు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నడిరోడ్డుపై పసికందు
అప్పుడే పుట్టిన ఆడపిల్లను నడిరోడ్డుపై వదిలివెళ్లిన సంఘటన విజయనగరం జిల్లా ఎస్. కోట మండలం అమ్మపాలెంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... బొడ్డు పేగు కూడా తెగని పసికందు(బాలిక)ను గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పై వదిలి వెళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పసికందును వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. -
బావిలో పసికందు మృతదేహం
పుట్టిన రోజే చావురోజు కవరులో పెట్టి బావిలో వేసిన వైనం తాడేపల్లి రూరల్ : పెనుమాక గ్రామంలోని కొత్తూరు ప్రాంత తాగునీటి బావిలో గురువారం ఆడ పసికందు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సెల్‌ఫోన్ ప్యాకింగ్ కవర్లో ఆ పసికందు మృతదేహాన్ని చుట్టి బావిలో పడవేసినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహం ఉబ్బి ఉండడంతో రెండు కాళ్లూ కవరను చీల్చుకుంటూ బయటకు వచ్చాయి. ముందు స్థానికులు ఏదో జంతువు మృతదేహం అనుకున్నారు. స్థానికంగా నివసించే యువకులు బావిలోకి దిగి పరిశీలించగా ముక్కుపచ్చలారని పసికందు కనిపించింది. బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీయడంతో స్థానికులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఆడపిల్ల పుట్టిందనే నెపంతో ఎవరైనా తీసుకువచ్చి బావిలో పడేశారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి వీఆర్వో ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు. స్థానికులు మాత్రం ఈ పసికందు మృతదేహాన్ని మంగళగిరి నుంచి తీసుకువచ్చి స్థానికుల సహాయంతో బావిలో పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని తీసుకువచ్చిన కవర్‌పై విమలా మొబైల్స్, నవతా ట్రాన్స్‌పోర్టు ఆపోజిట్, మంగళగిరి అని ఉంది. దీంతో కవర్ ఆధారంగా స్థానికులు మంగళగిరికి చెందినవారే ఈ పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా పెనుమాకలోనే పంచాయతీ కార్యాలయం సమీపంలో ఆడపిల్లను తీసుకువచ్చి కవర్లో ప్యాకింగ్ చేసి బావిలో పడవేసిన ఘటన జరిగింది. బహుశా అక్రమ సంబంధాల నేపథ్యంలో ఏదైనా ప్రైవేటు ఆసుపత్రిలో బిడ్డను ప్రసవించి, ఎవరికీ తెలియకుండా ఇలా చేశారేమోనని, దానికి స్థానికులు ఎవరైనా సహకరిస్తున్నారేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి పోలీసులు మంగళగిరి, పెనుమాక తదితర ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ టీచర్ల ద్వారా ఆధారాల కోసం ఆరా తీస్తున్నారు. పలు ప్రైవేటు ఆసుపత్రిల్లో సీసీ కెమెరాల ఫుటేజిని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
శ్మశానంలో పసికందు
సిద్దిపేట: అప్పుడే పుట్టిన పసికందును శ్మశానంలో వదిలివెళ్లిన ఘటన మెదక్ జిల్లా సిద్దిపేటలో శనివారం చోటుచేసుకుంది. ఉదయం కోమటి చెరువు పక్క నుంచి స్థానికుడు తోడెంగల కృష్ణ (26) వెళుతుండగా.. శ్మశానంలో ఒక మూల నుంచి ఏడుపు వినిపించింది. దగ్గరకెళ్లి పరిశీలించగా ఓ శిశువు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించాడు. వెంటనే శిశువును 108 లో సిద్దిపేట మాతాశిశు సంక్షేమ కేంద్రానికి తరలించి అత్యవసర చికిత్సలను చేపట్టడంతో ప్రాణాపాయం తప్పింది. ఐసీడీఎస్ అధికారులు సంగారెడ్డిలోని శిశు వివాహార్కు తరలించారు. -
నీళ్ల తొట్టిలో పడి పసికందు మృత్యువాత
చాట్రాయి : మండలంలోని ఆరుగొలనుపేట గ్రా మానికి చెందిన విజయ్‌కిరణ్(13 నెలలు) ఆడుకుంటూ ఇంటి సమీపంలో ఉన్న నీటి వరల తొట్టిలో పడి మృతిచెందాడు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో తండ్రి కొ మ్మి పోచయ్య, తల్లి దుర్గ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుమారుడి మృతదేహాన్ని ఒడి లో పెట్టుకుని తల్లి దుర్గ రోదిస్తుండటం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. బుడి బుడి నడకలతో చిరునవ్వులు చిందిస్తూ కొద్దిసేపటి ముందు వరకు తమ కళ్ల ముందు తిరిగిన విజ య్‌కిరణ్ అకాల మరణంతో కాలనీ వాసులు తీవ్ర విషాదానికి లోనయ్యారు. మృతుడి కుటుంబాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అప్పిరెడ్డి, గ్రామ సర్పంచ్ పద్మ తదితరులు పరామర్శించారు.