గొలుసు దొంగల దాడిలో గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతిచెందింది.
గొలుసు దొంగల దాడిలో గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతిచెందింది. నగరంలోని నేరెడ్‌మెట్ రామకృష్ణాపురంలో నివాసముంటున్న ఓ మహిళ ఇంటి ముందు నిల్చొని ఉన్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లడానికి యత్నించారు. ఆ సమయంలో మహిళ చేతిలో ఉన్న 23 రోజుల పసికందు కింద పడి మృతిచెందింది.
ఈ సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర గాయాలైన మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పసికందు మృతదేహం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మహిళ మెడపై చైన్ లాగిన ఆనవాళ్లతో పాటు కత్తి గాటుకూడా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. నగలను లాక్కెళ్లే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగిందా..? లేక మరేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు.