Chain Snatcher
-
తూర్పు గోదావరి జిల్లాలో చైన్ స్నాచర్ల హల్ చల్
-
బాడీ బిల్డర్.. అయ్యాడు చైన్‌స్నాచర్
కర్ణాటక: మిస్టర్ ఆంధ్రాగా పేరు గడించిన కడప రవీంద్రనగర నివాసి సయ్యద్ బాషా (34), అతని అనుచరుడు షేక్ అయూబ్‌ను మంగళవారం బెంగళూరు దక్షిణ విభాగం గిరినగర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.6 లక్షల విలువచేసే బంగారుచైన్లు, రెండు బైకులను స్వా«దీనం చేసుకున్నారు. డీసీపీ కృష్ణకాంత్ వివరాలను వెల్లడించారు. సయ్యద్ పాషా 2005 నుంచి 2015 వరకు కువైట్‌లో కారుడ్రైవరుగా పనిచేశాడు. అక్కడ ఉండగానే బంగారం స్మగ్లింగ్‌లో పాల్గొన్నాడు. కరోనా సమయంలో సొంతూరికి చేరుకుని బాడీ బిల్డర్‌గా రాణించి పోటీల్లో పాల్గొని మిస్టర్ ఆంధ్రగా గుర్తింపు పొందాడు. సులభంగా డబ్బు సంపాదించాలని అడ్డదారులు తొక్కడం మొదలుపెట్టాడు. చైన్ స్నాచింగ్‌లకు పాల్పడడంతో స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. బెంగళూరులో చోరీలు సులభమని.. సయ్యద్ జైలులో ఉండగా బెంగళూరులో సులభంగా దొంగతనాలు చేయవచ్చునని తోటి ఖైదీ సలహా ఇచ్చాడు. దీంతో సయ్యద్ కొంతకాలం కిందట బెయిల్‌పై విడుదలై కడప నుంచి బెంగళూరు కు చేరుకున్నాడు. బైక్‌లను దొంగిలించి వాటిపై గిరినగర, సుబ్రమణ్యనగర పోలీస్స్టేషన్ల పరిధిలో తిరుగుతూ ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. చోరీ తరువాత అదే ప్రాంతంలో మామూలుగానే తిరగేవాడు, దీని వల్ల తనపై ఎవరికీ అనుమానం రాదని భావించేవాడు. అంతేగాక మొబైల్‌ఫోన్‌ను కూడా వాడేవాడు కాదు. గిరినగరలో నమోదైన చైన్‌స్నాచింగ్ కేసుల్లో దర్యాప్తు చేసి సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా బైక్ నంబరును గుర్తించారు. మంగళవారం ఇద్దరిని అరెస్ట్‌చేసి విచారణ చేపట్టారు. నగరంలో చైన్‌స్నాచింగ్‌లతో పాటు 32 దొంగతనాలతో సయ్యాద్, అనుచరుని పాత్ర ఉన్నట్లు తెలిసింది. ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్టు బెంగళూరులో ఐపీఎల్ బెట్టింగ్ దందాకు పాల్పడుతున్న 160 మందితో కూడిన ముఠాను మంగళవారం సీసీబీ పోలీసులు అరెస్ట్‌చేశారు. వీరి వద్ద నుంచి రూ.65 లక్షల నగదు స్వా«దీనం చేసుకున్నారు. బెంగళూరులో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో ఆన్లైన్లో బెట్టింగ్ దందా జోరుగా జరిగింది. ఆన్లైన్, యాప్‌ల ద్వారా జరిపేవారు. -
దారుణం.. వ్యక్తి ముందే మహిళపై దాడి.. ఆపై
-
గొలుసు దొంగను ప్రతిఘటించిన చిన్నారి
క్రైమ్: సమయస్ఫూర్తితో వ్యవహరించడం.. ఆపద సమయంలోనూ అక్కరకు వస్తుంది. కానీ, సమయస్ఫూర్తితో పాటు ధైర్యంగా ఉంటేనే పరిస్థితులను ఎదుర్కోవచ్చని ఇక్కడ ఓ పదేళ్ల చిన్నారి నిరూపించింది. తన బామ్మ మెడలో గొలుసు దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని.. ప్రతిఘటించింది ఆమె పదేళ్ల మనవరాలు. తన ఇద్దరు మనవరాళ్లతో ఆ బామ్మ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో స్కూటీ మీద వచ్చిన ఓ ఆగంతకుడు.. ఆమె మెడలోని చెయిన్ లాక్కోబోయాడు. దీంతో ఆ వృద్ధురాలు ప్రతిఘటించింది. ఇది గమనించిన ఆమె పదేళ్ల మనవరాలు.. చేతిలోని బ్యాగు తీసుకుని ఆ దొంగను యెడా పెడా బాదేసింది. ఆ దెబ్బకు ఆ దొంగ అక్కడి నుంచి ఉడాయించాడు. మహారాష్ట్రలోని పూణేలో ఫిబ్రవరి 25వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. సీసీటీవీ ఫుటేజీలోని చోరీయత్నం- ఆ చిన్నారి అడ్డుకున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీంతో పూణే సిటీ పోలీసులు స్పందించారు. గురువారం(మార్చి 9న) కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. #WATCH | A 10-year-old girl foiled an attempt by a chain snatcher to snatch her grandmother's chain in Maharashtra's Pune City The incident took place on February 25 & an FIR was registered yesterday after the video of the incident went viral. (CCTV visuals confirmed by police) pic.twitter.com/LnTur7pTeU — ANI (@ANI) March 10, 2023 -
ఆ పోలీసాయన తెగువకి హ్యాట్సాఫ్.. నెట్టింట వైరల్
వైరల్: విధి నిర్వహణలో ప్రాణాలు పణంగా పెట్టిన అధికారుల గాథలు మనం బోలెడు చూసి ఉంటాం. అదే విధంగా.. సమయస్ఫూర్తితో వ్యవహరించే వాళ్లు కూడా అప్పుడప్పుడు తారసపడుతుంటారు. అలా.. ఢిల్లీలో ఓ పోలీసాయన డ్యూటీలో చూపించిన తెగువకి అభినందనలు కురుస్తున్నాయి. ఢిల్లీలో సత్యేంద్ర అనే కానిస్టేబుల్ తన విధి నిర్వహణను సక్రమంగా నిర్వహించారు. అదీ తెగువ ప్రదర్శించి. షాహాబాద్ డెయిరీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీకి గురైందన్న సమాచారం అందుకున్నారాయన. వెంటనే.. చెయిన్‌తో పారిపోతున్న ఓ దొంగను వెంటాడి.. భైక్ మీద నుంచి దూకి మరీ అతన్ని పట్టుకున్నాడు. చెయిన్ రికవరీతో పాటు పారిపోతున్న ఆ దొంగను పట్టేసుకున్న సత్యేంద్ర ఉన్నతాధికారుల అభినందనలు సైతం అందుకున్నారు. ఆపై తేలింది ఏంటంటే.. కానిస్టేబుల్ సత్యేంద్ర పట్టుకుంది మామూలు చెయిన్ స్నాచర్‌ను కాదంట. అతనికి నేర చరిత్ర చాలానే ఉందని, అతని ద్వారా పదకొండు పెండింగ్ కేసులను విజయవంతంగా పరిష్కరించగలిగామని ఢిల్లీ పోలీసులు ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ప్రాణాలకు తెగించి మరీ స్నాచర్‌ను పట్టుకున్న కానిస్టేబుల్ సత్యేంద్రపై అభినందనలు కురుస్తున్నాయి. ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేసిన ఆ వీడియోనే ఇప్పుడు ట్విటర్ ద్వారా ట్రెండ్ అవుతోంది. अपनी जान की परवाह किए बगैर शाहबाद डेरी थाने के कांस्टेबल सत्येंद्र ने एक स्नैचर को गिरफ्तार किया। इस स्नैचर की गिरफ्तारी से 11 मामले सुलझाए गए। विधिक कार्यवाही जारी है।@dcp_outernorth#HeroesOfDelhiPolice pic.twitter.com/PceBbYpdYQ — Delhi Police (@DelhiPolice) November 24, 2022 -
కి‘లేడీ’: కరోనా టీకా వేస్తున్నట్టు నటించి.. బంగారు గొలుసుతో...
గుంటూరు రూరల్: ఒంటరిగా ఉన్న మహిళలను గుర్తించి మాయమాటలు చెప్పి వారి వద్దనుంచి బంగారు గొలుసులు మాయంచేసే మాయలేడీని నల్లపాడు పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ బి.శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. భవనం ప్రభావతి హౌసింగ్‌బోర్డ్ కాలనీ ఎల్‌ఐజీలో తన భర్త రాజశేఖరరెడ్డితో కలిసి నివాసం ఉంటుంది. ఇద్దరే ఉంటున్నారని గమనించిన నగరంలోని గౌతమినగర్ 4వ లైనుకు చెందిన దొల చంద్రకళ ద్విచక్రవాహనంపై ప్రభావతి ఇంటికి ఈనెల 15వ తేదీన మధ్యాహ్నం సమయంలో వచ్చింది. కరోనా టీకాలు వేస్తున్నామని మీరు టీకా వేయించుకోవాలని ప్రభావతిని నమ్మబలికింది. దీంతో ప్రభావతి సరే టీకా వేయండని చెప్పగా, టీకా వేస్తున్నట్లుగా నటిస్తూ మాయలేడీ చంద్రకళ ప్రభావతి మెడలోని రెండు బంగారు గొలుసులను కట్‌చేసి బయటకు పరిగెత్తింది. (చదవండి: సాఫ్ట్వేర్ లవ్‌స్టోరీ.. బెంగళూరులో వివాహం.. రక్షణ కల్పించాలంటూ..) ఒక్కసారిగా గొలుసు లాక్కుని పరారవ్వటంతో కిందపడిన ప్రభావతి తేరుకుని బయటకు వచ్చి చూడగా మాయలేడీ ద్విచక్ర వాహనంపై పరారవ్వటం గమనించింది. దీంతో చేసేదిలేక నల్లపాడు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు అర్బన్ జిల్లా ఎస్పీ ఆరీఫ్‌హఫీజ్ ఆదేశాల మేరకు సౌత్‌జోన్ రూరల్ డీఎస్పీ వై.జెస్సీప్రశాంతి, సీఐ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎస్ఐ ఆరోగ్యరాజు సిబ్బందితో కలిసి కేసు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ పుటేజీల ఆధారంగా మాయలేడీ వినియోగిస్తున్న ద్విచక్రవాహనం నంబర్లు సైతం సరైనవి కాదని నంబర్లు మార్చి వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఎట్టకేలకు మాయలేడీ చంద్రకళను ఆదివారం అరెస్ట్ చేశారు. అనంతరం తమదైన శైలిలో పోలీసులు విచారించగా నిందితురాలు చేసిన నేరం ఒప్పుకుంది. చోరీ చేసిన రూ.4 లక్షల విలువ చేసే రెండు బంగారు గొలుసులు రికవరీ చేశామని సీఐ తెలిపారు. దీంతోపాటుగా నిందితురాలు వినియోగిస్తున్న ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశామన్నారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన ఎస్.ఆరోగ్యరాజును, ఎస్ఐ ఎస్.సత్యనాయక్, కానిస్టేబుళ్లు కె.సుబ్బారావు, షేక్ జాన్‌సైదా, షేక్ మస్తాన్‌వలి, ఎం.లోకేశ్వరరావులను అభినందించి అర్బన్ ఎస్పీ రివార్డులను ప్రకటించారని సీఐ తెలిపారు. (చదవండి: పదో తరగతి పరీక్షలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం) -
9 నెలల చిన్నారిని బలి తీసుకున్న చైన్ స్నాచర్
-
చిన్నారిని బలితీసుకున్న చైన్ స్నాచర్.. నీటి సంపులో పడేయడంతో..
సాక్షి, జనగామ జిల్లా: పాప వయస్సు ఏడాది.. అయినా బోర్లా పడరాదు..చేతులతో ముందుకు కదలలేదు.. ఆస్పత్రులకు వెళితే బాగయ్యే పరిస్థితి లేదన్నారు.. ఒకవైపు మూడేళ్ల కొడుక్కి ఓపెన్ హార్ట్ సర్జరీ జరగడం, చిన్నారి పరిస్థితిలో తీవ్ర మనోవేదనకు గురైన కన్న తల్లే చిన్నబిడ్డను నీటి సంప్‌లో వేసి చంపేసింది. ‘అయ్యో దొంగోడొచ్చాడు.. నా మెడలో పుస్తెల తాడు లాక్కోబోయాడు.. అడ్డుకున్నందుకు చంటి పాపను సంపులో వేసి చంపేశాడంటూ దొంగేడుపుతో అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. చివరకు జైలు పాలయింది. అప్పటివరకు తన కూతురును ఎత్తుకుని ఆడించిన తండ్రి.. హెయిర్ కటింగ్ సెలూన్‌కు వెళ్లిన అరగంటకే ఫోన్లో ఆమె మరణ వార్త తెలియడంతో అక్కడే కుప్పకూలి పోయాడు. జనగామ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్‌లో సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కొడుక్కి ఓపెన్ హార్ట్.. కూతురు కదల్లేని స్థితి జనగామ మండలం చీటకోడూరు గ్రామానికి చెందిన నడిగోటి భాస్కర్‌కు యాదాద్రి భువనగిరి జిల్లా పొద్దుటూరు గ్రామానికి చెందిన ప్రసన్నతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.. మూడేళ్ల నవనీత్, తేజస్వి (12 నెలలు) ఉన్నారు. హెయిర్ కటింగ్ సెలూన్ నడిపించే భాస్కర్, బతుకు దెరువు కోసం జనగామ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్‌కు మకాం మార్చాడు. అనారోగ్యానికి గురైన నవనీత్‌కు ఇటీవలే ఓపెన్ హార్టు సర్జరీ చేయించగా, రూ.8 లక్షల వరకు ఖర్చయింది. తేజస్వి కూడా సరైన ఎదుగుదల లేక సరిగ్గా కదలలేని స్థితిలో ఉండేది. దీంతో అనేక ఆస్పత్రులకు తిప్పారు. లక్షల రూపాయలు ఖర్చు చేసినా, బాగయ్యే పరిస్థితి లేదని డాక్టర్లు తేల్చి చెప్పడంతో ప్రసన్న తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలిసింది. కూతురు హత్యకు ముందే ప్లాన్ సోమవారం వీరితోనే ఉంటున్న అత్త, మామ, మరిది వేరే ఊరికి వెళ్లారు. ఉదయం 10.30 గంటలకు భాస్కర్ హెయిర్ కటింగ్ సెలూన్‌కు వెళ్లగా, ప్రసన్న ఇంటి గేటుకు తాళం వేసుకుని లోపలే ఉండి పోయింది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం కూతుర్ని చంపాలని నిర్ణయించుకుంది. ఇంటి బయట నీటి సంప్‌లో పడేసింది. చనిపోయిన తర్వాత బయటకు తీసి అరుపులు, కేకలతో ఏడుపు మొదలుపెట్టింది. అటుగా బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి రావడంతో అతనికి చైన్ స్నాచింగ్ కథ విని్పంచింది. అతనితో కలిసి బైక్‌పై ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ నుంచి చంపక్‌హిల్స్ ఎంసీహెచ్‌కు తరలించారు. చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రి ఉంచి ఆమెతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ‘గోడ మీదుగా హెల్మెట్ ధరించిన దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి, మెడలోని పుస్తెల తాడు బ్లేడ్‌తో తెగ్గొట్టే ప్రయత్నం చేశాడని పోలీసులకు, చుట్టుపక్కల వారికి ప్రసన్న చెప్పుకొచి్చంది. తాను అతనితో పెనులాడడానని, దుండగుడు రెండు ముక్కలైన పుస్తెల తాడు తీసుకుని, మరో వైపు పసిపాపను లాక్కుని, ఇంటి ఆవరణలో ఉన్న సంపులో వేసి, గోడ దూకి పారిపోయాడంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. అయితే అక్కడ ప్రసన్న చెబుతున్నట్టుగా సీన్ కనిపించకపోవడంతో అనుమానించిన ఏసీపీ జి.క్రిష్ణ, సీఐ ఇ.శ్రీనివాస్ భార్యాభర్తలను స్టేషన్‌కు తీసుకుని వెళ్లి ప్రసన్నను తమదైన శైలిలో విచారించారు. తానే పాపను హత్య చేసినట్లు ఆమె నోటితోనే చెప్పించారు. ఆ మేరకు భర్త ఇచి్చన ఫిర్యాదుతో హత్యా నేరం కింద కేసు నమోదు చేసుకుని జైలుకు పంపించారు. తల్లి డ్రామా బట్టబయలైయింది : డీసీపీ ఈ కేసును పోలీసులు ఏడు గంటల్లోనే ఛేదించారు. కూతురును హత్య చేసి, చైన్‌స్నాచర్ చేతిలో హతమైనట్లుగా నమ్మించేందుకు ప్రయతి్నంచిన తల్లి నిజాన్ని ఒప్పుకుందని డీసీపీ పి.సీతారాం విలేకరులకు తెలిపారు. పాప అనారోగ్య సమస్యతో బాధపడుతుండడంతోనే హత్య చేసినట్లు ప్రసన్న అంగీకరిచిందని తెలిపారు. బతికినంత కాలం కూతురితో ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పిందన్నారు. పోలీసులను తప్పుదారి పట్టించడం కోసమే చైన్ స్నాచింగ్ డ్రామా చేసిందన్నారు. -
పారిపోతూ.. విధి నుంచి తప్పించుకోలేకపోయాడు
ఏదో ఒకనాటికి.. చేసిన నేరానికి శిక్ష అనుభవించక తప్పదు. తప్పించుకునే ప్రయత్నాలు ఫలించకపోగా.. కాలమే దానికి సరైన సమాధానం ఇస్తుంది కూడా. అలా ఓ యువకుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడానికి ‘చెయిన్ స్నాచింగ్’ కారణమైంది. కేరళకు చెందిన ఇద్దరు యువకులు (17, 21 ఏళ్లు).. చెయిన్ స్నాచింగ్‌కు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో వాళ్ల మీద 15 కేసులు నమోదు అయ్యాయి. ఆ భయంతో పొరుగు రాష్ట్రం తమిళనాడులో పడి చెయిన్ స్నాచింగ్‌లకు పాల్పడడం.. వాటిని కేరళకు తెచ్చి అమ్మి ఆ డబ్బుతో జల్సాలు చేయసాగారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం కన్యాకుమారి తుచ్కలిలో ఓ మహిళ మెడ నుంచి బంగారు గొలుసు దొంగతనం చేశారు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు వేగంగా బైక్ మీద వెళ్లిపోయారు. పోలీసులు జాలి పడ్డారట! వేగంగా దూసుకెళ్తూ.. నరువమూడు(కేరళ) దగ్గర హైవే మీద డివైడర్‌ను ఢీ కొట్టి ప్రమాదానికి గురయ్యారు. తొలుత యాక్సిడెంట్ కేసుగా భావించిన పోలీసులు.. పాపం అనుకుని ఆస్పత్రిలో చేర్పించారు. బైక్ నడిపిన 17 ఏళ్ల కుర్రాడు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోగా.. మరో వ్యక్తికి కాలికి సర్జరీ అయ్యింది. అయితే వీళ్ల దగ్గర బంగారు గొలుసులు దొరకడంతో.. పోలీసులు రెండో వ్యక్తిని విచారించి అసలు విషయం రాబట్టారు. అలా.. చెడు దారిలో వేగంగా వెళ్లిన ఆ యువకుడి జీవితం అర్ధాంతంగా ముగియగా.. నడవలేని స్థితికి చేరుకున్న మరో యువకుడు జైలు పాలు కావాల్సిన పరిస్థితి ఎదురైంది. ప్చ్.. విధి ఎంత బలీయమైనదో కదా! -
రంగారెడ్డి: అబ్దుల్లాపుర్ మెట్లో చైన్‌స్నాచర్ వీరంగం
-
సీరియల్ స్నాచర్ ఖతిక్ కేసులో మరో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: సీరియల్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ వ్యవహారంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇతగాడు శనివారం అహ్మదాబాద్ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. అతడిని ఇక్కడకు తరలించడానికి పీటీ వారెంట్‌తో వెళ్లిన పేట్ బషీరాబాద్ పోలీసులకు ఈ విషయం తెలిసింది. నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ ఎస్కేప్పై మన పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉమేష్ ఖతిక్ నేరాంగీకార వాంగ్మూలం సహా పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు ‘బంగారం కోసమే’ ఈ వ్యవహారమా? అని భావిస్తున్నారు. తాజా పరిణామం నేపథ్యంలో ఉమేష్ కోసం అహ్మదాబాద్ పోలీసులతో పాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ అధికారులు మళ్లీ గాలింపు చేపట్టారు. అగమ్యగోచరంగా పరిస్థితి... ఉమేష్ ఖతిక్ అంశంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ‘ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెండ్ డైడ్’ అన్నట్లు ఉందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. రాజధానిలో అయిదు స్నాచింగ్స్ చేసిన 24 గంటల్లోనే ఇతడిని గుర్తించారు. అహ్మదాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకుని రికవరీల్లో ఇబ్బంది ఉండకూడదనే అక్కడి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీన్నే ఆ పోలీసులు తమకు అనువుగా మార్చుకుంటూ ఉమేష్‌ను అరెస్టు చేయడంతో పాటు ఇక్కడి ఐదు నేరాలకు సంబంధించిన 18.5 తులాలను రికవరీ చేశారు. చదవండి: Chain Snatcher: తెంచిన గొలుసులన్నీ ఇక్కడే పడిపోయాయి! ఆ బంగారాన్ని తమ కేసుల ఖాతాలో వేసేసుకున్నారు. ఉమేష్ అరెస్టు ప్రకటించిన అహ్మదాబాద్‌లోని వడాజ్ పోలీసుస్టేషన్ అధికారులు చిత్రంగా అతడి నేరాంగీకార వాంగ్మూలం నమోదు చేశారు. అందులో హైదరాబాద్‌లో నేరాలు చేస్తున్నట్లు చూపిస్తూనే.. ఒక నేరంలో తస్కరించిన గొలుసు మరో స్నాచింగ్ చేస్తున్నప్పుడు పడిపోయినట్లు రికార్డు చేశారు. ఉద్దేశపూర్వకంగానే అలా రికార్డు... అంతర్రాష్ట్ర, అంతర్జిల్లా నేరగాళ్లు వివిధ ప్రాంతాల్లో నేరాలు చేస్తుంటారు. వీరిని ఒక విభాగానికి చెందిన పోలీసులు పట్టుకున్నప్పుడు నేరాంగీకార వాంగ్మూలం నమోదు చేస్తారు. అందులో కేవలం సదరు నేరగాడు తమ ప్రాంతంతో పాటు ఫలానా చోట్లా నేరాలు చేశాడని పొందుపరుస్తారు. మరో జిల్లా, రాష్ట్ర పోలీసులు అతడిని పీటీ వారెంట్‌పై తీసుకురావాలంటే ఇది కచ్చితం. పట్టుకున్న సందర్భంలో రికవరీ చేసిన సొత్తు పూర్వాపరాలు పరిశీలిస్తారు. సమయం, సందర్భాలను బట్టి అది వేరే ప్రాంతానికి చెందినదనే ఆధారాలు లభిస్తే తమ వద్ద భద్రపరిచి ఆ పోలీసులకు అప్పగిస్తుంటారు. చదవండి: Chain Snatcher: ఉమేష్ ఖతిక్‌ను ఇచ్చేదేలే ఉమేష్ వ్యవహారంలో అహ్మదాబాద్ పోలీసులు నమోదు చేసిన వాంగ్మూలం ఉద్దేశపూర్వకంగానే ఉన్నట్లు కనిపిస్తోందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. సాధారణంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లోనూ నేరాలు చేసినట్లు మాత్రమే రాస్తారని, దీనికి భిన్నంగా ఆ నేరాల్లో లాక్కున్న గొలుసులు పడిపోయాయంటూ రాయడం, తాము వెళ్లినా అప్పగించకపోవడంతోనే వారి ఉద్దేశం అర్థమవుతోందన్నారు. వ్యవహారం ముదరడంతో మరో ట్విస్ట్..? ఈ వ్యవహారం ఉన్నతాధికారుల వద్దకు వెళ్లడంతో అహ్మదాబాద్ పోలీసులతో మాట్లాడారు. దీంతో విషయం సీరియస్‌గా మారుతోందని భావించిన అక్కడి అధికారులు ఈ కొత్త ట్విస్ట్‌కు కారణమై ఉంటారని మన పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలోనే ఉమేష్‌కు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఇతడికి అరెస్టు ప్రకటించిన వడాజ్ పోలీసులు న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్నారు. విచారిస్తున్నప్పుడు ఫిట్స్ వచ్చిపడిపోయాడని, అందుకే అహ్మదాబాద్‌లో శారదబెన్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఎస్కార్ట్ పోలీసుల కళ్లుగప్పి శనివారం పారిపోయాడంటూ చెప్తున్నారు. గతంలో కస్టడీ నుంచి పారిపోయిన చరిత్ర ఉన్న ఈ కరుడుగట్టిన స్నాచర్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారో అర్థం కావట్లేదని, దీని వెనుకా ఏదైనా మతలబ్ ఉందా? అనేది పరిశీలించాలని సైబరాబాద్‌కు చెందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
Chain Snatcher: ఉమేష్ ఖతిక్‌ను ఇచ్చేదేలే
సాక్షి, హైదరాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. కర్ణాటకలోని బెంగళూరులో వరుసపెట్టి పంజా విసారాడు.. హైదరాబాద్‌కు చేరుకుని రెండు రోజుల్లో అయిదు చైన్ స్నాచింగ్స్ సహా ఎనిమిది నేరాలు చేశాడు.. చూడటానికి పక్కా సాఫ్ట్వేర్ ఉద్యోగిలా కనిపించే ఈ ఘరానా నేరగాడు ఉమేష్ ఖతిక్‌ను అప్పగించేది లేదని అహ్మదాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. తెలంగాణ పోలీసులు ఇచ్చిన సమాచారంతో శనివారం తెల్లవారుజామున ఆ అధికారులు అక్కడే పట్టుకున్నారు. అతడిని తమకు అప్పగించాలంటూ ఇక్కడి పోలీసులు వెళ్లి కోరగా... తామే అరెస్టు చేస్తామని ఆపై పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లండి అంటూ స్పష్టం చేశారు. దీంతో ఆదివారం రాత్రి తెలంగాణ పోలీసు బృందాలు తిరిగి పయనమయ్యాయి. నాలుగు గంటలకు పైగా నడక.. మంగళవారం మధ్యాహ్నం రైలులో నగరానికి చేరుకున్న ఉమేష్ నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని మెజిస్టక్ హోటల్లోని రూమ్ నెం.204లో బస చేశాడు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసిన అతగాడు బయటకు వచ్చి కాలినడకన బయలుదేరాడు. దాదాపు నాలుగు గంటల పాటు వివిధ ప్రాంతాల్లో కాలినడకన సంచరించిన ఉమేష్ సాయంత్రం 5,30 గంటల ప్రాంతంలో మెహిదీపట్నం చేరుకున్నాడు. అక్కడి జిర్రా రోడ్లో మహ్మద్ సులేమాన్ నిర్వహిస్తున్న మొబైల్ దుకాణం వద్దకు వెళ్లాడు. అప్పటికి కొద్దిసేపటి ముందే తన యాక్టివా వాహనంపై సరుకు తీసుకువచ్చిన సులేమాన్ తన వాహనాన్ని దుకాణం ముందు పార్క్ చేశారు. అప్పటికే కస్టమర్లు ఎదురు చూస్తుండటంతో ఆ హడావుడిలో బండికి తాళం వేయడం మర్చిపోయిన ఆయన సరుకు తీసుకుని షాపు లోపలకు వెళ్లిపోయారు. చదవండి: Chain Snatcher: చైన్ స్నాచర్ ఉమేష్ ఖాతిక్ అరెస్ట్.. ఎంత దూరమైనా సరే.. అల్పాహారం తర్వాత మొదలుపెట్టి.. తాళంతో సహా ఉన్న సులేమాన్ ద్విచక్ర వాహనాన్ని గుర్తించిన ఉమేష్ దాన్ని తస్కరించాడు. అక్కడ నుంచి చెక్కర్లు కొడుతూ తాను ఉన్న హోటల్‌కు చేరుకున్నాడు. ఆ రాత్రి హోటల్లోనే ఉన్న ఉమేష్ బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో అల్పాహారం చేసి అక్కడ నుంచి బయలుదేరాడు. ఎక్కడా ఎలాంటి రెక్కీలు చే యని అతగాడు నేరుగా అల్వాల్‌కు చేరుకున్నా డు. అక్కడ ఉదయం 10 గంటల నుంచి మొదలెట్టి మేడిపల్లిలో సాయంత్రం 4.30 వరకు వరుసపెట్టి నేరాలు చేశాడు. అక్కడి సంపూర్ణ హోట ల్ వద్ద వాహనం, సమీపంలోని చెంగిచర్ల చౌర స్తా సమీపంలో ఉన్న మేకల బాల్‌రెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద తన జర్కిన్ విడిచిపెట్టాడు. అక్కడ నుంచి బస్సులో లక్డీకాపూల్‌కు చేరుకున్న ఉమేష్... ఆటోలో హోటల్‌కు చేరాడు. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో హోటల్ ఖాళీ చేసి రైలులోనే అహ్మదాబాద్ చేరుకున్నాడు. హోటల్లో మరో వ్యక్తి ఫోన్ నంబర్... ఉమేష్ నాంపల్లిలోని మెజిస్టిక్ హోటల్లో బస చేస్తున్న సమయంలో తన ఫోన్ నంబర్ పొందుపరచలేదు. గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన చేతన్ రాథోడ్‌కు చెందిన నంబరును ఇచ్చాడు. గుర్తింపు కార్డుగా మాత్రం తన ఆధార్‌నే అందించాడు. సీసీ కెమెరాల ఆధారంగా ఉమేష్ కదలికలు తెలుసుకున్న పోలీసులు హోటల్ వరకు వచ్చాడు. రిజిస్టర్లో ఉన్న ఫోన్ నంబర్‌కు సంప్రదించగా ఉమేష్ ఎవరో తనకు తెలియదని చేతన్ చెప్పాడు. దీంతో ఆధార్ కార్డు ఆధారంగా ముందుకు వెళ్లిన పోలీసులు ఉమేష్ నేరచరిత్ర తెలుసుకున్నారు. సాంకేతిక ఆధారాలను బట్టి అతడు శుక్రవారం రాత్రి అతడు అహ్మదాబాద్‌లోని తన ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ నుంచి బృందాలు వెళ్లేసరికి అతడు తప్పుకునే అవకాశం ఉందని భావించిన అధికారులు అహ్మదాబాద్ అధికారులను అప్రమత్తం చేశారు. శనివారం తెల్లవారుజామున ఆ ఇంటిపై దాడి చేసిన ఆ పోలీసులు ఉమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికి దాదాపు 20 రోజులుగా బెంగళూరు అధికారులు అహ్మదాబాద్ పోలీసులతో టచ్‌లో ఉన్నారు. -
చైన్ స్నాచర్ ఉమేష్ ఖాతిక్ అరెస్ట్.. ఎంత దూరమైనా సరే..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో రెండు రోజుల్లో ఎనిమిది నేరాలు చేసి పరారైన ‘సింగిల్ స్నాచర్’ ఉమేష్ ఖాతిక్‌ను అహ్మదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిటీ నుంచి పరారైన ఇతగాడిని శనివారం తెల్లవారుజామున అక్కడి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని నగరానికి తీసుకువచ్చేందుకు సైబరాబాద్ పోలీసులు అహ్మదాబాద్‌కు వెళ్లారు. సొత్తు రికవరీ చేయడంతో పాటు ఇంకా ఏవైనా నేరాలు చేశాడా? అనే కోణంలో విచారణ చేయనున్నారు. గతంలో ఇతడిని అనేకసార్లు అరెస్టు చేసిన అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన ఓ ఉన్నతాధికారితో ‘సాక్షి’ శనివారం ఫోన్లో మాట్లాడింది. ఈ నేపథ్యంలో ఉమేష్‌కు సంబంధించిన కీలకాంశాలు ఆయన వెల్లడించారు. టార్గెట్ చేసిన నగరంలోని హోటళ్లలో బస చేయడం, చోరీ చేసిన వాహనంపై తిరుగుతూ స్నాచింగ్స్‌కు పాల్పడటం సహా ఈ ఘరానా స్నాచర్కు సంబంధించిన వివరాలివీ.. ►రాజస్థాన్‌లో పాలి జిల్లాకు చెందిన ఉమేష్ కొన్నాళ్లు అహ్మదాబాద్‌లోని నారాయణ్పురలో నివసించాడు. అప్పట్లో మహారాష్ట్రలోని జల్గాం జిల్లాకు చెందిన సూర్యవంశీ అలియాస్ దీపక్‌తో కలిసి కొన్ని చోరీలు చేశాడు. ►ఈ కేసులకు సంబంధించిన 2015–16లలో అహ్మదాబాద్ పోలీసులకు చిక్కి వీరు జైలుకు వెళ్లారు. బయటకు వచ్చిన తర్వాత ఒకరు రాజస్థాన్‌కు, మరొకరు సూరత్‌కు వెళ్లిపోయారు. కొన్నాళ్లు మిన్నకుండిపోయిన ఈ ద్వయం 2017 నుంచి చైన్ స్నాచింగ్స్ చేయడం మొదలెట్టింది. ►ఉమేష్ రాజస్థాన్ నుంచి బస్సు లేదా రైలులో దాదాపు 650 కి.మీ. దూరంలో ఉన్న సూరత్ చేరుకునే వాడు. ఇద్దరూ కలిసి తొలుత ఓ వాహనం చోరీ చేసి దానిపై తిరుగుతూ స్నాచింగ్స్‌కు పాల్పడ్డారు. రెండు మూడు నేరాలు చేసిన తర్వాత ఉమేష్ ఇన్స్టాల్మెంట్లో కారు కొన్నాడు. అప్పటి నుంచి దాని మీదే సూరత్ వచ్చే వాడు. ►ఇప్పటి వరకు ఉమేష్ చోరీ చేసిన ద్విచక్ర వాహనాలన్నీ గేర్లు లేనివే. వాటిపైనే తిరుగుతూ దీపక్‌తో కలిసి అనేక స్నాచింగ్స్ చేశాడు. ఈ ఇద్దరిపై గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. ►ఉమేష్ 2015లో కొన్నాళ్లు అహ్మదాబాద్ సమీపంలోని ప్రశాసన్‌నగర్‌లో ఉన్నాడు. అప్పట్లో చోరీ కేసులకు సంబంధించి సోలా పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిపై గుజరాత్ యూనివర్సిటీ ప్రాంతంలోనూ కొన్ని కేసులు నమోదయ్యాయి. ►దీంతో ఆ ఠాణా ఇన్స్పెక్టర్ రాజ్యగురు ఇతడిని పీటీ వారెంట్‌పై కస్టడీలోకి తీసుకున్నారు. తమ ఠాణాకు తరలించి చోరీ సొత్తు ఎక్కడ విక్రయించావో చెప్పాలంటూ ఒత్తిడి చేశారు. దీంతో ఆయనపై కక్షగట్టిన ఉమేష్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత పెద్ద డ్రామా నడిపాడు. అప్పట్లో ఉమేష్ వయసు కేవలం 19 ఏళ్లు. ►సదరు ఇన్స్పెక్టర్ ఇంటరాగేషన్ పేరుతో విచక్షణారహితంగా కొట్టారని, ఈ నేపథ్యంలోనే తన రెండు కళ్లూ పోయాయంటూ ఆరోపించాడు. దీంతో న్యాయస్థానం అతడికి ప్రత్యేక చికిత్స అందించేలా ఆదేశాలిచ్చింది. ►రాజ్యగురుపై విచారణను చేపట్టింది. చివరకు ఠాణాలో ఉన్న సీసీ కెమెరాల ఫీడ్‌ను ఉన్నతాధికారులు పరిశీలించిన నేపథ్యంలో అతడి ఆరోపణలు అవాస్తవమని తేలింది. ఈలోపే అతడి తండ్రి గులాజ్జీ, తల్లి మోహిని, సోదరి ఉష సైతం విలేకరుల సమావేశాలు పెట్టి హడావుడి చేశారు. పోలీసులను బ్లాక్మెయిల్ చేయడానికే ఈ వ్యవహారం నడిపినట్లు తేలింది. -
అల్వాల్‌లో ప్రత్యక్షం.. ఉప్పల్‌లో అదృశ్యం
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండల్లో బుధవారం వరుస స్నాచింగ్స్తో సవాల్ విసిరిన సింగిల్ స్నాచర్ మొత్తం ఏడు నేరాలు చేసినట్లు తేలింది. ఉదయం అల్వాల్‌లో ప్రారంభించిన అతగాడు సాయంత్రం మేడిపల్లిలో ముగించాడు. ఈ ఏడింటిలోనూ మొదటి రెండూ విఫలం కాగా... ఆ తర్వాత అయిదింటిలోనూ కలిపి 18.5 తులాల బంగారం కొట్టేశాడు. ఉప్పల్ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఇతడి కోసం మూడు పోలీసు కమిషనరేట్లకు చెందిన టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ పోలీసులు గాలిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆసిఫ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని జిర్రా రోడ్లో యాక్టివా వాహనం చోరీ చేసిన ఈ స్నాచర్ బుధవారం ఉదయం తన ‘పని’ మొదలెట్టాడు. అల్వాల్ పరిధిలోని ఇందిరానగర్‌కు చెందిన పుష్ప ఇళ్లల్లో పని చేస్తుంటారు. పనులు ముగించుకున్న ఈమె బుధవారం బుధవారం ఉదయం 10.45 గంటలకు కానాజీగూడ ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆమె మెడలో ఉన్న రోల్డ్ గోల్డ్ గోలుసును బంగారంతో చేసిందిగా భావించిన స్నాచర్ వెనుక నుంచి వచ్చి లాక్కుపోవడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన ఆమె అప్రమత్తమై కేకలు వేయడంతో అక్కడ నుంచి వాహనంపై పారిపోయాడు. ఆలస్యంగా స్పందించిన ఆమె బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: ఐదున్నర గంటలు..6 నేరాలు.. వీడు మామూలోడు కాదురోయ్! అక్కడి నుంచి పేట్‌బషీరాబాద్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీకి వెళ్లిన స్నాచర్ ఉమారాణి మెడలో గొలుసు చోరీ చేయడానికి ప్రయత్నించాడు. ఈ రెండూ విఫలం కావడంతో.. రాఘవేంద్ర కాలనీ, శ్రీరాంనగర్ కాలనీ, మారేడ్‌పల్లిలోని ఇంద్రపురి రైల్వే కాలనీ, తుకారాంగేట్‌లోని సమోసా గార్డెన్స్, మేడిపల్లిలోని లక్ష్మీనగర్ కాలనీల్లో పంజా విసిరాడు. సాయంత్రం 4.30 గంటలకు ఆఖరి నేరం చేసిన స్నాచర్ అక్కడ నుంచి ఉప్పల్ వరకు వచ్చాడు. ఈ కదలికలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఉప్పల్‌లోని ఓ గల్లీలోకి ప్రవేశించిన దుండగుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో నాగోల్, హబ్సిగూడ, రామాంతపూర్ రోడ్లలోని కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇతడు ఎక్కడి వాడు? ఎక్కడ బస చేశాడు? కొన్ని నేరాలకు మధ్య సమయంలో ఎక్కడ ఉన్నాడు? అనే వివరాలను ఆరా తీస్తున్నారు. త్వరలో పట్టుకుంటాం బుధవారం వరుస స్నాచింగ్స్‌కు పాల్పడిన దుండగుడికి సంబంధించి కొన్ని ఆధారాలు లభించాయి. వాటి ఆధారంగా ముందుకు వెళ్తున్నాం. త్వరలోనే నేరగాడిని పట్టుకుంటాం. సైబరాబాద్, రాచకొండ పోలీసులతోనూ సమన్వయం ఏర్పాటు చేసుకుని పని చేస్తున్నాం. చాలా కాలం తర్వాత ఇలాంటి ఉదంతం చోటు చేసుకుంది. పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. – సీవీ ఆనంద్, సిటీ సీపీ -
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్
-
కళ్లల్లో కారం కొట్టి చైన్‌స్నాచింగ్.. దొంగకు చుక్కలు చూపించిన సూపర్ ఉమెన్
సాక్షి, కామారెడ్డి: చైన్‌స్నాచింగ్ యత్నించిన నిందితుడిని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి అనంతరం పొలీసులకు అప్పగించిన సంఘటన కామారెడ్డి పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. పట్టణంలోని శివాజీ రోడ్డు చౌరస్తాలో కృష్ణమూర్తి అనే వ్యక్తి కిరాణాషాపు నిర్వహిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి షాపులో ఉన్న ఆయన భార్య కంట్లో కారంపొడి చల్లి మెడలో ఉన్న బంగారం గొలుసును లాక్కొని పారిపోయే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో అక్కడికి సరుకులు కొనేందుకు వచ్చిన భారతి అనే మహిళ ఆ దొంగను అడ్డుకొని కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల ఉన్న వారు వచ్చి నిందితుడిని పట్టుకుని దేహశుధ్ది చేసి గొలుసును బాధిత మహిళకు అప్పగించారు. నిందితుడి వద్దనున్న డ్రైవింగ్ లైసెన్సులో యాదగిరి, సదాశివనగర్ అని, ద్విచక్రవాహనానికి చెందిన ఆర్సీ కార్డుపై అజంపుర, మెదక్ అని వేర్వేరు అడ్రస్‌లు ఉన్నట్లు గుర్తించారు. కౌన్సిలర్లు పిట్ల వేణు, కోయల్కర్ కన్నయ్యలు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దొంగను అడ్డగించిన భారతి అనే మహిళను స్థానికులు అభినందించారు. చదవండి: ఒకే ఎఫ్ఐఆర్తో రెండు కేసులు, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి.. సీపీ సీరియస్ -
దేశ రాజధానిలో దారుణం
న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దోపిడీ యత్నాన్ని అడ్డుకున్న ఓ మహిళ దుండగుడి కత్తిపోట్లకు బలైంది. వాయవ్య ఢిల్లీలోని ఆదర్శ్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సిమ్రాన్ కౌర్ (25) శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో తన రెండేళ్ల కుమార్తె, తల్లితో కలిసి మార్కెట్ నుంచి ఇంటికి వెళుతోంది. తమ ఇంటికి సమీపంలో ఉండగా వెనుక నుంచి వచ్చిన దుండగుడు సిమ్రాన్ మెడలో గొలుసును లాక్కునేందుకు యత్నించాడు. ఆమె అప్రమత్తమై, అతడిని తీవ్రంగా ప్రతిఘటించింది. పెనుగులాటలో ఆ దుండగుడు కిందపడి పోయాడు. అనంతరం తిరిగి లేచి, తన వద్ద ఉన్న కత్తితో ఆమె పొట్టలో పొడిచి పరారయ్యాడు. అక్కడికి సమీపంలోనే ద్విచక్ర వాహనంతో సిద్ధంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి మాయమ య్యాడు. తీవ్రంగా గాయపడిన సిమ్రాన్‌ను ఇరుగు పొరుగువారు ఆస్పత్రికి తరలించారు. ఆమె అప్పటికీ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దుండగులను పట్టుకునేందుకు 10 పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ ఉషా రంగ్నానీ తెలిపారు. ఈ ఘటనతో ఇద్దరు వ్యక్తులకు ప్రమేయం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. दिल्ली के आदर्श नगर में स्नैचिंग का विरोध करने पर गोद मे बच्चा लेकर जा रही महिला के गर्दन पर बदमाश ने दो बार चाकू से किया वार, अस्पताल में महिला की मौत। दिल्ली में आए दिन होती है स्नैचिंग की वारदात, इस वारदात ने फिर उठाए पुलिस पैट्रोलिंग पर सवाल। @indiatvnews @DelhiPolice pic.twitter.com/gsrlIr18la — Abhay parashar (@abhayparashar) February 28, 2021 -
ఆడి... షాను! నేరగాళ్లకు పరిభాషక పేర్లు
సాక్షి, సిటీబ్యూరో: రద్దీగా ఉన్న బహిరంగ ప్రదేశాలతో పాటు భారీ సభలు, ర్యాలీలతో పాటు కిటకిటలాడుతున్న బస్సుల్ని టార్గెట్‌గా చేసుకుని చేతివాటం చూపిస్తున్న ఇద్దరు ఘరానా నేరగాళ్లను పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరు నేరం చేసేప్పుడు ‘పోషించే పాత్రలకు’ ప్రత్యేక పరిభాషక పదాలు సైతం ఉన్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. వీరిద్దరిపై ఇప్పటికే పలు పోలీసుస్టేషన్లలో కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు. డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి సోమవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. టోలిచౌకీ, మిరాజ్ కాలనీకి చెందిన మహ్మద్ రిజ్వాన్ అలియాస్ కైలాష్ ప్రస్తుతం మాన్గార్బస్తీలో ఉంటూ బైక్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఆసిఫ్‌నగర్‌లోని జిర్రా ప్రాంతానికి చెందిన వాటర్ బాటిల్స్ సప్లయర్ మహ్మద్ రిజ్వాన్ అలియాస్ వీరుతో ఇతడికి చిన్ననాటి స్నేహితుడు. వ్యసనాలకు బానిసలైన వీరు గతంలో ఎవరికి వారుగా పిక్ పాకెటింగ్ నేరాలకు పాల్పడేవారు. ఈ నేపథ్యంలోనే కైలాష్‌పై లంగర్‌హౌస్, చార్మినార్, ఉప్పల్, హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్లలో, వీరుపై లంగర్‌హౌస్, బేగంబజార్, సుల్తాన్‌బజార్, నారాయణగూడ, ఉప్పల్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. వీరు పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చారు. వీరు నేరచరిత్రను పరిగణలోకి తీసుకున్న సుల్తాన్‌బజార్ పోలీసులు అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించగా 2016 జూలై 21 నుంచి ఏడాది పాటు జైల్లో ఉండి బయటికి వచ్చాడు. కొన్నాళ్ల క్రితం జట్టు కట్టిన వీరిద్దరూ కలిసి పిక్పాకెటింగ్స్, చైన్ కటింగ్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. వీరిద్దరూ ప్రధానంగా జనసమర్థం ఎక్కువగా ఉన్న బహిరంగ ప్రదేశాలతో పాటు భారీ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు జరిగే ప్రాంతాలతో పాటు రద్దీ బస్సులను ఎంచుకునేవారు. ఓ వ్యక్తిని టార్గెట్‌గా చేసుకున్న అనంతరం అతడి వద్దకు వెళ్లి అటు ఇటు కదులుతూ హడావుడి చేసి దృష్టి మళ్లిస్తారు. ఇతడిని పరిభాషికంగా ‘ఆడి’గా పిలుస్తారు. ఈ నేపథ్యంలోనే అదును చూసుకునే కైలాష్ ఆ వ్యక్తి మెడలో ఉన్న బంగారు గొలుసుని తన పంటితో కత్తిరించేసి తస్కరిస్తాడు. ఇలా చేసే ఇతడిని షాను అని పిలుస్తుంటారు. తమ ‘పని’ పూర్తయిన వెంటనే ఇద్దరూ క్షణం ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి ఉడాయిస్తాయి. ఇదే తరహాలో నేరం చేస్తూ గతంలో ఉప్పల్, హబీబ్‌నగర్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లారు. బయటకు వచ్చిన తర్వాత తమ పంథా మార్చుకోకుండా ఇద్దరూ కలిసి మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్, బంజారాహిల్స్, మార్కెట్ ఠాణాల పరిధిలో ఏడు నేరాలకు పాల్పడ్డారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్, మహ్మద్ ముజఫర్ అలీ, ఎన్.రంజిత్‌కుమార్ వలపన్ని సోమ వారం పట్టుకున్నారు. వీరి నుంచి 14.4 తులాల బంగా రం తదితరాలు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. -
బెడిసి కొట్టిన దొంగతనం
-
చైత్రకు చిక్కాడు స్నాచర్
దొడ్డబళ్లాపురం : చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న యువకుడిని ఒక మహిళా హోం గార్డ్ ధైర్య సాహసాలు ప్రదర్శించి పట్టుకున్న సంఘటన నెలమంగల పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. నెలమంగల పట్టణ శివారులోని సొండెకొప్ప బైపాస్ వద్ద ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం సొండెకొప్ప వద్ద మహిళా హోం గార్డ్ చైత్ర విధుల్లో ఉంది. ఈ సమయంలో ఉమేశ్ అనే యువకుడు తన స్నేహితుడితో బైక్‌పై వచ్చి అక్కడే నిల్చున్న మహిళ మెడలో గొలుసు తెంపుకుని వెళ్లడానికి ప్రయత్నించాడు. తక్షణం తేరుకున్న చైత్ర ఉమేశ్ పరారవడానికి ప్రయత్నిస్తుండగా పరుగున వెళ్లి పట్టుకుంది. తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా చైత్ర తన పట్టు వదల్లేదు. పట్టుబడ్డ ఉమేశ్‌ను స్థానికులు చితకబాదారు. తరువాత చైత్ర, చైన్‌స్నాచర్ ఉమేశ్‌ను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టార్గెట్ సెల్‌ఫోన్స్!
ఒకప్పుడు స్నాచింగ్ అంటే మెడలోని గొలుసులు, చేతిలోని బ్యాగ్స్ తస్కరించడం మాత్రమే చేసేవారు. ఇక జేబు దొంగలైతే టార్గెట్ చేసిన వ్యక్తి జేబులో ఉన్న పర్సును చాకచక్యంగా మరో కంటికి తెలియకుండా దొంగిలించేవారు. అయితే ఇటీవలి కాలంలో స్నాచర్లు, పిక్పాకెటర్లు సెల్ఫోన్లనే టార్గెట్ చేస్తున్నారు. చదువుకున్న యువత, జల్సాలకు అలవాటు పడిన వారు ‘జాయ్ స్నాచర్లు’గా మారి పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇటీవల వరుసగా నమోదవుతున్న ఈ తరహా కేసులు ప్రస్తుతం సిటీ పోలీసులకు ఓ పెద్ద ఛాలెంజ్‌గా మారాయి. సాక్షి, సిటీబ్యూరో: స్నాచింగ్.... ఎంపిక చేసుకున్న బాధితుడు/బాధితురాలి మెడలోని గొలుసులు, చేతిలోని బ్యాగ్స్ తస్కరించడం పిక్‌పాకెటింగ్... టార్గెట్ చేసిన వ్యక్తి జేబులో ఉన్న పర్సును చాకచక్యంగా మరో వ్యక్తికి తెలియకుండా దొంగిలించడం ఇప్పటి వరకు ఈ తరహా నేరాలపైనే ఆధారపడేవారు. అయితే ఇటీవలి కాలంలో స్నాచర్లు, పిక్పాకెటర్లు సెల్ఫోన్లనే టార్గెట్ చేసుకుంటున్నారు. చదువుకున్న యువత, జల్సాలకు అలవాటుపడిన వారు సైతం ‘జాయ్ స్నాచర్లు’గా మారి పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇటీవల వరుసగా నమోదవుతున్న కేసుల నేపథ్యంలో ప్రస్తుతం సిటీ పోలీసులకు ‘సెల్‌ఫోన్’ ఓ పెద్ద ఛాలెంజ్‌గా మారింది. గణాంకాల ప్రకారం నగరంలో ఏటా దాదాపు 50 వేలకు పైగా సెల్ఫోన్లు చోరీకి గురవుతున్నాయి.దీనికితోడు అనేక ఛోటామోటా ముఠాలు సెల్‌ఫోన్ పిక్‌పాకెటింగ్, స్నాచింగ్‌ను వ్యవస్థీకృతంగా చేస్తున్నాయి. బస్సు ప్రయాణికులు, పాదచారులను లక్ష్యంగా చేసుకుని సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్నారు. పర్సులు, గొలుసుల నుంచి సెల్ఫోన్ల వైపు... నగరంలోని పిక్‌పాకెటింగ్ గ్యాంగ్‌లు గతంలో కేవలం పర్సులను మాత్రమే టార్గెట్ చేసేవి. అయితే ప్లాస్టిక్ కరెన్సీగా పిలిచే క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం పెరగడంతో పర్సులతో ‘గిట్టుబాటు’ కావట్లేదు. ఐదేళ్ల క్రితం వరకు చైన్ స్నాచింగ్ ముఠాలు వరుపెట్టి పంజా విసిరాయి. అయితే ప్రజల్లో పెరిగిన చైతన్యం, పోలీసుల చర్యలతో ఈ వ్యవస్థీకృత ముఠాలకు చెక్ పడింది. మిగిలిన స్నాచర్లకు మెడల్లో బంగారం దొరకడం గగనంగా మారిపోవడంతో వారి దృష్టీ సెల్ఫోన్లపై పడింది. అందుకే ఇటీవల కాలంలో పిక్పాకెటర్లు పర్సులను, స్నాచర్లు గొలుసుల్ని వదిలేసి సెల్ఫోన్లపై పడ్డారు. కొందరు ముఠాలు కట్టి వ్యవస్థీకృతంగా సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ముఠాలు పరిధులను సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి. నిషా జోరు..సరదా కోసం.. ఇటీవల కాలంలో ‘జాయ్ సెల్‌ఫోన్ స్నాచర్లు’ పెరిగిపోతుండటం నగర పోలీసులకు కొత్త సవాళ్లను విసురుతోంది. ఈ నేరాలు చేసే వారిలో అత్యధికులకు వాస్తవానికి ఆ అవసరం ఉండదు. ఇలాంటి స్నాచర్ల కుటుంబాలు సైతం స్థిరపడినవో, విద్యాధికులతో కూడినవో ఉంటున్నాయి. అయితే మద్యం మత్తులోనో, గంజాయికి బానిసలుగా మారడంతోనో వీరు గతి తప్పుతున్నారు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం ‘తాత్కాలిక స్నాచర్లుగా’ మారిపోయి అప్పుడప్పుడు నేరాలు చేస్తున్నారు. ఇలాంటి వారిలోనూ కొందరు ఈజీ మనీకి అలవాటుపడి వరుసపెట్టి నేరాలు కొనసాగిస్తున్నారు. వ్యవస్థీకృతం కాని, నేరం చేయాల్సి అవసరం లేని వారిలో సరదా కోసం చేస్తున్న వారి సంఖ్యా ఇటీవల పెరుగుతోందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరు సరదా కోసం సెల్ఫోన్లు లాక్కుపోతూ స్నాచింగ్, దోపిడీ కేసుల్లో నిందితులుగా మారుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా దక్షిణ మండలంతో పాటు అంతరాష్ట్ర, జిల్లా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఉన్న చోట్ల ఈ చోరీలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిపారు. ఇలాంటి కేసుల్ని సీసీ కెమెరాల ఆధారంగా కొలిక్కి తెస్తున్న పోలీసులునేరగాళ్లను కట్టడి చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. ఐఎంఈఐ నంబర్ మార్చేసి... ప్రతి మొబైల్ ఫోన్‌కు ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యుప్మెంట్ ఐడెంటిఫికేషన్‌గా పిలిచే (ఐఎంఈఐ) నంబర్ ఉంటుంది. మనిషి వేలిముద్రల మాదిరిగా ప్రపంచంలోని ఏ రెండు సెల్ఫోన్లకూ ఒకే నెంబర్ ఉండదు. సదరు సెల్‌ఫోన్‌ను ఏ వ్యక్తి వినియోగిస్తున్నది తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. జాతీయ భద్రత నేపథ్యంలో ఇది ఎంతో కీలకం. ఐఎంఈఐ నంబర్ ట్యాంపర్ చేసేందుకు ఉపకరించే గ్యాడ్జెట్ విపణిలో లభిస్తున్నాయి. చోరీ ఫోన్లకు దొంగల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసే వ్యక్తులు ఈ గ్యాడ్జెట్స్‌ను వినియోగించి దానికి ఉన్న నంబర్‌కు బదులు మరో ఐఎంఈఐ నంబర్ కేటాయిస్తారు. మరోపక్క పనికి రాని పాత ఫోన్లను రూ.వందల్లో కొనుగోలు చేస్తూ వాటి మదర్ బోర్డ్‌పై ఉన్న ఐఎంఈఐ నెంబర్ స్ట్రిప్‌ను ట్యాంపరింగ్ ద్వారా సేకరించి చోరీ చేసిన వాటికి వేసే వారు. తద్వారా సాంకేతికంగా చోరీ ఫోన్లను పట్టుకోవడం సాధ్యం కాదు. గతంలో కేవలం ఈ విధానం ద్వారా మాత్రమే దొంగ ఫోన్లను ‘దొర’ఫొన్లుగా మార్చేసేవారు. సరిహద్దులు దాటిస్తూ... తాజాగా చోరీ సెల్ఫోన్లను కొనుగోలు చేస్తున్న ఇటీవల కాలంలో ఈ చోరీ సెల్ఫోన్లను కొనుగోలు చేసే మారు వ్యాపారుల పంథా పూర్తిగా మారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కారణంగానే తస్కరణకు గురవుతున్న సెల్ఫోన్లలో గరిష్టంగా 30 నుంచి 40 శాతం కూడా రికవరీ కావట్లేదని భావిస్తున్నారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఈ తరహా వ్యాపారాలు ప్రారంభించిన చోరీ మాల్ వ్యాపారస్థులు సిండికేట్స్‌గా చైనా మార్గాన్ని ఎంచుకున్నట్లు కొన్ని ఆధారాలు సేకరించారు. గడిచిన కొన్నేళ్లుగా చైనా నుంచి వివిధ రకాలైన వస్తువులను దిగుమతి చేసుకోవడం సాధారణంగా మారిపోయింది. ఇలా వచ్చిన మాల్లో కొంత అనేక కారణాల నేపథ్యంలో రిటర్న్ చేస్తుంటారు. వీటితో కలిపి చోరీ సెల్ఫోన్లను చైనాకు పంపుతున్నట్లు అనుమానిస్తున్నారు. పక్కా ప్రొఫెషనల్ చోరుల నుంచి కొన్న ఖరీదైన హై–ఎండ్ ఫోన్లను మాత్రమే ఇలా పంపేస్తున్నట్లు నిర్థారిస్తున్నారు. ఈ కారణంగానే ఇటీవల కాలంలో చోరీకి గురైన హై–ఎండ్ సెల్ఫోన్లను రికవరీ చేయడం అసాధ్యంగా మారినట్లు తెలిపారు. ఈ వ్యవహారాలపై దృష్టి పెట్టిన పోలీసులు బాధ్యుల కోసం లోతుగా ఆరా తీస్తున్నారు. -
చైన్‌స్నాచర్ అఘాయిత్యం
కర్ణాటక, దొడ్డబళ్లాపురం : చైన్‌స్నాచర్లు మరోసారి తెగబడ్డారు. బెంగళూరు ఉత్తర తాలూకా పరిధిలోని బాగలూరులో గొలుసు చోరీకి ప్రతిఘటించిన మహిళపై కొడవలితో దాడిచేసి గాయపరిచారు. బాగలూరు గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ శుక్రవారం సాయంత్రం వాకింగ్ చేస్తుండగా స్కూటీలో వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని గొలుసు లాక్కెళ్లడానికి ప్రయత్నించారు. అయితే ఆమె ప్రతిఘటించడంతో ఆగ్రహించిన ఒక దుండగుడు కొడవలితో గాయపరిచి పరారయ్యారు. లక్ష్మి కేకలు విన్న స్థానికులు ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు. బాగలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఒంటరిగా వెళ్లే మహిళలే లక్ష్యం
గుంటూరు: ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే మహిళల్ని లక్ష్యంగా చేసుకొని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడి పోలీసులకు సవాలుగా మారిన ఘరానా దొంగను అర్బన్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని అర్బన్ ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ సీహెచ్. విజయారావు వివరాలు వెల్లడించారు. చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామానికి చెందిన యువకుడు పోతినేని గోపి ఆరో తరగతి వరకు చదివాడు. తాపీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. వ్యసనాలకు బానిసగా మారి పేకాట, మద్యం, కోడి పందాలకు అలవాటు పడ్డాడు. అప్పులపాలై వాటిని తీర్చేందుకు చైన్ స్నాచింగ్‌లు చేయాలని నిశ్చయించుకొని ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. నంబరు ప్లేటును తొలగించి ముఖానికి ఖర్చీఫ్ కట్టుకొని హెల్మెట్ ధరించి..శుభకార్యాలకు, దేవాలయాలకు రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్లే ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని చైన్ స్నాచింగ్‌కు పాల్పడి ద్విచక్ర వాహనంపై పరారవుతుంటాడు. ఈ తరహాలో తెనాలి, పొన్నూరు, గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లో గడచిన ఏడాది ఏప్రిల్ నుంచి వరుసగా ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకు 25 చైన్ శ్నాచింగ్లకు పాల్పడ్డాడు. పట్టుపడిందిలా... అర్బన్ జిల్లా పరిధిలో మొత్తం 22 చైన్ స్నాచింగ్‌లు జరిగాయి. దీంతో స్థానిక పోలీసులు, సీసీఎస్ పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమేరా పుటేజీల్ని పరిశీలించినా నిందితుడి ఆచూకీని గుర్తించలేక పోయారు. ఈ క్రమంలో అర్బన్ జిల్లా పరిధిలో మరింత నిఘాను పెంచారు. ఈనెల 12న తెనాలి వైపు నుంచి మంగళగిరి ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకుడు ఆనవాళ్లను ప్రత్యేక టీంలో ఉన్న కానిస్టేబుళ్లు ఏ.నాగాంజనేయులు, కిరణ్‌కుమార్ గుర్తించారు. వెంటనే మంగళగిరి, సీసీఎస్ సీఐలను అప్రమత్తం చేశారు. హుటాహుటిన రంగంలోకి దిగిన ప్రత్యేక బలగాలు మంగళగిరి వైపు వస్తున్న యువకుడిని పెద్దవడ్లపూడి గ్రామ సమీపంలోని కోకోకోలా కంపెనీ ఎదురుగా చూసి అదుపులోకి తీసుకొనేందుకు యత్నించారు. అప్పటికే పోలీసుల్ని గుర్తించిన యువకుడు పరారయ్యేందుకు విఫలయత్నం చేసి దొరికి పోయాడు. వారిదైన శైలిలో విచారించగా నేరాలకు పాల్పడినట్లు అంగీకరించడంతో రూ. 31 లక్షల విలువ చేసే 1.37కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సిబ్బంది పనితీరు అభినందనీయం విధి నిర్వహణలో ప్రతిభను చూపి పోలీసులకు సవాలుగా మారిన నేరస్తుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్న కానిస్టేబుళ్లు నాగాంజనేయులు, కిరణ్‌కుమార్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వారికి క్యాష్ రివార్డులు అందచేశారు. సీఐలు రవిబాబు, అబ్దుల్ కరీం, సురేష్‌బాబు, సిబ్బందిని అభినందించి వారికి కూడా క్యాష్ రివార్డులు అందచేస్తామని ఎస్పీ వివరించారు. ధైర్యసాహసాలను ప్రదర్శించి నిందితుడిని అరెస్టు చేసిన ప్రత్యేక బృందాన్ని అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు వైటీ నాయుడు, బి.లక్ష్మీనారాయణ, ఎస్.రాఘవ పాల్గొన్నారు. మూడు రోజుల్లో నిందితుల అరెస్టు మంగళగిరి మండలం నవులూరు గ్రామ పరిధిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం సమీపంలో ఈనెల 11న రాత్రి సమయంలో చోటు చేసుకున్న ఘటనలో అంగడి జ్యోతి మృతి చెందడం విచారకరమని ఎస్పీ తెలిపారు. నిర్జీవ ప్రదేశం, వీధిలైట్లు లేని కారణంగా మరింత నిఘాను పెట్టలేక పోయామని స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో వీధిలైట్లు ఏర్పాటు చేయాలని సీఆర్డీఏకు లేఖ రాస్తున్నామని చెప్పారు. యువతిపై అత్యాచారం జరిగిన ఆనవాళ్లు లేవన్నారు. సాంకేతిక పరంగా విచారణ కొనసాగుతుందన్నారు. తెలిసిన వ్యక్తులే దుర్ఘటనకు కారణమై ఉంచవచ్చని ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. మరో మూడు రోజుల్లో నిందితుల్ని అరెస్టు చేసి మీడియా ఎదుట ఉంచుతామని వివరించారు. -
పట్టపగలు తెగబడ్డ చైన్ స్నాచర్లు
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: పట్టపగలు మహిళల మెడలోని గొలుసులు తెంపుకుని పరారవుతున్న ఇద్దరు చైన్ స్నాచర్లను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన రామనగరలో చోటుచేసుకుంది. అక్రంబాష, మునరుల్ షేక్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం రామనగర రాయరదొడ్డి సర్కిల్లో నిందితులు ఇద్దరూ తలుపులు కొట్టి తాగడానికి నీళ్లు అడిగి మహిళలు బయటకు వచ్చి నీళ్లు ఇచ్చే సమయంలో చైన్లు లాక్కుని పరారయ్యారు. మహిళలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పట్టుకుని చితకబాదారు. నిందితులు వచ్చిన బైక్ డిక్కీలో కత్తులు, కారంపుడి, ఇతర వస్తువులు దొరికాయి.అ నంతరం పోలీసులకు అప్పగించారు. ఐజూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గొలుసు దొంగల హల్చల్
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలో గొలుసు దొంగలు హల్చల్ చేశారు. ఒంటరిగా వెళుతున్న మహిళల మెడల్లోని బంగారు గొలుసులను తెంపుకెళ్లారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా పోలీసు కార్యాలయంలో పనిచేస్తున్న పద్మావతి ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం సమీపంలో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఇంటికి వెళుతుండగా ఇంటికి సమీపంలోని పెట్రోల్‌బంకు వద్దకు వచ్చేసరికి ఇద్దరు గుర్తుతెలియని దుండగులు బైక్‌పై వచ్చి ఆమె మెడలోని ఏడు సవర్ల బంగారు గొలుసులను తెంపుకెళ్లారు. ఆమె గట్టిగా కేకలు వేసినా లాభం లేకుండా పోయింది. మహిళా హెడ్‌కానిస్టేబుల్ మెడలో.. వెంకటాచలం పోలీసు స్టేషన్లో అమృతవల్లి హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఆమె నగరంలోని ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం సమీపంలో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఆమె స్టేషన్ నుంచి స్కూటీలో ఇంటికి బయలుదేరింది. ఇంటిగేట్ తీసేందుకు స్కూటీ ఆపి వెళుతుండగా ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి ఆమె మెడలోని ఆరు సవర్ల బంగారు గొలుసును తెంపుకెళ్లారు. బాధితురాలు పెద్దగా అరిచేలోగా దుండగులు బైక్ వేగం పెంచి పరారయ్యారు. రమేష్‌రెడ్డినగర్‌లో... కె.లక్ష్మీప్రసన్న అనే మహిళ రమేష్‌రెడ్డినగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆమె మంగళవారం రాత్రి ఏసీ కూరగాయల మార్కెట్‌కు వెళ్లింది. కూరగాయలు కొనుగోలు చేసి ఇంటికి నడుచుకుంటూ బయలుదేరింది. ఇంటికి సమీపంలో వచ్చేసరికి ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి ఆమె మెడలోని మూడుసవర్ల బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ మేరకు బాధితులు ఘటన జరిగిన కొద్దిసేపటికే చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేస్తున్న పోలీసులు గొలుసు దొంగతనాలు జరగడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. బుధవారం నగర వ్యాప్తంగా విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మోటార్‌బైక్‌పై అనుమానాస్పదంగా వెళుతున్న ఇద్దరు వ్యక్తులను చిన్నబజారు పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. వారే గొలుసులను దొంగలించినట్లుగా విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు వారిని పూర్తిస్థాయిలో విచారిస్తున్నట్లు తెలిసింది. -
తెగబడిన గొలుసు దొంగలు
చిలకలగూడ : చిలకలగూడ ఠాణా పరిధిలోని పద్మారావునగర్‌లో బుధవారం రాత్రి చైన్‌స్నాచర్లు పంజా విసిరారు. నడిచి వెళుతున్న ఇద్దరు మహిళలను టార్గెట్ చేసుకుని బైక్‌పై వెనుకనుంచి వచ్చి వారి మెడలోని బంగారు గొలుసులు లాక్కెళ్లారు. నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వార్, అడిషనల్ డీసీపీ శాంతి శ్రీనివాస్ ఘటనస్థలాన్ని పరిశీలించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పద్మారావునగర్ స్టెర్లింగ్ మెజిస్టిక్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న భార్గవి, అపార్ట్మెంట్ వాచ్మెన్ కుమార్తె శ్రీదేవితో కలిసి బుధవారం రాత్రి సమీపంలోని సూపర్‌మార్కెట్‌కు నడిచి వెళుతుండగా బైక్‌పై వెనకనుంచి వచ్చిన ఇద్దరు దుండగులు వారి మెడలోని బంగారు గొలుసులను తెంపుకుని క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్, అడిషనల్ డీసీపీ శాంతి శ్రీనివాసరావులతోపాటు చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి, డీఐ నర్సింహారాజు, టాస్క్‌ఫోర్స్ సీఐ నాగేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పద్మారావునగర్‌లోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుల ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు అధికారులు తెలిపారు. -
ప్రాక్టీస్ కోసం విఫలయత్నాలు.. సింగిల్‌గానే స్నాచింగ్స్!
సాక్షి, సిటీబ్యూరో: క్యాబ్ కోసం చేసిన అప్పులు తీర్చడానికి ఒంటరిగానే స్నాచింగ్స్ చేయాలనుకున్నాడు... బైక్ నెంబర్‌ను ‘మార్కింగ్’ చేసి ఐదుసార్లు విఫలయత్నం చేశాడు... ఆరోసారి సక్సెస్ కావడంతో ‘స్ఫూర్తిని’ కొనసాగిస్తూ మరో ఆరు నేరాలు చేశాడు... చోరీ సొత్తును ఎవరికీ అమ్మకుండా కేవలం ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టులు పెట్టేవాడు. మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం పట్టుకున్న బాక్సర్ కమ్ స్నాచర్ కోన నర్సింగ్‌రావు అలియాస్ నర్సింహ నేపథ్యమిదీ. ప్రాథమికంగా ఇతడిని గాంధీనగర్ పోలీసులు జైలుకు పంపగా... మిగిలిన ఐదు ఠాణాల అధికారులు ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్‌పై తమ కేసుల్లో అరెస్టులు చేయాలని నిర్ణయించారు. తండ్రి పదవీ విరమణతో... నర్సింహ తండ్రి కృష్ణ నిలోఫర్ ఆస్పత్రిలో చిరుద్యోగిగా పని చేసేవాడు. 2006లో అతను రిటైర్ కావడంతో చదువు మానేసిన నర్సింహ అప్పటికే తెలిసిన బాక్సింగ్ విద్యతో కోచ్‌గా మారాడు. పగలు, సాయంత్రం ఈ ఉద్యోగం చేస్తూనే అదనపు ఆదాయం కోసం అన్వేషించాడు. ఈ నేపథ్యంలో ఇతడి దృష్టి క్యాబ్‌పై పడింది. తెలిసినవారి వద్ద అప్పులు చేసిన కారు కొనుగోలు చేసిన అతను ఓ కంపెనీకి అద్దెకు పెట్టాడు. అందులో తీవ్ర నష్టాలుడంతో అప్పులకు వడ్డీలు కూడా కట్టలేని స్థితికి చేరాడు. దీంతో అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. బాక్సింగ్ కోచ్, క్యాబ్ డ్రైవర్‌గా సంపాదించింది కుటుంబ పోషణకే చాలకపోవడంతో దిక్కుతోచని స్థితికి చేరాడు. దీంతో స్నాచింగ్స్ చేయడం ద్వారానే తేలిగ్గా డబ్బు సంపాదించడం సాధ్యమవుతుందని భావించాడు. జట్టు కడితే ‘లీకేజ్’ సమస్యని... సాధారణంగా స్నాచింగ్ చేయాలంటే ఇద్దరు ఉండాల్సిందే. ఒకరు బైక్ నడుపుతుంటే మరొకరు గొలుసు లాగుతారు. అయితే ఇలా ఎవరితోనైనా కలిసి ముఠా కడితే అతడి ద్వారా తన ఉనికి బయటపడుతుందని భావించిన నర్సింహ ఒంటరిగానే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. ఏడు నెలల క్రితం ఓ బైక్ ఖరీదు చేసిన అతను దానిపై మలక్‌పేట, ఉప్పల్, బీరప్పగడ్డ, వనస్థలిపురం ప్రాంతాల్లో సంచరించాడు. ఒంటరిగా వెళ్తున్న మహిళల మెళ్లోని మంగళసూత్రాలు లాగే ప్రయత్నం చేశాడు. ఈ ఐదుసార్లూ గొలుసులు తెంపగలిగినా అవి బాధితుల చేతికి చిక్కడమో, తప్పించుకునే ప్రయత్నాల్లో కింద పడిపోవడమే జరిగింది. దీంతో మరింతగా ‘ప్రాక్టీసు’ చేసిన నర్సింహ చివరకు సింగిల్‌గానే వాహనంపై తిరుగుతూ స్నాచింగ్స్ చేయడంపై పట్టు సాధించాడు. మూడును ఎనిమిదిగా మార్చుకుని... అయితే అతను పోలీసులకు ఆధారాలు చిక్కకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. సీసీ కెమెరాల్లో రికార్డు కాకూడదనే ఉద్దేశంతో స్నాచింగ్‌కు వెళ్లేప్పుడు ప్రధాన రహదారులు, సిగ్నల్స్ ఉన్న జంక్షన్స్‌ను వినియోగించే వాడుకాదు. ఇతడు సంచరించే బైక్ నెంబర్ ఏపీ 28 బీపీ 4232 కాగా నేరం చేయడానికి వెళ్లే ప్రతి సందర్భంలోనూ ‘3’ను మార్కర్‌తో ‘8’గా మార్చేసేవాడు. ‘పని’ పూర్తయిన తర్వాత దానిని తడిచేసేవాడు. ఇదే తరహాలో అతను మీర్పేట్, అమీర్‌పేట్, ఉప్పల్, వనస్థలిపురం, గాంధీనగర్, సరూర్‌నగర్ ప్రాంతాల్లో ఆరు స్నాచింగ్స్ చేసి రూ.7 లక్షల విలువైన 16.5 తులాల బంగారం లాక్కెళ్లాడు. ఈ నేరాలు చేస్తున్నప్పుడూ ఎవరికీ అనుమానం రాకూడదనే ఉద్దేశంతో బాక్సింగ్ కోచ్‌గా కొనసాగాడు. తాకట్టు పెట్టి క్యాష్ చేసుకుంటూ... ఈ మంగళసూత్రాలు, అవి ఉండే గొలుసులను నర్సింహ ఎక్కడా అమ్మలేదు. కేవలం పెద్ద సంస్థల్లో తాకట్టు పెట్టేవాడు. తన గుర్తింపుకార్డును దాఖలు చేస్తూ గొలుసులను తాకట్టు పెట్టి వాటి విలువలో 80 శాతం నగదు తీసుకుని ఉడాయించేవాడు. మంగళసూత్రాలు తాకట్టు పెడితే అనుమానం వస్తుందని వాటిని తన వద్దే ఉంచేవాడు. రెండుమూడు సూత్రాలు పోగైన తర్వాత వాటిని ఉప్పుగూడలోని వృద్ధుడైన గోల్డ్‌స్మిత్ వద్దకు తీసుకెళ్లేవాడు. అతడి సాయంతో వాటిని కరిగించి గాజుగా మార్చేవాడు. ఆపై దీనిని కుదువపెట్టి క్యాష్ చేసుకునే వాడు. కేవలం తాకట్టు పెట్టడం తప్ప విడిపించడం అనేది ఇతడి ‘చరిత్రలో’ లేదు. శనివారం నర్సింహను పట్టుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాంధీనగర్ ఠాణాకు అప్పగించారు. -
చైన్స్నాచర్లపై అవగాహన కోసం పాట పాడిన పోలీస్
-
ఓ పోలీస్ పాట సోషల్ మీడియాలో వైరల్..
కర్ణాటక, బొమ్మనహళ్లి: ఆ పోలీసు గస్తీ కాయడం, దొంగలను పట్టుకోవడం వంటి విధులతోనే ఊరుకోలేదు. తన బుర్రకు, గొంతుకు పనిచెప్పి ఓ పాటను వదిలాడు. ఇక అంతే. జనంలో ఓ హీరో అయ్యాడు. బెంగళూరు నగరంలో ప్రతి రోజూ చైన్ స్నాచింగ్‌లతో మహిళలు బయటకు రావాలంటే భయపడాల్సి వస్తోంది. ఒంటరి మహిళలు, వృద్ధులపై చైన్‌స్నాచర్లు తెగబడుతున్న దారుణాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి పోలీస్ కానిస్టేబుల్ స్వయంగా పాడి రూపొందించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ఆదరణ చూరగొంటోంది. బయ్యప్పనహళ్లి పోలీస్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్య.. చైన్‌స్నాచింగ్‌ల వల్ల మహిళలకు కలుగులుతున్న ఇబ్బందులు, సమాజంలో చోటు చేసున్న భయానక వాతావరణం, చైన్‌స్నాచింగ్‌లను అడ్డుకట్ట వేయడానికి అనుసరించాల్సిన విధానాలను వివరిస్తూ స్వయంగా పాటపాడి వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. హేమంత్ సంగీత దానం ఆయన ఉడతాభక్తి సేవను గుర్తించిన శాండల్ ఉడ్ సంగీత దర్శకుడు హేమంత్ పాటకు సంగీతం సమకూర్చారు. ఈ పాటకు య్యూటూబ్‌లో లక్షల మంది చూశారు, దీంతో సుబ్రహ్మణ్య పాటను ఫేస్బుక్, వాట్సాప్‌లలో కూడా అప్లోడ్ చేశారు. మరింత వైరల్‌గా మారడంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ సునీల్‌కుమార్.. సుబ్రహ్మణ్యను అభినందించి నగదు బహుమానంతో సత్కరించారు. సంతోషంగా ఉంది ‘చైన్‌స్నాచింగ్‌ల వల్ల మహిళలు, వృద్ధులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరించి ఇకపై చైన్ స్నాచింగ్‌లకు పాల్పడవద్దంటూ చైన్స్నాచర్లకు సూచించా. ఇంత స్పందన రావడం ఎంతో సంతోషంగా ఉంది’. –సుబ్రహ్మణ్య, కానిస్టేబుల్ -
కూకట్‌పల్లిలో పట్టుబడ్డ ‘కంజర్ కెర్వా’ముఠా
-
‘పదేళ్ల’ దొంగల పని పట్టారు!
సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. దశాబ్దాకాలంగా జాతీయ రహదారుల్లోని డాబాలు, రెస్టారెంట్లు, హోటళ్ల వద్ద బస్సుల్లో చోరీలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న కంజర్ కెర్వా ముఠాకు చెందిన ఐదుగురిని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నుంచి మూడున్నర కిలోల బంగారు ఆభరణాలు, మారుతీ స్విఫ్ట్ డిజైర్ కారు, పదునైన కత్తులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ గురువారం ఇక్కడ వెల్లడించారు. తోటి ప్రయాణికుల్లాగా వ్యవహరిస్తూ... మధ్యప్రదేశ్ రాష్ట్రం దార్ జిల్లా మన్వర్ తాలూకా కెర్వా జాగీర్ గ్రామానికి అనుకొని ఉన్న ముల్తానిపురకు చెందిన హైదర్ ఆలీ కాశమ్ ముల్తాని, సికిందర్ రజాక్, మోసిన్ ఖాన్, మహమ్మద్ తాయూబ్ ఖాన్, అఫ్సర్ ఖాన్లు ముఠాగా ఏర్పడ్డారు. ఏడు నెలల నుంచి హైదరాబాద్ ఔటర్‌రింగ్ రోడ్డు బయట హైవేల్లోని దాబాలు, హోటల్స్ వద్ద హాల్ట్ తీసుకున్న బస్సుల్లో చోరీలు చేస్తున్నారు. ప్రణాళిక ప్రకారం కారులో వచ్చేవారు. లక్ష్యంగా చేసుకున్న బస్సు నిలిపిన దాబాకు 200 మీటర్ల దూరంలో వాహనాన్ని నిలిపి కట్టింగ్ ప్లేయర్, కత్తులు, స్క్రూడ్రైవర్లను తీసుకొని సాధారణ ప్రయాణికుల్లాగానే బస్సు ఎక్కేవారు. ఆ సమయంలో చాలామంది ప్రయాణికులు చాయ్ తాగేందుకు, టిఫిన్, భోజనం చేసేందుకు బస్సు దిగి వెళ్లేవారు. బస్సుల్లోని బ్యాగ్‌లను తెరిచి నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులుంటే తీసుకెళ్లేవారు. ఇలా ఒక ట్రిప్పులో 4 చోరీల వరకు చేసి ఎవరికీ దొరక్కుండా ఉడాయించేవారు. సొత్తు పొగొట్టుకున్నవారి ఫిర్యాదు మేరకు బస్సులో ఉన్న వారందరినీ పోలీసులు తనిఖీ చేస్తే ఏమీ దొరికేది కాదు. అయితే, ఏడునెలలుగా ఈ తరహా చోరీలపై ఫిర్యాదులు ఎక్కువవుతుండటంతో నిగ్గు తేల్చేందుకు శంషాబాద్ ఎస్వోటీ బృందాన్ని బరిలోకి దింపారు. పక్కా రెక్కీతో పట్టుకున్నారు.. ఈ తరహా చోరీల్లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఒకరిని అరెస్టు చేసినట్టుగా శంషాబాద్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌రెడ్డి నేతృత్వంలోని బృందానికి తెలిసింది. ఇండోర్ అధికారి ఇచ్చిన వివరాల మేరకు ఎస్వోటీ పోలీసులు ముల్తానిపురకు వెళ్లారు. ఆ గ్రామంలో 70 నుంచి 80 ఇళ్లు ఉండగా, అందులో 50 నుంచి 60 మందికి నేరచరిత్ర ఉన్నట్టు తెలుసుకున్నారు. వీరి ఇళ్లు రాజభవంతులను తలపించేలా కట్టుకోవడం పోలీసులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కాశమ్ ముల్తాని రెండేళ్లుగా ఒక స్కూల్ నిర్వహిస్తున్నాడు. 2013లో నిందితులను పట్టుకునేందుకు ఈ గ్రామానికి వచ్చిన అనంతపురం జిల్లాకు చెందిన ఇన్స్పెక్టర్, ఎస్ఐ, కానిస్టేబుళ్లపై దాడి చేశారనే విషయం ఎస్వోటీ పోలీసులకు తెలిసింది. ఈ నేపథ్యంలో గ్రామానికి సమీపంలోనే దాదాపు 25 రోజులపాటు ఉండి హైదరాబాద్ వెళ్లే వారి గురించి వాకబు చేశారు. 25 మంది వరకు వచ్చి వెళుతుంటారని తెలుసుకున్నారు. నెలరోజుల్లో 28 రోజులు ఇంట్లోనే ఉండి రెండు రోజులు చోరీలకు వెళుతుంటారని తెలుసుకున్నారు. అప్పటికే ఐదుగురు చోరీల కోసం హైదరాబాద్ బయలుదేరినట్టు గుర్తించారు. ఓఆర్ఆర్, కూకట్‌పల్లిలో ఎస్వోటీ పోలీసులు నిఘా ఉంచి ఐదుగురి నిందితులను పట్టుకున్నారు. వీరి అరెస్టుతో కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్, కోదాడ, నల్లగొండల్లో నమోదైన 12 కేసులను ఛేదించినట్లైంది. మోస్ట్ వాంటెడ్ క్రిమిన్సల్‌ను పట్టుకున్న ఎస్వోటీ బృందాన్ని సీపీ సజ్జనార్ రివార్డులతో సన్మానించారు. ఈ గ్యాంగ్ వివరాలతో ఇతర రాష్ట్రాల డీజీపీలకు లేఖ రాస్తామని, అక్కడ కూడా ఇటువంటి చోరీలు ఏమైనా జరిగితే కేసు పరిష్కారానికి ఉపయోగపడతాయని సజ్జనార్ తెలిపారు. -
ప్రిన్స్ 22 కేసులు 52
మలక్‌పేట: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పలు దొంగతనాలు, స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఘరానా దొంగను పోలీసులు అరెస్టు చేశారు. మలక్‌పేట ఇన్స్పెక్టర్ గంగారెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.బార్కాస్‌కు చెందిన మహ్మద్ అమీర్ అలీయాస్ ప్రిన్స్ (22) చిన్నతనం నుంచే అవారాగా తిరిగేవాడు. 2009 నుంచి దొంగతనాలకు పాల్పడి పలుమార్లు జువైనల్ హోమ్‌కు వెళ్లి వచ్చాడు. 2012 నుంచి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని పలు పోలీస్స్టేషన్లలో అతనిపై 52 స్నాచింగ్‌లు, దొంగతనం కేసు నమోదయ్యాయి. గత ఏడాది పీడీయాక్ట్ కింద జైలుకు వెళ్లిన అతను గత నెల 30న బయటికి వచ్చాడు. అయినా తన పంథా మార్చుకోకుండా చత్రినాక పీఎస్ పరిధిలో హోండాషైన్ బైక్‌ను ఎత్తుకెళ్లాడు. అదే బైక్‌పై తిరుగుతూ ఈ నెల 3 న మూసారంబాగ్ డివిజన్ ఫ్రెండ్స్‌కాలనీలో వాకింగ్‌కు వెళుతున్న ప్రమీలాబాయి మెడలోంచి 4 తులాల బంగారు మంగళ సూత్రం తెంచుకుని వెళ్తుండగా అక్కడే విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికురాలు జ్యోతి చీపురు కర్రతో కొట్టిన ఆమెను తప్పించుకుని ఎస్బీఐ ఆఫీసర్స్ కాలనీ వైపు పరాయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 3 తులాల బంగారు గొలుసు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం మలక్‌పేట పోలీసులకు అప్పగించగా, రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
అటు తెలంగాణ.. ఇటు ఆంధ్రా
తాడేపల్లిగూడెం రూరల్ : చోరీ కేసులో దొంగను అరెస్టు చేసి, పది గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు ఫోన్లు, వాచీలు, వెండి పట్టీని స్వాధీనం చేసుకున్నట్టు పట్టణ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్ మూర్తి తెలిపారు. బుధవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో విలేకరులకు ఆయన వివరాలు వెల్లడించారు. తెలంగాణలోని హయత్‌నగర్‌కు చెందిన శీలి శివకృష్ణ అలియాస్ శివకుమార్ అలియాస్ శివ అనే వ్యక్తి తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేట గ్రామంలోని అత్తవారింట్లో నివాసముంటూ తెలంగాణలోను, తాడేపల్లిగూడెం పట్టణంలోనూ పలు చోరీలకు పాల్పడ్డాడు. గత నెల మార్చి 20న పట్టణంలోని బాపూజీ పుంత రోడ్డులోని బీఐ రాజేంద్ర నివాసంలో శివకృష్ణ చోరీ చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు శివకృష్ణపై నిఘా పెట్టారు. పట్టణ ఎస్సై కేవీ రమణ హయత్‌నగర్‌లో విచారించగా అక్కడ లభించిన సమాచారంతో జగ్గన్నపేటలో ఉంటున్న శివకృష్ణను బుధవారం అరెస్టు చేసినట్లు సీఐ మూర్తి చెప్పారు. అతని నుంచి 10 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.4 వేలు నగదు, ఐదు వాచీలు, ఐ–ఫోన్, నోకియా లుమియా ఫోన్, వెండి పట్టిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. గతంలో కూడా హయత్‌నగర్‌లో ఇటువంటి చోరీలకు పాల్పడి శివకృష్ణ జైలుకు వెళ్లినట్టు పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చామన్నారు. ప్రజలు ఎల్‌హెచ్‌ఎంఎస్ విధానాన్ని వినియోగించుకోవడం ద్వారా చోరీల నివారణకు సహకరించాలని సీఐ కోరారు. ఎస్సై కేవీ రమణ, ఏఎస్సై కె.సాంబశివరావు, హెచ్‌సీలు రాంబాబు, అల్లూరి సత్యనారాయణరాజు, సిబ్బంది ఎస్.నాగరాజు, కె.రాజు, కె.మహేష్, టి.రవి పాల్గొన్నారు. -
బంగారు గొలుసులపైనే చూపు
నిడదవోలు :వివాహాది శుభకార్యాల సీజన్ వస్తే అతడికి పండుగే.. కల్యాణ మండపాల వద్ద రెక్కీ నిర్వహిస్తాడు. ఒంటరిగా వెళుతున్న మహిళలనే టార్కెట్ చేస్తాడు. హఠాత్తుగా మెడలో ఉన్న మంగళ సూత్రాలు, బంగారు గొలుసులను తెంచుకుని ఊడాయిస్తాడు. ఈ దొంగ ఎట్టకేటకు పోలీసులకు చిక్కాడు. దీనికి సంబంధించిన వివరాలను నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ బుధవారం విలేకరులకు వెల్లడించారు. మహిళల మెడలో బంగారు ఆభరణాలు అపహరిస్తున్న తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన ఘంటా కాశీవిశ్వనా«థ్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.5 లక్షల విలువ చేసే 22 కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఎక్కవగా మహిళల మెడల్లోని మంగళసూత్రాలు, గొలుసులే ఉన్నాయి. పట్టుబడిందిలా.. చాగల్లు గ్రామంలో పేముల కాలువ బ్రిడ్జి వద్ద వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న కాశీవిశ్వనాథ్‌ను ఆపారు. అతని తీరుపై అనుమానంతో విచారించగా, పలు నేరాలకు పాల్పడినట్టు అంగీకరించాడు. నిందితుడికి బావ అయిన తొండ పోతురాజుతో కలసి 2017లో చాగల్లు, చంద్రవరం, కాటకోటేశ్వరం, పురుషోత్తపల్లి, పిట్టల వేమవరం గ్రామాల్లో ఒంటరిగా వెళుతున్న మహిళలు, వివాహాల సమయంలో కల్యాణ మండపాల వద్ద ఉన్న మహిళల మెడల్లో బంగారు ఆభరణాలు అపహరించాడు. పరారీలో ఉన్న పోతురాజును అరెస్టు చేయాల్సి ఉంది. కేసును ఛేదించిన చాగల్లు ఎస్సై ఎస్.రామకృష్ణ, ఐడీ పార్టీ ఏఎస్సై ఎండీ షరీఫ్, హెచ్‌సీ సత్యనారాయణ, కానిస్టేబుళ్లు బాల, అనిల్, సునీల్, బాషాలను సీఐ బాలకృష్ణ అభినందించారు. వీరికి రివార్డుల కోసం జిల్లా ఉన్నతాధికారులకు నివేదించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ ఎస్సై జి.సతీష్, రూరల్ ఎస్సై కె.రవికుమార్ తదితరలు పాల్గొన్నారు. -
‘టాక్టికల్’గా పట్టేశాడు
సాక్షి, సిటీబ్యూరో: కాస్పోటిక్స్ వ్యాపారంలో వచ్చిన నష్టాలు పూడ్చుకోవడానికి చైన్ స్నాచర్‌గా మారిన నిందితుడిని బాచుపల్లి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతడిని పట్టుకోవడంలో ఓ కానిస్టేబుల్ కీలక పాత్ర పోషించాడని, కమిషనరేట్ వ్యాప్తంగా ఇచ్చిన టాక్టికల్ ట్రైనింగ్ ఈ అధికారికి ఉపయుక్తంగా మారిందని సైబరాబాద్ అధికారులు తెలిపారు. గాజులరామారం, ప్రకాశంపంతులు నగర్‌కు చెందిన సునీల్ కుమార్ గతంలో కాస్మోటిక్స్ వ్యాపారం చేసేవాడు. ఇది సరిగ్గా నడవకపోవడంతో నష్టాలకు తోడు అప్పులయ్యాయి. వీటి నుంచి బయటపడేందుకు సునీల్ స్నాచర్ అవతారం ఎత్తాడు. నల్లరంగు బైక్‌ను ఖరీదు చేసిన ఇతను, దాని వెనుక నెంబర్ ప్లేట్ తొలగించాడు. ముందు భాగంలోదీ సరిగ్గా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. జీన్స్ ప్యాంట్, పాయింటెడ్ షూస్, హెడ్ వేర్‌తో కూడి స్వెర్టర్ ధరించి, ముఖానికి తెల్లని ఖర్చీఫు కట్టుకుని స్నాచింగ్స్ మొదలెట్టాడు. ఏడాది కాలంలో మియాపూర్, బాచుపల్లి ప్రాంతాల్లో నాలుగుసార్లు పంజా విసిరి 12.5 తులాల బంగారు ఆభరణాలు, పుస్తెలతాల్లు లాక్కెల్లాడు. జనవరి 13న బాచుపల్లి ప్రగతినగర్‌కు చెందిన కె.హారిక మెడలో ఉన్న నల్లపూసల గొలుసు లాక్కుపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బాచుపల్లి ఇన్స్పెక్టర్ కె.బాలకృష్ణారెడ్డి దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలపై దృష్టిపెట్టారు. ప్రగతినగర్, బాచుపల్లి, నిజాంపేట, మియాపూర్‌ల్లోని అనేక సీసీ కెమెరాల ఫీడ్ అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలో స్నాచర్ ఆహార్యంపై స్పష్టత వచ్చింది. ఈ ఫీడ్ నుంచి సేకరించిన ఫొటోలను గస్తీ సిబ్బందికి అందించారు. ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో కానిస్టేబుల్ రాజుకు (పీసీ 6116) ప్రగతినగర్‌లోని కేంద్రం వద్ద శుక్రవారం డ్యూటీ పడింది. అది ముగించుకుని స్టేషన్‌కు వెళుతుండగా, అదే సమయంలో సునీల్ మరోసారి పంజా విసరడానికి తన బైక్‌పై బయలుదేరాడు. బాచుపల్లిలోని పుష్ఫక్ అపార్ట్మెంట్స్ వద్ద రాజుకు అతను ఎదురు రావడంతో బైక్ రంగు, వెనుక నెంబర్ ప్లేట్ లేకపోవడం, సునీల్ ఆహార్యం చూసిన కానిస్టేబుల్ రాజుకు అతడే తాము వెతుకుతున్న స్నాచర్‌గా అనుమానించాడు. దీంతో సునీల్ వాహనాన్ని అడ్డగించాడు. తాను ఒక్కడే ఉండటంతో పాటు తాను అనుమానిస్తున్న విషయం సునీల్ గుర్తిస్తే దాడి చేసి తప్పించుకుని పారిపోతాడని భావించిన రాజు వాహనానికి నెంబర్ ప్లేట్ లేని కారణంగా విచారణ కోసం పోలీసుస్టేషన్‌కు రావాల్సిందిగా చెప్పి సునీల్‌ను ఒప్పించాడు. అలా ఠాణాకు తీసుకువెళ్ళిన తర్వాత విచారించిన నేపథ్యంలో అతడే స్నాచర్‌గా తేలింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసిన బాచుపల్లి పోలీసులు బైక్, సెల్‌ఫోన్, మూడు నల్లపూసల గొలుసు లు, ఒక పుస్తెలతాడు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని సిబ్బందికి పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య టాక్టికల్ శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇందులో విపత్కర పరిస్థితుల్లో విధులు ఎలా నిర్వర్తించాలి? ప్రత్యేక సందర్భాల్లో ఎలా చాకచక్యంగా ఉండాలి? తదితర అంశాలు నేర్పిస్తున్నారు. గతంలో ఈ శిక్షణ పూర్తి చేసుకున్న రాజు అందులో నేర్పిన విషయాలను సద్వినియోగం చేసుకునే సునీల్‌ను పట్టుకోవడంతో కీలక పాత్ర పోషించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ రాజుకు రివార్డు ఇవ్వనున్నారు. -
సీరియల్ స్నాచర్..‘సినిమా’ కష్టాలు...
సాక్షి,సిటీబ్యూరో: మహారాష్ట్ర నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడి సీరియల్ స్నాచర్‌గా మారిన ఘరానా దొంగ మీర్ అయ్యాన్ను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల అతను తన ముఠా తో కలిసి రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో పంజా విసిరాడు. పదకొండు నేరాల్లో 430 గ్రాముల బంగారు ఆభరణాలు లాక్కుపోయినట్లు పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ చైతన్యకుమార్‌తో కలిసి గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ‘సినిమా’ కష్టాలు... మహారాష్ట్రలోని జల్గాం ప్రాంతానికి చెందిన మీర్ అయాన్ అలీ ఖాన్ అలియాస్ అబ్దుల్లా పుట్టక ముందే తండ్రిని కోల్పోయాడు. తన తొమ్మిదో ఏట తల్లి సైతం అనారోగ్యంతో మరణించింది. దీంతో అయాన్ తన మేనత్త వద్దకు చేరాడు. ఆమె పెడుతున్న బాధలు భరించలేక ముంబై పారిపోయాడు. అక్కడి వీధుల్లో తిరుగుతున్న ఇతడిని గమనించిన స్థానికులు కొలాబా ప్రాంతంలోని యాంకరేజ్ ఆర్ఫనేజ్ హోమ్‌కు తరలించారు. అక్కడే ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ సమయంలో హోమ్ మూతపడటంతో మళ్ళీ రోడ్డునపడ్డ అయాన్ మార్బుల్ స్టోన్స్ పరిచే పని నేర్చుకున్నాడు. ఈ వృత్తినే జీవనాధారంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో 2010లో హైదరాబాద్ వచ్చాడు. జల్సాలకు అలవాటుపడి... సిటీలో కొన్నాళ్ల పాటు ఆ పనే చేసిన అయాన్‌కు అలా వచ్చిన ఆదాయం సరిపోలేదు. జల్సాలకు అలవాటుపడటంతో ఖర్చులు పెరిగి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం చోరీలు చేయాలని నిర్ణయించుకున్న అయాన్ 2011లో సైదాబాద్ పరిధిలో తొలి స్నాచింగ్ చేసి పోలీసులకు చిక్కాడు. ఈ కేసులో చంచల్‌గూడ జైల్లో ఉండగా బోయిన్పల్లి నుంచి వాహన చోరీ కేసులో జైలుకు వచ్చిన తలాబ్‌కట్ట వాసి మహ్మద్ అహ్మద్ అలీతో పరిచయమైంది. చెరశాలలోనే జట్టు కట్టిన ఈ ద్వయం బయటకు వచ్చాక వరుసపెట్టి స్నాచింగ్స్ చేయడం మొదలెట్టింది. ఉత్తరప్రదేశ్ నుంచి నగరంలో నివసిస్తున్న హరేందర్ సింగ్‌తోనూ అయాన్‌కు పరిచ యం కావడంతో అతడూ ఈ ముఠాలో చేరాడు. కలిసి రాని ‘11’... నిత్యం బైక్‌ను డ్రైవ్ చేసే బాధ్యతలు నిర్వర్తించే అయాన్ వెనుక కూర్చుని స్నాచింగ్ చేయడానికి మాత్రం ఒకసారి అలీని మరోసారి సింగ్‌ను తీసుకువెళ్ళేవాడు. ఈ రకంగా ఈ త్రయం 2014–15ల్లో సంతోష్‌నగర్, కార్ఖానా, ముషీరాబాద్, చిలకలగూడ, మేడిపల్లి, చందానగర్, మీర్‌పేట, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, నల్లకుంట, టప్పాచబుత్ర పరిధిలో 11 నేరాలు చేసి పోలీసులకు చిక్కింది. ఈ కేసులకు సంబంధించి సంతోష్‌నగర్ పోలీసులు 2016లో అయాన్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించారు. గతేడాది ఫిబ్రవరిలో జైలు నుంచి బయటకు వచ్చిన అయాన్ కొన్నాళ్ళు ఆటోడ్రైవర్‌గా పని చేశాడు. అలా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో మళ్ళీ పాతమిత్రులతో కలిసి స్నాచింగ్స్ ప్రారంభించాడు. గతేడాది మే నుంచి లంగర్‌హౌస్, ఉస్మానియా వర్శిటీ, అంబర్‌పేట, గాంధీనగర్, మలక్‌పేట, నార్సింగి, ఉప్పల్, మేడిపల్లి ఠాణాల పరిధుల్లో 11 నేరాలు చేశాడు. 2011లో తొలిసారి అరెస్టు అయిన అయాన్.... ఆపై రెండు దఫాల్లోనూ 11 చొప్పునే స్నాచింగ్ చేసి పోలీసులకు చిక్కాడు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ... నిత్యం హిందీ పేపర్లు చదివే అయాన్‌కు పోలీసుల దర్యాప్తు తీరుపై అవగాహన ఉంది. అధికారులు ప్రధానంగా సీసీ కెమెరాల ఫీడ్ ఆధారంగా ముందుకు వెళ్తారనే విషయం తెలుసుకున్నాడు. దీంతో తొలి రెండు స్నాచింగ్స్‌ను స్నేహితుడి నుంచి అరువు తెచ్చుకున్న వాహనంపై తిరుగుతూ చేశాడు. ఆపై తానే ఓ సెకండ్‌హ్యాండ్ వాహనం ఖరీదు చేసుకున్నాడు. దానికి నకిలీ నెంబర్ ప్లేట్ తగిలించడంతో పాటు నిత్యం హెల్మెట్ ధరించేవాడు. వెనుక కూర్చునే అలీ, సింగ్‌లతో మాస్క్ వేయించేవాడు. చోరీలకు వినియోగించిన వాహనాన్ని సైతం తలాబ్‌కట్టలోని తన ఇంటి వరకు తీసుకువెళ్ళకుండా దూరంగా పార్క్ చేసేవాడు. ఈ హెల్మెట్ ధరించి టార్గెట్లను ఎంచుకునే నేపథ్యంలోనే రెండుసార్లు ‘తప్పు’లోకాలేశాడు. మీర్‌పేట పరిధిలో చేసిన రెండు స్నాచింగ్స్లోనూ మహిళల మెడలో పసుపు రంగులో ఉన్న నైలాన్ తాడును బంగారు పుస్తెలతాడుగా భావించి స్నాచింగ్ చేయించాడు. ఈ ఘటనల్లో పుస్తెలు మాత్రం బంగారంవి అతడికి దక్కాయి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నందుకే ఎనిమిది నెలల పాటు వరుసగా స్నాచింగ్స్ చేయగలిగాడు. వ్యూహాత్మకంగా వ్యవహరించిన టాస్క్‌ఫోర్స్.. గతేడాది మే నుంచి వరుసపెట్టి పంజా విసురుతున్న ఈ ముఠా కదలికలను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు జనవరిలో గుర్తించారు. తమ వాహనానికి నకిలీ నెంబర్ ప్లేట్ తగిలించినప్పటికీ నిత్యం ఒకే ప్లేట్ వాడటంతో పోలీసులకు ఆధారం చిక్కింది. మరోపక్క సీసీ కెమెరాల్లో రికార్డు అయిన కదలికల ఆధారంగా వీరు పాతబస్తీకి చెందిన వారుగా తేల్చారు. వీటి ఆధారంగా ఇన్స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు కేఎన్ ప్రసాద్‌వర్మ, జి.వెంకట రామిరెడ్డి, ఎన్.శ్రీశైలం, మహ్మద్ థాకుద్దీన్ తమ బృందాలతో కలిసి దాదాపు నెల రోజుల పాటు పాతబస్తీని జల్లెడపట్టారు. గురువారం వాహనంపై వస్తున్న అయాన్‌ను పట్టుకున్నారు. ఇతడి నుంచి 311 గ్రాముల బంగారం ఆభరణాలు, రూ.1.25 లక్షల నగదు, వాహనం స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. కేసును తదుపరి చర్యల నిమిత్తం మలక్‌పేట పోలీసులకు అప్పగించారు. -
ఆశగా వచ్చాడు.. అడ్డంగా దొరికాడు
అతడో దొంగ. పేరు అమోల్ బాబా సాహెబ్ షిండే. మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాలోని యశ్వంత్‌నగర్ సొంతూరు. డ్రైవర్‌గా పనిచేస్తున్న ఇతగాడు లగ్జరీ జీవితాన్ని గడపాలన్న ఆశతో చోరీల బాట పట్టాడు. తెలుగు ప్రజలకు ఆభరణాలంటే మోజెక్కువని తెలుసుకుని హైదరాబాద్‌కు వచ్చాడు. పలుమార్లు స్నాచింగ్‌లు చేసి సొంత ప్రాంతానికి పరిపోయాడు. తిరిగి వచ్చిన ఇతడు పోలీసులకు చిక్కాడు. సాక్షి, సిటీబ్యూరో: ఐదు నెలల కాలంలో సైబరాబాద్‌లో 17 చైన్ స్నాచింగ్‌లు చేసి పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన అంతర్రాష్ట చైన్ స్నాచర్ అమోల్ షిండే ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా అతడిని గుర్తించిన పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి కేపీహెచ్‌బీలోని ఓ లాడ్జ్‌లో ఉండగా అరెస్టు చేశారు. ఇతడి నుంచి దాదాపు రూ.15 లక్షల విలువచేసే 47 తులాల బంగారం, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ జానకీ షర్మిల, మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్, కూకట్పల్లి ఏసీపీ భుజంగరావుతో కలిసి శనివారం కమిషనర్ సందీప్ శాండిల్య మీడియాకు వెల్లడించారు. తెలుగు మహిళలు ఎక్కువ నగలు ధరిస్తారని.. మహారాష్ట్రలోని పర్భానీ జిల్లా యశ్వంత్‌నగర్‌కు చెందిన అమోల్ బాబా సాహెబ్ షిండే తల్లిదండ్రులతో కలిసి అక్కడే ఉంటున్నాడు. డ్రైవర్‌గా పనిచేసే సమయంలో వ్యసనాల కారణంగా నేరాలబాట పట్టాడు. సులువుగా డబ్బులు సంపాదించాలని చైన్ స్నాచింగ్‌లు మొదలెట్టాడు. 2013లో పర్భానీ జిల్లాలో గొలుసు దొంగతనాలకు పాల్పడి తొలిసారి జైలుకు వెళ్లాడు. ఏడాది తర్తా జైలు నుంచి విడుదలై ఔరంగాబాద్‌కు మకాం మార్చి వరుసగా నాలుగు స్నాచింగ్‌లు చేసి పోలీసులకు చిక్కాడు. తిరిగి జైలు నుంచి వచ్చాక 2016లో లాతూర్‌లో స్నాచింగ్‌లు చేసి జైలుకెళ్లాడు. ఇదే సమయంలో మరో నేరగాడు సంజయ్ హకాని యాదవ్‌తో పరిచయం ఏర్పడింది. ‘తెలుగు వారు ఎక్కువగా నగలు ధరిస్తార’ని సంజయ్ ద్వారా తెలుసుకున్న ఆమోల్.. జైలు నుంచి విడుదలయ్యాక 2017 ఆగస్టులో అక్కడే ఓ బైక్ కొని హైదరాబాద్‌కు వచ్చాడు. కొన్ని నేరాలు చేశాక మరో బైక్ మార్చి మరికొన్ని నేరాలు చేశాడు. ఎడమ చేత్తో తెంచేస్తాడు అమోల్ రెక్కీ నిర్వహించి స్నాచింగ్‌కు పాల్పడేవాడు. ఒంటరిగా మహిళలు గుడికి, షాపులకు, మార్కెట్‌కి వెళ్లే సమయంలో వారికి ఎదురుగా వచ్చి ఎడమ చేత్తో చైన్ స్నాచింగ్ చేస్తాడు. ఇలా కేపీహెచ్బీలో ఐదు, మియాపూర్‌లో మూడు చోరీలు చేసి పర్భానీ వెళ్లిపోయాడు. మళ్లీ సిటీకి వచ్చి కేపీహెచ్బీలో మూడు, మియాపూర్‌లో ఒకటి స్నాచింగ్ చేసి మళ్లీ వెళ్లిపోయాడు. తిరిగి జనవరి 6న కేపీహెచ్‌బీకి వచ్చి గాయత్రి లాడ్జ్‌లో దిగి మియాపూర్‌లో రెండు, చందానగర్‌లో ఒకటి, కేపీహెచ్బీలో రెండు చైన్ స్నాచింగ్‌లు చేశాడు. అయితే సీసీటీవీ ఫుటేజీలకు చిక్కిన దృశ్యాల ఆధారంగా నిందితుడు అమోల్ షిండేను గుర్తించిన పోలీసులు అతడి కోసం పర్భానీకి కూడా వెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి గాయత్రి లాడ్డిలో ఉన్నాడని తెలుసుకుని పట్టుకున్నారు. ఇతడిపై ఔరంగాబాద్, లాతూర్‌లో పెండింగ్ వారంట్లు ఉండడం, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 28 చైన్ స్నాచింగ్‌లు చేయడంతో పీడీ యాక్ట్ ప్రయోగించనున్నారు. స్నాచర్‌ను పట్టుకునేందుకు కృషిచేసిన డీసీపీ జానకి షర్మిల, కూకట్పల్లి ఏసీపీ భుజంగరావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ సుధీర్, కానిస్టేబుల్ అనిల్‌ను సైబరాబాద్ సీపీ అభినందించారు. -
పోరాడి పట్టించారు
సాక్షి,సిటీబ్యూరో: బైక్‌పై వెళుతుండగా బంగారు మంగళసూత్రం లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన చైన్ స్నాచర్‌ను నిలువరించడమేగాక అతడిపై పిడిగుద్దులు కురిపించిన సీనియర్ సిటిజన్ దంపతులను రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ అభినందించారు. సోమవారం మల్కాజ్గిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ,, కుషాయిగూడ ఏసీపీ కష్ణామూర్తితో కలిసి వివరాలు వెల్లడించారు. ఒడిశాకు చెందిన మనోజ్ స్వైన్ చిన్నప్పటి నుంచే చోరీలకు అలవాటు పట్టాడు గతంలో జ్యువనైల్ హోంకు వెళ్లి వచ్చాడు. ఉద్యోగం కోసం నగరంలోని చర్లపల్లికి వచ్చి క్యాటరింగ్ బాయ్‌గా పనిచేస్తున్న అతడికి అదే ప్రాంతంలో ఉంటూ ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనిల్, హకీంలతో పరిచయం ఏర్పడింది. విలాసవంతమైన జీవనం గడిపేందుకు స్నాచింగ్‌లు, చోరీలను ఎంచుకున్నారు. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ నుంచి దేశవాళీ తుపాకీ, తూటాలు, కత్తిని కొనుగోలు చేశారు. గత జూన్‌లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ నుంచి ఓ బైక్‌ను దొంగతనం చేసి దానిపై తిరుగుతూ కుషాయిగూడలో రెండు, కీసరలో నాలుగు, లాలాగూడలో ఒక చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. చిరునామాలు అడుగుతూ మహిళ మెడల్లోంచి బంగారు ఆభరణాలు లాక్కెళ్లేవారు. అనిల్, హకీం ఉత్తరప్రదేశ్‌కు వెళ్లిపోవడంతో ఈనెల 17న మనోజ్ కొండాపూర్ నుంచి యామ్నాపేటకు బైక్‌పై వెళుతున్న వృద్ధ దంపతులు దర్శన్, బాలంగిణిలను గుర్తించాడు. కరీమాగూడ సమీపంలో వారి స్కూటర్‌ను ఢీకొట్టాడు. కిందపడిపోయి న దర్శన్ మెడపై తుపాకీ కవర్‌తో దాడి చేసి, బాలంగిణి మెడ లోని బంగారు గొలుసును లాక్కునేందుకు ప్రయత్నించాడు. దీంతో తేరుకున్న దర్శన్ దొంగపై రాళ్లతో దాడి చేయడంతో అతను బైక్, చెప్పులు అక్కడే వదిలి పొలాల్లోకి పారిపోయాడు. కీసర పోలీసులు సాక్ష్యాధారాలను సేకరించి చర్లపల్లిలోని బీఎం రెడ్డి కాలనీలో ఉంటున్న మనోజ్‌ను ఆదివారం అదుపులోకి తీసు కుని 6.5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మల్లాపూ ర్లోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో తనఖా పెట్టిన మూడు తులాల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో మనోజ్ పదునైన కత్తితో దాడిచేయడంతో పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాసుకు స్వల్పగాయాలయ్యాయి. దొంగను నిలువరించిన వృద్ధ దంపతులను గుడ్ సిటిజన్ రివార్డుతో, దొంగను పట్టుకున్న పోలీసు సిబ్బందికి నగదు ప్రోత్సహకాలు అందజేశారు. -
చైన్ స్నాచర్ అరెస్ట్: బుల్లెట్ స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: కీసర పోలీసు స్టేషన్ పరిధిలో స్కూటర్‌పై వెళ్తున్న యువతిని అనుసరించిన ఓ దొంగ చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. అక్కడే ఉన్న వృద్ధ దంపతులు గమనించి చైన్ స్నాచర్‌ను పట్టుకోబోగా అతను బైక్, చెప్పులు వదిలి పరారయ్యాడు. బైక్‌లో ఉన్న ఒక తపంచా, ఒక రౌండ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. తర్వాత చైన్‌స్నాచర్ మనోజ్ స్వైన్‌ను అరెస్టు చేశామని, ఇతను చిన్నప్పటి నుంచి నేరాలకు పాల్పడుతున్నాడని, జువైనల్ హోమ్ నుంచి పరారయ్యాడని వివరించారు. ఇతనికి సహకరించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనిల్, హకీమ్ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని, గతంలో ఇతనిపై ఎనిమిది కేసులున్నాయని చెప్పారు. నిందితుడి నుండి ఒక కంట్రీమేడ్ తపంచా, బటన్ కత్తి, తొమ్మిది తులాల బంగారంను స్వాదీనం చేసుకున్నట్టు సీపీ తెలిపారు. ఉద్యోగాల ముఠా అరెస్టు రైల్వే, ఎన్టీపీసీలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్న ముఠా గుట్టును ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. నకిలీ ఐడి కార్డులతో నిరుద్యోగులకు ఈ ముఠా కుచ్చు టోపీ పెట్టింది. ఏడుగురు సభ్యులు గల ముఠా బోగస్ లెటర్ హెడ్స్ సృష్టించి అపాయింట్ మెంట్ లెటర్స్ తయారు చేస్తోంది. ముఠాలో ఓ మహిళ కూడా ఉంది. ముఠాను పట్టుకున్న ఎస్ఓటీ పోలీసులు వారి నుంచి రూ. 20 లక్షల నగదు, 7 సెల్ఫోన్లు, ఐడీ కార్డులు, బోగస్ అపాయింట్మెంట్లు, ల్యాప్‌టాప్, ప్రింటర్లను సీజ్ చేశారు. బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నిరుద్యోగులు నమ్మొద్దని, అలాంటి వారిపై పోలీసులకు తెలియజేయాలన్నారు. -
ఒక దొంగ కథ.. 23 చైన్ స్నాచింగ్‌లు.. 900 గ్రా. బంగారం!
సాక్షి, తిరుపతి సిటీ: చీటీల పేరుతో చేసిన అప్పులు తీర్చలేక ఓ వ్యక్తి చైన్ స్నాచర్ అవతారం ఎత్తాడు. 23 చైన్ స్నాచింగ్‌లతో 900 గ్రాముల బంగారాన్ని కొల్లగొట్టాడు. ఇలా దొంగగా మారిన వీరనాగులు అనే యువకుడిని స్థానికుల సహకారంతో అలిపిరి పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఎఎస్పీ సిద్ధారెడ్డి, అలిపిరి సిఐ శ్రీనివాసులు సోమవారం విలేకరుల సమావేశంలో నిందితుడిని, స్వాధీనం చేసుకున్న బంగారు గొలుసులూ మీడియా ఎదుట హాజరుపరిచారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం పెడన గ్రామానికి చెందిన రామలక్ష్మి కాలనీకి చెందిన భద్రరావు కుమారుడు వీరనాగులు (27). కొన్నేళ్ల కిందట వీరనాగులు తల్లిదండ్రులపై అలిగి తిరుపతికి పారిపోయి వచ్చాడు. తిరుపతిలోనే ఉంటూ ఒక యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వారికి నాలుగేళ్ల చిన్నారి ఉంది. వీరు నగరంలోని భవానీ నగర్లో చిన్న కిరాణా షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వీరనాగులుకు స్థానికులతో పరిచయాలు కావడంతో రూ.2 లక్షల మేర చీటీ నిర్వహిస్తున్నాడు. అయితే చీటీలు ఎత్తుకున్న వారు తిరిగి చెల్లించకపోవడంతో చీటీలు వేసిన వారికి డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఆర్థికంగా చితికిపోవడంతో చైన్ స్నాచింగ్‌ను ఎంచుకున్నాడు. ఒంటరిగా వెళుతున్న మహిళలను టార్గెట్ చేసుకుని వారి మెడల్లోని బంగారు గొలుసులను లాక్కుని వెళ్ళేవాడు. 23 చైన్ స్నాచింగ్‌లు.. 900 గ్రాములు బంగారం రెండేళ్లుగా ఎవ్వరికీ అనుమానం రాకుండా వీరనాగులు చైన్ స్నాచింగ్‌ను వృత్తిగా చేసుకున్నాడు. ఒకసారి చైన్ స్నాచింగ్ చేసుకుని వచ్చాడంటే తిరిగి 20 రోజులదాకా అటు వెళ్లడు. ఆలోపు కిరాణా షాపు నిర్వహించుకుంటూ ఉండేవాడు. చైన్ స్నాచింగ్‌లతో మూడు పువ్వులు, ఆరుకాయలుగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుండేవాడు. ఇటీవల రామచంద్రానగర్‌లో ఒక మహిళ పట్టపగలు ఒంటరిగా నడిచి వెళ్తుండగా ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికుల సహకారంతో అలిపిరి సీఐ శ్రీనివాసులు, క్రైం పార్టీ పోలీసు బృందం రవిరెడ్డి, గోపి, రాజు ఇతర సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈస్ట్, అలిపిరి, తిరుచానూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో 900 గ్రాముల విలువ చేసే సుమారు 23 బంగారు గొలుసులను లాక్కెళ్లినట్లు విచారణలో తేలింది. వీరనాగులు నుండి చోరీలకు పాల్పడిన నగలను స్వాధీనం చేసుకున్నట్లు క్రైం డీఎస్పీ సిద్ధారెడ్డి తెలిపారు. నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. -
ఒక్క ‘నమస్తే’తో దొరికిపోయాడు
►ఆ కవలలు రియల్ హీరోలు ►చిన్న అనుమానమే పెద్ద దొంగను పట్టించింది. ►ఈ సారి థాయ్ మసాజ్‌కు ప్లాన్ ►మూడుసార్లు పోలీసులకు బురిడీ సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో గత పదేళ్లుగా చైన్ స్నాచింగ్‌లు జరుగుతూనే ఉన్నాయి. టార్గెట్ చేస్తే కచ్చితంగా పని చేసుకెళ్లే ఓ చైన్‌స్నాచర్ పదేళ్లుగా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఎలాగైనా అతడిని పట్టుకోవాలని నిర్ణయించుకున్న పోలీసులు పార్కు బ్లూ ప్రింట్ తీసుకుని, దొంగతనాలు జరిగిన తీరుపై సమీక్షించారు.. అయినా ఖాకీలను బురిడీ కొట్టిస్తూ ఎప్పటికప్పుడూ తనదైన రీతిలో పని కానిచ్చేస్తున్నాడు. దీంతో అతడి కోసమే ప్రత్యేకంగా పార్కు చుట్టూ 60 కెమెరాలు ఏర్పాటు చేయడమేగాక పార్కులో ఉన్న మరో 25 కెమెరాలపై నిఘా ఉంచారు. అయినా స్నాచింగ్‌ల పర్వం కొనసాగుతూనే ఉండటంతో మరో 20 కెమెరాల ఏర్పాటుకు నిర్ణయించారు. అయితే ఇన్ని కెమెరాలకు చిక్కని నిందితుడు కేవలం ఒక ‘‘నమస్తే’’కు దొరికిపోయాడు. ఇద్దరు సినీ కవలలైన స్టంట్ మాస్టర్లు అతడిని పట్టించి రియల్ హీరోలుగా మిగిలారు.. వెస్ట్‌జోన్ డీసీపీ వెంకట్వేర్‌రావు మంగళవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. కార్మికనగర్ ప్రాంతానికి చెందిన నర్సయ్య అలియాస్, నర్సింహ అలియాస్ రిషీ చిన్నా(25) కారు డ్రైవరుగా పని చేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన కేబీఆర్ పార్కులో ఏడు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడినట్లు తెలిపారు. నిందితుడి నుంచి ఏడు బంగారు గొలుసులు (250 గ్రాములు), ఒక సాంత్రో కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలో మాదాపూర్, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ చోరీలకు పాల్పడినప్పటికీ పోలీసులను బురిడీ కొట్టించి బయట పడినట్లు తెలిపారు. నిందితుడితోపాటు చోరీసొత్తును కొనుగోలు చేసిన ఓం నగర్ ప్రాంతానికి చెందిన సత్యనారాయణచారిని కూడా అరెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు. రిచ్‌గా ఉండాలని... నర్సింహ అలియాస్ రిషీచిన్నా చదివింది పదో తరగతి. విలాసవంతమైన జీవితం గడపాలని కలలుకనే అతను అందుకోసం చోరీల బాట పట్టాడు. 10వ తరగతి వరకు స్థానిక ఆలియా ప్రభుత్వ పాఠశాలలో చదివిన అతను దానికి సమీపంలోనే ఉన్న సుజాత హైస్కూల్లో చదివినట్లు చెప్పుకొనేవాడు. చేతిలో ఖరీదైన స్మార్ట్‌ఫోన్ పట్టుకుని బీటెక్ చదివానంటూ అందరినీ నమ్మించేవాడు. పబ్బులకు వెళ్లాలని, గర్ల్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరగాలని, విదేశీ టూర్లు, బీచ్‌లకు వెళ్లాలని ప్లాన్ చేసుకునేవాడు. అదే ఆలోచన నర్సింహను రిషీగా మార్చింది. ఒక గర్ల్‌ఫ్రెండ్‌ను సొంతం చేసుకొనేలా చేసింది. కేబీఆర్ పార్క్ కొట్టిన పిండి నర్సింహకు పోలీసులు సేకరించిన కేబీఆర్ బ్లూప్రింట్ కంటే ఎక్కువగా పార్కు చుట్టూ ఉన్న కెమెరాలు, ఎక్కడి నుంచి వెళ్లాలి, ఎక్కడి నుంచి లోపలికి రావాలి అనే ప్రతి విషయం తెలుసు. దీంతో అతను కేబీఆర్ పార్కు చాలా సేఫ్ ప్లేస్‌గా భావించాడు. ఇక్కడే రెండు నెలల వ్యవధిలో స్నాచింగ్‌లకు పాల్పడేవాడు. ఇందుకోసం ప్రతి రోజూ పార్క్‌కు వచ్చేవాడు. వాకింగ్ చేసినట్లు నటిస్తూ రెక్కీ నిర్వహించేవాడు. తోటి వాకర్లకు అనుమానం రాకుండా మసలుకునేవాడు. పట్టించిన నమస్తే.. పార్కుకు వచ్చే నర్సింహ చేతిలో స్మార్ట్‌ఫోన్‌తో బిజీగా ఉన్నట్లు నటించేవాడు. అక్కడికి రెగ్యులర్‌గా వచ్చే వాకర్లను గుర్తుపెట్టుకొనేవాడు. ఈ నేపథ్యంలో అతను రోజూ పార్కుకు వస్తున్న కవల స్టంట్ మాస్టర్లకు నమస్తే పెట్టేవాడు. ఈ క్రమంలో అగస్టు 19న సుశీల దేవి అనే వృద్ధురాలి మెడలో నుంచి చైన్ లాక్కున అతను అక్కడి నుంచి బయటపడే ప్రయత్నంలో ఉండగా వారు ఎదురయ్యారు. ఎప్పటిలానే నర్సింహ వారికి నమస్తే పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొంచెం ముందుకు వచ్చిన వారికి స్నాచింగ్ జరిగిందని తెలియడం, ఆ సమయంలో అటువైపు అతనొక్కడే వెళ్లడంతో అతనిపై అనుమానం వచ్చింది. తాజాగా నాలుగు రోజుల క్రితం పార్కుకు వచ్చిన నర్సింహను గుర్తించిన వారు అక్కడే ఉన్న పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నర్సింహను అదుపులోకి తీసుకోగా, తాను బీటెక్ స్టూడెంట్‌నని తనకేమీ తెలియదంటూ తప్పించుకొనే ప్రయత్నం చేశాడు. పోలీసులు తమశైలిలో విచారించడంతో నేరం అంగీకరించాడు. థాయ్ మసాజ్‌కు వెళ్లాలని.. నర్సింహకు థాయ్‌లాండ్‌కు వెళ్లి అక్కడ మసాజ్ చేయించుకోవాలని కోరిక. ఈ నేపథ్యంలో అతను నాలుగు రోజుల క్రితం కేబీఆర్ పార్కుకు వచ్చాడు. అక్కడ స్నాచింగ్‌కు పాల్పడి తరువాత దసరాకు ముందు మరోసారి పంజా విసరాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో వెల్లడించాడు. బంగారాన్ని డబ్బులుగా మార్చుకొని థాయిలాండ్‌కు వెళ్లి మసాజ్ చేయించుకోవాలనుకున్నట్లు తెలిపారు. మూడుసార్లు టోకరా.. కేపీహెచ్‌బీలోనూ అతను గతంలో రెండు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. పోలీసులు అతడిని అనుమానంతో అదుపులోకి తీసుకోగా, తాను బీటెక్ స్టూడెంట్‌నని నమ్మించి బురిడీ కొట్టించాడు. మాదాపూర్‌లో చైన్‌స్నాచింగ్ కేసులోనూ అలాగే తప్పించుకున్నాడు. కేబీఆర్ పార్కులోనూ స్నాచింగ్‌కు పాల్పడి బంజారాహిల్స్ పోలీసులకు చిక్కిన సమయంలోనూ ఇలాగే చెప్పడంతో పోలీసులు నమ్మి వదిలేశారు. చివరికి ఇలా కేబీఆర్ పార్కులో వాకర్లా నటించి స్నాచింగ్‌లకు పాల్పడుతూ వాకర్లు ఇచ్చిన సమాచారంతో నాటకార్ నర్సింహ నాటకానికి తెరపడింది. సంబంధిత వార్త.. ఇంట్లో నర్సింహ.. బయట రిషి! -
గొలుసుదొంగలకు దేహశుద్ధి
హైదరాబాద్: హైదరాబాద్‌లో గొలుసుదొంగలకు ప్రజలు బుద్ధిచెప్పారు. నగరంలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోహెడ గ్రామంలో కందల లక్ష్మమ్మ అనే మహిళ మంగళవారం ఉదయం పాలు పోయాడానికి వెళ్లి వస్తుండగా ఆమె మెడలోని బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లారు. లక్ష్మమ్మ వెంటనే కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. పారిపోతున్న ఇద్దరు స్నాచర్లను పట్టుకుని దేహశుద్ధిచేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. నాలుగున్నర తులాల బంగారు గొలుసు తిరిగి దక్కడంతో లక్ష్మమ్మ ఊపిరిపీల్చుకున్నారు. ఇలాంటి దుండగులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
ప్రియురాలి ఇంటి నుంచి దొంగ పరార్!
బెంగళూరు: చైన్స్నాచర్ను పట్టుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. కాల్పులు జరిపినా అతడు దొరక్కుండా తప్పించుకు పారిపోయాడు. కర్ణాటకలోని గదగ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గదగ్ పట్టణానికి చెందిన విశ్వనాథ్ కోళివాడ చైన్ స్నాచింగుల్లో దిట్ట. అతడిపై గదగ్, హుబ్లీతో పాటు పలు ప్రాంతాల్లో పలు కేసులున్నాయి. పోలీసుల కళ్లుగప్పి నిందితుడు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతుండేవాడు. విశ్వనాథ్ ను పట్టుకునేందుకు చాలా రోజులుగా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో విశ్వనాథ్ గదగ్ పాతబస్టాండ్ వద్ద ఉన్న ప్రియురాలి ఇంటికి వచ్చాడు. పక్కా సమాచారంతో మంగళవారం అర్ధరాత్రి ఇంటిని చుట్టుముట్టారు. బయటకు రావాలని హెచ్చరికలు చేసినా విశ్వనాథ్ నుంచి స్పందన రాలేదు. దీంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. అయితే, అప్పటికే నిందితుడు చాకచక్యంగా తప్పించుకొని మరోసారి ఉడాయించాడు. ఇదిలా ఉండగా అర్ధరాత్రి సమయంలో కాల్పుల శబ్ధం విని స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే, దొంగను పట్టుకునేందుకు కాల్పులు జరిపినట్లు తెలియడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
చైన్ స్నాచర్లకు కళ్లెం
నగరంలో చైన్ స్నాచర్ల ఆటకట్టించడంలో పోలీసులు సఫలమయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈసారి స్నాచింగ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. 2015లో మొత్తం 267 స్నాచింగ్ కేసులు నమోదవగా..ఈ ఏడాది నవంబర్ వరకు కేవలం 82 కేసులు నమోదయ్యారుు. దీంతో మహిళలు ఊపిరి పీల్చుకుంటున్నారు. నగరవ్యాప్తంగా పోలీసులు భారీ ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం..కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ వంటి పకడ్బందీ చర్యలు చేపట్టడంతో చైన్‌స్నాచర్లు తోకముడిచారు. సిటీబ్యూరో: సిటీలో వరుస ఉదంతాలతో ముచ్చెమటలు పట్టించిన చైన్ స్నాచర్లు తోకముడుస్తున్నారు... గతేడాదితో పోలిస్తే ఈ కేసుల్లో భారీ తగ్గుదల కనిపించింది. సిటీ పోలీసులు అనుసరిస్తున్న ప్రత్యేక విధానాలే దీనికి కారణమని స్పష్టమవుతోంది. అడుగడుగునా సీసీ కెమెరాల ఏర్పాటు, పీడీ యాక్ట్ ప్రయోగం, కేసుల విచారణ వేగవంతం చేయడం తదితర చర్యలు ఫలితాలిచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ముచ్చెమటలు పట్టించారు... సామాన్యుల నుంచి ప్రముఖుల కుటుంబాల వారిని స్నాచర్లు వదల్లేదు. ఓ పక్క స్థానిక ముఠాలు, మరోపక్క ఉత్తరాది నుంచి వచ్చివెళ్లే గ్యాంగులు ముచ్చెమటలు పట్టించారుు. ఉదయం, సాయంత్రం వేళల్లో విరుచుకుపడిన గొలుసు దొంగలు ఒకే రోజు వరుస ఉదంతాలకూ పాల్పడ్డారు. వీరిబారిన పడి ప్రాణాలు కోల్పోరుు, తీవ్రంగా గాయపడిన బాధితులు సైతం ఉన్నారు. ఈ రకంగా దాదాపు ఐదేళ్ల పాటు నగర ప్రజలతో పాటు పోలీసులకూ చైన్ స్నాచర్లు నరకం చూపించారు. దీంతో అప్రమత్తమైన నగర పోలీసులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఫలితంగా గడిచిన మూడేళ్లుగా ఈ కేసుల్లో తగ్గుదల కనిపించింది. ఈసారి గణనీయమైన మార్పు... సిటీ కాప్స్ తీసుకుంటున్న చర్యల కారణంగా గడిచిన కొన్నేళ్లుగా చైన్ స్నాచింగ్ నేరాల్లో తగ్గుదల కనిపిస్తూ వచ్చింది. 2013లో 675, 2014లో 523 కేసులు నమోదయ్యారుు. గత ఏడాది నుంచీ ఈ నేరాలను ప్రత్యేకంగా పరిగణించిన నగర పోలీసులు గణనీయంగా తగ్గించాలని నిర్ణరుుంచుకున్నారు. దీంతో అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంటూ వచ్చారు. ఓ పక్కన సంప్రదాయ పద్ధతులతో పాటు మరోపక్క సాంకేతిక పరిజ్ఞానాన్నీ విసృ్తతంగా వినియోగిస్తున్నారు. ఫలితంగా గత ఏడాది ఈ కేసుల సంఖ్య 267కు తగ్గింది. ఈ ఏడాది వీటి సంఖ్య 100కు మించకూడదనే లక్ష్యంతో ఆది నుంచీ చర్యలు తీసుకున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా సిటీలో స్నాచింగ్స సంఖ్య చెప్పుకొదగ్గ స్థారుులో తగ్గింది. ఈ ఏడాది నవంబర్ 18 వరకు కేవలం 82 కేసులు నమోదయ్యారుు. వీటిలోనూ గొలుసు దొంగతనాలకు సంబంధించినవి కేవలం 60 కేసులే. మిగిలిన 22 కేసులూ బ్యాగ్‌లు తదితరాలు లాక్కుపోవడం వంటి నేరాలపై నమోదయ్యారుు. పోలీసులు తీసుకున్న ప్రధాన చర్యలివి... ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల సహకారంతో నగర వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వీటి సంఖ్య వీటన్నింటినీ బషీర్‌బాగ్‌లోకి కమిషనరేట్‌లో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానిస్తున్నారు. ఇప్పటికే వీటి సంఖ్య 10 వేలకు చేరింది. దాదాపు ప్రతి ప్రాంతంలోనూ ఈ కెమెరాలు ఉంటున్న నేపథ్యంలో ప్రతి ఉదంతానికి సంబంధించి ఏదో ఒక క్లూ దొరుకుతోంది. ఫలితంగా నేరగాళ్లను పట్టుకుని జైలుకు పంపడం తేలికై ంది. దీని ఫలితంగా కేసులు కొలిక్కివచ్చే శాతం కూడా గణనీయంగా పెరిగింది. మరోపక్క ఇలా చిక్కిన నేరగాళ్లల్లో వరుసగా నేరాలు చేసిన వారు ఉంటే వీరిపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగిస్తున్నారు. జైల్లో ఉండగానే శిక్షలుపడేలా... పీడీ యాక్ట్ ప్రయోగించడంతో నేరగాళ్లు 12 నెలల పాటు జైల్లోనే ఉంటున్నారు. నగర పోలీసులు గడిచిన రెండేళ్ల కాలంలో మొత్తం 530 మందిపై ఈ చట్టాన్ని ప్రయోగించారు. వీరిలో 68 మంది స్నాచర్లే కావడం గమనార్హం. ఇలా ఏడాది పాటు వీరు జైల్లో ఉన్న సమయంలోనే కేసు విచారణ పూర్తరుు, శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది ఈ రకంగా లాంబా, ఫైజల్ లాంటి ఘరానా స్నాచర్లతో సహా మొత్తం 14మందికి కనిష్టంగా రెండేళ్ల నుంచి గరిష్టంగా ఏడేళ్ల వరకు శిక్షలు పడ్డారుు. దీంతోపాటు విజుబుల్ పోలీసింగ్‌లో భాగంగా పోలీసులు తీసుకుంటున్న చర్యలు కూడా స్నాచర్లను కట్టడి చేస్తున్నారుు. -
అమీర్‌పేట్‌లో చైన్‌స్నాచర్ హల్చల్
హైదరాబాద్: నగరంలోని అమీర్‌పేట్‌లో సోమవారం ఓ చైన్‌స్నాచర్ హల్చల్ చేశాడు. స్థానిక కుమ్మరిబస్తీలో రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లడానికి దుండగుడు ప్రయత్నించాడు. దీన్ని అడ్డుకున్న మహిళను ఆ చైన్ స్నాచర్ కత్తితో బెదిరించాడు. ఇద్దరి మధ్య తీవ్ర పెనుగులాట జరగడంతో.. మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు అప్రమత్తమయ్యేలోపే దొంగ అక్కడి నుంచి ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
కడపలో ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్ట్
కడప నగరంలో ఇద్దరు చైన్ స్నాచర్లను వన్‌టౌన్ పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన ఇద్దరు చైన్స్నాచర్లలో ఒకరు సీకే దిన్నె మండలానికి చెందిన కొత్తపల్లి కృష్ణాంజనేయులు కాగా..కడప నగరం నాగరాజుపేటకు చెందిన సాకె చంద్రశేఖర్ మరొకరు. వీరు నగరంలో జరిగిన 11 చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితులు. వీరి వద్ద నుంచి 10 లక్షల రూపాయల విలువ చేసే 33 తులాల బంగారు ఆభరణాలను, ఒక మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వరంగల్జిల్లాలో చైన్ స్నాచర్కు దేహశుద్ది
-
కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో దొంగ హల్చల్
కర్నూలు: కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి క్యాజువాలిటీలో ఓ దొంగ హల్చల్ చేశాడు. సోమవారం తెల్లవారుజామున క్యాజువాలిటీలో చికిత్సపొందుతున్న ఒక మహిళ మెడలోంచి బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. వెంటనే స్పందించిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉషారాణి ఔట్‌పోస్ట్ పోలీసులను అప్రమత్తం చేశారు. అప్రమత్తమైన పోలీసులు పారిపోతున్న దొంగను చాకచక్యంగా పట్టుకుని అతనివద్ద నుంచి బంగారు గొలుసు, మరికొన్ని ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మురళీమనోహర్ ప్రస్తుతం 3వ పట్టణ పోలీసుల అదుపులో ఉన్నాడు. రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆస్పత్రిలో నిద్ర చేస్తుండగానే ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. -
స్నాచర్ల నుంచి కిలోన్నర బంగారం స్వాధీనం
ఎల్బీనగర్ పోలీసులు శుక్రవారం కరుడు గట్టిన ఇద్దరు చైన్స్నాచర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కేజీన్నర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కానిస్టేబుల్‌పై దాడి చేసి అతని బైక్‌ను ఎత్తుకెళ్లిన కేసులోనూ వీరు నిందితులని చెబుతున్నారు. వారిపై వివిధ నేరాల కింద సుమారు 60 కేసులున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మళ్లీ స్నాచర్ల పంజా!
మూడు రోజుల్లో ఏడు ఉదంతాలు నమోదు గురువారం నార్త్‌జోన్‌లో రెండు స్నాచింగ్స్ సీసీ కెమెరాల్లో ‘చిక్కిన’ రెండు ముఠాలు బవరియా గ్యాంగ్ పైనే అనుమానాలు సిటీబ్యూరో/అడ్డగుట్ట/రామ్‌గోపాల్‌పేట: నగరంలో చైన్‌స్నాచర్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. జంట కమిషనరేట్లలో మూడు రోజుల వ్యవధిలో ఏడు ఉదంతాలు చోటు చేసుకున్నాయి. వీటిలో ఆరింటికి రెండు ముఠాలే బాధ్యులుగా గుర్తించారు. సీసీ కెమెరాల్లో చిక్కిన నిందితులు, వాహనాల నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా అధికారులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన బవరియా గ్యాంగ్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నార్త్‌జోన్‌లో ఇద్దరే... రెండు రోజుల వ్యవధిలో నార్త్‌జోన్‌లో నాలుగు స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయి. బుధవారం రాత్రి గోపాలపురం, తుకారాంగేట్ ఠాణాల పరిధిలో, గురువారం వేకువజామున మహంకాళి, తుకారాంగేట్ పోలీస్స్టేషన్ల పరిధుల్లో చోరులు పంజా విసిరారు. సీసీ టీవీల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించిన అధికారులు ఈ నాలుగూ ఒకే ముఠా పనిగా గుర్తించారు. ఎరుపు, నలుపు రంగులతో కూడిన పల్సర్ వాహనంపై వచ్చిన ఇద్దరు దొంగలు ఈ పని చేసినట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేస్తూ పల్సర్ వాహ నాలపై దృష్టి పెట్టారు. ఆరెండూ మరో ముఠా పని... హైదరాబాద్-సైబరాబాద్ కమిషనరేట్లలోని ఫలక్‌నుమా, నాచారం, సరూర్‌నగర్ ఠాణాల పరిధుల్లో మంగళ-బుధవారాల్లో మూడు స్నాచింగ్స్ జరిగాయి. సరూర్‌నగర్‌లోని కర్మన్‌ఘాట్ మినహా మిగిలిన రెండు ఉదంతాలకూ పాల్పడింది ఒకే గ్యాంగ్‌గా ప్రాథమికంగా నిర్థారించారు. ఇక్కడ కూడా నిందితులు పల్సర్ వాహనాన్నే వాడినప్పటికీ పూర్తి ఎర్రరంగుది వినియోగించారు. ఫలక్‌నుమ ప్రాంతంలో ఏకంగా టిఫిన్ సెంటర్లోకే వచ్చిన చోరులు గొలుసు తస్కరించిన విషయం విదితమే. మన్‌ప్రీత్ పైనే అనుమానాలు... ఈ స్నాచింగ్స్‌కు సంబంధించి బవరియా గ్యాంగ్ సూత్రధారి మన్‌ప్రీత్ పైనే పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో ఉన్న 12 గ్రామాలకు చెందిన అనేక మంది దేశ వ్యాప్తంగా స్నాచింగ్స్ చేయడాన్నే వృృత్తిగా ఎంచుకున్నారు. పోలీసు పరిభాషలో వీటిని బవరియా గ్యాంగ్స్‌గా పరిగణిస్తారు. ఆ జిల్లాలోని బడా కాన్పూర్ గ్రామానికి చెందిన మన్‌ప్రీత్ అలియాస్ మంగళ్ అనేక స్నాచింగ్ గ్యాంగ్‌ను నిర్వహిస్తున్నాడు. ఆ ముఠాలో సభ్యుడిగా ఉన్న గోవింద్‌ను రాజేంద్రనగర్ పోలీసులు మార్చి తొలివారంలో అరెస్టు చేశారు. దీంతో తప్పించుకుని పారిపోయిన మంగళ్ తదితరులు పది రోజుల్లోనే మళ్లీ సిటీని టార్గెట్ చేశారు. షామ్లీ జిల్లాలోని అహ్మద్ఘడ్, బడా కాన్పూర్ కాలా, నయాబస్ గ్రామాలకు చెందిన సోను కుమార్, రాజీవ్ ఖోహ్లీ, పింకు కుమార్‌లతో ముఠా కట్టిన మంగళ్ మార్చి రెండో వారంలో సిటీకి చేరుకున్నాడు. ఆ నెల 13, 14, 15 తేదీల్లో జంట కమిషనరేట్ల పరిధిలోని సైదాబాద్, చందానగర్, కేపీహెచ్‌బీ కాలనీ, మీర్పేట్ తదితర ఠాణాల పరిధిలో 12 స్నాచింగ్స్ చేశారు. వీటితో పాటు మరో రెండు చోట్ల స్నాచింగ్ చేయడానికి ప్రయత్నించారు. ఈ కేసులకు సంబంధించి సోను చిక్కాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న మన్‌ప్రీత్ మరోసారి ముఠాలతో వల విసురుతున్నాడని అనుమానిస్తున్నారు. పని చేయని పోలీసు చర్యలు... చైన్ స్నాచర్లు కనిపిస్తే చాలు చేతికి చిక్కాల్సిందేనంటూ సైబరాబాద్ పోలీసు ఏర్పాటు చేసిన ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్స్ (సీసీ టీమ్స్) పత్తా లేకుండా పోయాయి. 110 మంది సిబ్బందితో 55 బృందాలు గత ఏడాది నవంబర్‌లో ఏర్పాటు చేశారు. చైన్‌స్నాచర్లు కనిపించినప్పుడు వారిని పట్టుకునే విధానంలో మెళకువలూ నేర్పారు. వనస్థలిపురం ఠాణా పరిధిలో చైన్‌స్నాచింగ్‌కు యత్నించిన స్నాచర్లపై కాల్పులు జరపడం మినహా... ఈ ృృందాలు సాధించిన విజయాలు అంటూ ఏమీ లేవు. హైదరాబాద్ కమిషనరేట్‌లో పీడీ యాక్ట్, దోపిడీ సెక్షన్లతో కేసు నమోదు వంటి చర్యలు తీసుకున్నా... స్నాచర్లను పూర్తిస్థాయిలో కట్టడి చేయలేకపోతున్నాయి. క్రైమ్ టీమ్స్ కొరగాకుండా పోవడంతో నేరగాళ్లు విృృంభిస్తున్నారు. ఇవీ ఉదంతాలు మంగళవారం: ఫలక్‌నుమ శంషీర్‌గంజ్‌లో రెడ్డి టిఫిన్ సెంటర్‌కు మంగళవారం ఉదయం 7.30 గంటల వచ్చిన ఇద్దరు యువకులు టిఫిన్ అనంతరం నిర్వాహకురాలు టి.లక్ష్మీ(35) మెడలోని మూడు తులాల బంగారు గొలుసు తెంచుకుపోయారు. బుధవారం: నాచారం పోలీసుస్టేషన్ పరిధిలోని అన్నపూర్ణకాలనీకి చెందిన కరుణశ్రీ బుధవారం ఉదయం నడుచుకుంటూ వెళ్తుండగా పల్సర్‌పై వచ్చిన ఇరువురు ఆమె మెడలోంచి 8 గ్రామలు బంగారు పుస్తెలతాడు స్నాచింగ్ చేశారు. సరూర్‌నగర్ ఠాణా పరిధిలోని కర్మన్‌ఘాట్ మాధవనగర్‌కు చెందిన హరిత(40) బుధవారం సాయంత్రం దుకాణనికి వెళ్లి వస్తుండగా... ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కుపోయారు.తుకారాంగేట్ పరిధిలోని అడ్డగుట్ట ఈస్ట్మారేడుపల్లికి చెందిన వేదవల్లి (59) రాత్రి 7.30 గంటలకు నవీన్ సూపర్‌మార్కెట్‌కు వెళ్లివస్తుండగా స్నాచర్లు ఐదున్నర తులాల మంగళసూత్రం, గొలుసు లాక్కుపోయారు. గోపాలపురం ఠాణా పరిధిలోని న్యూ బోయిగూడకు చెందిన సుజాత (57) రాత్రి 8.30 గంటల సమయంలో ఇంటి సమీపంలోని కిరాణ దుకాణానికి వెళ్లి వస్తుండగా పంజా విసిరిన స్నాచర్లు ఆమె మెడలోని చైన్ స్నాచింగ్ చేశారు. గురువారం: తుకారాంగేట్ ఠాణా పరిధిలోని అడ్డగుట్టకు చెందిన లక్ష్మి (40) బస్టాండ్ పక్కనే కిరాణ దుకాణ ం నిర్వహిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఇద్దరు యువకులు పల్సర్ వాహనంపై ఈమె దుకాణానికి వచ్చారు. వస్తువు కొనుగోలు చేస్తున్నట్లు చేసి ఆమె మెడలో నుంచి మంగళసూత్రాన్ని లాక్కెల్లారు. తన గొలుసు రోల్డ్‌గోల్డ్ అని, 3 గ్రాముల బంగారు పుస్తెలు దానికి ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహంకాళి ఠాణా పరిధిలోని రాణిగంజ్ గాస్మండికి చెందిన శ్రీనివాస్‌యాదవ్ సతీమణి చంద్రకళ (48) గురువారం ఉదయం 6.30గంటల సమయంలో పక్కనే ఉన్న చెత్త కుండీలో చెత్త వేసేందుకు భయటకు వచ్చారు. చెత్తవేసి వస్తుండగా పల్సర్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కుని పరారయ్యారు. చెత్త వేసేందుకు వెళుతున్న ఆమెను వెంబడించిన దుండగులు తిరిగి వస్తుండగా మళ్లీ వాహనం తిప్పుకున్నారు. వెనుక కూర్చున్న ఒకడు వాహనం దిగి ఆమె మెడలోని చైన్ లాక్కుని వాహనం ఎక్కి పరారయ్యారు. నిందితులను వెంబడించేందుకు కొంత మంది యత్నించినా క్షణాల్లో స్నాచర్లు అక్కడి నుంచి ఉడాయించారు. -
చైన్ స్నాచర్లకు 6 నెలల జైలు
చేవెళ్ల రూరల్ : ఓ మహిళ మెడ నుంచి మంగళ సూత్రాన్ని తెంపుకుపోయే ప్రయత్నం చేసిన ముగ్గురు నిందితులకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కోర్టు ఆరు నెలల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున జరిమానా విధించింది. సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల మేరకు... 2014 డిసెంబర్ 11వ తేదీన సాయంత్రం చేవెళ్ల గ్రామానికి చెందిన జయశ్రీ వాకింగ్ చేస్తుండగా బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు పుస్తెల తాడును అపహరించేందుకు ప్రయత్నించారు. పుస్తెలతాడును పట్టుకొని లాగేందుకు ప్రయత్నించగా ఆమె కేకలు వేయటంతో వారు దాన్ని వదిలిపెట్టి పరారయ్యారు. జయశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చేవెళ్ల పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. నిందితులు దుంప ప్రవీణ్, గూడెం జైపాల్, గూడెం యాదయ్యలపై అభియోగాలు నిరూపణ కావటంతో జడ్జి అన్నపూర్ణశ్రీ పై తీర్పు వెల్లడించారు. -
చెలరేగిన చైన్ స్నాచర్లు
బెంగళూరు(బనశంకరి) : నగరంలో మళ్లీ చైన్‌స్నాచర్లు పెట్రేగిపోయారు. శనివారం రాత్రి రెండు వేర్వేరు ప్రాంతాల్లో చైన్‌స్నాచింగ్‌కు తెగబడ్డారు. జేపీ.నగర ఏడవపేజ్లోని చుంచుఘట్ట మెయిన్‌రోడ్డు శివశక్తినగరలో శాలిని అనే మహిళ రాత్రి 8.15 సమయంలో ఆస్పత్రిలో విధులు ముగించుకుని కాలినడకన ఇంటికి బయల్దేరింది. బన్నేరుఘట్టరోడ్డు- అరికెరె సిగ్నిల్ వద్ద బైక్‌లో వచ్చిన దుండగుడు ఆమె మెడలోని 10 గ్రాముల బంగారుచైన్ లాక్కొని ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జేపీ.నగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అదేవిధంగా జయనగర హౌసింగ్‌బోర్డులోని వజ్రమునినగరలో చైన్ స్నాచింగ్ జరిగింది. స్థానికంగా ఉంటున్న సుజాతా అనే మహిళ శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఇంటి ముందు చిన్నారిని ఆడించుకుంటూ భోజనం తినిపిస్తుండగా ఇద్దరు చైన్స్నాచరు అడ్రస్ అడుగుతూ ఆమె మెడలో ఉన్న 45 గ్రాముల బంగారుచైన్ లాక్కుని బైకులో ఉడాయించారు. ఘటనపై తలఘట్టపుర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
చైన్ స్నాచర్ దాడిలో పసికందు మృతి
గొలుసు దొంగల దాడిలో గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతిచెందింది. నగరంలోని నేరెడ్మెట్ రామకృష్ణాపురంలో నివాసముంటున్న ఓ మహిళ ఇంటి ముందు నిల్చొని ఉన్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లడానికి యత్నించారు. ఆ సమయంలో మహిళ చేతిలో ఉన్న 23 రోజుల పసికందు కింద పడి మృతిచెందింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర గాయాలైన మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పసికందు మృతదేహం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మహిళ మెడపై చైన్ లాగిన ఆనవాళ్లతో పాటు కత్తి గాటుకూడా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. నగలను లాక్కెళ్లే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగిందా..? లేక మరేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు. -
అంతర్రాష్ట్ర చైన్‌స్నాచర్ అరెస్ట్
హైదరాబాద్ : జల్సాలకు అలవాటు పడి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర చైన్స్నాచర్ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 50 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ షామిజిల్లాకు చెందిన సోనుకుమార్ జంట నగరాల్లో 14 చోట్ల చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు అతని నుంచి వివరాలు సేకరిస్తున్నారు. -
రెప్పపాటులో తెంపేశారు
పీలేరులో చైన్‌స్నాచర్ల హల్ చల్ ముగ్గులేస్తున్న మహిళల మెడలోని తాళిబొట్ల అపహరణ తెల్లవారుజామున ఇంటి ముందు కల్లాపి చల్లుతూ.. ముగ్గులు వేస్తున్న మహిళల మెడ నుంచి బంగారు చైన్లను దుండగలు అపహరించారు. రెప్పపాటులో తాలిబొట్లను తెంపి ఉడాయించారు. దాడి నుంచి మహిళలు తేరుకునే లోపే అక్కడి నుంచి మాయమయ్యారు. పీలేరు: చైన్ స్నాచర్లు పీలేరు పట్టణంలో హల్చల్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో మహిళల మెడలోని బంగారు తాళిబొట్లను లాక్కెల్లారు. ఉదయం 5.30 నుంచి 6 గంటల మధ్యలో ద్విచక్ర వాహనాలపై వచ్చిన స్నాచర్లు ఇళ్ల ముందు కల్లాపి చల్లి ముగ్గులు వేస్తున్న సమయంలో తమ ప్రతాపం చూపారు. రెప్పపాటు వ్యవధిలో ఈ ఘటనలతో మహిళలు దిగ్భ్రాంతికి గురయ్యారు. గట్టిగా కేకలు వేసేలోపే మాయమయ్యారు. పట్టణంలో ఈ సంఘటనలు తీవ్ర కలకలం రేపాయి. వివరాల్లోకి వెళితే.. స్థానిక పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని బాలాజీ థియేటర్ సమీపంలో మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో మనోహర్ భార్య రూపాదేవి ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేస్తుండగా బుల్లెట్ పై వచ్చిన ఇద్దరు ఆమె మెడలోని 7 సవర్ల బంగారు తాళిబొట్టును లాక్కెల్లారు. అలాగే పట్టణంలోని ఇందిరానగర్‌లో ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుని భార్య ఇంటి ముందు చెత్త ఊడుస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన స్నాచర్లు శ్రీనివాసులురెడ్డి ఇళ్లెక్కడని అడగడం, ఆమె సమాధానం చెప్పేలోపే ఆమె మెడలోని బంగారు బొట్టుచైన్‌ను తెంపేశారు. అలాగే ఇందిరానగర్‌లో ఇళ్లముందు ముగ్గులు వేసుకుం టున్న ఇద్దరు మహిళళను ఏమార్చబోయారు. అయితే వారు అప్రమత్తం కావడంతో స్నాచర్లు పరారయ్యారు. ఇందిరానగర్‌కు చెందిన బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి విముఖత వ్యక్తం చేశారు. -
నగరంలో రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు
హైదరాబాద్: నగరంలో చైన్‌స్నాచర్లు మరోఎసారి రెచ్చిపోయారు. సోమవారం ఉదయం ఒక్క వనస్థలిపురం పరిధిలోనే మూడు చోట్ల ముగ్గురు మహిళల నుంచి 12.5 తులాల బంగారు గొలుసులను లాక్కెళ్లారు. ఎన్జీఓస్ కాలనీలో అలివేలు మంగమ్మ అనే మహిళ మెడలోని ఐదున్నర తులాల బంగారు గొలుసు, కుసుమకుమారి అనే మహిళ మెడలో మూడున్నర తులాల బంగారు గొలుసు, హుడాసాయినగర్ కాలనీలో కృష్ణవేణి అనే మహిళ మెడలో 4 తులాల బంగారు గొలుసులను బైక్‌లపై వచ్చిన దుండగులు దొంగిలించారు. బాధితుల ఫిర్యాదు మేరుకు పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
శంషాబాద్ లో చైన్‌స్నాచర్ అరెస్ట్
హైదరాబాద్: జల్సాలకు అలవాటుపడి నగరంలో పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ర్ట దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన గోవింద్ ఓ ముఠాను ఏర్పాటు చేసుకొని నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు. ఈ ముఠా పై నిఘా పెట్టిన పోలీసులు గోవింద్‌ను శనివారం శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 25 తులాల బంగారు ఆభరణాలతో పాటు పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముఠాకు చెందిన మరో ఇద్దరి కోసం గాలింపు చేపడుతున్నామని శంషాబాద్ డీసీపీ శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో తెలిపారు. -
చోరీచేసేందుకు ప్రయత్నించిన చైన్ స్నాచర్ మృతి
-
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్
- స్థానికుల నుంచి తప్పించుకోబోయి తీవ్రంగా గాయపడ్డ దొంగ హైదరాబాద్: మహిళ మెడలో గొలుసు చోరీచేసేందుకు ప్రయత్నించిన అగంతక చైన్ స్నాచర్ ను స్థానికులు పట్టుకున్నారు. ఆదివారం రాత్రి లంగర్‌హౌస్ బాపూ ఘాట్ సమీపంలోని చోటుచేసుకున్న ఈ సంఘటనలో పారిపోయేందుకు ప్రయత్నించిన అగంతకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. బాపూఘాట్ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోన్న మహిళ మెడలోని బంగారు చైన్‌ను లాగేసిన స్నాచర్.. పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే చుట్టుపక్కలవారు అప్రమత్తమై దొంగను పట్టుకునే ప్రయత్నం చేశారు. వాళ్లనుంచి తప్పించుకునే క్రమంలో గాంధీనగర్, ప్రశాంత్‌నగర్‌ల మీదుగా లక్ష్మీనగర్ వరకు పరుగులు తీసిన దొంగ.. చివరికి ప్రహరీగోడకు ఉన్న ఇనుప చువ్వలు గుచ్చుకుని ఆగిపోయాడు. అప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన దొంగను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్నాచింగ్ కు పాల్పడ్డ యువకుడు ఎవరనేది ఇంకా తెలియరాలేదని, కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేస్తున్నామని పోలీసులు చెప్పారు. -
చైన్ స్నాచర్ అడ్డంగా దొరికిపోయాడు
శంకరపట్నం: మహిళల మెడలోంచి బంగారు ఆభరణాలు లాక్కుని.. బైక్‌పై పరారవుతున్న ఇద్దరు దుండగుల్లో ఒకరు కరీంనగర్ జిల్లాలో అడ్డంగా దొరికిపోయాడు. దుండగులను బస్సును ఢీకొనడంతో గాయపడిన వారు తప్పించుకునేందుకు గుట్టపైకి పరుగులు తీశారు. సినీ ఫక్కీలో పోలీసులు, యువకులు ఛేజ్ చేసి ఓ దొంగను పట్టుకున్నారు. వివరాలివీ...కరీంనగర్ జిల్లా తాడికల్‌కు చెందిన వరలక్ష్మి ఇంటి వద్దే గేదెలకు పశుగ్రాసం వేస్తోంది. కరీంనగర్‌లోని కార్ఖానగడ్డకు చెందిన ఎండీ.ఫయూజ్, ఎండీ.మన్నన్ అనే యువకులు పల్సర్ వాహనంపై వచ్చి సర్పంచ్ ఇల్లు ఎక్కడ అని అడిగారు. ఆమె చెబుతుండగానే.. ఆమె మెడలోంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు. అక్కడినుంచి కేశవపట్నంలోని ఓ కిరాణ దుకాణం ముందు ఉన్న అల్లెంకి సుబ్రమణి మెడలోంచి గొలుసును లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఆమె ప్రతిఘటించడంతో పరారయ్యారు. అక్కడి నుంచి కేశవపట్నంకు చెందిన మ్యాకమల్ల సాగరిక తన పిల్లలకు మధ్యాహ్న భోజనం ఇచ్చి వస్తుండగా పోలీస్‌స్టేషన్ సమీపంలోనే పుస్తెలతాడు లాక్కుని పరారయ్యారు. సాగరిక వెంటనే పోలీసులకు విషయం చెప్పడంతో ఏఎస్సై ఎంఎస్.బేగ్ తన సిబ్బందితో కలిసి దొంగలను వెంబడించారు. కొత్తగట్టు శివారుకు చేరుకోగానే వేగం పెంచడంతో అదుపుతప్పిన దొంగలు ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. ఈ సంఘటనలో ఫయాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయాలతోనే లేచి కొత్తగట్టులోని పెద్దగుట్టపైకి చేరుకున్నారు. స్థానిక యువకులు, పోలీసులు కలిసి గుట్టపైకి చేరి గాలింపు చేపట్టారు. రక్తపు మరకల ఆధారంగా వెదకగా.. ఫయాజ్ ఓ సొరంగంలో దాక్కున్నాడు. అతడిని పట్టుకొని, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరో దొంగ మన్నన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
దొంగకు షాకిచ్చిన మహిళ
నగరంలో గొలుసు దొంగతనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. రోడ్లపై నడుచుకుంటూ వెళ్లేవారినీ, పొద్దునే వాకింగ్‌కు వెళ్లే మహిళలనే టార్గెట్‌గా చేసుకునే చైన్‌స్నాచర్..తాజాగా రూటు మార్చారు. ఇళ్లలోకి చొరబడి మరీ దొంగతనాలకు ప్రయత్నిస్తున్నారు. ఆదివారం ఇలాంటి సంఘటనే మీర్‌పేటలో చోటుచేసుకుంది. మీర్‌పేట పరిధిలోని మిథిలానగర్‌లో ఉన్న ఓ ఇంట్లోకి చొరబడి అనురాధ(28) అనే మహిళ మెడలోని తాళిబొట్టును అపహరించేందుకు ప్రయత్నించాడు. అనురాధ తీవ్రంగా ప్రతిఘటించడంతో తాళిబొట్టును వదిలేసి దుండగుడు పరారయ్యాడు. తాళిబొట్టు దొంగిలించే సమయంలో దుండగుడు ఆమె ముఖం మీద ముసుగు వేయడంతో దుండగుడిని గుర్తుపట్టలేకపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.కోట్లు స్నాచింగ్
నగరంలో భారీగా చైన్‌స్నాచర్ల చేతివాటం మూడేళ్లల్లో రూ.8.6 కోట్ల సొత్తు స్వాహా ‘దోపిడీ’కి అడ్డంకిగా మారిన ‘బాంబే’ తీర్పు సిటీబ్యూరో: సిటీలో పంజా విసురుతున్న గొలుసు దొంగలు గడిచిన మూడేళ్లల్లో లాక్కుపోయిన సొత్తు ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.8,60,54,337. అన్ని రకాలైన సొత్తు సంబంధిత నేరాల్లో ప్రజల కోల్పోయిన దాంట్లో ఇది 7.5 శాతం. ఎప్పటికప్పుడు పంథా మార్చుకుంటూ సిటీలో పంజా విసురుతున్నారు. పోలీసుల ఎత్తులకు స్నాచర్లు పై ఎత్తులు వేస్తున్నారు. మార్కెట్లో బంగారం ధరలు పైపైకి దూసుకుపోతుండడంతో పాతనేరస్తులే కాదు... కొత్తవారూ స్నాచర్ల అవతారం ఎత్తుతున్నారు. ఎలాంటి నేరచరిత్ర లేని వారు, విద్యార్థులు కూడా జల్సాల కోసం స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. ఏటా చిక్కుతున్న స్నాచర్లలో 40 శాతం కొత్తవారే ఉంటుండడం పోలీసులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. వీరి వివరాలు, వేలిముద్రలు వంటి ఎలాంటి సమాచారం పోలీసు రికార్డుల్లో ఉండకపోవడంతో వీరిని గుర్తించడం, పట్టుకోవడం కష్టంగా మారింది. దీంతో పోలీసులకు చిక్కేవరకు నేరాలు చేసుకుంటూ పోతున్నారు. పోలీసు యాక్షన్‌కు స్నాచర్ల రియాక్షన్... స్నాచింగ్ నేరాల్ని కట్టడి చేయడానికి పోలీసులు వేస్తున్న ఎత్తులకు స్నాచర్లు పైఎత్తులు వేస్తున్నారు. తెల్లవారుజామున, సాయంత్రం వేళ నిర్మానుష్య ప్రదేశాల్లో నడిచి వెళ్తున్న మహిళలను టార్గెట్‌గా చేసుకుని వాహనంపై పక్క నుంచి వెళ్తూ గొలుసుకు తెంచుకుపోతున్న స్నాచర్లకు కట్టడి చేయడం కోసం పోలీసులు రెండు రకాల వ్యూహాలు పన్నారు. ఒకటి మఫ్టీలో పోలీసుల్ని మోహరించడం.. మరోటి మహిళా పోలీసులే సాధారణ దుస్తుల్లో బంగారంతో నడిచి వెళ్లే డెకాయ్ ఆపరేషన్. ఈ రెండింటినీ గమనించిన గొలుసు దొంగలు తమ పంథాను పూర్తిగా మార్చేసుకున్నారు. ఓ ప్రాం తంలో పంజా విసిరే ముందు అక్కడ తమ ముఠా సభ్యులతో రెక్కీ చేయించి పరిస్థితులను గమనించి ‘పని’ పూర్తి చేసుకుంటున్నారు. కొన్నిసా ర్లు ఇళ్ల వద్దే ఉన్న, పనులు చేసుకుంటున్న మహిళల మెడలోని గొలుసులు తెంచుకుపోతున్నారు. తగ్గిన కేసులు... పెరిగిన సంచలనాలు... నగరంలో చైన్‌స్నాచింగ్స్ సంఖ్య గణనీయంగా తగ్గింది. పదేపదే నేరాలు చేస్తున్న, మూడు కంటే ఎక్కువ కేసులు ఉన్న వారిపై నగర పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగించడం ప్రారంభించారు. గతేడాది కమిషనరేట్ పరిధిలో రౌడీషీటర్లు, ఇళ్లలో చోరీలు చేసేవారు, గుడుంబా విక్రేతలు, మాదకద్రవ్యాల విక్రేతలు, మోసగాళ్లు, బందిపోటు దొంగలతో కలిపి మొత్తం 263 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించగా... ఇందులో 60 మంది చైన్ స్నాచర్లే ఉన్నారు. 2014లో 523గా ఉన్న కేసుల సంఖ్య గతేడాది 263గా ఉంది. అయితే ఒకేరోజు వరుసపెట్టి అనేక చోట్ల స్నాచింగ్స్ జరగడం, స్నాచర్ల బారిపడన పడిన వారిలో పలువురు వీఐపీ సం బంధీకులు ఉండటం, అనేక మంది క్షతగాత్రులు కావడం, కొందరైతే తీవ్రగాయాలతో ఆస్పత్రుల్లో చేరడం తదితర సంచలనాత్మక ఘటనల నేపథ్యంలో ఈ నేరాలు నిత్యం వార్తల్లో ప్రముఖ స్థానంలో నిలుస్తూనే ఉన్నాయి. ‘దోపిడీ’కి రెండు నెలల్లోనే బ్రేక్... స్నాచర్స్‌ను పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి నగర పోలీసులు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. స్నాచింగ్‌కు పాల్పడి చిక్కిన వారిపై ఒకప్పుడు కేవలం ఐపీసీలోని 379 (చోరీ) సెక్షన్ కింద కేసులు నమోదు చేసేవారు. అయితే ఓసారి ఇలా ఈజీ మనీకి అలవాటుపడిన వారు మళ్లీ రెచ్చిపోతుండటం, సంచనాలు నమోదు కావడంతో ఈ నేరగాళ్లకు తేలిగ్గా బెయిల్ దొరక్కుండా ఉండటానికి స్నాచింగ్ తీరుతెన్నులను బట్టి దోపిడీ కేసు (ఐపీసీ 392) నమోదు చేస్తున్నారు. దాదాపు 40 మందిపై ఈ సెక్షన్ కింద కేసులు నమోదయ్యాయి. అయితే ఇటీవల బాంబే హైకోర్టు అక్కడి ఓ కేసులో స్నాచింగ్ నేరాన్ని దోపిడీ కింద నమోదు చేయడం తగదంటూ తీర్పు ఇచ్చింది. దీంతో ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ వేయాల్సి వచ్చింది. -
చైన్ స్నాచర్‌ను ప్రతిఘటించిన మహిళ
చైన్ స్నాచర్‌ను సమర్ధవంతంగా ప్రతిఘటించిన మహిళ అతన్ని గాయపచగలిగింది. కానీ.. పోలీసులకు పట్టించడంలో విఫలమైంది. కరీంనగర్ జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రానికి చెందిన లక్ష్మీ(45) అనే మహిళ ఆదివారం పత్తి చేను దగ్గరకు వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని దుండుగుడు ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లడానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె అతని చేతిని బలంగా పట్టుకొని ఒక్కతోపు తోసింది. దీంతో అగంతకుడు చెట్లలో పడిపోయాడు. అనంతరం అతన్ని పట్టుకొని రెండు తగిలించి.. చుట్టు ఉన్న వారిని అప్రమత్తం చేసింది. అంతలో తేరుకున్న దుండగుడు ఆమెనుంచి విడిపించుకొని పక్కనే పార్క్ చేసి ఉన్న బైక్ ఎక్కి పరారయ్యాడు. ఇంతలో అక్కడికి వచ్చిన స్థానికులు లక్ష్మీ ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నర్సరావుపేటలో చైన్‌స్నాచర్ అరెస్ట్
నర్సరావుపేటలో మహిళల మెడలో బంగారు గొలుసుల చోరీకి పాల్పడుతున్న షేక్ బాజీ అనే చైన్ స్నాచర్‌ను అరెస్ట్ చేసి ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. అతని వద్ద 96 గ్రాముల బంగారంను స్వాధీనం చేసుకున్నారు. -
నిద్రిస్తున్న మహిళ మెడలో గొలుసు చోరీ
రోడ్డు పై వెళ్తున్న ఒంటరి మహిళలనే కాదు ఇంట్లో ఉన్న వారినీ వదలటం లేదు దొంగలు. ఇంట్లో నిద్రిస్తున్న మహిళ మెడలో మంగళసూత్రాన్ని గుర్తు తెలియని వ్యక్తి అపహరించిన సంఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. సైదాబాద్ పూసలబస్తీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న కె. స్వప్న స్థానికంగా పైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. కాగా, సోమవారం వేకువజామున తన ఇంట్లో నిద్రిస్తుండగా ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసు గుర్తు తెలియని వ్యక్తి లాక్కుని పారిపోయాడు. ఆమె తేరుకునేలోగానే గోడదూకి మాయమయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చైన్ స్నాచర్ భలే దొరికిపోయాడు
హైదరాబాద్ సిటీ: నెల రోజుల క్రితం హైదరాబాద్‌లో చైన్ దొంగిలించిన ఓ దొంగ ఇప్పుడు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. గత నెలలో రాంనగర్లో ఓ మహిళ కళ్లలో కారం కొట్టి దుండగుడు బంగారు గొలుసు దొంగిలించాడు. అదే సమయంలో ఆమె సెల్‌ఫోన్‌ను కూడా ఎత్తుకుపోయాడు. దీనిపై బాధిత మహిళ స్మిత రెండున్నర తులాల మంగళసూత్రం గొలుసుతో పాటు సెల్‌ఫోన్ అపహరణకు గురైందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. నెల రోజుల తర్వాత దొంగ ఆ సెల్ఫోన్లో సిమ్ వేయడంతో పోలీసులు ట్రాప్ చేసి...ఆ చైన్స్నాచర్ను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ దొంగ రాంనగర్ ప్రాంతానికి చెందిన అరుణ్ కుమార్(22)గా గుర్తించారు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖలో చైన్ స్నాచర్ అరెస్ట్
అల్లీపురం: వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన మహేశ్వర్ రావు(45) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 20 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఎమ్వీపీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో 9 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
చైన్‌స్నాచర్‌తో చేతులు కలిపిన పోలీస్
-
మహిళ తేరుకునేలోపే పరారైన చైన్ స్నాచర్
-
గొలుసు వదిలి పరారైన చైన్ స్నాచర్
హైదరాబాద్ : స్కూల్లో పిల్లల్ని దింపి ఇంటి తిరిగి నడిచి వెళ్తున్న అనిత (30) అనే మహిళపై చైన్ స్నాచర్ దాడి చేసి... మెడలో గొలుసు లాక్కుని... పరారవుతున్న క్రమంలో కిందపడ్డాడు. ఇంతలో తెరుకున్న అనిత బిగ్గరగా కేకలు వేసింది. దీంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. దాంతో చైన్ స్నాచర్ గొలుసు వదిలి కొద్దిదూరంలో బైక్‌పై వెయిట్ చేస్తున్న వ్యక్తితో కలసి పరారయ్యాడు. స్థానికులు బైక్‌పై వెంబడించిన... చైన్ స్నాచర్లు మాత్రం కన్ను తెరచి మూసే లోపు మాయమయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మీర్‌పేట ఆర్‌ఎన్‌రెడ్డి నగర్లో గురువారం చోటు చేసుకుంది. అనిత పోలీస్ స్టేషన్‌కి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
మిట్ట మధ్యాహ్నమే...
మల్కాజిగిరి, సరూర్‌నగర్, మేడిపల్లి పీఎస్ పరిధిల్లో గొలుసు దొంగతనాలు మధ్యాహ్నం సమయంలోనే ఘటనలు సుమారు ఆరు తులాల నగలతో ఉడాయింపు సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో చైన్‌స్నాచర్లు మరోసారి వీరంగం సృష్టించారు. సోమవారం నాడు మూడుచోట్ల రెచ్చిపోయిన గొలుసు దొంగలు...మధ్యలో రెండు రోజుల విరామమిచ్చి మళ్లీ తెగబడ్డారు. మేడిపల్లి, సరూర్‌నగర్, మల్కాజిగిరి పోలీసు స్టేషన్ల పరిధిలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళల మెడల్లోంచి సుమారు ఆరు తులాల బంగారు గొలుసులను లాక్కెళ్లారు. ఈ మూడు ఘటనలు మధ్యాహ్నం సమయంలో జరగడంతో వేర్వేరు చైన్ స్నాచర్లు ఈ పనిచేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అద్దె ఇళ్లు కోసం వెతుకుతుండగా... మల్కాజిగిరి: మల్కాజిగిరి పోలీసు స్టేషన్ పరిధిలోని జవహర్‌నగర్ కమ్యూనిటీ హాల్ సమీపంలో అద్దె ఇళ్లు కోసం వెతుకుతున్న పద్మ అనే మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసు తెంపుకెళ్లారు. ‘మేడిపల్లికి చెందిన పద్మ తోటి కోడలు అనురాధ మౌలాలి జవహర్‌నగర్‌లో ఉంటోంది. అయితే పద్మ కూడా నివాసాన్ని జవహర్‌నగర్‌కు మార్చేందుకు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో అనురాధతో కలిసి అద్దె ఇళ్లు వెతుకుతోంది. ఇది గమనించిన బైక్‌పై ఉన్న ఇద్దరు దుండగులు..పద్మ జవహర్‌నగర్ కమ్యూనిటీ హాల్ సమీపానికి వచ్చేవరకు చూశారు. ఎదురుగా వేగంగా వచ్చి మెడలో మూడు తులాల బంగారు గొలుసు తెంపుకెళ్లార’ని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటన జరిగిన కిలోమీటర్ దూరంలోనే సీసీటీమ్ ఉండటం గమనార్హం. కూతురు ఇంటికి వెళుతుండగా... చైతన్యపురి: సరూర్‌నగర్ ఠాణా పరిధిలోని చంపాపేటలో నివాసముండే తారకమ్మ గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఇంటి సమీపంలోని కూతురు ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది. అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని పుస్తెలతాడు లాక్కుని పారిపోయారు. అయితే పుస్తెలతాడుకు సుమారు నాలుగు గ్రాములు బంగారు పుస్తెలు మాత్రమే ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లలను తీసుకొద్దామని... బోడుప్పల్: ఈస్ట్ బాలాజీ హిల్స్ కాలనీలో నివసించే జైతులు రోజు మాదిరిగా గురువారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో స్థానికంగా వున్న స్కూల్లో చదువుకుంటున్న పిల్లలను తీసుకొచ్చేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. వెనక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ ఆగంతుకుడు ఆమె మెడలో నుంచి రెండు తులాల నల్లపూసల తాడును తెంచుకుని పారిపోయాడు. జైతులు కుటుంబ సభ్యులతో కలిసి మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
గల్లీమే సవాల్!
విజృంభిస్తున్న చైన్‌స్నాచర్లు స్పాట్లు మారుస్తూ...రెక్కీలు నిర్వహిస్తూ కొత్త పోకడలు పోలీసులకు ముప్పతిప్పలు గురువారం సైబరాబాద్‌లో మూడు ఘటనలు ఓపక్క ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్స్ (సీసీటీస్)తో పోలీసులనిరోధక చర్యలు... మరోపక్క దూకుడు తగ్గించకుండా తమ పంథా కొనసాగిస్తున్న చైన్‌స్నాచర్లు... సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇలా అసలైన ఆట మొదలైంది. పోలీసులు తీసుకుంటున్న చర్యల్ని ‘అధిగమిస్తున్న’ గొలుసు దొంగలు కొత్త గల్లీలు వెతుక్కుంటూ తాపీగా తమ ‘పని’ కానిస్తున్నారు. పోలీసులకు కొత్త సవాళ్లు విసురుతున్నారు. వనస్థలిపురం పరిధిలోని ఆటోనగర్‌లో గొలుసు దొంగలపై సీసీటీమ్స్ కాల్పులు జరిపిన రెండు రోజుల్లోనే స్నాచర్లు మళ్ళీ పంజా విసిరారు. గురువారం ఒక్కరోజే మల్కాజ్గిరి, మేడిపల్లి, సరూర్‌నగర్‌లలో మూడు స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. సిటీబ్యూరో: నేరగాళ్లు, అసాంఘిక శక్తులపై పోలీసులు నిఘా ఉంచడం సహజం. ఇది అందరికీ తెలిసిందే. నగరంలో ప్రస్తుతం వరుసగా చోటు చేసుకుంటున్న స్నాచింగ్ ఉదంతాలను పరిశీలిస్తే... దొంగలు కూడా పోలీసులు, వారి కదలికలపై నిఘా ఉంచారని..వారిని పక్కాగా గమనిస్తూ అదును చూసి పంజా విసురుతున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. ‘గస్తీ’కి తోడు సీసీటీమ్స్... చైన్ స్నాచర్లను కట్టడి చేయడానికి కమిషనరేట్ పరిధిలో ఒకప్పుడు కేవలం గస్తీ బృందాలు మాత్రమే ఉండేవి. పోలీసుస్టేషన్ల వారీగా అక్కడక్కడ పికెట్లు ఏర్పాటు చేసే వారు. ఇటీవల స్నాచర్ల తీరు హింసాత్మకంగా మారుతుండడంతో ఏకంగా సీసీటీమ్స్ను రంగంలోకి దింపారు. మెరికల్లాంటి సిబ్బందిని ఎంపిక చేసుకోవడంతో పాటు మూడు వారాల పాటు శిక్షణ ఇచ్చి, తుపాకులూ అందించారు. ప్రస్తుతం కమిషనరేట్ మొత్తమ్మీద 55 బృందాలు పని చేస్తున్నాయి. ఈ రకంగా చైన్ స్నాచర్లను కట్టడి చేయడానికి పోలీసులు అన్ని శక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. పరిశీలిస్తూ ‘పని’ పూర్తి చేస్తూ... పోలీసులు తీసుకుంటున్న చర్యల విషయం మీడియా ద్వారా ఇటు ప్రజలతో పాటు అటు స్నాచర్లకూ తెలుస్తూనే ఉంటోంది. దీంతో గొలుసు చోరులు ఎప్పటికప్పుడు తమ పంథాలను మార్చుకుంటూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే పోలీసులు గుర్తించిన...నిత్యం స్నాచింగ్స్ చోటు చేసుకునే హాట్‌స్పాట్స్ ఏరియాల్లోకి స్నాచర్లు అడుగుపెట్టడం లేదు. వీటిపై పోలీసు నిఘా ఉంటుందనే ఉద్దేశంతో గల్లీలనే మార్చి రెచ్చిపోతున్నారు. గస్తీ బృందాలు, పికెట్లు, సీసీటీమ్స్ లేని ప్రాంతాలను ఎంచుకుని, ముందుగా రెక్కీ చేస్తూ ఆపై టార్గెట్లను గుర్తించి పంజా విరుసుతున్నట్లు జరుగుతున్న ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. నేరగాళ్ళకు సంబంధించిన సమగ్ర సమాచారం తెలిసి, ఆ రంగంలో విశేష అనుభవం ఉన్న అధికారుల సంఖ్య వేళ్లపైనే లెక్కించవచ్చు. అయితే ప్రస్తుతం వీరిలో చాలా మంది క్షేత్రస్థాయిలో అందుబాటులో లేరు. సైబరాబాద్‌కు చెందిన అధికారులు ఎన్నికల నేపథ్యంలో జరిగిన బదిలీలతో హైదరాబాద్ సహా అనేక చోట్లకు బదిలీ అయ్యారు. మరికొందరు లా అండ్ ఆర్డర్ విభాగానికి మారిపోయారు. క్రైమ్ విభాగానికి రావడం అంటే సమర్థులైన అధికారులంతా అదో పెద్ద శిక్షగా భావిస్తున్నారు. అక్కడున్న పరిస్థితులే ఈ భావనకు ఊతం ఇస్తున్నాయి. వీటికి తోడు సిబ్బందితో ఇబ్బంది ఎలానూ ఉంది. ఇలా అనేక కారణాల నేపథ్యంలో నేరగాళ్ళకు పూర్తి స్థాయిలో చెక్ చెప్పడం సవాల్‌గా మారింది. ప్రజలూ సహకరించాలి... చైన్ స్నాచర్లను కట్టడి చేయడానికి ప్రజల సహకారం సైతం ఎంతో కీలకం. వీరిలో స్పందన, అవగాహన వస్తే తప్ప ఆశించిన ఫలితాలు రావు. ఎవరికి వారు కనీస జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఏదైనా ఉదంతం జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులకు, పోలీసులకు సహకరించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ఆటోనగర్ ఉదంతాన్నే తీసుకుంటే పారిపోతున్న స్నాచర్ల వెంట సీసీటీస్ సిబ్బందే వెళ్ళారు తప్ప అక్కడున్న ఏ ఒక్క సాధారణ పౌరుడూ ముందడుగు వేయలేదు. అదే జరిగితే ఆ స్నాచర్లు అక్కడే చిక్కడానికీ అవకాశాలు ఉండేవి. బాధితులు సైతం స్నాచింగ్ జరిగిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీసుల సమాచారం ఇవ్వడం స్నాచర్లను పట్టుకోవడానికి ఉపకరించే అవకాశాల్లో కీలకమైందని మరువకూడదు. -
చైన్‌స్నాచర్ల భరతం పట్టండి
పారిపోయే అవకాశం ఇవ్వొద్దు ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్స్‌కు సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం సిటీబ్యూరో: చైన్ స్నాచర్లు కనిపిస్తే చాలు పట్టుకొని తీరుతామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. వనస్థలిపురం ఆటోనగర్‌లో సోమవారం ఉదయం 11 గంటలకు చైన్‌స్నాచర్లు చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న నేపథ్యంలో ‘ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్స్’కు గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఆయన బుధవారం దిశా నిర్దేశం చేశారు. చైన్‌స్నాచర్ల కనిపించినప్పుడు వారిని పట్టుకునే విధానంలో మెళకువలతో పాటు పరిస్థితులకు తగ్గట్టుగా వేగంగా స్పందిచడంపై పాఠాలు చెప్పారు. ఫీల్డ్‌లో వారికి ఉన్న సందేహాలనూ నివృత్తి చేశారు. ఆ తర్వాత పోలీసు పరేడ్ గ్రౌండ్లో సీసీటీమ్స్ చేసిన బైక్ విన్యాసాలు, రివాల్వర్ వాడే తీరు కళ్లకు కట్టింది. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. ‘‘గతంతో పోల్చుకుంటే చైన్ స్నాచింగ్‌లు తగ్గుముఖం పట్టాయి. అయితే హింస తీవ్రత పెరిగింది. ఓయూలో సుమిత్ర అనే మహిళ మరణించింది. చాలా మంది మహిళలు గాయపడ్డారు. అందుకే శ్రుతిమించుతున్న చైన్స్నాచర్లను నిలువరించాలంటే వారి తరహాలోనే పోలీసు టీమ్స్ ఉండాలని భావించాం. ఫీల్డ్‌లోనే గుర్తిస్తే చైన్ స్నాచింగ్‌లను తగ్గించవచ్చనే ఆలోచనల నుంచి యాంటీ చైన్ స్నాచింగ్ స్ట్రాటజీ కార్యరూపం దాల్చింది’’ అని ఆనందర్ అన్నారు. ఐదంచెల ప్రణాళికతో చెక్... ‘‘చైన్ స్నాచింగ్ జరిగిన తర్వాత అరగంట, గంటకు బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే, అప్పటికే మూడు నాలుగు ప్రాంతాల్లో గొలుసు చోరీలు జరిగిపోతున్నాయి. ఎక్కడెక్కడ చైన్ స్నాచింగ్‌లు జరుగుతున్నాయో గుర్తించి అందుకు అనుగుణంగా 110 మందితో 55 సీసీటీమ్స్ రెడీ చేశాం. చైన్ స్నాచర్లను పట్టుకునే మెళకువలతో పాటు బైక్‌ను వేగంగా నడపడం, నియంత్రించడంపై శిక్షణ ఇప్పించాం. ఒకవేళ స్నాచర్లు ఆయుధాలతో దాడికి యత్నిస్తే ఆత్మరక్షణ కోసం కాల్పులు ఎలా జరపాలో కూడా ప్రత్యేక తర్ఫీదునిచ్చాం’’ అని కమిషనర్ చెప్పారు. అంతరాష్ట్ర చైన్‌స్నాచర్ల ముఠాలను పట్టుకునేందుకు ఇప్పటికే ఏడు ప్రత్యేక బృందాలు రెడీ చేశాం. స్నాచర్లను పట్టుకునేందుకు ఆ బృందాలు వారణాసి, మహారాష్ట్రలకు వెళ్లాయి. ఇతర రాష్ట్రాల్లోని చైన్ స్నాచర్ల వివరాలు తెలుసుకునేందుకు కూడా ప్రత్యేక విభాగం పనిచేస్తోంది. స్థానిక స్నాచింగ్ ముఠాలపై నిఘా వేసేందుకు కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పటికే గొలుసు దొంగల పూర్తి సమాచారం సేకరించాం. ఆఫీసు రికార్డుల్లో పూర్తిగా అప్డేట్ చేసే పనిలో నిమగ్నమయ్యాం. సీసీటీమ్స్, లోకల్ పోలీసు అధికారుల ఫోన్లో చైన్‌స్నాచర్ల ఫొటోలతో పాటు వివరాలు ఉండేలా యాప్ రెడీ చేస్తున్నాం. గతంలో మాదిరిగా రోటీన్ చెకప్ కాకండా స్థానిక పోలీసులు ఎక్కడపడితే అక్కడ వాహనాల తనిఖీలు చేసేలా చూస్తున్నాం. డైనమిక్ బీట్స్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలోని పార్కింగ్ ప్రాంతాల్లో తనిఖీ చేస్తున్నాం. స్నాచింగ్స్‌పె ప్రజల్లో అవగాహన కలిగించేందుకు తయారుచేసిన కరపత్రాలను పంపిణీ చేస్తున్నాం. ఇతర నేరాలు కూడా జరిగే విధానాన్ని వివరిస్తూ రెడీ చేసిన పోస్టర్లను అన్ని ప్రాంతాల్లో అతికించేలా చొరవ తీసుకుంటున్నామని కమిషనర్ ఆనంద్ చెప్పారు. -
భయం..భయం..
చైన్ స్నాచర్ల ఆగడాలతో ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటేనే మహిళలు భయపడే పరిస్థితి నెలకొంది. ఇంటి ముందు ఉన్న కిరాణ షాపుకు వెళ్లినా... కూరగాయల మార్కెట్‌కు వెళ్లినా... పిల్లలను పాఠశాల నుంచి తీసుకువచ్చేందుకు వెళ్లినా.. తిరిగి ఇంటికి చేరే వరకు ప్రమాదం ఏ రూపంలో ముంచుకొస్తుందోని మహిళలు ఆందోళనచెం దుతున్నారు. ఏ గల్లీ, ఏ రోడ్డు నుంచి చైన్‌స్నాచర్లు దూసుకొస్తారో... మెడలోని ఆభరణాలను తెంపుకెళ్తారోనని భయం భయంగా దిక్కులు చూస్తూ వెళ్లాల్సివస్తోంది. తాము ఎంత జాగ్రత్తగా ఉన్నా చైన్‌స్నాచింగ్‌లు తప్పడం లేదని పలువురు మహిళలు వాపోతున్నారు. - వనస్థలిపురం మానసిక వేదనకు గురవుతున్నాం... వనస్థలిపురంలో చైన్ స్నాచింగ్‌లకు అంతే లేకుండా పోతోంది. నిత్యం ఏదో ఒక చోట, ఒకోసారి రెండు, మూడు చోట్ల స్నాచింగ్‌లు జరుగుతున్నాయి. మహిళలు బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. మంగళ సూత్రాలను సైతం తెంపుకెళుతుండడంతో మహిళలు మానసిక వేదనకు గురవుతున్నారు. - ఉమా శ్రీనివాస్, వనస్థలి మహిళా మండలి అధ్యక్షురాలు గస్తీ పెంచాలి పాఠశాలల సమయంలో, దేవాలయాల వద్ద, ఫంక్షన్ల సమయంలో పోలీసులు గస్తీ పెంచాలి. చైన్‌స్నాచింగ్‌ల పరంపరను నిరోధించాలి. మహిళల మంగళ సూత్రాలను ఎత్తుకెళుతున్న నేరస్తులను కఠినం గా శిక్షించాలి. మహిళలు కూడా బయటికి వెళ్లినప్పుడు ఎవరికివారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. - చల్లా గీతారెడ్డి, ఎండీ, ఆరెంజ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ మమ్మల్నే తప్పుపడుతున్నారు... పోలీసులు ఎంతసేపు మమ్మల్నే తప్పుబడుతున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ మాకే చెపుతున్నారు తప్ప చైన్‌స్నాచింగ్‌ల నిరోధానికి సరైన చర్యలు తీసుకోవడం లేదు. మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరిగే నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి వందల సంఖ్యలో చైన్‌స్నాచింగ్‌లు జరిగాయి. మంగళ సూత్రాలు కూడా లాక్కెళుతున్నారు. - ఎ.నిర్మల, గృహిణి -
సీసీటీమ్స్కు స్పెషల్ క్లాస్
సిటీబ్యూరో: చైన్ స్నాచర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగిన ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్స్ (సీసీటీమ్స్)కు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్పెషల్ డెరైక్షన్స్ ఇవ్వనున్నారు. ఆటోనగర్‌లో సోమవారం చైన్ స్నాచర్లపై సీసీటీమ్స్ కాల్పులు జరిపిన నేపథ్యంలో ఆయా బృం దాలు కిందిస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారిం చారు. చైన్ స్నాచర్లను పట్టుకునే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించనున్నారు. సీసీటీమ్స్ ఇచ్చిన సలహాలు, సూచనలను కూడా పరిగణనలోకి తీసుకొని అందుకనుగుణంగా చైన్‌స్నాచర్ల వీరంగానికి అడ్డుకట్ట వేయడంపై సీవీ ఆనంద్ ప్రత్యేకదృష్టి పెట్టనున్నారు. ఈ మేరకు గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్స్ తో సమావేశం ఏర్పాటుచేస్తున్నారు. ‘జనరద్దీ ఉన్న ప్రాంతాల్లో కాల్పులు జరపొద్దు. అయితే కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో చైన్స్నాచర్లను నిలువరించే క్రమంలో జరుగుతుంటా యి. ఎల్బీనగర్లోని ఆటోనగర్‌లో చైన్స్నాచర్లను పట్టుకునేందుకు సిబ్బంది చాలా ధైర్యం చేసింది’అని సీవీ ఆనంద్ అన్నారు. మహిళల భద్రత కోసమే... ‘మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఛేజిం గ్ అండ్ క్యాచింగ్ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఓయూ లో జరిగిన ఘటనలో సుమిత్రా అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత జరిగిన వివిధ ఘటనల్లో పదుల సంఖ్యలో మహిళలు గాయపడ్డారు. అందుకే చైన్‌స్నాచర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఎల్బీనగర్ ఆటోనగర్‌లో చైన్స్నాచర్లను నిలువరించే క్రమంలో సీసీటీమ్స్ కాల్పులు జరిపాయి. ఇది లోకల్ ముఠా పనే, సాధ్యమైనంత తొందరగా పట్టుకుంటామ’ని ఎల్బీనగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. -
కాస్కోండి
ఇక చైన్ స్నాచర్ల ఆటకట్టు ఆపరేషన్స్ ప్రారంభించిన ‘సీసీ టీమ్స్’ వారంలోనే వనస్థలిపురంలో తొలి ఘటన హాట్‌స్పాట్స్‌లో మకాం వేస్తున్న బృందాలు ప్రాంతాల వారీగా విధులు కేటాయింపు సిటీబ్యూరో: అదును చూసి వరుసగా పంజా విసురుతూ...సాధారణ ప్రజలతో పాటు పోలీసుల్నీ ముప్పతిప్పలు పెడుతున్న చైన్ స్నాచర్ల ఆటకట్టించడానికి సైబరాబాద్ పోలీసులు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. ఈమేరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్స్ (సీసీటీస్) తమ ఆపరేషన్స్ ప్రారంభించాయి. వారం రోజులుగా వనస్థలిపురం ప్రాంతంలో మకాం వేసి ఓ బృందం సోమవారం ఇద్దరు స్నాచర్లను పట్టుకోవడానికి ప్రయత్నించింది. తప్పించుకు పారిపోతున్న దొంగలపై కాల్పులు జరిపింది. బహిరంగ ప్రదేశం కావడంతో టార్గెట్ మిస్ అయినప్పటీ సీసీటీమ్స్ ఏర్పాటు స్ఫూర్తి అమలులోకి వచ్చినట్లయింది. చైన్ స్నాచర్లకు చెక్ చెప్పడానికి ఉద్దేశించిన సీసీటీమ్స్కు మూడు అంశాల్లో శిక్షణ ఇచ్చారు. స్నాచర్లను ఎదుర్కొనే విధానాల్లో భాగంగా హై స్పీడ్ వాహనాలను సురక్షితంగా డ్రైవ్ చేయడం, ఎలాం టి ఆయుధాలు లేకుండా స్నాచర్లతో పోరాడగలగటం, అవసరమైనప్పుడు కాల్పులు జరపటంలో మూడు వారాల పాటు శిక్షణ ఇచ్చారు. ఠాణాల వారీగా హాట్‌స్పాట్స్ గుర్తింపు... సైబరాబాద్ మొత్తమ్మీద 110 మందితో 55 సీసీటీమ్స్ను రం గంలోకి దింపిన అధికారులు వాటికి విధులనూ వ్యూహా త్మంకగా అప్పగించారు. ఠాణాల వారీగా గడిచిన మూడేళ్ళల్లో చోటు చేసుకున్న స్నాచింగ్స్‌ను పరిశీలించిన అధికారులు తరచుగా గొలుసు చోరీలు చోటు చేసుకుంటున్న హాట్ స్పాట్స్‌ను గుర్తించారు. ప్రాంతాలతో పాటు సమయాలు, కచ్చితమైన చోట్లనూ స్థానిక అధికారుల సాయంతో తెలుసుకుని జాబితాలు సిద్ధం చేసుకున్నారు. పోలీసుస్టేషన్ల వారీగా పని చేసే సీసీటీమ్స్ల్లో ఒక్కోదానికీ కొన్ని ప్రాంతాలను అప్పగించారు. వీరు ఆయా ప్రాంతాల్లో నిఘా వేసి ఉంచడంతో పాటు స్నాచింగ్స్‌కు అనుకూలమైన సమయాలు, ఏరియాలను గుర్తిస్తూ అవసరమైన చర్యలకు తీసుకోవాల్సి ఉంటుం ది. ఈ విధులు నిర్వర్తిస్తున్న ఒక్కో బృందానికీ సైబ రాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ నెలకు రూ.5 వేలు చొప్పున అదనంగా అందిస్తున్నారు. తక్షణం స్పందించే తత్వం ఉండేదుకు సీసీటీమ్స్లో పని చేస్తున్న యువకులు గరిష్టంగా 25 ఏళ్ళ లోపు వాళ్ళే ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఒంటరి మహిళల్ని ఫాలో అవుతూ... సీసీటీస్లో పని చేసే సిబ్బంది పూర్తి స్థాయిలో మఫ్టీలోనే ఉం టారు. ఆహార్యం, వస్త్రధారణలో సైతం ఎక్కడా పోలీసుల్లా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చైన్ స్నాచర్లు ఎక్కువగా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళల్నే టార్గెట్‌గా చేసుకుంటున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న సీసీటీమ్స్ తమకు కేటాయించిన ప్రాంతాల్లో విధులు నిర్వరిస్తున్నాయి. ఈ బృందంలో ఉండే ఇద్దరు సభ్యులు తమకు కేటాయించిన ప్రాంతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటారు. హాట్‌స్పాట్‌కు అతి దగ్గరలో ఒకరు వాహనంపై సిద్ధంగా ఉంటారు. మరొకరు ఆ ప్రాం తంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలకు కాస్త దూరంలో అనుసరిస్తారు. ఒక మహిళ ఆ ప్రాంతం దాటిపోతే మరో మహిళ వెనుక అనుసరిస్తుంటారు. ప్రతి గంట కూ వీరు స్థానాలు మారుతూ విధులు కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలోనే వనస్థలిపురం ఘటనలో బాధితురాలికి అతి సమీపంలోనే సీసీటీమ్ సిబ్బంది ఉన్నారు. ‘మూవింగ్ ఆజ్జెట్స్’తోనే ఇబ్బంది... చైన్‌స్నాచర్లు తమను పట్టుకోవడానికి ప్రయత్నించిన క్షేత్రస్థాయి పోలీసులపై దాడులకు దిగడం, కత్తులతో హత్యాయత్నాలకు పాల్పడటం గతంలో చోటు చేసుకున్నాయి. ఉత్తరాది నుంచి వస్తున్న స్నాచర్లు తమ వెంట నాటు తుపాకులు సైతం తెచ్చుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఇద్దరు సభ్యులతో ఉండే ఒక్కో సీసీటీమ్స్ బృందానికీ ఒక తుపాకీ కేటాయించారు. వీరికి మొయినాబాద్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడెమీ (ఐఐటీఏ)లో 40 రౌండ్లు చొప్పున ఫైరింగ్ ప్రాక్టీస్ సైతం చేయించారు. అయి తే గ్రేహౌండ్స్, ఆక్టోపస్ కమాండోల మాదిరిగా జనసమర్థ ప్రాంతాల్లో కదులుతున్న వస్తువులు, వ్యక్తులు (మూవింగ్ ఆబ్జెక్ట్స్)ను టార్గెట్ చేయడంలో సీసీటీమ్స్ సభ్యులు నిష్ణాతులు కాదు. ఈ కారణంగానే వనస్థలిపురం ఉదంతంలో చైన్ స్నాచర్లు తప్పించుకోగలిగారు. -
స్నాచర్..టైర్రర్
రెచ్చిపోయిన గొలుసు దొంగలు నాలుగు చోట్ల చైన్ స్నాచింగ్ ఆటోనగర్‌లో సీసీటీమ్స్ కాల్పులు సరూర్‌నగర్, అల్వాల్, టోలీచౌకిల్లోనూ ఘటనలు.. తొమ్మిది తులాల బంగారు ఆభరణాలతో పరారీ జంట పోలీసు కమిషనరేట్ల పరిధిలో సోమవారం నాలుగు చోట్ల చైన్ స్నాచర్లు వీరంగం సృష్టించారు. ఎల్బీనగర్ పరిధిలోని ఆటోనగర్‌లో అనురాధ అనే మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా..ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసు లాక్కొనేందుకు ఇద్దరు దుండగులు ప్రయత్నించారు. ఇది గమనించిన ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్స్ (సీసీటీమ్స్) కానిస్టేబుళ్లు రవిశంకర్, నరేందర్ వారిని వెంబడించగా బైక్‌పై పారిపోయారు. వారిని పట్టుకునే ప్రయత్నంలో కానిస్టేబుళ్లు కాల్పులు కూడా జరిపారు. అయినా చైన్‌స్నాచర్లు తప్పించుకున్నారు. సరూర్‌నగర్, అల్వాల్, టోలీచౌకి ఫ్లైఓవర్ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో బాధితులు తొమ్మిది తులాల బంగారు ఆభరణాలను కోల్పోయారు. - సాక్షి, సిటీబ్యూరో సరూర్‌నగర్‌లో... చైతన్యపురి: హుడాకాంప్లెక్స్‌లో నివాసముండే డి.సుమతి(48) సోమవారం మధ్యాహ్నం ఇంటి సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లివస్తుంది. అదే సమయంలో ఎదురుగా వేగంగా వస్తున్న బైకును గమనించింది. చీరకొంగు భుజాలపై వేసుకుంటుండగా బైకుపై వెనుక కూర్చున్న అగంతకుడు ఆమె మెడలోని బం గారు పుస్తెలతాడును లాగాడు. దీంతో అప్రమత్తమైన ఆమె గట్టిగా పట్టుకోగా పుస్తె, లక్ష్మిరూపు కిందపడిపోగా, మూడు తులాల గొలుసు దుండగుల చేతికి చిక్కింది. బాధితురాలు సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని డీఐ సునిల్ తెలిపారు. అల్వాల్‌లో... అల్వాల్: గోల్నాక అల్వాల్‌కు చెందిన ఇందిర (55) సోమవారం ఉదయం టెంపుల్ అల్వాల్‌లో ఉన్న తన టెలిఫో న్ బూత్ వైపు నడుచుకుంటు వెలుతుండగా, వెనుకనుంచి వచ్చిన గుర్తు తెలియని అగంతకులు ఇందిర మెడలోని రెండు తులాల బంగారు గొలుసు లాక్కొని ముందుకు పరిగెత్తారు. అప్పటికే సిద్ధంగా ఉన్న ద్విచక్ర వాహనంపై పారిపోయారు. కొద్ది దూరం వెళ్లాక నిందితుడు బం గారు గొలుసుకు ఉన్న పుస్తెలను తొలగించి రోడ్డుపై పడవేసి వెళ్లాడు. తెలుపు రంగు టీషర్ట్, షార్ట్ ధరించి ఉన్నాడని 50 సంవత్సరాల వయసు కలిగి ఉండవచ్చని బాధితురాలు అల్వాల్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. టోలిచౌకి ఫ్లైఓవర్‌పై... గోల్కొండ: గచ్చిబౌలికి చెం దిన సంపత్‌రావు ఆదివారం రాత్రి పది గంటల ప్రాం తంలో తన భార్య వరలక్ష్మితో కలిసి పురానాపూల్‌లోని తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరై తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలోనే సంపత్ టోలీచౌకి ఫ్లైఓవర్‌పై నుంచి షేక్‌పేట్ నాలావైపు వెళుతుండగా రుమాన్ హోటల్ ఎదురుగా కొందరు యువకులు గుమిగూడి వాగ్వావాదం చేసుకుంటున్నారు. ఆ గుంపునకు సమీపంలో వచ్చి సంపత్‌రావు బైక్ వేగాన్ని తగ్గించాడు. అదే సమయంలో వెనక నుంచి పల్సర్‌పై వేగంగా వచ్చిన ఇద్దరు యువకులు వరలక్ష్మి మెడలోని నాలుగు తులాల బంగారు మంగళ సూత్రాన్ని లాక్కొని పరార య్యారు. దీంతో హతాషుడైన సంపత్‌రావు బైక్ వేగాన్ని పెంచి వారిని వెంబడించాడు. అక్కడున్న ఇద్దరు యువకులు కూడా పల్సర్‌ను వెంబడించినా లాభం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
వేట మొదలైంది...
గొలుసు దొంగల ఆటకట్టించేందుకు.. రంగంలోకి యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్స్ నిపుణుల ఆధ్వర్యంలో బైక్ రేసింగ్, ‘షార్ట్ వెపన్’ శిక్షణ పలు ప్రాంతాల్లో నిఘా... తక్షణమే స్పందించేందుకు సిద్ధం సిటీబ్యూరో: నగరంలో చైన్ స్నాచర్ల భరతం పట్టేందుకు సైబరాబాద్ యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్స్ రంగంలోకి దిగాయి. జంట పోలీసు కమిషనరేట్లలో వరుస గొలుసు దొంగతనాలతో సవాల్ విసురుతున్న అంతర్రాష్ట్ర ముఠాలతో పాటు స్థానిక గ్యాంగ్‌ల పనిపట్టేందుకు మూడంచెల్లో కఠోర శిక్షణ పొందిన ఈ బృందాలు ఆదివారం నుంచి వేట మొదలెట్టాయి. 55 బృందాలతో పాటు 30 మంది సభ్యులతో కూడిన ఐదు నేర విభాగ బృందాలు సివిల్ డ్రెస్సులో బహిరంగ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో గంటల తరబడి తిరుగుతూ అనుమానంగా కనిపిస్తే చాలు వారి ఫొటోలను క్లిక్‌మనిపిస్తున్నారు. మహిళలను వెంబడిస్తున్నట్టుగా అనిపిస్తే వారిని అనుకరించి పట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. వారం రోజుల శిక్షణ... ‘పిల్లర్ రైడర్ ముఖానికి రుమాలు...బైకర్ మొహానికి కర్చీఫ్‌తో పాటు హెల్మెట్...బ్రేక్ వేస్తే బైక్ ఎగిరిపడుతుందా అన్నట్లుగా అతి వేగంగా ఇద్దరు వ్యక్తులు దూసుకెళ్తున్నారు. సేమ్ టూ సేమ్ వీరి వెనకాలే అంతే వేగంతో ఇద్దరు మరో బైక్‌పై దూసుకెళ్లి ముందు వెళ్తున్న వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ముందు బైక్ వ్యక్తులు తమ వద్దనున్న ఆయుధాలతో దాడి చేయబోతే పిడుగుద్దులతో వారిని నిలువరించారు.’ ఈ దృశ్యాలు ఉస్మాన్‌సాగర్ గండిపేట చెరువు ప్రాంతంలో గత వారం రోజులుగా కన్పిస్తున్నాయి. విషయమేంటంటే...యాంటీ చైన్‌స్నాచింగ్ టీంకు ఇక్కడ ఈ తరహాలో శిక్షణ ఇస్తున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్వీయ పర్యవేక్షణలో ఏఆర్ ఏసీపీ కిష్టయ్య నేతృత్వంలో 110 మందితో కూడిన బృందాలతో పాటు నేర విభాగం నుంచి మరో 30 మంది ఈ రకమైన తర్ఫీదు పొందారు. గొలుసు దొంగలు ఎలా ఉంటారు...వారి వ్యవహారశైలి ఎలా ఉంటుంది..వారిని గుర్తించడం ఎలా వంటి అంశాల్లో నిపుణులతో శిక్షణ ఇప్పించారు. మానసికంగా, శారీరకంగా సంసిద్ధులను చేశారు. వ్యక్తిత్వ వికాస నిపుణులతో మోటివేషన్ క్లాసులు, రివాల్వర్, తుపాకులు ఉపయోగించే విధానం, బైక్ రేసింగ్ చేయడంలో మెళకువలను ప్రాక్టికల్‌గా నేర్పించారు. వారం రోజుల పాటు ఉదయం ఆరు నుంచి 11.30 గంటల వరకు బైక్ రేసింగ్, ఆ తర్వాత షార్ట్వెపన్స్ వినియోగం, మోటివేషనల్ తరగతులు నిర్వహించారు. ఆత్మరక్షణ కోసమైతే కాల్పులే... చైన్ స్నాచింగ్స్ జరిగినప్పుడు బాధితులు ఆలస్యంగా ఫిర్యాదుచేస్తున్నారు. దాంతో దొంగల్ని పట్టుకోవడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్స్‌కు అంకురార్పణ జరిగింది. ఈ బృందాలు క్షేత్రస్థాయిలోనే ఉండటం వల్ల ఒకవేళ చోరీ జరిగినా వీలైనంత త్వరగా ఘటనాస్థలికి చేరుకునేందుకు అస్కారముంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ముఠాలు తారసపడితే వెంబడించేందుకు హైస్పీడ్ బైక్‌లు ఇచ్చారు. దుండగులు ఎదురుతిరిగితే ఎలాంటి చర్యకైనా సిద్ధంగా ఉండేందు కోసం...అంటే ఆత్మరక్షణార్ధం ఎదురుతిరిగేందుకు చట్టంలో వెసులుబాటు ఉండటంతో అవసరమైతే కాల్పులు జరిపేందుకు వెనుకాడకుండా సిబ్బందిని తీర్చిదిద్దారు. స్నాచర్లు..క్యాచర్లుగా... స్నాచర్లు, క్యాచర్లుగా పోలీసులు ద్విపాత్రాభినయం చేస్తూ ప్రాక్టీసు చేశారు. స్నాచర్లు...ఎంత వేగంగా బైక్‌లను నడుపుతూ తప్పించుకుంటారో అంతే వేగాన్ని ప్రయోగించి దొంగలను పట్టుకోవడంపై శిక్షణ ఇచ్చాం. మామూలు రోడ్లపై సాధారణ జనానికి ఇబ్బంది కలగకుండా స్నాచర్లను పట్టుకోవడం...చైన్ స్నాచర్లు ఆయుధాలతో ఎదురుతిరిగితే ఎలాంటి ఎత్తులు వేయాలో నేర్పాం. ఆత్మవిశ్వాసం, ప్రజలకు రక్షణ కల్పించాలనే లక్ష్యంతో కష్టమైనా పోలీసులు ఇష్టంగా అన్ని అంశాల్లో ఆరితేరారు. - కిష్టయ్య, ఏఆర్ ఏసీపీ -
బయ్యారంలో చైన్‌స్నాచర్ అరెస్ట్
బయ్యారం (ఖమ్మం జిల్లా) : ఖమ్మం జిల్లా బయ్యారం మండలంలో గత కొంత కాలంగా వరుస చైన్ స్నాచింగులకు, దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 12 తులాల బంగారం, 57 తులాల వెండి, మరో బైక్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాపం సాకేత్!
బరి తెగింపు.. ఎవరేమి చేస్తారులే అనే బలుపు.. వెంటాడి లాగేద్దాం వస్తే గొలుసులు.. పోతే ప్రాణాలు అన్నట్లు.. చైన్ స్నాచర్లు చెలరేగిపోతున్నారు. గురువారం ఒక్క రాత్రే ఒక్క రాజేంద్రనగర్ పరిసరాల్లో కేవలం గంటన్నరలో మూడు ఉదంతాలు చోటు చేసుకున్నాయి. పాపం ఓ చిన్నారి తీవ్రంగా గాయపడడం విచారకరం. రాజేంద్రనగర్: రోజురోజుకీ బరితెగిస్తున్న స్నాచర్లు పోలీసులకే సవాల్ విసురుతున్నారు. మెడలో ఉన్న గొలుసుల్ని లాగే క్రమంలో తీవ్రంగా గాయపడుతున్న బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఉస్మానియా వర్శిటీ పరిధిలో ఏకంగా ఓ మహిళ మృత్యువాత పడింది. గురువారం రాత్రి రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో జరిగిన వరుస స్నాచింగ్స్లో ఏడాదిన్నర వయస్సున్న సాకేత్ తీవ్రంగా గాయపడ్డాడు. స్నాచర్లు పంజా విసిరే సమయంలో వాహనంపై ప్రయాణిస్తున్న తల్లిఒడిలో నిద్రిస్తున్న ఈ పసివాడు తల్లితో సహా కిందపడ్డాడు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి 8.30 నుంచి 10 గంటల మధ్య మూడు ఉదంతాలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ ఒకే ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. హైదర్‌గూడకు చెందిన చంద్రశేఖర్ తన భార్య లావణ్య, కుమారుడు సాకేత్‌లతో కలిసి పల్లెచెర్వులో జరిగిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఆరామ్‌ఘర్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు లావణ్య మెడలోని మూడు తులాలు బంగారు గొలుసు లాగేశారు. ఆకస్మికంగా జరిగిన ఈ ఉదంతంతో అదుపు తప్పిన లావణ్య ఒడిలోని బిడ్డతో సహా రోడ్డుపై పడిపోయారు. దీంతో లావణ్యకు స్వల్ప గాయాలు కాగా.. సాకేత్ ఎడమ కాలు విరగడంతో పాటు ముఖానికీ తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరూ స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందారు. స్నాచింగ్ విషయం చెప్తున్న పోలీసులు బాలుడికి గాయాలైన విషయాన్ని మాత్రం అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. మరో రెండు ఘటనల్లో... శివరామ్పల్లికి చెందిన విజయ్ తన భార్య లలితతో కలిసి పల్లెచెర్వులో బతుకమ్మ సంబరాలకు హాజరై తిరిగి వస్తున్నారు. పల్లెచెర్వు దాటిని కొద్దిసేపటికే వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు లలిత మెడలోని 2.5 తులాల పుస్తెలతాడు తాక్కుని ఉడాయించారు. హైదర్‌గూడకు చెందిన వెంకటయ్య తన భార్య సంతోషితో కలిసి స్థానికంగా ఉన్న సాయిబాబ దేవాలయానికి వెళ్ళారు తిరిగి వస్తున్న సమయంలో వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు సంతోషి మెడలోని 3.5 తులాల బంగారు గొలుసు స్నాచింగ్ చేశారు. మహిళ మెడలో గొలుసు మాయం కుత్బుల్లాపూర్: ఆటోలో మాయ లేడీలు ఓ మహిళ మెడ నుంచి బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్ రాఘవేంద్ర కాలనీలో నివాసముండే శశికళ ఐడీపీఎల్ ఎస్‌బిహెచ్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె బుధవారం షాపూర్‌నగర్ నుంచి ఆటోలో బ్యాంక్‌కు బయలుదేరారు. ఆ సమయంలో ముఖాలకు స్కార్ఫ్‌లు కట్టుకున్న ముగ్గురు మహిళలు చుట్టూ పోగై పథకం ప్రకారం మెడలో ఉన్న సుమారు రూ.1.20 లక్షల విలువ చేసే ఐదు తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. బ్యాంక్‌కు వెళ్లిన శశికళ మెడలో పుస్తెలతాడు లేకపోవడంతో తోటి ఉద్యోగులు అడగ్గా ఆమె గొలుసు పోయిన విషయం గుర్తించి షాకయ్యారు. ఈ విషయంపై బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆటో నడిపిన వ్యక్తి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చైన్ స్నాచింగ్ బంజారా హిల్స్: ఇంటి ముందు నిలబడిన మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు తస్కరించిన ఘటన శుక్రవారం రాత్రి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పొలీసులు తెలిపిన వివరాలు.. శ్రీనగర్ కాలనీ సమీపంలోని ఎల్లారెడ్డిగూడ ఆర్ బీఐ క్వార్టర్స్ ఎదురుగా నివసించే విజయలక్ష్మి (44) అనే మహిళ శుక్రవారం రాత్రి 9 సమయంలో భోజనం చేసి వచ్చి ఇంటి ముందు నిలబడింది. అమె నిలబడ్డ రెండు మూడు నిమిషాలకే నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్‌పై ముసుగులు ధరించి వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఆమె మెడలోని రెండు తులాల మంగళ సూత్రాన్ని లాక్కొని క్షణాల్లో పరారయ్యారు. ఒక్క ఉదుటన గొలుసు లాగడంతో ఆమె కింద పడి పోయింది. ఆమె కేకలు విని కుటుంబం సభ్యులు బయటకు వచ్చి ప్రథమ చికిత్స చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కార్యాలయంలోకి వెళ్లి...కళ్లలో కారం కొట్టి.!
రాంనగర్లో రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు ముషీరాబాద్: రాంనగర్లో మంగళవారం చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. వేర్వేరుగా ఇద్దరు మహిళల మెడలోని బంగారు ఆభరణాలు దోచుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం స్థానిక ఈస్ట్ ఎంసీహెచ్ కాలనీకి చెందిన అనసూయ(53) మార్నింగ్ వాక్కు వైఎస్ఆర్ పార్కుకు వెళుతుండగా దాదాపు 24 ఏళ్ల వయస్సున్న ఇద్దరు యువకులు ద్విచ క్రవాహనంపై వెనుక నుంచి వచ్చారు. ఆమె మెడలోని ఆరు తులాల పుస్తెలతాడును లాక్కొని పార్శిగుట్ట వైపు పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ సురేందర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారం కొట్టి... రాంనగర్ ఈ-సేవ సమీపంలోని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఇంటి పక్కన గల భవనం మొదటి అంతస్థులో ఎడ్యుకేషన్ ఫౌండేషన్ పేరుతో కార్యాలయం ఉంది. అందులో రాంనగర్ ప్రేయర్ పవర్ చర్చి సమీపంలో నివసించే స్మిత(32) ఆఫీస్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఓ యువకుడు అక్కడికి వెళ్లాడు. ఆమె కళ్లలో కారం కొట్టి... మెడలోని రెండున్నర తులాల పుస్తెల తాడును లాక్కొని పరారయ్యారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో షట్టర్ కిందికి దించి... బయటి నుంచి గేటు పెట్టి వెళ్లిపోయాడు. ఆఫీస్‌లోని ఫోన్లో యాజమానికి సమాచారం అందించగా.. ఆయన వచ్చి షటర్ తెరిచాడు. సమాచారం అందుకున్న నల్లకుంట ఇన్స్పెక్టర్ సంతోష్ కిరణ్, ఎస్ఐ రామరాజు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. అందులో స్నాచర్ రావడం..వెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. కేసు దర్యాప్తులో ఉంది. -
కలసికట్టు... ఆటకట్టు
వరుసగా పంజా విసురుతున్న స్నాచర్లు ప్రజలంతా సంఘటితమైతేనే నేరాలకు చెక్ మనకు మనమే రక్షకులవుదాం చైన్ స్నాచింగ్ అంటే పోలీసుల దృష్టిలో ఓ గొలుసు చోరీ కేసు... కొన్ని గ్రాముల బంగారం. సామాన్యులకు మాత్రం అది కొన్ని నెలల కష్టార్జితం... దానికి మించి మహిళలకు సెంటిమెంట్. సిటీబ్యూరో: నగరంలో చైన్‌స్నాచర్లు విజృంభిస్తున్నారు. పగలూ రాత్రీ... అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా పంజా విసురుతున్నారు. వీరి కారణంగా మహిళలు పుస్తెల తాళ్లు కోల్పోవడమే కాదు.. గాయపడడం... ప్రాణాలు కోల్పోతున్న దుర్ఘటనలూ చోటుచేసుకుంటున్నాయి. స్నాచర్లను పూర్తి స్థాయిలో కట్టడి చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు. ఇక మనమంతా ఒకటై ఉపక్రమిస్తేనే మనకు రక్ష అనే పరిస్థితి కనిపిస్తోంది. రండి... ఎవరికివారు... తమకు సాధ్యమైన బాధ్యత తీసుకుందాం. చైన్ స్నాచింగ్‌లకు చెక్ చెప్పి దొంగలకు సవాల్ విసురుదాం. ఎవరికి వారుగా ముందుకు వస్తే... ఉత్తరాదితో పాటు పొరుగు రాష్ట్రాల ముఠాలు నగరంపై కన్నేసి పంజా విసురుతున్నాయి. ఇలా వచ్చిన వారంతా లాడ్జిలు, హోటళ్లు, అద్దె ఇళ్లలో ఆశ్రయం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య సంస్థలతో పాటు ఇటు ఇళ్లను అద్దెకు ఇచ్చే, వర్కింగ్ మెన్స్ హాస్టల్స్ వారు సైతం కస్టమర్/టెనెంట్స్ వెరిఫికేషన్ పక్కాగా చేయాలి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలతో సహా వచ్చే వారి కదలికలు గమనిస్తుండాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. స్థానిక స్నాచర్లలో 90 శాతం కొత్తవారే. విద్యార్థులు, చిరుద్యోగులు, నిరుద్యోగులు ఈజీ మనీ కోసం ఈ బాట పడుతున్నారు. వీరిని కట్టడి చేయాలంటే కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు ఉపక్రమించాల్సిందే. ఓ కన్నేసి ఉంచడం ద్వారా హఠాత్తుగా జీవన సరళి మారిన వ్యక్తులు, స్థోమతకు మించి విలాసాలకు ఖర్చు చేస్తున్న వారిని గుర్తించాలి. నేర్పుగా కూపీలాగి సంబంధీకులతో పాటు పోలీసులనూ అప్రమత్తం చేయాలి. కాలనీ సంక్షేమ సంఘాలు, యూత్ ఆర్గనైజేషన్స్‌కు నగరంలో కొదవలేదు. ఖాళీ సమయాల్లో వీలున్నంత వరకు బృందాలుగా ఏర్పడి ప్రాంతాల వారీగా గస్తీ కాయాలి. ముఖ్యంగా జన సంచారం తక్కువగా ఉండే ప్రధాన రహదారులతో పాటు నిర్జన ప్రదేశాల పైనా కన్నేసి ఉంచాలి. ద్విచక్ర వాహనాలు... ప్రధానంగా హైస్పీడ్ వెహికిల్స్‌పై తిరిగే కొత్త వ్యక్తులను ఆపి వివరాలు ఆరా తీయాలి. అనుమానం వస్తే అక్కడే ఆపి పోలీసులను పిలవాలి. ఉదయం, సాయంత్ర వేళల్లో వాకింగ్ చేసేవారు ఎంద రో. దీని కోసం అనేక చోట్ల టీమ్స్ సైతం ఏర్పడ్డాయి. ఇలా నడిచే సమయాన్నీ స్నాచర్ల కట్టడికి వినియోగించవచ్చు. పార్కులు, నిర్ణీత ప్రాంతాల్లో వాకింగ్ చేయడం కంటే అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ రహదారులు, స్నాచర్ల ప్రభావం ఉన్న చోట్లను ఎంపిక చేసుకోవాలి. నడుస్తూనే చుట్ట పక్కల ప్రాంతాలు, మనుషులపై కన్నేసి ఉంచితే... వారి కదలికలను గమనిస్తూ ఆరోగ్యం, భద్రత రెండూ పొందే వీలుంటుంది. స్థానికంగా ఉన్న మైత్రి/శాంతి సంఘాల సభ్యులనూ భాగస్వాములను చేసుకోవచ్చు. కాలనీవాసులు ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే స్నాచర్లను కట్టడి చేయవచ్చు. మహిళలు ఎక్కువగా వెళ్లే ప్రాంతాలతో పాటు దేవాలయాలు ఉన్న చోట్లా విడతలు, వంతుల వారీగా బృందాలుగా ఏర్పడి గస్తీ కాసుకోవాలి. ప్రధానంగా ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటే స్నాచర్లను కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాల్సిందే... స్నాచర్లకు టార్గెట్‌గా మారుతున్న వారిలో వివాహితులే ఎక్కువ. దీనికి వారి మెడల్లో ఉండే బంగారం పరిమాణం ఒక కారణమైతే... వస్త్రధారణ మరో కారణం. ఇటీవల కాలంలో యువతులంతా స్కార్ఫ్‌లు వాడటం అలవాటుగా చేసుకున్నారు. దీంతో వారి మెడలోని గొలుసులు ఇతరులకు కనిపించేందుకు.. వాటిని లాగేందుకు అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే వివాహితలు సైతం బయటకు వచ్చినప్పుడు మెడ చుట్టూ చున్నీ చుట్టుకోవడం... స్కార్ఫ్ వాడటం చేయాలి. కనీసం కొంగునైనా మెడ చుట్టూ కప్పుకోవాలి. చిరునామాలు చెప్పాలని... ఇళ్లు అద్దెకు తీసుకుంటామని, మంచినీళ్లు కావాలని ఇళ్ల దగ్గరకు, ఇంట్లోకి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. అపరిచితులకు సాధ్యమైనంత దూరంలో ఉండి మాట్లాడండి. ఏమాత్రం అనుమానం వచ్చినా తక్షణం స్పందించి చుట్ట పక్కల వారినీ అప్రమత్తం చేసి పట్టుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్ర వేళల్లో ఈ జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. ద్విచక్ర వాహనంపై ఓ చోట స్నాచింగ్ చేసిన చోరులు వరుస పెట్టి నలుగురైదుగురిని బాధితులుగా మార్చి వెళ్తున్నారు. దీన్ని అరికట్టాలంటే స్నాచింగ్ బారినపడిన బాధితులు ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంలో ఆలస్యం చేయకూడదు.జాప్యం వల్ల ‘గోల్డెన్ మినిట్స్’ వృదా అవుతుండటంతో స్నాచర్లు భద్రంగా గమ్యస్థానాలకు చేరిపోతున్నారు. స్నాచింగ్ జరిగిన వెంటనే తక్షణం ఈ సమాచారాన్ని ‘100’కు ఫోన్ చేసి చెప్పాలి. దొంగలు, వాహనం గుర్తులతో పాటు వారు వె ళ్లిన దిశనూ చెప్పాలి. అప్పుడే మరొకరు బాధితులుగా మారకుండా కాపాడడంతో పాటు స్నాచర్లను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నిర్జన ప్రదేశాలు... జన సమ్మర్థం తక్కువగా ఉన్న చోట్ల ఒంటరిగా సంచరించవద్దు. వాహనాలపై వెళ్లేటప్పుడు వెనుక వస్తున్న వారినీ గమనించండి. ఆ స్ఫూర్తిని మళ్లీ పొందలేమా..? సైబరాబాద్‌లో 2005కు ముందు పరిస్థితులు మరీ దారుణం. ఎప్పుడు... ఏ ముఠా విరుచుకు పడుతుందో చెప్పలేని స్థితి. దారుణంగా చంపేసి... అందిన కాడికి దోచుకుపోయే గ్యాంగులెన్నో. వీరికి చెక్ చెప్పడానికి అప్పట్లో కాలనీ సంక్షేమ సంఘాలు నడుం బిగించాయి. వంతుల వారీగా కర్రలు, ఈలలతో గస్తీ కాసేలా చేసి ఫలితాలు సాధిం చా యి. ఇప్పుడు చైన్స్నాచర్లను కట్టడి చేయడానికి మరోసారి ఒక్కటి కాలేమా..? సంక్షేమ సంఘాలతో పాటు ప్రతి ఒక్కరం మనవంతు బాధ్యత తీసుకోలేమా? హైదరాబాద్, సైబరాబాద్ కమిషరేట్లలో కలిపి క్షేత్ర స్థాయి పోలీసుల సంఖ్య 15 వేలు దాటదు. అయితే ఏం? నగర జనాభా కోటికి అటూఇటుగా ఉంది. పిల్లలు, వృద్ధులు, మహిళలను వదిలేసినా మన సంఖ్య 20 లక్షలకు తగ్గదు. అంతా కలిస్తే ఊహించలేనంత బలం మనది. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా చుట్టూ ఉన్న పది మీటర్ల పరిధిలోని వ్యక్తులపై కన్నేసి ఉంచితే చాలు. ఒక్క స్నాచర్లేంటి... ఉగ్రవాదులు, కరడుగట్టిన నేరగాళ్లూ తోకముడవాల్సిందే. -
టెక్నాలజీతో చైన్స్నాచర్లకు చెక్!
సాక్షి, సిటీబ్యూరో: జంట పోలీసు కమిషనరేట్లలో చైన్ స్నాచర్లను కట్టడి చేసేందుకు సైబరాబాద్ పోలీసులు సరికొత్త పంథాతో ముందుకెళ్తున్నారు. వేగంగా బండి నడుపుతూ స్నాచింగ్ చేసి.. రెప్ప పాటులో మాయమవుతున్న గొలుసుదొంగలను పట్టుకునేందుకు ఇప్పటికే 55 మోటారు సైకిల్ టీమ్‌లను రంగంలోకి దింపగా.. మరోవైపు టెక్నాలజీతోనూ వారి ఆట కట్టించేందుకు దేశంలోనే తొలిసారిగా ‘యాంటీ చైన్ స్నాచింగ్ స్ట్రాటజీ’ని అమలు చేస్తున్నారు. టీమ్ వర్క్... దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కరుడుగట్టిన దొంగల ముఠాలు జంట కమిషనరేట్లలోని పలు ప్రాంతాలపై దృష్టి పెట్టడంతో వాటిని ధీటుగా ఎదుర్కోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. ఇటీవల స్నాచింగ్‌లు హింసాత్మకంగా మారడంతో దొంగల వ్యూహాలను తిప్పికొట్టేందుకు రంగం సిద్ధం చేశారు. పోలీసు సిబ్బందిని సుశిక్షితం చేయడం దగ్గరి నుంచి నేరస్థుడి సమాచారాన్ని క్రోడీకరించడం వరకు కమిషనర్ ఆనంద్ దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. సీపీ పర్యవేక్షణలోనే యాంటీ చైన్ స్నాచింగ్ సెల్ బాధ్యతలను క్రైమ్స్ డీసీపీ నవీన్, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ సాయిమనోహర్ చూసుకుంటున్నారు. నేరగాళ్ల సెల్‌ఫోన్ ద్వారా వారి వివరాలు పసిగట్టే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎస్ఓటీ ఓఎస్డీ రాంచంద్రారెడ్డికి అప్పగించారు. ఈయన సారథ్యంలో ఏడుగురు సభ్యులతో కూడిన టీమ్ కాల్ డేటా వివరాలను సేకరించి, సిగ్నల్స్ ఆధారంగా నిందితులు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకుంటున్నారు. కేసు దర్యాప్తు క్రమంలో ఈ డేటా చాలా కీలకం కానుంది. వందల సంఖ్యలో డేటా సేకరణ... ఎస్ఓటీ, సీసీఎస్, సీసీఆర్బీ, ఐటీ సెల్ల నుంచి సభ్యులతో ఈస్ట్, వెస్ట్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేశారు. టెక్నికల్ అనాలసిస్, డేటా కలెక్షన్, మ్యాపింగ్, ట్రాకింగ్ పనిని వేగవంతం చేశాయి. ఇవి వం దల సంఖ్యలో నిందితుల డేటా సేకరించినట్టు తెలుస్తోంది. అలాగే ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల లా అండ్ ఆర్డర్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ డేటా కలెక్షన్ చేస్తున్నారు. నిందితుల ఫొటో కలెక్షన్, సీసీటీవీ ఫుటేజీ కలెక్షన్, ఎక్కడెక్కడ కేసులు పెండింగ్ ఉన్నాయనే వివరాలను సేకరిస్తున్నారు. చైన్ స్నాచింగ్‌లు ఎక్కువగానే జరుగుతున్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతోనూ సమన్వయం సాధించే దిశగా ప్రయత్నిస్తున్నారు. వీరి నుంచి స్నాచర్ల డాటా తెప్పిస్తే దాదాపు 70 శాతం వరకు స్నాచర్ల వివరాలు సేకరించినట్టు అవుతుంది. యాంటీ సెల్ పసిగట్టింది... భోపాల్‌లో కొంత మంది చైన్ స్నాచర్లను అక్కడి పోలీసులు పట్టుకున్నారు. అయితే యాంటీ చైన్ స్నాచింగ్ సెల్ ద్వారా అక్కడి నుంచి చైన్ స్నాచర్ల సమాచారాన్ని తెప్పించాం. వారు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లలో దాదాపు 20కి పైగా చైన్‌స్నాచింగ్‌లు చేసినట్టు గుర్తించాం. ఇప్పటికే సైబరాబాద్ పోలీసు టీమ్‌ను భోపాల్‌కు పంపించాం. పీటీ వారంట్ వేశాం. త్వరలోనే ఆ నిందితులను నగరానికి తీసుకొచ్చి మరిన్ని వివరాలు రాబడతాం. -నవీన్, క్రైమ్స్ డీసీపీ, సైబరాబాద్ -
చైన్ స్నాచర్‌ను పట్టుకున్న గ్రామస్తులు
-
చైన్ స్నాచర్‌ను పట్టుకున్న గ్రామస్తులు
నాగాయలంక (కృష్ణా జిల్లా) : కృష్ణా జిల్లా నాగాయలంకలో ఆదివారం ఒక మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లిన దొంగను స్థానికులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఉదయం 7 గంటలకు నాగాయలంకలో ఉప్పల ప్రమీలారాణి ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా కోడూరు మండలం మర్రిపాలెంకు చెందిన రంగప్రసాద్ ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కొని పరుగుతీశాడు. ఆమె కేకలు వేయడంతో గ్రామస్తులు వెంబడించి అతణ్ణి పట్టుకుని కరెంట్ స్తంభానికి కట్టేశారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించారు. -
చైన్ స్నాచర్‌గా మారిన మాజీ క్రికెటర్
భోపాల్: రాష్ట్ర స్థాయిలో ఆడిన క్రికెటర్ పక్కదారి పట్టాడు. నేరాలను వృత్తిగా చేసుకుని ఓ గ్యాంగ్‌ను తయారు చేశాడు. దీనికి నాయకుడిగా ఉంటూ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. చివరకు గ్యాంగ్‌తో సహా అరెస్టయి కటకటాలపాలయ్యాడు. మధ్యప్రదేశ్ అండర్-19 మాజీ క్రికెటర్ ముర్తజా అలీ (30) కథ ఇది. ముర్తజా అలీతో పాటు చైన్ స్నాచర్ల గ్యాంగ్‌లోని షాదబ్, హైదర్, గుఫ్రాన్, రజా అలీని అరెస్ట్ చేసినట్టు జహంగీరాబాద్ ఏరియా సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సీఎస్పీ) సలీమ్ ఖాన్ చెప్పారు. 75కు పైగా నేరాల్లో వీరి ప్రమేయమున్నట్టు తెలిపారు. ఈ గ్యాంగ్ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిందని చెప్పారు. వీరి నుంచి నాలుగు మోటార్ బైక్‌లు, పది బంగారు చైన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరచగా, ఈ నెల 22 వరకు పోలీస్ రిమాండ్‌కు ఆదేశించారు. -
చైన్ స్నాచర్ అరెస్ట్
ఏలూరు(పశ్చిమగోదావరి): మహిళ మెడల్లో బంగారు చైన్ కనిపిస్తే చాలు అతని చేతుల్లో దురద మొదలవుతోంది. ఒంటరిగా ఉన్న మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలను లాక్కెళ్లి వాటితో జల్సా చేయడమే అతని పని. అటువంటి దొంగను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 11 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఒంటరి మహిళల వెనుక తిరుగుతున్న జోజు(24)ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ స్టైల్లో విచారించగా అసలు విషయం తెలిసింది. గతంలో అతనిపై పలు స్టేషన్లలో కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
విస్తృతంగా పోలీసుల తనిఖీలు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్ 46 పోలీస్స్టేషన్ల పరిధిలోని 12 ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహిస్తున్నట్లు ఏసీపీ నారాయణగౌడ్ తెలిపారు. సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 వరకు వాహనాల తనిఖీలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. చైన్ స్నాచర్లు, తీవ్రవాదుల కదిలికల నేపథ్యంలో ఈ మేరకు నాకాబందీ చేపట్టినట్లు ఏసీపీ పేర్కొన్నారు. -
చైన్ స్నాచర్ అనుకుని దేహశుద్ధి..
పంజగుట్ట: మద్యం మత్తులో ఓ యువకుడు మహిళపై చెయ్యి వేయడంతో అక్కడి స్థానికులు చైన్‌స్నాచర్ అని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పంజగుట్ట పోలీసులు తెలిపిన వివరాలివీ.. వరంగల్ జిల్లా జనగామకు చెందిన వినోద్ అనే యువకుడు అతిగా మద్యం సేవించి శనివారం రాత్రి సుమారు 8:15 ప్రాంతంలో అమీర్‌పేట బిగ్ సీ వద్ద వాహనం ఆపుకుని నిలబడ్డాడు. రోడ్డుపై అటుగా వెళుతున్న ఓ యువతిని చేయిపట్టుకునేందుకు యత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. అక్కడే ఉన్న కొందరు స్థానికులు చైన్‌స్నాచింగ్ చేసేందుకు యత్నించాడనుకుని, అతడిని చితకబాదారు. అనంతరం పంజగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వినోద్‌ను అదుపులోకి తీసుకుని మద్యం లెవల్ తెలుసుకునేందుకు ఆసుపత్రికి తరలించారు. ఇదిలాఉండగా, వినోద్‌పై బాధిత యువతి ఎలాంటి ఫిర్యాదు ఇవ్వకుండానే వెళ్లిపోయింది. -
చోరీ చేస్తూ.. దొంగ దొంగ అని అరుస్తాడు
మలేషియా టౌన్షిప్ (హైదరాబాద్) : ఒంటరిగా నడిచి వెళ్లే మహిళలే టార్గెట్ చేస్తూ వారి వెనుక నడిచి వెళ్తూనే మెడల్లోని గొలుసులు లాగేసుకుని.. ఆపై దొంగ దొంగ...అని పరుగు తీస్తూ తప్పించుకునే తెలివైన స్నాచర్‌ను కేపీహెచ్‌బీ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఏడు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడిన అతగాడి నుంచి పది తులాల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూకట్పల్లి ఏసీపీ సంజీవరావు వెల్లడించిన వివరాలివీ.. పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలం కాశిపాడుకు చెందిన బొక్క చింతారావు అలియాస్ శ్రీను (30) గతంలో కేపీహెచ్‌బీకి చెందిన ఓ పారిశ్రామిక వేత్త వద్ద ఎనిమిదేళ్ల పాటు కారు డ్రైవర్‌గా పనిచేశాడు. కానీ వేతనం సరిపోవడం లేదని ఆ ఉద్యోగం మానేసి సొంతూరు కాశిపాడు వెళ్లి పోయాడు. కొన్ని రోజులు అక్కడే ఉంటున్నాడు. అయితే చైన్ స్నాచింగ్‌లతో తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించ వచ్చని దురాశ కలిగింది. దీంతో మళ్లీ హైదరాబాద్ చేరుకుని..ఇక్కడి లాడ్జిల్లో ఉంటూ చైన్‌స్నాచింగ్‌లు పాల్పడుతున్నాడు. పని అయిన వెంటనే తిరిగి స్వగ్రామానికి వెళ్లి, కొన్ని రోజుల తర్వాత తిరిగి వస్తాడు. ఒంటరిగా నడిచి వెళ్లే మహిళలనే ఇతడు లక్ష్యంగా చేసుకుంటాడు. వారిని వెంబడించి, అదను చూసుకుని వారి మెడలోని నగలను లాగేసుకుంటాడు. ఆపై దొంగ..దొంగ అని అరుస్తూ అటుగా వెళ్లే వారి దృష్టి మరల్చి మెల్లగా జారుకుంటాడు. ఈ స్టైల్లోనే కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు... సనత్‌నగర్‌లో ఒకటి... మియాపూర్‌లో ఒకటి... దుండిగల్‌లో ఒకటి మొత్తం ఏడు స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. ఈ చైన్ స్నాచింగ్‌లపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు అతని కదలికలపై కన్నేసి ఉంచారు. శుక్రవారం కేపీహెచ్‌బీకాలనీ రైతుబజార్ సమీపంలో అనుమానాస్పదంగా మహిళల వైపు చూస్తున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. అనంతరం అతడు చేసిన చైన్ స్నాచింగ్‌లను పోలీసులకు పుస గుచ్చినట్లు వివరించాడు. అతని వద్ద రూ.2.5 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
విజృంభిస్తున్న చైన్‌స్నాచర్లు
- మూడు రోజుల్లో 20 గొలుసు దొంగతనాలు - స్నాచింగ్‌కు యువత అలవాటు - పెండింగ్‌లోనే అనేక కేసులు - ఆనవాళ్లు దొరకక పోలీసుల తంటాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చైన్ స్నాచర్లు హడలెత్తిస్తున్నారు. మూడు రోజుల వ్యవధిలో హైదరాబాద్, వరంగల్ నగరాల్లో దొంగలు రెచ్చిపోయారు. దాదాపు 20 చోట్ల చోరీలకు పాల్పడి 60 తులాలకు పైగా బంగారాన్ని దోచుకెళ్లారు. నగరాలు, పట్టణాల్లో రాత్రి, పగలు అనే తేడా లేకుండా బైక్‌లపై తిరుగుతూ మహిళలను టార్గెట్ చేస్తున్నారు. వారి మెడల్లోని ఆభరణాలను తెంచుకొని ఉడాయిస్తున్నారు. ఈ ఘటనల్లో మహిళలు తీవ్రంగా గాయపడుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు ఒక పక్క ప్రొఫెషనల్స్, మరో పక్క కొత్త నేరగాళ్లు చైన్‌స్నాచింగ్ చేస్తున్నారు. కొత్త నేరస్తుల రికార్డులు లేకపోవడంతో పోలీసులకు ఈ కేసులు కత్తిమీద సాము అవుతున్నాయి. మరోపక్క నగరాల్లో సీసీటీవీ కెమెరాల డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. మహిళలను టార్గెట్‌గా చేసుకొని వరుస చోరీలకు పాల్పడుతున్న నేరగాళ్ల ఆనవాళ్లు దొరకక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి బయటి రాష్ట్రాల నుంచి వచ్చి, వెంటనే సొంత ప్రదేశాలకు వెళ్లకుండా వేరే చోటికి వెళ్లి జల్సాలు చేస్తుండటంతో వారి ఆనవాళ్లు కూడా దొరకడం లేదు. ఇటీవల నిజామాబాద్ జిల్లా బికనూరు వద్ద పోలీసులకు పట్టుబడిన దొంగలను విచారించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఆధారాలు లభించిన వాళ్ల సొంతూళ్లకు వెళ్లినా వారు దొరకని పరిస్థితి ఏర్పడింది. నేరగాళ్ల ఆనవాళ్లు దొరకకపోవడంతో సగానికి పైగా కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. హైదరాబాద్‌లో 2012 సంవత్సరంలో 643 చైన్‌స్నాచింగ్‌లు జరగగా, వాటిలో 315 కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. 2013కు చెందిన 340 కేసులు, 2014కు చెందిన 230 కేసులు ఆధారాల్లేక పెండింగ్‌లో ఉండిపోయాయి. వరంగల్‌లో ఈ ఏడాది 62 చైన్ స్నాచింగ్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎక్కువ మంది యువతే.. చైన్స్నాచర్స్పై నమోదవుతున్న కేసుల్లో చాలా మంది సులభంగా బయటికొస్తున్నారు. నేర చరిత్ర ఉంటే తప్ప చైన్స్నాచర్లపై పీడీ యాక్ట్ పెట్టడం లేదు. సీసీ కెమెరాల్లో చిక్కిన వారంతా యువతేనని, వారికి ఎటువంటి నేర చరిత్ర లేనందున పట్టుకోవడం కష్టమవుతోందని పోలీసులు వాపోతున్నారు. రాష్ట్రంలో కొత్తగా నేరాల బాటపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు ఎన్సీఆర్బీ-2014 గణాంకాలు చెబుతున్నాయి. కొత్తగా నమోదవుతున్న నేరాల్లో 40 శాతం వరకు యువతే ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. -
రాజధానిలో ఒక్క రోజే 11 చోట్ల చైన్ స్నాచింగ్
గొలుసు దొంగల బీభత్సం - రాజధానిలో ఒక్క రోజే 11 చోట్ల చైన్ స్నాచింగ్ - బాధితుల్లో మాజీ మంత్రి అత్తయ్య సాక్షి, హైదరాబాద్: రాజధానిలో చైన్ స్నాచర్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే ఏకంగా 11 ప్రాంతాల్లో 40.5 తులాల బంగారం దోచుకెళ్లారు. బాధితుల్లో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్లు అత్తయ్య సత్యవతి (76) కూడా ఉన్నారు. ఫిలింనగర్‌లోని ఓ గుడిలో దైవ దర్శనం చేసుకుని కారు కోసం వేచి చూస్తుండగా బైక్‌పై ఇద్దరు దుండగులు వచ్చి ఆమె మెడలోని 4 తులాల గొలుసు లాక్కెళ్లారు. ఇది గమనించిన కారు డ్రైవర్ వారిని వెంబడించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అదే దారిలో ముందుకు వెళ్లిన దుండగులు.. ఫిలింనగర్ బస్తీకి చెందిన మల్లీశ్వరి (30) రోడ్డు దాటుతుండగా ఆమె మెడలోని రెండు తులాల గొలుసు లాక్కెళ్లారు. వాకింగ్‌కు వెళ్లి వస్తుండగా.. దోమలగూడ హౌసింగ్ బోర్డు నివాసి రమాదేవి (65) ఉదయం వాకింగ్‌కు వెళ్లి వస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు అగంతకులు.. ఆమె మెడలోని 5 తులాల గొలుసు అపహరించారు. చిక్కడపల్లి పరిధిలోని గాంధీనగర్‌లో నివసించే సునీత.. అశోక్‌నగర్‌లోని ఓ డాక్టర్ అపాయింట్మెంట్ కోసం వెళ్లి వస్తుండగా ఇద్దరు దుండగులు 9 తులాల మంగళసూత్రం లాక్కెళ్లారు. కూకట్‌పల్లిలోని వివేకానందనగర్ కాలనీకి చెందిన స్వప్న (36) తన కుమారుడిని స్కూల్‌కు పంపించి వస్తుండగా ఆమె మెడలోని మూడు తులాల గొలుసును దుండగులు తీసుకెళ్లారు. కేపీహెచ్‌బీ నివాసి మల్లేశ్వరి (55) తన మనవడిని స్కూల్లో దించి వస్తుండగా రెండు తులాల చైన్ లాక్కెళ్లారు. అదే ప్రాంతానికి చెందిన జలజ (50) కూరగాయలు కొనుక్కుని వస్తుండగా ఆమె మెడలోని నల్లపూసల హారాన్ని దుండగులు తీసుకెళ్లాలని ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించడంతో ఒక తులం మాత్రమే వారు తీసుకెళ్లారు. నడుచుకుంటూ వెళ్తుండగా.. బల్కంపేట డివిజన్‌కు చెందిన అంబిక నడుచుకుంటూ వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన ఇద్దరు అగంతకులు.. 4 తులాల గొలుసు తెంచుకెళ్లారు. దారుస్సలాం సేవక్‌నగర్ నివాసి స్వరూపమ్మ ఉదయం పాల ప్యాకెట్ల కోసం వెళ్తుండగా ఓ దుండగుడు మూడున్నర తులాల మంగళసూత్రాన్ని లాక్కెళ్లాడు. సనత్నగరర్లోని జెక్‌కాలనీకి చెందిన సువర్చల (52) ఉదయం మెడికల్ షాప్‌కు వెళ్లి వస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని 7 తులాల గొలుసులు ఎత్తుకెళ్లారు. సనత్‌నగర్ పోలీసులు సీసీ కెమెరాల్లోని ఫుటేజీ ఆధారంగా చైన్‌స్నాచర్ల ఫొటోలను విడుదల చేశారు. కాగా, ఎల్బీ నగర్ పరిధిలోని వనస్థలిపురంలో మంగళవారం రాత్రి దుండగులు ఓ మహిళ మెడలోని చైన్ లాక్కెళ్లారు. అయితే అది రోల్డ్ గోల్డ్‌గా తేలింది. -
చైన్ స్నాచర్ ని బైక్‌తో ఢీకొట్టాడు..
అనంతపురం: మహిళ మెడలో గొలుసు తెంపుకుని పారిపోతున్న దుండగులను పట్టిచ్చిన యువకుడిని పోలీసులు ఘనంగా సన్మానించారు. అనంతపురం నగరంలోని మారుతీనగర్‌కు చెందిన ఎం.పద్మావతి(48) సోమవారం మధ్యాహ్నం నడిచి వెళ్తుండగా ఇద్దరు యువకులు బైక్‌పై వెనుక నుంచి వచ్చి ఆమె మెడలో గొలుసును తెంపుకొని పోయారు. దీంతో బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. అదే సమయంలో ఎదురుగా బైక్‌పై వస్తున్న గీతాప్రసాద్ అనే యువకుడు ఆమె కేకలు విని అప్రమత్తమయ్యాడు. దుండగుల బైక్‌ను తన బైక్‌తో ఢీకొట్టాడు. దీంతో ఆగంతకులు పడిపోయారు. వెంటనే చుట్టుపక్కల వారు వారిద్దరినీ పట్టుకుని, బంధించారు. పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను నగరానికి చెందిన షేక్ సర్వర్ వలీ, మహ్మద్ అలీగా గుర్తించారు. గీతాప్రసాద్ సమయస్ఫూర్తిని అందరూ మెచ్చుకున్నారు. సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎస్పీ రాజశేఖర్‌బాబు.. యువకుడు గీతాప్రసాద్‌కు రూ.5 వేలు రివార్డుగా అందజేసి, ఘనంగా సత్కరించారు. జాతీయ అవార్డుకు గీతా ప్రసాద్ సాహసకృత్యాన్ని సిఫారసు చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. -
చైన్ స్నాచర్ వద్ద 440గ్రాముల బంగారం
పెందుర్తి (విశాఖపట్నం) : ఓ చైన్ స్నాచర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా పెందుర్తిలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న దోని యల్లాజీ అనే వ్యక్తిని పెందుర్తి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 440 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. -
చైన్ స్నాచర్ దాడి : మహిళకు తీవ్రగాయాలు
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం బాటసింగారం గ్రామ సమీపంలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న మహిళపై ఆగంతకుడు దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లాడు. అనంతరం అతడు అక్కడి నుంచి పరారైయ్యాడు. ఈ క్రమంలో సదరు మహిళ బైక్‌పై నుంచి కిందపడి ... తీవ్రంగా గాయపడ్డింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
చైన్ స్నాచర్ అరెస్ట్: సొత్తు స్వాధీనం
అల్లీపురం: విశాఖ జిల్లాలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పెందుర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబ్బపాలెం గ్రామానికి చెందిన రావివలస సంతోష్‌కుమార్ గత కొన్ని రోజులుగా ఉదయం వేళల్లో ఒంటరిగా ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నాడు. అతనికి ఆటో డ్రైవర్ యల్లాజీ సహకరించేవాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిఘా పోలీసులు బుధవారం ఉదయం సంతోష్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 400 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు యల్లాజీ కోసం గాలిస్తున్నట్లు డీసీపీ పి.రవికుమార్ మూర్తి తెలిపారు. -
చైన్ కిల్లర్స్
పెరుగుతున్న గొలుసు దొంగతనాలు తీవ్రంగా గాయపడుతున్న మహిళలు గత నెలలో ఓ మహిళ మృతి రోడ్డుపైకి వచ్చేందుకే భయం అత్యాధునిక వాహనాలు... అదే స్థాయిలో ఆయుధాలు... అడుగడుగునా సీసీ కెమెరాలు... సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పుంతలు... విశ్వనగరం వైపు అడుగులు... ఈ ఆర్భాటాలు సరే. పట్టపగలు... నడిరోడ్డు మీదే చైన్‌స్నాచర్లు బరి తెగిస్తున్నారు. స్త్రీల మెడలోని ఆభరణాలు దోచుకుంటున్నారు. దాడులకు తెగబడుతున్నారు. ఈ క్రమంలోనే గత నెలలో సుమిత్ర అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. వరుస దుర్ఘటనలతో రోడ్డు పైకి రావడానికే మహిళలు భీతిల్లుతున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు. ఈ ఘోరాలను అరికట్టడంలో దారుణంగా విఫలమవుతున్నారు. - సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో: నిన్న మొన్నటి వరకు ‘మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లొద్దు... ఎవరినైనా తోడు తీసుకెళ్లాల’ని ప్రచారం చేసిన పోలీసులకు... ఈ ఘటనలతో ప్రజలకు ఏ సూచనలు ఇవ్వాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఒంటరిగా ఉన్నా... గుంపుగా వెళుతున్నా... దొంగతనాలకు అడ్డుకట్ట పడడం లేదు. మహిళ ల మెడలోని ఆభరణాలను తెంచుకొని దుండగులు రెప్పపాటులో మాయమైపోతున్నారు. ఇక్కడా...అక్కడా... పగలూ...రాత్రీ అనే తేడా లేకుండా రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో బంగారం కోసం మహిళలను గాయపరిచేందుకు సైతం దొంగలు వెనుకాడటం లేదు. గత నెలలో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సంఘటనలో బర్కత్‌పుర వాసి సుమిత్ర మృతి చెందింది. ఈ సంఘటన ఇప్పటికీ సిటీవాసుల కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. కుమారుడు వెంట ఉన్నా... తల్లిని కాపాడుకోలేకపోయాడు. మాటలు...చేతలకు పొంతనేదీ? హైదరాబాద్‌ను సురక్షిత నగరంగా మార్చే క్రమంలో నిఘా, భద్రతను బలోపేతం చేస్తున్నామంటూ ఉన్నతాధికారులు చెబుతున్న మాటలకు... వాస్తవ పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం... వేలల్లో సీసీ కెమెరాలు...ప్రతి క్షణం నిఘా... ఏ రోజుకారోజు పోలీసుల పనితీరును బేరీజు వేసేందుకు పోలీసు వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ యాప్... ఇలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నామని చెబుతున్న పోలీసులు... మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. వరుస చోరీలు జరుగుతున్నా కనీసం దొంగలను కనిపెట్టలేకపోతున్నారని, రక్షక్, మొబైల్ వాహనాలు ఉన్నా ఫలితం లేదని బాధితులు వాపోతున్నారు. పోలీసు నిఘా లేని ప్రాంతాల్లో నడి వయస్సు దాటిన మహిళలనే లక్ష్యంగా చేసుకొని మెడలోని గొలుసులను లాక్కెళ్లే ఘటనలు గతంలో కనిపిస్తుండేవి. చైన్ స్నాచింగ్లోకి అడుగు పెడుతున్న యువకులు...బైక్ రేసింగ్‌పై పట్టు సాధిస్తున్నారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలపై వెళుతున్న జంటలను, ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తున్నారు. జల్సాలకు అలవాటు పడి... సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఉన్న దొంగలు మహిళల ప్రాణాలకే హాని తల పెడుతున్నారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, అనుచరులతో పాటు డబ్బు కోసం కొందరు విద్యార్థులు కూడా అకృత్యాలకు పాల్పడుతున్నారు. చైన్ స్నాచింగ్‌ల తీవ్రత పెరుగుతుండటంతో పోలీసులు దొంగలపై పీడీ యాక్ట్ పెడుతున్నారు. స్నాచర్లను పట్టుకునేందుకు మారువేషాల్లో మహిళా కానిస్టేబుళ్లు నగలతో వెళుతున్నా ప్రయోజనం కనబడటం లేదు. కొత్తపేట నుంచి మంగళవారం రాత్రి మలక్‌పేటలోని అక్బర్‌బాగ్ డివిజన్ ఆనంద్ నగర్‌కు బయలుదేరారుకంభంపాటి రామకృష్ణ, శ్వేత దంపతులు. ద్విచక్ర వాహనంపై వెళుతుండగా... నల్లని పల్సర్ ైబైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు శ్వేత మెడలోని రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడును తెంచుకుని నల్లగొండక్రాస్ రోడ్డు వైపు ఉడాయించారు. ఈ క్రమంలో శ్వేతకు గాయాలయ్యాయి. మలక్‌పేట ‘బి’ క్వార్టర్‌కు చెందిన శ్రీనివాస్, భార్య వర్ధనమ్మ (52)తో కలసి మంగళవారం రాత్రి నల్గొండ ైఫ్లైఓవర్ మీదుగా ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. ఇంతలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని ఆభరణాల తెంచుకొని పరారయ్యారు. వాహనం పై నుంచి కిందపడిన వర్ధనమ్మ తీవ్రంగా గాయపడింది. మేడిపల్లికి చెందిన శిరీష (40) ఒంగోలు నుంచి వస్తూ బుధవారం రాత్రి కర్మన్‌ఘాట్‌లో బస్సు దిగారు. భర్త నాగేశ్వరరావుతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికిబయలుదేరారు. బైక్‌పై వచ్చిన దుండగులు శిరీష మెడలోని మూడు తులాల బంగారు గొలుసును తెంచుకుని పారిపోయారు. ఈ ఘటనలోనూ శిరీషకు గాయాలయ్యాయి. మన బాధ్యతా ఉంది.. కేవలం పోలీసులే కాదు... మనం కూడా కనీస జాగ్రత్తలు పాటించాలి. డ్రెస్ వేసుకుంటే మెడపై చున్నీ, ముఖానికి స్కార్ప్ ఉండేలా చూసుకోవాలి. వివాహితులైన మహిళలు చీర కొంగును మెడకు చుట్టుకోవాలి. ఇలాంటి చిన్నచిన్న జాగ్రత్తలతో కొంతమేరక దొంగతనాలు తగ్గే అవకాశముంది బంగారు గొలుసు చోరీ రాజేంద్రనగర్: బైక్‌పై ఇంటికి వెళుతున్న ఓ మహిళ మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును చైన్‌స్నాచర్లు తెంచుకొని పరారయ్యారు. పెద్ద మంగళారం ప్రాంతానికి చెందిన అనసూయ(35) బుధవారం ఆరమైసమ్మ ప్రాంతంలోని బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లారు. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో తన మరిది రాజుతో కలిసి వాహనంపై వెళుతుండగా... పోలీసు అకాడమీ వద్ద వెనుక నుంచి వచ్చిన ద్విచక్ర వాహనదారుడు అనసూయ మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వాహనాలపై వస్తుండగా... చైతన్యపురి/నాగోలు: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ మెడలోని గొలుసును బైకుపై వచ్చిన అగంతకులు లాక్కెళ్లిన సంఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సునీల్ తెలిపిన వివరాల ప్రకారం... ఎన్టీఆర్ నగర్‌కు చెందిన అంజని కుమారి (52) మంగళవారం రాత్రి కుమార్తె అభిషాతో కలిసి ద్విచక్ర వాహనంపై వైట్‌హౌస్ సమీపంలోని సోదరి ఇంటికి వె ళ్లారు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వస్తుండగా స్వర్ణకంచి షోరూం సమీపంలో బైకుపై వచ్చిన ఇద్దరు అగంతకులు ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న అంజనీ కుమారి మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కుని దిల్సుఖ్నగర్ వైపు పరారయ్యారు. బుధవారం బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఇదే ముఠా నగరంలోని వివిధ ప్రాంతాలలో గొలుసు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎల్బీన గర్ పోలీస్ స్టేషన్ పరిధిలో... భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ మెడలో నుంచి బైకుపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు మూడు తులాల బంగారు గొలుసును తెంచుకుని పారిపోయిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మేడిపల్లికి చెందిన శిరీష (40) ఒంగోలుకు వెళ్లి బుధవారం రాత్రి కర్మన్‌ఘాట్‌లో బస్సు దిగారు. భర్త నాగేశ్వరరావుతో కలిసి 10.20 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై మేడిపల్లి వెళ్తుండగా... ద్వి చక్ర వాహనంపై వచ్చిన దుండగులు శిరీష మెడలోని మూడు తులాల బంగారు గొలుసును తెంచుకుని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
చైన్‌స్నాచర్ల చేతివాటం
వారం రోజుల్లో 14 గొలుసు చోరీలు తెగబడుతున్న స్నాచర్లు బెంబేలెత్తుతున్న మహిళలు జల్లెడ పడుతున్న పోలీసులు చైన్‌స్నాచర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నగరంలో వారం రోజుల్లో 14 గొలుసు చోరీలు చేసి ఏడు పోలీస్స్టేషన్ల పరిధిలో మహిళల మెడల్లోని అరకిలో బంగారం కాజేశారు. హఠాత్తుగా జరిగే గొలుసు దొంగల దాడితో మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడే వైపు నుంచి స్నాచర్లు వచ్చి మెడలోని గొలుసులు తెంచుకుపోతారోననే ఆందోళన వారిని వెంటాడుతోంది. పంజా విసిరిన గొలుసు దొంగలను పట్టుకునేందుకు సీసీఎస్ పోలీసులు నిఘా పటిష్టం చేశారు. అనుమానిత ప్రాంతాల్లో సీసీఎస్ సిబ్బంది జల్లెడ పడుతున్నారు. చిన్న అనుమానం వచ్చినా వాహనాలు స్వాధీనం చేసుకుని పూర్తి ఆధారాలు తెలుసుకున్న తర్వాతే వదులుతున్నారు. విజయవాడ సిటీ : గతనెల 23వ తేదీ గురువారం నగరంపై గొలుసు దొంగలు దాడి చేశారు. పటమట, మాచవరం, కృష్ణలంక పోలీస్స్టేషన్ల పరిధిలో గంటన్నర వ్యవధిలోనే నాలుగు గొలుసు చోరీలు చేశారు. ఆ తర్వాత మాచవరం భవానీపురం తదితర పోలీసు స్టేషన్ల పరిధిలో ఆరు గొలుసు చోరీలు జరిగాయి. తిరిగి గురు పౌర్ణమి రోజైన శుక్రవారం సత్యనారాయణపురం, సూర్యారావుపేట, గవర్నరుపేట పోలీస్స్టేషన్ల పరిధిలో ఐదు ప్రాంతాల్లో గొలుసు చోరీలు జరిగాయి. శుక్రవారం రాత్రి పోలీసుల తనిఖీ సమయంలోనే రైల్వేస్టేషన్‌కి మోటారు సైకిల్‌పై భర్తతో వెళ్తున్న మహిళ మెడలో గొలుసు తెంచుకుని పరారవ్వడం కలకలం రేపింది. చోరీ బైకులతోనే.. చోరీ బైకులనే గొలుసు దొంగలు ఉపయోగించినట్టు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. శుక్రవారం ఉదయం గవర్నర్‌పేట, సూర్యారావుపేట పోలీస్స్టేషన్ల పరిధిలో రెండు కరిజ్మా మోటారు సైకిళ్ల చోరీ జరిగింది. బైకుల చోరీ జరిగిన 15 నిమిషాల వ్యవధిలోనే వరుస గొలుసు చోరీలు జరిగాయి. వీటిని చోరీలు చేసిన తర్వాత పశువుల ఆస్పత్రి సమీపంలో వదిలేసి వెళ్లారు. ఆ తర్వాత పోలీసుల విచారణలో అవి చోరీ బైకులుగా వెల్లడైంది. బైకు చోరీలు మొదలు గొలుసు చోరీల వరకు పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. పలుచోట్ల నాసిరకం సీసీ కెమెరాలు ఉంటే, మరికొన్ని చోట్ల ఏదో ఒకటి అడ్డు రావడం వల్ల నిందితుల ఆచూకీ కనిపెట్టలేని పరిస్థితి. దీంతో పోలీసుల దర్యాప్తులో పురోగ తి మందగించింది. ఉత్తరాది ముఠాల రాక వారం రోజులగా జరుగుతున్న గొలుసు చోరీలను బట్టి ఉత్తరాది ముఠాల ప్రమేయంగా సీసీఎస్ పోలీసులు గుర్తించారు. స్థానికంగా ఉండే పాత నేరస్తులు ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు తెల్లవారుజామున గొలుసు చోరీలు చేస్తారు. లేదంటే మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య, రాత్రి 7 గంటల సమయంలో ఎక్కువగా చోరీలకు పాల్పడుతుంటారు. రద్దీ అధికంగా ఉండే సమయంలోనే వీరు గొలుసు దొంగతనాలకు తెగబడటాన్ని బట్టి ఉత్తరాది నుంచి వచ్చిన ముఠాల పనిగానే పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు నగరంలోని ఏదైనా ప్రాంతంలో గానీ, లేదా ఇతర ప్రాంతాల్లో గానీ షెల్టర్ తీసుకుని పోలీసుల కదలికలకు అనుగుణంగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నట్టు భావిస్తున్నారు. మహిళలు అప్రమత్తంగా ఉండాలి బయటి ప్రాంతాల నుంచి వచ్చిన ముఠాలు గొలుసు చోరీలకు పాల్పతున్నట్టు గుర్తించాం. పోలీసుపరంగా వీరిని పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. ప్రజలు కూడా వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒంటరిగా వెళ్లే మహిళలు ఎక్కువ నగలు ధరించకపోవడం, వెళ్లే సమయంలో పరిసర ప్రాంతాలను నిశితంగా పరిశీలించడం చేయాలి. ప్రజలు కూడా అపరిచితుల ఆధారాలను గుర్తించి డయల్ 100కి సమాచారం ఇవ్వాలి. - జి.రామకోటేశ్వరరావు, అదనపు డీసీపీ(క్రైమ్స్) -
పోలీసుల అదుపులో చైన్‌స్నాచర్
నల్లగొండ : జిల్లాలో తరుచూ చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న పాత నేరస్థుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం మండలంలో జరిపిన తనిఖీల్లో పాత నేరస్థుడు కొత్తేటి రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం నల్లగొండలో జరిగిన మీడియా సమావేశంలో రాజును పోలీసులు ప్రవేశపెట్టారు. వివరాల ప్రకారం.. శాలిగౌరారం మండలం వల్లాల గ్రామానికి చెందిన రాజు చైన్‌స్నాచింగ్‌లకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే జిల్లా వ్యాప్తంగా దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. కాగా తనిఖీల్లో పట్టుకున్న రాజు వద్ద నుంచి పోలీసులు 23 తులాల బంగారం, ఒక టీవీఎస్ మోపెడ్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో రాజు జిల్లా వ్యాప్తంగా ఎనిమిది చైన్‌స్నాచింగ్ దొంగతనాలకు పాల్పడ్డట్లు ఒప్పుకున్నాడు. -
దాడి...దోపిడీ
చైన్‌స్నాచర్ల చేతిలో గాయపడుతున్న మహిళలు {పాణాల మీదకు తెస్తున్న వైనం వరుస చోరీలతో జనం బెంబేలు సిటీబ్యూరో: జూలై 17... బర్కత్‌పుర వాసి సుమిత్ర కుమారుడు సంజయ్‌తో కలసి ద్విచక్ర వాహనంపై ఉస్మానియా యూనివర్సిటీ రోడ్డు మీదుగా వెళుతున్నారు. టూ వీలర్‌పై వచ్చిన దొంగ ఆమె మెడలోని బంగారు గొలుసు లాగడమే కాదు. ఏకంగా నెట్టేయడంతో కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. జూలై 29... హైదరగూడకు చెందిన సుభాషిణి భర్తతో కలిసి అబిడ్స్‌లో సినిమా చూసి అర్ధరాత్రి తిరిగి వస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును తెంచడమే కాకుండా నెట్టేశారు. కింద పడడంతో ఆమె గాయాలపాలైంది. ప్రస్తుతం ప్రాణాపాయం లేకున్నా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గురువారం... కుంట్లూరులోని అట్టల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న హయత్‌నగర్ డివిజన్ ప్రగతి నగర్‌కు చెందిన వెంకటలక్ష్మి సాయంత్రం నాలుగు గంటలకు విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా... ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించారు. ఎవరూ లేని ప్రాంతం చూసి ఆమె స్కూటీకి అడ్డంగా బైక్ పెట్టారు. ఆమె వాహనం నిలిపే లోపే మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కొని ఉడాయించారు. ...ఇటీవల కాలంలో చైన్‌స్నాచింగ్ సంఘటనల తీరు ఆందోళన కలిగిస్తోంది. ద్విచక్ర వాహనాలపై వెళుతున్న మహిళలనే టార్గెట్‌గా చేసుకుని దొంగలు దోపిడీలకు పాల్పడుతున్నారు. ఒక ఘటనలో ఏకంగా మహిళ ప్రాణాలే పోయాయి. దొంగ ఇప్పటివరకు దొరకలేదు. రెండో ఘటనలోనూ దొంగ పోలీసులకు చిక్కలేదు. మూడో ఘటనలో ఏకంగా బాధితురాలిని వెంబడించి మరీ దోపిడీకి పాల్పడడం పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నెలలో బంగారు ఆభరణాల దొంగతనాలు పెరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని విభాగాల అధికారులు చైన్‌స్నాచర్ల కోసం వేట సాగిస్తున్నారు. వారు సీసీలకు చిక్కిన దృశ్యాలను కూడా మీడియాకు విడుదల చేశారు. అయినా నిందితులు చిక్కకపోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది. నేరచరిత్ర లేని వ్యక్తులుఇవి చేస్తుండటంతో పట్టుకోవడం కష్టంగా మారిందని వారు చెబుతున్నారు. రోడ్డెక్కాలంటే భయం.. మహిళలు రోడ్డెక్కాలంటే ఒకటికినాలుగు... కాదు కాదు వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. కనీసం వంట సామానుల కోసం వీధిలోకి రావాలన్నా భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నెలలో పదుల సంఖ్యలో జరిగిన చైన్‌స్నాచింగ్ ఘటనలు మహిళలను కలవరానికి గురి చేస్తున్నాయి. ఇటీవల కాలంలో దోపిడీకి పాల్పడుతున్న అగంతకులు ఆభరణాలు దోచుకునే క్రమంలో దాడికి దిగుతున్నారు. దీంతో మహిళలు గాయపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు మీదకు వస్తోంది. సంఖ్య తగ్గినా... పోలీసు రికార్డుల ప్రకారం గతంతో పోల్చితే ఈ ఏడాది చైన్‌స్నాచింగ్ ఘటనలు తగ్గినట్లు తెలుస్తోంది. 2014 జనవరి నుంచి జూలై వరకు 582 కేసులు నమోదవగా... ఈ ఏడాది కేవలం 152 మాత్రమే చోటు చేసుకున్నాయి. నగలు లాక్కెళ్లేటప్పుడు ప్రతిఘటిస్తే ఏకంగా ప్రాణం తీస్తామని నిందితులు పరోక్షంగా భయపెడుతున్నారు. దొంగతనాలకు పాల్పడే వారిపై పీడీ చట్టాన్ని ప్రయోగిస్తున్న పోలీసులు.. చైన్స్నాచర్లకు ఇది వర్తింపజేయడం లేదు. స్నాచర్లపై మామూలు కేసులు పెట్టడంతో చాలా సులభంగా బెయిల్‌పై విడుదలై... మళ్లీ ఆగడాలకు పాల్పడుతున్నారు. వీరిపై పోలీసుల దృష్టి కూడా అంతంతమాత్రంగా ఉంటోంది. ఏదో కేసులో పట్టుబడితేనే వారి వివరాలు తెలుస్తున్నాయి. ఇటీవల పోలీసులు పట్టుకున్న ఘరానా గొలుసు దొంగ లాంబ... నాలుగు వందలకు పైగా నేరాలకు పాల్పడ్డాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో దొంగ అరవై చోరీలు పూర్తి చేస్తే కానీ పోలీసులు గుర్తు పట్టలేకపోయారు. భయంతోనేనా? బంగారం బరువు ఎక్కువ ఉండే గొలుసులనే దొంగలు టార్గెట్ చేస్తున్నారు. తక్కువ రిస్కుతో ఎక్కువ మొత్తం సంపాదించే యత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో బాధితులు ఎక్కడ ప్రతిఘటిస్తారోనన్న భయంతో దాడికి దిగుతున్నారు. గాయపడిన బాధితురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు తోటి వారు ప్రాధాన్యమిస్తుండటంతో దొంగలు పారిపోవడం మరింత సులువవుతోంది. విలాసాల కోసం... వారాంతాల్లో ప్రధాన రహదారుల్లో అర్ధరాత్రి, తెల్లవారుజామున బైక్ రేసింగ్లలో పాల్గొనే కుర్రాళ్లు జల్సాల కోసం చోరీల బాట పట్టినట్టు తెలుస్తోంది. విలాసాల కోసం వీళ్లు అప్పుడప్పుడు ఈ పని చేస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కొత్తవారు కావడంతో వీరిని పట్టుకునేందుకు పోలీసులు తంటాలు పడుతున్నారు. రెప్ప పాటులో మహిళల వద్దకు చేరుకోవడం, గొలుసులు లాగేసుకోవడం, నెట్టేయడం చకచకా చేసేసి కనిపించకుండాపోతున్నారు. చిలకలగూడ, మారేడ్‌పల్లి. బేగంపేట, నారాయణగూడ, చిక్కడపల్లి, అబిడ్స్, నాంపల్లి, సైఫాబాద్, పంజగుట్ట, ఎస్సార్‌నగర్, అంబర్‌పేట, హబ్సిగూడ, నల్లకుంట ప్రాంతాలు...శివారు ప్రాంతాలు ఎల్బీనగర్, చైతన్యపురి, కర్మన్‌ఘాట్, అల్వాల్, ఏఎస్ రావు నగర్, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, జీడిమెట్ల, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో చెయిన్ స్నాచర్లు రెచ్చిపోతున్న ఘటనలు నమోదవుతున్నాయి. కఠినంగా శిక్షించాలి చైన్‌స్నాచర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ఎవరినీ వదలడం లేదు. గత ఏడాది ఫ్రెండ్స్‌తో కలిసి యూసుఫ్‌గూడలో నడిచి వెళుతుండగా పది తులాల బంగారు గొలుసులను దొంగలు లాక్కెళ్లారు. మెడ మీద చిన్న గాయమైంది. పోలీసులకు ఫిర్యాదు చేశా. ఇప్పటి వరకు నాలుగు తులాలు తిరిగి అప్పగించారు. ఇంకా ఆరు తులాల గొలుసు దొరకలేదు. చైన్స్నాచర్లను కఠినంగా శిక్షించే చట్టాలు తీసుకురావాలి. -శ్రీలక్షి్ష్మ, సినీ నటి -
ఇలా వెళ్లి.. అలా వస్తున్నారు..
- చైన్స్నాచర్లకు నామమాత్రంగానే శిక్షలు - వెంటనే బెయిల్ - గత మూడేళ్ల రిపోర్టులే నిదర్శనం - తొలిసారిగా ఓ మహిళ మృతి సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ద్విచక్రవాహనాలపై సంచరిస్తూ మహిళలను టార్గెట్ చేస్తున్నారు. బంగారానికి డిమాండ్ ఉండటంతో పాటు సులభంగా విక్రయించడం, ఈ చోరీ కేసులో నామమాత్రపు శిక్షలు పడుతుండటం కూడా వీరి ఆగడాలకు అదుపులేకుండా పోతోంది. కలచివేసిన సుమిత్ర మృతి.. తార్నాక ఎస్బీహెచ్లో తమ ఖాతా వివరాలు తెలుసుకొని తిరిగి కుమారుడితో ద్విచక్రవాహనంపై ఓయూ క్యాంపస్ మీదుగా వెళుతున్న సుమిత్ర మెడలోని బంగారు గొలుసును తెంచే క్రమంలో ఆమెను నెట్టేయడంతో మెదడుకు తీవ్రగాయాలై అపస్మారకస్థితిలోకి వెళ్లింది.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశమైంది. ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న మహిళ చైన్ స్నాచింగ్ ఘటనలో మృతిచెందడంతో ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. బంగారం పోతే మళ్లీ కొనుక్కోవచ్చు.. కానీ పోయిన ప్రాణాన్ని ఎవ్వరూ తెచ్చివ్వగలరూ అంటూ కుటుంబసభ్యులు చేస్తున్న రోదనలు కలచివేస్తున్నాయి. నామమాత్రపు శిక్షలేనా..? 2012లో 667 కేసులు నమోదైతే 304 చార్జిషీట్ దాఖలు వరకు వెళ్లాయి. వీటిలో 53 కేసుల్లో నామమాత్రపు శిక్ష పడింది. 62 వీగిపోగా, రెండు రాజీకి వచ్చాయి. 2013లో 695 కేసులు నమోదైతే 286 చార్జిషీట్లు దాఖలయ్యాయి. 47 కేసుల్లో నిందితులకు శిక్ష పడగా, 34 వీగిపోయాయి. నాలుగు రాజీ కుదిరాయి. 2014లో 555 కేసులు నమోదైతే 104 చార్జిషీట్ దాఖలు వరకు వెళ్లాయి. 15 కేసుల్లో శిక్ష పడగా, నాలుగు వీగిపోయాయి. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 150 కిపైగా బంగారు గొలుసు దొంగతనాలు నమోదయ్యాయి. ఈ కేసుల్లోనూ పెద్ద సంఖ్యల్లో శిక్ష పడిన దాఖలాలు లేవు. ఐపీసీ 382 సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేస్తుండటంతో వీరు జైలుకు అలా వెళ్లి ఇలా బెయిల్ తెచ్చుకుంటున్నారు. శిక్ష కాలం కూడా తక్కువగా ఉండటంతో ఈ నేరాలనే కొనసాగిస్తున్నారు. కొన్ని కేసులు చార్జిషీట్ వరకు కూడా వెళ్లడం లేదు. కొందరు అమ్యామ్యాలు తడిపి కేసుల నుంచి బయటపడుతున్నారు. ఇప్పటివరకు బంగారు గొలుసు దొంగలను పట్టుకొని స్వాధీనం చేసుకున్న సంఘటనలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. తెరపైకి ఐపీసీ 302 సెక్షన్.. సీసీటీవీ కెమెరాలతో భద్రత పటిష్టం చేస్తామని చెబుతున్న సిటీ పోలీసులు కనీసం పోలీసు స్టేషన్ ముందున్న సీసీటీవీ ఫుటేజీలను కూడా వాడటం లేదు. అవి పనిచేసి ఉంటే సుమిత్ర మృతికి కారకుడైన దొంగ దొరికి ఉండే వాడేమో. అయితే ఆధునీకరణ పనులు జరుగుతుండటంతో సీసీటీవీ వైర్లు తెగిపోయి అవి పనిచేయడం లేదని స్థానిక పోలీసులు చెబుతున్నారు. తార్నాకతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు దొంగను పట్టుకుంటామని చెబుతున్నారు. అయితే ఈ ఘటన జరిగి వారం రోజులు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. దొంగ చేతిలో తీవ్రంగా గాయపడ్డ సుమిత్ర చికిత్స పొందుతూ మృతి చెందింది. సంఘటన జరిగినా రోజునా ఐపీసీ 356 సెక్షన్ కింద కేసు నమోదు చేసినా యూనివర్సిటీ పోలీసులు, సుమిత్ర మృతితో తాజాగా ఐపీసీ 302 సెక్షన్ (హత్య కేసు) కింద కేసు నమోదుచేశారు. తొలి సెక్షన్ కింద కేవలం ఆరునెలలే జైలు శిక్ష పడే అవకాశముండగా, తాజాగా నమోదుచేసిన 302 సెక్షన్ కింద యావజ్జీవ కారాగార పడే అవకాశముంది. బాధితురాలి మరణించడంతో నేర తీవ్రతను పెంచుతూ తొలిసారిగా ఐపీసీ 302 సెక్షన్‌ను చైన్ స్నాచర్‌పై నమోదుచేశారు. చాలా బాధగా ఉంది... చైన్ స్నాచింగ్ ఘటనలో మహిళ మృతి చెందడం చాలా బాధగా ఉంది. ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం బహుశా ఇదే మొదటిసారి అనుకుంటున్నా. గొలుసు చోరీలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పొల్చుకుంటే కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరిగిన ఘటనను మేం తీవ్రంగా తీసుకొని ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశాం. దొంగను పట్టుకునేందుకు ఇప్పటికే నగరంలోని వివిధ విభాగాల బృందాలు పనిచేస్తున్నాయి. -స్వాతిలక్రా, అదనపు పోలీసు కమిషనర్, సిట్ అండ్ క్రైమ్స్ -
చైన్‌స్నాచర్ దాడిలో గాయపడిన మహిళ మృతి
-
చైన్‌స్నాచర్ దాడిలో గాయపడిన మహిళ మృతి
హైదరాబాద్: చైన్‌స్నాచర్ దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న సునీత ( 40 ) శనివారం మృతి చెందారు. ఈ నెల 17 న ఓయూ లా కాలేజ్ వద్ద సునీత పై చైన్‌స్నాచర్ దాడి చేశాడు. స్కూటర్ పై వెళ్తున్న ఆమెపై దాడి చేసి 3 తులాల బంగారం దోచుకెళ్లారు. ఈ దాడిలో ఆమె స్కూటర్ పై నుండి కిందపడటంతో తీవ్రంగా గాయపడింది. కోమాలోకి వెళ్లిన సునీత హాస్పిటల్ లో చికత్స పొందుతూ శనివారం మృతి చెందారు. -
బరితెగింపు
నగరంలోని నాలుగు {పాంతాల్లో చైన్‌స్నాచర్ల హల్చల్ గురువారం ఉదయం గంట వ్యవధిలో చేతివాటం ఒకరి పనేనా లేదా ముఠానా..? అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం భయాందోళనలో మహిళలు విజయవాడ సిటీ : చైన్‌స్నాచర్ల విజృంభణతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు ప్రాంతాల్లో గురువారం ఉదయం జరిగిన గొలుసు దొంగతనాలు పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. గురునానక్ రోడ్డులోని గురుద్వార్ వద్ద, అశోక్ నగర్‌లోని వెంకటేశ్వరరావు వీధి, జ్యోతిమహల్ దగ్గరలో, మొగల్రాజపురంలోని శివాలయం వద్ద గురువారం ఉదయం 8.30 నుంచి 9.45 గంటల మధ్యలో ఈ దొంగ తనాలు జరిగాయి. ఈ ప్రాంతాలన్నీ నిత్యం జనసంచారంతో రద్దీగా లేదా ముఠాగా ఏర్పడి చేస్తున్నారా అనే అనుమానాలు పోలీసుల్లో వ్యక్తమవుతున్నాయి. గంటంపావు వ్యవధిలో రూ.5లక్షల విలువైన 20 కాసుల బంగారాన్ని కొట్టేసిన వారికోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పోలీసులకు సవాల్ నేరాలు తగ్గుముఖం పట్టాయంటూ ఊపిరిపీల్చుకుంటున్న పోలీసులకు దొంగలు విసిరిన ఈ సవాల్ ముచ్చెమటలు పట్టిస్తోంది. వెంటనే స్పందించిన పోలీసులు ప్రధాన రహదారులను దిగ్బంధించి, పొరుగు జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. బాధితుల సమాచారం ఆధారంగా ప్రత్యేక బృందాలతో నిందితుల పట్టివేతపై దృష్టిసారించారు. పాత నేరస్తుల చిట్టా బయటకు తీయడంతో పాటు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీసీ టీవీ పుటేజ్‌లు పరిశీలిస్తున్నారు. భయాందోళనలో మహిళలు జన సంచారం ఉన్న సమయంలోనే గొలుసు చోరీలకు తెగబడటంతో నగర మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. ఆకస్మిక పరిణామం నుంచి బాధితులు తేరుకుని కేకలు వేసేలోగానే ఆగంతకుడు కనుమరుగయ్యాడు. కొన్నిచోట్ల ఆగంతకుడ్ని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. ఒకరేనా..? ముఠానా? గోదావరి పుష్కర విధుల కోసం కమిషనరేట్ నుంచి పెద్దసంఖ్యలో పోలీసులు బందోబస్తుకు వెళ్లారు. అలాగే, కొంతకాలంగా నగరంలో నేరాలు తగ్గడంతో పోలీసులు రిలాక్స్‌గా ఉన్నారు. ఇందులో భాగంగా ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య కాలనీలు, ముఖ్య కూడళ్లలో నిఘా పెట్టడం మానేశారు. స్టేషన్ సిబ్బంది గస్తీ కూడా నామమాత్రంగానే ఉంది. సీసీఎస్ పోలీసులు చేపట్టిన చర్యలకు పొరుగు ప్రాంతాల నుంచి నేరస్తుల రాక తగ్గిందనేది వాస్తవం. అందుకే పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ తర్వాత నిఘా, గస్తీకి స్వస్తి చెప్పారు. ఈ క్రమంలోనే ఒకేరోజు నాలుగు గొలుసు దొంగతనాలు జరగడం పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇవన్నీ ఒక్కరే చేసినట్టు భావిస్తున్నా ఆయా ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసం, రాకపోకల సమయంలో రద్దీని దృష్టిలో పెట్టుకుని ముఠా పనిగా అనుమానిస్తున్నారు. పోలీసులను ఏమార్చే క్రమంలో భాగంగానే ఒకే తరహాలో నేరం చేసి ఉంటారని, జరిగిన నేరాలను బట్టి చూస్తే పొరుగు ప్రాంతాల నేరస్తుల ప్రమేయం ఉండొచ్చని అధికారులు అంటున్నారు. డయల్ 100కు సమాచారం ఇవ్వండి గొలుసు చోరీలకు పాల్పడిన ప్రాంతాల్లో నిందితుడ్ని పట్టుకునేందుకు కొందరు యువకులు ప్రయత్నించినట్టు మా దృష్టికి వచ్చింది. ఈ విధంగా నిందితులను గమనించిన వాళ్లు డయల్ 100కు సమాచారం ఇచ్చి పోలీసులకు సహకరించాలి. ఇప్పటికే అనుమానిత వ్యక్తులు, ప్రాంతాలపై నిఘా పెట్టాం. నిందితుల పట్టివేతకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. - జి.రామకోటేశ్వరరావు, అదనపు డీసీపీ(క్రైమ్స్) -
ముగ్గురు చైన్ స్నాచర్ల అరెస్ట్
తెనాలిరూరల్ :ఉన్నత విద్యను అభ్యసించినా, చెడు వ్యసనాల కారణంగా చోరులుగా మారిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ. 6.50 లక్షల విలువైన సొత్తును స్వాధీనపర్చుకున్నారు. ఆ వివరాలను సోమవారం తెనాలి టూ టౌన్ సర్కిల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ(క్రైం) ఎ. శోభామంజరి వెల్లడించారు. గుంటూరుకు చెందిన రాగిపాటి బాలు, జంగం జరియల్, భట్టిప్రోలు మండలం పల్లెకోనకు చెందిన గుంటూరు సురేష్ స్నేహితులు. పాత నేరస్తుడయిన బాలు అలియాస్ బాలయ్య ఆటో నడుపుతుండగా, జరియల్ ఇంజినీరింగ్ చదివాడు. సురేష్ లా విద్యార్థి. జరియల్ మరదలు చెన్నైలో చదువుకుంటోంది. ఆమెకు విలువైన బహుమతులు ఇవ్వాలని, అందుకు పెద్దమొత్తంలో నగదు అవసరమని స్నేహితులకు చెప్పాడు. దీనికితోడు ముగ్గురూ జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆలోచన చేశారు. టీవీ సీరియళ్లలో చూపినట్టు చైన్‌స్నాచింగ్ సులువైన మార్గమని బాలు చెప్పాడు. దీంతో నరసరావుపేట నవోదయ నగర్, అరండల్‌పేట, రేపల్లెలో, మంగళగిరిలోని గాంధీబజారు, మార్కెట్ వద్ద, తెనాలి నందులపేట, కొత్తపేటలలో మహిళల మెడల్లోని బంగారు గొలుసులను లాక్కుని వెళ్లారు. గుంటూరు నల్లపాడులోని ఎంబీటీఎస్ పాలిటెక్నిక్ కళాశాలలో 15 ఎల్సీడీ మానిటర్లు, రెండు సీపీయూలు, ఒక ప్రొజెక్టర్‌ను అపహరించుకెళ్లారు. వీటి మొత్తం విలువ రూ. 6.50 లక్షలు ఉంటుందని ఏఎస్పీ తెలిపారు. నిందితులను సీఐలు కళ్యాణ్‌రాజు, బి. శ్రీనివాసరావు అరెస్ట్ చేశారని వివరించారు. సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. -
వాట్సప్ ఫొటోతో దొరికిపోయిన చైన్ స్నాచర్
జీడిమెట్ల (హైదరాబాద్): నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్‌ను ఓ మహిళ పంపిన వాట్సప్ ఫొటో ఆధారంగా పోలీసులు అదుపులోకి తీసుకుని పీడీ యాక్ట్ కింద శనివారం కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. సూరారం కాలనీకి చెందిన మహేందర్‌సింగ్ చౌడ (28) అనే వ్యక్తి బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయంలో హోంగార్డుగా పని చేస్తూ చైన్ స్నాచింగ్‌లకు తెగబడ్డాడు. హైదరాబాద్, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని మొత్తం 10 పోలీస్స్టేషన్ల పరిధిలో ఏకంగా 36 స్నాచింగ్‌లకు పాల్పడి పోలీసులకు చుక్కలు చూపించాడు. చివరికి పాపం పండి ఓ మహిళ ఇచ్చిన వాట్సప్ ఫొటో మెసెజ్‌తో బండారం బట్టబయలైంది. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే మొత్తం ఒక కిలో 12 తులాల బంగారం రికవరీ అయ్యింది. ఏప్రిల్ నెలలో అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపగా తాజాగా సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ స్నాచర్లపై పీడియాక్ట్ ప్రయోగించారు. -
హోంగార్డ్... కిలోన్నర బంగారం!
హైదరాబాద్: తీగ లాగితే డొంక కదిలిన చందంగా జీడిమెట్ల పోలీసులు ఓ మహిళ ఇచ్చిన చిన్న క్లూ ఆధారంగా విచారణ జరిపి ఇంటి దొంగను పట్టుకుని కేజీన్నర బంగారు నగలు దొంగిలించినట్లు గుర్తించారు. విశ్వసనీయ కథనం ప్రకారం.. బాలానగర్ ఏసీపీ ట్రాఫిక్ పీఎస్‌లో పని చేసే ఓ హోంగార్డు స్నాచర్ అవతారమెత్తి ఉదయం, సాయంత్రం, రాత్రి అనే తేడా లేకుండా రెండేళ్లుగా స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు. కాగా, హెచ్ఏఎల్ కాలనీలో మూడుసార్లు అటు ఇటు వాహనంపై తిరుగుతున్న వ్యక్తిని ఓ మహిళ ఫొటో తీసింది. అర గంట క్రితం జరిగిన ఓ స్నాచింగ్‌పై ఆరా తీస్తున్న పోలీసులకు తన వద్ద ఉన్న కీలక ఆధారాన్ని అందించింది. వెంటనే జీడిమెట్ల పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టి.. సదరు మహిళ ఇచ్చిన ఆధారాల మేరకు ఓ ద్విచక్ర వాహనాన్ని ఆపి..ఓ వ్యక్తి అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారిస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. హోంగార్డుగా ఓ వైపు అధికారులతో శభాష్ అనిపించుకుంటూ.. మరో వైపు స్నాచింగ్‌లకు పాల్పడుతూ పోలీసులకే చుక్కలు చూపిస్తున్న ఇతగాడి బాగోతం చూసి ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు. ఉదయం ఉద్యోగానికి వచ్చే సమయంలో, మధ్యాహ్నం లంచ్, రాత్రి ఇంటికి .. ఇలా ఏ సమయంలో తనకు చిక్కిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేసుకుని ఏకంగా 50కి పైగా స్నాచింగ్‌లకు పాల్పడి దొంగే దొంగ.. దొంగ.. అన్నట్లుగా పోలీస్‌స్టేషన్‌లోనే ఉంటూ ఇతర పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. ఎట్టకేలకు పాపం పండి పోలీసులకు చిక్కగా ఒక్కొక్కటిగా నిజాలు ఒప్పుకోవడంతో ఇప్పుడు విస్తుపోవడం పోలీసుల వంతైంది. అంతే కాదండోయ్ ఇతగాడికి ఇంట్లో (సూరారం) ఇల్లాలు తో పాటు వంటింట్లో (ఎన్ఎల్బీ నగర్) ప్రియురాలు అన్నట్లుగా ఇద్దరితో సహజీవనం చేస్తున్నాడు. స్నాచింగ్‌కు పాల్పడిన సొత్తును బ్యాంకుల్లో, తనకు తెలిసిన స్నేహితులకు, పాన్ బోకర్లకు అమ్మి జల్సాలు చేస్తూ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. పూర్తి వివరాలను సైబరాబాద్ సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇతగాడి భండారాన్ని బయట పెట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. -
చైన్ స్నాచర్కు దేహశుద్ధి!
-
చైన్‌స్నాచర్ల ముఠా అరెస్ట్
ఏలూరు: నిమిషాల వ్యవధిలో మహిళల మెడల్లో ఆభరణాలు అపహరిస్తున్న చైన్‌స్నాచర్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు... తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆనంద్‌నగర్‌లో నివాసం ఉండే వల్లూరి కిషోర్‌కుమార్(బన్ను), ప్రత్తిపాటి విజయ్, ఏలూరుకు చెందిన కాకరపర్తి వెంకన్నలు పాత నేరస్థులు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏర్పడిన పరిచయంతో వీరంతా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో గత ఏడాది డిశెంబరు 25వ తేదీన స్థానిక మార్కండేయస్వామి గుడిదగ్గర విజయ్, బన్నులు మహిళ మెడలోని బంగారు గొలుసు తెంపుకుపోయారు. వెంటనే దొంగిలించిన బంగారంతో రాజమండ్రి వెళ్తూ మార్గమధ్యలో ఏడు గోరీల సెంటర్లో మరో మహిళ మెడలోని గొలుసును కాజేశారు. ఏలూరులో ఉంటోన్న కాకరపర్తి వెంకన్న ఈ ఏడాది ఫిబ్రవరి 14 న ముత్తమ్మగుడి సెంటర్లో ఓ మహిళ మెడలోని గొలుసును అపహరించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దరాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిందితులంతా కలిసి స్మశానంలో దొంగతనానికి ప్రణాళిక సిద్ధం చేస్తూ పోలీసులకు దొరికారు. -
చైన్ స్నాచర్ అరెస్ట్... 12 తులాల బంగారం స్వాధీనం
నల్గోండ: నల్గొండ జిల్లా కోదాడ శివారులో చైన్ స్నాచర్ బి. శివారెడ్డిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 12 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసు స్టేషన్‌కు తరలించిన పోలీసులు శివారెడ్డిని తనదైన శైలిలో విచారిస్తున్నారు. నిందితుడి శివారెడ్డిపై ఇప్పటికే కృష్ణా జిల్లా మైలవరం, ఏ కొండూరు, రెడ్డి గూడెం పోలీసు స్టేషన్లతోపాటు నల్గొండ జిల్లా హుజూర్నగర్, కోదాడ, చిలుకూరు పోలీసు స్టేషన్లలో పలు దొంగతనం కేసులు నమోదయాయి. -
దొంగలు బాబోయ్ దొంగలు
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్ /అర్భన్) :దొంగల స్వైర విహారంతో జిల్లావాసులు బెంబేలె త్తిపోతున్నారు. ఒంటరి గా వెళుతున్న మహిళల మెడలో నగలను బైక్‌లపై దూసుకు వచ్చే చైన్ స్నాచర్లు తెంచుకునిపోతున్నారు. ఎవరైనా వ్యక్తులు భారీ మొత్తంలో నగదు తీసుకు వెళుతుంటే వారిని ఏమార్చి దోపిడీలకు పాల్పడుతున్నారు. రాత్రీ, పగలు భేదం లేకుండా ఇళ్లు, వ్యాపార సంస్థలు, ఏటీఎంలలో సైతం కన్నాలు వేస్తూ దొంగలు ప్రజలను ఠారెత్తిస్తున్నారు. ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, జీపులు కూడా క్షణాలలో మాయం చేస్తున్నారు. రాత్రి వేళ నగరాలు, పట్టణాల శివార్లు, జాతీ య రహదారులపై వెళుతున్న వాహనాలను అడ్డగించి దోపిడీలకు పాల్పడుతున్నారు. ఎవరైనా వ్యక్తులు విలువైన ఆస్తులు, ఆభరణాలు కొనుగోలు చేసేందుకు తెచ్చుకున్న సొమ్ము వాహనాలలో ఉంచితే గద్దల్లా తన్నుకు పోతున్నారు. ఇంకా కొంచెం తెలివి మీరిన దొంగలు ధనిక వర్గాలకు చెందిన చిన్నారులను, వ్యక్తులను కిడ్నాప్ చేసి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి సందర్భాలలో కిడ్నాపర్ల డిమాండ్‌కు అంగీకరించక పోయినా.. పోలీసులను ఆశ్రయించారని తెలిసినా కిడ్నాప్ చేసిన వ్యక్తులను, చిన్నారులను దారుణంగా చంపేందుకు సైతం వెనుకాడక పోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మూడునెలల క్రితం జంగారెడ్డిగూడెంలో ఒక వ్యాపారిని కిడ్నాప్ చేసి అతని కుటుంబ సభ్యులను పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. నిర్ణీత సమయానికి వారు డబ్బు ఇవ్వకపోవడంతో ఆ వ్యాపారిని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. గ్రామాలలోని వ్యవసాయ క్షేత్రాలలో, నగర శివార్లలో ఉండే గృహాలలో దోపిడీకి పాల్పడే క్రమంలో కొన్ని సందర్భాలలో హత్యలు, అత్యాచారాలకు కూడా తెగబడుతున్నారు. చోద్యం చూస్తున్న పోలీసులు కొత్త సంవత్సరంలో ఇప్పటి వరకూ జిల్లావ్యాప్తంగా పలుచోట్ల 50కి పైగా దోపిడీలు, దొంగతనాలు జరిగినా, ఏ ఒక్క కేసులోనూ నిందితులను పట్టుకున్న దాఖలాలు లేవు. జిల్లాలోకి ప్రవేశించే అనుమానిత వ్యక్తులను, అంతర్రాష్ర్ట దొంగలను ఏరివేసేందుకు ఇటీవల పోలీస్ యంత్రాంగం కార్డన్ సెర్చ్ పేరిట నిర్వహించిన తతంగం అంతా ఇంతా కాదు. అయితే ఈ కొత్త కార్యక్రమం కేవలం ప్రచారానికే పరిమితమైందని ప్రజలు భావిస్తున్నారు. తాజాగా ఉండి గ్రామంలో జరిగిన చెయిన్ స్నాచింగ్ ఘటనలో కూడా ఇతర రాష్ట్రాల దొంగలు హల్చల్ చేయడం ప్రజల ఆరోపణలకు ఊతమిస్తోంది. అదే క్రమంలో మంగళవారం రాత్రి భీమడోలులో షట్టర్లు పగులగొట్టి బంగారు ఆభరణాల దుకాణం, బ్రాందీషాపులో జరిగిన దొంగతనాలలో పోలీసింగ్ డొల్లతనం బయటపడిందని జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
చెలరేగిన చైన్ స్నాచర్లు
బెంగళూరు : కేవలం 40 నిమిషాల వ్యవధిలోనే బెంగళూరు చైన్‌స్నాచర్లు చెలరేగిపోయారు. వేర్వేరు ప్రాంతాల్లో మహిళల మెడలోని బంగారు గొలుసులు లాక్కొని ఉడాయించారు. మంగళవారం సాయంత్రం ఆరు నుంచి 6.40 గంటల్లోపు చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా.... సిగ్నల్‌లో : హెచ్ఎస్ఆర్ లేఔట్‌కు చెందిన లెజీనా అనే మహిళ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు కారులో సిల్క్ బోర్డు మీదుగా బయలుదేరారు. సిల్క్‌బోర్డు జంక్షన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్‌లో కారు అద్దం తీసి వేచి ఉన్నారు. ఆ సమయంలో బైక్‌లో అటుగా వచ్చిన ఇద్దరు కారులో ఉన్న ఆమె మెడలో ఉన్న 40 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. ఇంటికి వెలుతుంటే : హెచ్ఆర్బీఆర్ లేఔట్లో నివాసం ఉంటున్న భారతి అనే మహిళ ఏజీఎస్ అనే కార్యాలయంలో పని చేస్తున్నారు. ఈమె మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు కార్యాలయంలో పనిముగించుకుని ఇంటికి బయలుదేరారు. మార్గ మధ్యలో హెచ్ఆర్బీఆర్ లేఔట్లో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమె మెడలో ఉన్న 35 గ్రాముల బంగారు గొలుసు లాక్కోని పరారైనారు. ఇంటి ముందు నిలబడి ఉంటే : త్యాగరాజనగరలోని శాస్త్రినగరలో పద్మావతి అనే మహిళ నివాసం ఉంటున్నారు. ఈమె మంగళవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఇంటి ముందు నిలబడి ఉన్నారు. ఆ సమయంలో బైక్‌లో వెళ్లిన ఇద్దరు నిందితులు అడ్రస్ అడిగే నెపంతో పద్మావతి మెడలో ఉన్న 60 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. విద్యుత్ బిల్లు కట్టి వెలుతుంటే : చిక్కమారనహళ్ళికి చెందిన కోమల మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు తన ఇంటి సమీపంలోని బెంగళూరు ఒన్ కేంద్రంలో విద్యుత్ బిల్లు కట్టి తిరుగు ప్రయానమయ్యారు. మార్గ మధ్యలో బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమె మెడలోని 45 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. పక్కింటి మహిళతో మాట్లాడుతుంటే : కుమారస్వామి లేఔట్‌లోని హర్ష లేఔట్‌కు చెందిన శారద, మంగళవారం సాయంత్రం 6.40 గంటలకు తన పక్కింటి మహిళతో మాట్లాడుకుంటుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమె మెడలోని 65 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించాచు. ఈ ఘటనలపై మడివాళ, హెణ్ణూరు, బెంగళూరు సెంట్రల్, త్యాగరాజనగర, కుమారస్వామి లేఔట్లో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం కూడా... విజయనగర సమీపంలోని గోవిందరాజనగరకు చెందిన ఈశ్వరీ బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు తన ఇంటి ముందు నిలబడి ఉండగా బ్లాక్ పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమెను పలకరించి, అడ్రస్ అడిగే నెపంతో సమీపించారు. ఆమె తనకు తెలియదు అని చెప్పే లోపు ఆమె మెడలో ఉన్న 45 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. ఘటనలో ఈశ్వరీ కిందపడడంతో ఆమె గాయాలయ్యాయి. ప్రశాంత నగర్లోనూ ఉషా అనే మహిళ బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు తన ఇంటి నిలబడి స్నేహితురాలితో మాట్లాడుతుండగా బ్లాక్ పల్సర్‌పై వచ్చిన ఇద్దరు అడ్రస్ అడిగే నెపంతో ఆమె మెడలోని 70 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసినట్లు విజయనగర పోలీసులు తెలిపారు. -
ఫైట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్ అసిస్టెంట్ అరెస్ట్
బద్వేల్: వైఎస్సార్ జిల్లా బద్వేల్ లో చైన్ స్నాచర్ ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 1.35 లక్షల రూపాయల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పెద్దిరెడ్డి ఓబుల్ రెడ్డి ఫైట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్ వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతడు ఎక్కకెక్కడ గొలుసు దొంగతనాలకు పాల్పడనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. -
కిలోమీటరు పరుగెత్తి.. చైన్ స్నాచర్‌ను పట్టింది!
ఎవరైనా మెడలో గొలుసు కొట్టేస్తే ఒక్కసారిగా సాధారణ మహిళలైతే కంగారు పడతారు. ధైర్యవంతులైతే వాళ్ల వెనకాల పడి పట్టుకుంటారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఓ మహిళ ఇలాగే ధైర్యం చూపించి పదిమందికీ ఆదర్శంగా నిలిచారు. తన గొలుసు కొట్టేసిన వాడిని కిలోమీటరు దూరం వరకు వెనక పరుగెత్తి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హరిద్వార్ నగరంలో ప్రైవేటు ట్యూషన్లు చెప్పుకొనే నిర్మలా పండిట్ తన బంధువుల ఇంటికి ఇండోర్ వచ్చారు. బయటకు వెళ్లినప్పుడు ఉన్నట్టుండి ఓ వ్యక్తి వచ్చి ఆమె మెడలో ఉన్న గొలుసు కొట్టేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, అందరిలా భయపడేందుకు బదులు అతడిని కిలోమీటరు దూరం వరకు పరిగెత్తి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆమె ధైర్యానికి మెచ్చుకున్న పోలీసులు 10 వేల రూపాయల రివార్డు ఇచ్చి సత్కరించారు. -
చైన్ స్నాచర్లు.. రెచ్చిపోతున్నారు!
-
ముప్పుతిప్పలు పెట్టి.. దొరికాడు!
స్థానికులకు చిక్కిన స్నాచర్ దూలపల్లి: మహిళ మెడలోని పుస్తెలతాడును దొంగ స్నాచింగ్ చేశాడు. రెండు గంటల పాటు స్థానికులను ముప్పు తిప్పలు పెట్టి చివరకు చిక్కాడు. వివరాలు... దూలపల్లికి చెందిన చింతల సర్వయ్య ఎలక్ట్రీషియన్. ఇతనికి డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద వ్యవసాయ భూమి ఉంది. సోమవారం వరి కోత నిమిత్తం సర్వయ్య భార్య లలిత పొలానికి నడుచుకుంటూ వెళ్తోంది. తుమార్ చెరువు మీదుగా వెళ్తుండగా అప్పటికే కాపు కాసిన చైన్ స్నాచర్ వెనుక నుంచి వచ్చి ఆమె మెడలోని 4 తులాల పుస్తెల తాడు స్నాచింగ్ చేసేందుకు యత్నించాడు. అప్రమత్తమైన లలిత చేతులతో తాడును పట్టుకుని కొద్దిసేపు నిలువరించింది. దీంతో స్నాచర్ లలితను కిందపడేసి కొద్ది దూరం ఇడ్చుకెళ్లాడు. అయినా ఆమె తాడును వదలకుండా ప్రతిఘటించింది. దీంతో స్నాచర్.. లలిత కుడి కంటిపై బలంగా గుద్ది పుస్తెల తాడుతో పరారయ్యాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో పనులు నిర్వహిస్తున్న మహిళలు వచ్చి స్నాచర్‌ను వెంబడిస్తూ పరిగెత్తారు. గ్రామ పొలిమేరలో మల్లన్న గుడి వద్ద ఉన్న అయ్యప్ప స్వాములు కూడా స్నాచర్ కోసం పరిగెత్తారు. ఫోన్ల ద్వారా సమాచారం అందుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. స్నాచర్ దూలపల్లి శ్మశానవాటిక, గంగాస్థాన్, డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్, చర్మాస్ రోడ్డుల గుండా పరిగెడుతూ తప్పించుకున్నాడు. ఎట్టకేలకు చెరువులోని ఓ పొదల మాటున నక్కడంతో గమనించిన స్వాములు యాదగిరి యాదవ్, దేవేందర్‌యాదవ్‌లు స్నాచర్‌ను పట్టుకున్నారు. స్నాచర్ వారి మీద తిరగబడడంతో స్థానికులు దేహశుద్ధి చేశారు. స్నాచర్ జేబులో ఉన్న నాలుగు తులాల పుస్తెల తాడును లలితకు అందజేశారు. అనంతరం పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. స్నాచర్ గతంలో కూడా పలు స్నాచింగ్‌లకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. -
చైన్‌స్నాచర్ శివ కేసులో ముగ్గురి అరెస్ట్
-
చైన్‌స్నాచర్ శివ కేసులో ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: చైన్‌స్నాచర్ శివ గ్యాంగ్ కేసులో మొత్తం ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శివ భార్య నాగలక్ష్మితో పాటు ముత్తూట్ ఫైనాన్స్ ఓంకార్ నగర్ బ్రాంచ్ మేనేజర్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ చంపాపేట బ్రాంచ్ మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3.75 కేజీల బంగారం, రూ.4.5లక్షల నగదు, 2 కార్లు, బైక్‌తో పాటు విలువైన ఫర్నిచర్‌ను స్వాధీనం చేసుకున్నారు. శివ గ్యాంగ్‌పై సుమారు 700 చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ సీవీ ఆనంద్ తెలిపారు. చైన్‌స్నాచర్ శివ ఆగస్ట్‌లో జరిగిన పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే. -
సినీనటి శ్రీ లక్ష్మి గొలుసు అపహరణ
కొనుగోళ్లు జరిపి వస్తుండగా ఘటన హైదరాబాద్: సినీనటి శ్రీలక్ష్మికి చెందిన నగలను ఓ చైన్‌స్నాచర్ అపహరించాడు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో యూసుఫ్‌గూడ వద్ద జరిగింది. ఎస్ఆర్నగర్ పోలీసుల కథనం మేరకు... శ్రీలక్ష్మి , మరోనటి అన్నపూర్ణతో కలిసి తన కారులో శ్రీనగర్‌కాలనీ నుంచి యూసుఫ్‌గూడకు వెళ్తూ దారిలో ఆర్బీఐ క్వార్టర్స్ సమీపంలో కారును నిలిపి రోడ్డు అవతల ఉన్న అయ్యంగార్ బేకరీలో కొనుగోళ్లు జరిపారు. వారు తిరిగి వచ్చాక కారులో అన్నపూర్ణ వెనక సీట్లో కూర్చోగా డ్రైవర్ సీటు ఉన్న డోర్‌ను శ్రీలక్ష్మీ తెరుస్తున్నప్పుడు వెనుక నుంచి నుంచి వచ్చిన ఆగంతకుడు ఆమె మెడలోని 8 తులాల నగలను లాక్కుని, కొద్ది దూరంలో బైక్‌పై సిద్ధంగా ఉన్న అతని అనుచరుడితో కలిసి యూసుఫ్‌గూడ వైపు పారిపోయాడు. ఈ ఘటనతో శ్రీలక్ష్మి కొద్దిసేపటి వరకు తేరుకోలేకపోయారు.అనంతరం ఆమె ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. డీఐ శంకర్ కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం నుంచి యూసుఫ్‌గూడ వరకు ఉన్న సీసీకెమెరా ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా శ్రీలక్ష్మి సాయం కోసం 100కు ఫోన్‌చేసినా పోలీసులు సకాలంలో స్పందించ లేదని తెలుస్తోంది. -
తెగబడిన స్నాచర్లు
పండుగ రోజు శుక్రవారం ఆరు చోట్ల చోరీ ► 28 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లిన వైనం ► ఇదే రీతిలో గుత్తి, గుంతకల్లులో శనివారం ఘటనలు ► కలకలం సృష్టించిన ‘చైన్ బ్యాచ్’ - ఆచూకీ తెలిపితే రూ.25 వేలు పారితోషికం అనంతపురం క్రైం : అనంతపురం నగరంలోని పోలీసులకు వినాయక చవితి పండుగ రోజున చైన్ స్నాచర్లు ఝులక్ ఇచ్చారు. శుక్రవారం ఆరు చోట్ల చోరీలకు తెగబడ్డారు. మహిళలనే లక్ష్యంగా చేసుకుని 28 తులాల బంగారు చైన్లు, తాళి బొట్టు చైన్లు లాక్కెళ్లారు. ఒకచోట దొంగతనం జరిగిందని తెలిసి పోలీసులు అక్కడికి వెళ్లి విచారిస్తుండగానే మరో ప్రాంతంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడి సవాల్ విసిరారు. వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్ ఇలా మూడు పోలీస్స్టేషన్ల పరిధిలోనూ చేతివాటం ప్రదర్శించడం గమనార్హం. ఒకరు బైక్ నడుపుతూ మహిళలకు సమీపంలోకి వెళ్లగా, వెనుక కూర్చొన్న యువకుడు ఒక్క ఉదుటున చైను లాగేసుకుంటూ ఉడాయించారు. కాగా, శనివారం గుత్తి, గుంతకల్లులోనూ ఇదే రీతిలో ఇద్దరు యువకులు చోరీలకు తెగించారు. అన్ని సంఘటనలూ ఒకే రీతిలో జరగడం చూస్తుంటే ఒకే గ్రూపు ఈ ఘటనలకు పాల్పడి ఉంటుందనే నిర్ధారణకు పోలీసులు వచ్చారు. పోలీసులు తెలిపిన మేరకు చైన్‌స్నాచింగ్ ఘటనల వివరాలిలా ఉన్నాయి. ముగ్గు వేస్తుండగా... ఎంపీడీఓ జయరాం భార్య అలివేణి టీచరు. వీరు జీసస్‌నగర్‌లో ఉంటున్నారు. ఉదయం 5-50 గంటల ప్రాంతంలో అలివేణి ఇంటి ముందు ముగ్గు వేస్తోంది. ఒక అపరిచిత వ్యక్తి వచ్చి అలివేణి మెడలో నుంచి బలవంతంగా ఐదు తులాల బంగారు చైను లాక్కుని ఉడాయించాడు. కాస్త దూరంలో మరో వ్యక్తి సిద్ధంగా ఉంచుకున్న బైకులో ఎక్కి వెళ్లిపోయాడు. రెప్పపాటులో కనుమరగయ్యారు. ఆంటీ అని పిలిచి... ఆర్టీసీ బస్టాండు వెనుకవైపు ఉన్న షిరిడీ నగర్లో ఉంటున్న రమాదేవి ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఈమె ఉదయం 6.30 గంటల సమయంలో ఇంటిముందు చెట్టు నుంచి పూలు కోస్తుండగా వెనుకవైపు నుంచి వచ్చిన ఓ వ్యక్తి ‘ఆంటీ...’ అని పిలిచాడు. వెనక్కు తిరిగి చూడగానే ఆమె కాలిపై తొక్కిపెట్టి ఒక్క ఉదుటున మెడలో ఉన్న 7 తులాల బంగారం చైను లాక్కుని వెళ్లాడు. కాస్త దూరంలో మరో వ్యక్తి సిద్ధంగా ఉంచిన బెకైక్కి వెళ్లిపోయాడు. వృద్ధురాలి మెడలోని చైన్ అపహరణ హౌసింగ్ బోర్డులోని ఇండేన్ గ్యాస్ ఎదురుగా రెవెన్యూ కాలనీలో అంజనమ్మ అనే వృద్ధురాలి మెడలో నుంచి మూడు తులాల బంగారు చైనును లాక్కుని ద్విచక్రవాహనం నుంచి ఉడాయించారు. పెద్దావిడ కేకలు వేసినా.. అప్పటికే వారు కనింపిచకుండా వెళ్లిపోయారు. ఇంటిముందు కూర్చుని ఉండగా... శ్రీనగర్‌కాలనీలో వి. పార్వతమ్మ అనే వృద్ధురాలు ఉదయం 7.30 గంటల సమయంలో ఇంటి ముందు వసారాలో కూర్చుని ఉంది. నిర్మానుష్య ప్రదేశం కావడంతో స్నాచర్లు పార్వతమ్మ వద్దకు నేరుగా వచ్చి 4 తులాల బంగారు చైను లాక్కొని పరారయ్యారు. పెద్దావిడ కేకలు వేసినా ఫలితం లేకపోయింది. కసువు ఊడ్చుతున్న మహిళ నుంచి... ఆజాద్‌నగర్‌లో నివాసం ఉంటున్న శారదాంబ వృత్తి రీత్యా టీచరు. ఉదయాన్నే ఇంటి ముందు కసువు ఊడ్చుతోంది. ఆమె వద్దకు వచ్చిన ఆగంతకుడు ఆమె మెడలో నుంచి 5 తులాల బంగారు చైను బలవతంగా లాక్కుని పరిగెత్తాడు. కాస్త దూరంలో ద్విచక్రవాహనంలో సిద్ధంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి పారిపోయాడు. ‘ఎవరు మీరు’ అని అడిగితే... బళ్లారిరోడ్డులోని వైశ్యా బ్యాంకు కాలనీలో నివాసం ఉంటున్న గంగావతి ఉదయం పక్కింట్లోకి వెళ్లింది. అప్పటికే ఆమె ఇంటిముందు ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. తన ఇంట్లోకి వెళ్తూవెళ్తూ ‘ఎవరు మీరు’ అని అడిగింది. సమాధానం చెప్పినట్లే చెప్పి.. దగ్గరకు వచ్చి ఒక్కసారిగా ఆమె మెడలో నుంచి 4 తులాల బంగారు చైనును లాక్కెళ్లారు. ఆమె షాక్ నుంచి తేరుకుని గట్టిగా కేకలు పెట్టేసరికే కనుమరుగయ్యారు. మహిళ మెడలోని బంగారు గొలుసు అపహరణ గుంతకల్లు టౌన్ : పట్టణంలోని గంగానగర్‌కి చెందిన సరళ శనివారం ఉదయం ఇంటి ఆవరణలో గేదెకు పాలు పితుకుతున్న సమయంలో వెనుక నుంచి గుట్టుచప్పుడు కాకుండా వచ్చిన ఓ దుండగుడు ఆమె మెడలోని తులం బంగారు గొలుసును లాక్కుని వెళ్లాడు. సమీపంలో సిద్ధంగా ఉన్న మరో వ్యక్తి పల్సర్ బైక్‌పై ఉడాయించారు. బాధితురాలు ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రూ.60 వేల విలువైన బంగారు చైన్ అపహరణ గుత్తి: గుత్తి ఆర్ఎస్లోని రైల్వే క్వార్టర్స్‌లో రైల్వే ఉద్యోగి ఎల్లప్ప, పార్వతమ్మ దంపతులు నివాసముంటున్నారు. పార్వతమ్మ శనివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో పక్కింటిలోకి వెళుతుండగా ఇద్దరు గుర్తు తెలియని దొంగలు బ్లాక్ కలర్ పల్సర్ బైక్‌లో వచ్చి ఆమె మెడలోని మూడు తులాల బంగారు చైన్‌ను లాక్కెల్లారు. దొంగ దొంగ అని బాధితురాలు గట్టిగా అరిచినా ఎవ్వరూ పట్టించుకోలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆచూకీ తెలిపితే రూ.25 వేలు పారితోషకం చైన్ స్నాచింగ్ ఘటనలను ఎస్పీ రాజశేఖరబాబు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని స్టేషన్లను అప్రమత్తం చేశారు. సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన ముఠా ఆచూకీ తెలిపినా, లేదా పట్టించినా రూ.25 వేలు పారితోషికం ఇస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల ఎస్పీలతో కూడా మాట్లాడి వారిని అప్రమత్తం చేశారు. జిల్లా కేంద్రంలో ‘చైన్ గ్యాంగ్’ కోసం సుమారు 50 బృందాలు గాలింపు చేపట్టాయి. స్నాచింగ్‌లకు పాల్పడిన ముఠా ఉత్తరాది రాష్ట్రాలకు చెందినదిగా అనుమానిస్తున్నారు. నల్ల రంగు ద్విచక్ర వాహనంలోని ఇద్దరు అగంతకుల్లో ఒకరికి బట్టతల ఉందని, హిందీ భాషలో మాట్లాడినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, స్థానిక యువకులే ఈ ఘటనలకు పాల్పడి ఉండవచ్చని, స్థానికేతరులన్నట్లు హిందీలో మట్లాడి ఉండవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా వరుస చోరీలు పోలీసు శాఖ ప్రతిష్టకు మచ్చ తెస్తున్నాయి. -
నఘోరం
వరుస నేరాలతో భీతిల్లుతున్న నగరం పోలీస్‌లకు సవాల్ విసురుతున్న నేరగాళ్లు మొన్న ఫాంహౌస్‌లో.. నిన్న మేడిపల్లిలో అకృత్యాలు చైన్‌స్నాచింగ్‌లు, దోపిడీలు, హత్యలు నిత్యకృత్యం {పేక్షక పాత్రలో పోలీస్ యంత్రాంగం అడుగు బయట పెట్టాలంటే భయం.. కాస్త ఆదమరిస్తే చాలు నగానట్రా మాయం.. మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లారంటే గొలుసుదొంగల చేతివాటం.. మోసాలు, మాయాజాలాలకు లెక్కేలేదు. ఇక భయపెట్టి, బెదిరించి అకృత్యాలు సరేసరి. ఎక్కడా నిర్భయంగా ఉండే పరిస్థితి లేదు. బరితెగించి రెచ్చిపోతున్న నేరగాళ్ల ధాటికి నగరం భీతిల్లుతోంది. ఫ్రెండ్లీ పోలీసింగ్.. ఘటన జరిగిన చోటకు క్షణాల్లో వాలిపోయేలా అధునాతన హంగులు.. నగరం ఒళ్లంతా నిఘా కెమెరాల కళ్లు.. నేరగాళ్ల అకృత్యాలకు చెల్లు అంటూ చెబుతున్న యంత్రాంగానికి ఈ నేరాలు.. ఘోరాలు సవాల్ విసురుతున్నాయి. బరితెగిస్తున్న నేరగాళ్లు కొద్ది రోజులుగా గ్రేటర్ నగరంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. రాజధానిలో భద్రత డొల్ల అని నిరూపిస్తున్నాయి. శామీర్‌పేట శివారులో దొంగనోట్ల ముఠా ఏకంగా పోలీసులపైకే తెగబడిన వైనం శాంతిభద్రతల్ని ప్రశ్నార్థకం చేసింది. దీని తరువాత శంషాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై కరడుగట్టిన చైన్‌స్నాచర్ శివ పోలీస్ ఎన్కౌంటర్లో మృతిచెందాడు. ఈ ఘటన అనంతరం దాదాపు 50 మంది గొలుసుదొంగలపై నిఘా ఉంచామని, అందరి ఆటా కట్టిస్తామని సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. కానీ, నేటికీ నగరంలో గొలుసు దొంగతనాలు ఆగలేదు. వనస్థలిపురంలో దుండగులు సోమవారం ఓ మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసును తెంచుకుపోయారు. మరో మహిళ మంగళసూత్రాన్ని తెంచుకుపోవడానికి విఫలయత్నం చేశారు. మొన్నటికి మొన్న సొంత ఫామ్‌హౌస్‌లోనే స్నేక్‌గ్యాంగ్ చేతిలో ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి నిందితుల కొమ్ము కాశారన్నది తాజాగా వెల్లడైన నిజం. దీన్ని మరవక ముందే మేడిపల్లిలో ఓ గిరిజన మహిళపై ఐదుగురు కీచకులు అకృత్యానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఇక, శనివారం వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘటనలు బెంబేలెత్తించాయి. పట్టపగలే కోఠి ప్రాంతంలో దుండగులు కత్తులతో దాడిచేసి రూ.40 లక్షలు దోచుకుపోయారు. కాచిగూడ బిగ్‌బజార్‌లో రూ.35 లక్షల విలువైన సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను మూటగట్టుకుపోయారు. వ్యవస్థీకృత నేరాలు ఇలా ఉంటే, ఇక క్షణికావేశంలో తనువు చాలిస్తున్న, ఎదుటి వారి ప్రాణాలు తీస్తున్న ఘటనలు కలచివేస్తున్నాయి. -
పోలీసు కస్టడీకి శివ గ్యాంగ్
మూడు రోజులు విచారించనున్న పోలీసులు బంగారం రికవరీ కోసం యత్నాలు సాక్షి, సిటీబ్యూరో: కోర్టు ఆదేశాల మేరకు చర్లపల్లి జైలులో ఉన్న శివ గ్యాంగ్ సభ్యులు ముగ్గురినీ నార్సింగి పోలీసులు సోమవారం కస్టడీలోకి తీసుకున్నారు. వీరిని మూడు రోజుల పాటు విచారించనున్నారు. ఈనెల 15న శంషాబాద్‌లో పోలీసు కాల్పుల్లో కరుడుగట్టిన చైన్‌స్నాచర్ శివ మృతి చెందగా, పోలీసులు అదే రోజు శివ గ్యాంగ్ సభ్యులైన అతని భార్య నాగలక్ష్మి, అనుచరులు జగదీష్, రాజ్‌కుమార్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నార్సింగిలోని వీరింటిని సోదా చేసిన పోలీసులకు ముత్తూట్, శ్రీరామా ఫైనాన్స్ తదితర కంపెనీల్లో తాకట్టుపెట్టిన బంగారు నగల రసీదులతో పాటు ఆయా బ్యాంకుల ఫిక్సిడ్ డిపాజిట్ రసీదులు కూడా దొరికాయి. ఈ రసీదుల ఆధారంగా ఆయా ఫైనాన్స్ కంపెనీల్లో ఉన్న బంగారాన్ని రికవరీ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు నిందితుల నుంచి రూ.30 లక్షల విలువైన బంగారు నగలు, ఖరీదైన వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు మరింత రికవరీపై దృష్టి పెట్టారు. శివ గ్యాంగ్ రెండేళ్లలో కనీసం రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల విలువైన బంగారు నగలు చోరీ చేసిందని విచారణలో తేలింది. దీంతో ఈ బంగారం అంతా రికవరీ చేసేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఒక్క సైబరాబాద్‌లోనే ఈ గ్యాంగ్ 700కుపైగా స్నాచింగ్‌లకు పాల్పడినట్టు నిర్థారించారు. నగర పోలీసు కమిషనరేట్‌తో పాటు రంగారెడ్డి, మెదక్ జిల్లాలలోనూ వీరు పంజా విసిరారు. ఇవన్నీ కలుపుకుంటే కనీసం వెయ్యికిపైగా నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా, రాజేంద్రనగర్ కోర్టు ఆదేశాల మేరకు నిందితులు ముగ్గురినీ కస్టడీలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. విచారణలో వారు వెల్లడించిన అంశాల ఆధారంగా రికవరీ చేస్తారు. దొంగ సొమ్ము ఖరీదు చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేయనున్నారు. శివ తన మకాం పోలీసులకు తెలియకుండా ఉండేందుకు తన సెల్‌ఫోన్‌ను మూడు కిలోమీటర్ల దూరంలోనే స్విచ్ఆఫ్ చేసి ఇంటికి వెళ్లేవాడని, అలాగే ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో మూడు కిలోమీటర్ల దూరం వెళ్లాక ఫోన్ ఆన్ చేసేవాడని తెలిపింది. -
భర్తకు తోడుగా...పతిభక్తి చాటుకున్న నాగలక్ష్మి
ఇదీ గజదొంగ శివ స్నాచింగ్‌ల సంఖ్య భార్య రెక్కీ టార్గెట్ పూర్తిచేసేది శివ, జగదీష్, రాజ్‌కుమార్ ముగ్గురి అరెస్టు సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో చనిపోయిన కరుడుగట్టిన చైన్ స్నాచర్ శివ గ్యాంగ్ సభ్యులు విచారణలో వెల్లడించిన అంశాలు పోలీసుల దిమ్మెతిరిగి పోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఈ గ్యాంగ్ గత రెండేళ్లలో సైబరాబాద్, హైదరాబాద్, మెదక్ జిల్లాలలో 300 వరకు స్నాచింగ్‌లకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుకోగా.. విచారణలో 700 స్నాచింగ్‌లకు పాల్పడినట్లు నిందితులు వెల్లడించారు. ఇందులో సైబరాబాద్ పరిధిలోనే 500 చోరీలకు పాల్పడ్డారు. అందులో ఈ ఏడాది 250 స్నాచింగ్‌లకు పాల్పడి రికార్డు సృష్టించారని క్రైమ్ ఇన్చార్జి డీసీపీ జి.జానకీషర్మిల, ఏసీపీ రామ్ కుమార్‌లు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి శంషాబాద్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో గ్యాంగ్‌లీడర్ శివ మృతి చెందగా అతని భార్య నాగలక్ష్మి (30)తో పాటు అతని ఇద్దరు అనుచరులు జగదీష్ (30), రాజ్‌కుమార్ (23)లను సైబారాబాద్ క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 30 లక్షల విలువైన 30 తులాల బంగారు ఆభరణాలు, రెండు కార్లు, రెండు బైక్‌లతో పాటు అతని ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన ఈ ముగ్గురినీ తిరిగి పోలీసు కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారించే అవకాశాలున్నాయని జానకీషర్మిల అన్నారు. జూనియర్ ఆర్టిస్ట్ అయ్యేందుకు వచ్చి... రాజమండ్రికి చెందిన నాగలక్ష్మి, ఆమె సోదరి జూనియర్ ఆర్టిస్టుల య్యేందుకు 2005లో హై దరాబాద్‌కు వచ్చి కృష్ణానగర్‌లో స్థిరపడ్డారు. సోదరి టీవీ జూనియర్ ఆర్టిస్ట్‌గా చేరింది. కృష్ణానగర్‌లోని బంధువుల వద్దకు వచ్చే క్రమంలో నాగలక్ష్మితో శివకు పరిచయం ఏర్పడి ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్తకు తోడుగా... భర్త చేసే నేరాలలో తాను సైతం పాల్గొని పతిభక్తి చాటుకుంది నాగలక్ష్మి. ఆమె రెక్కీ ని ర్వహించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే శివ అతని అనుచరులు జగదీష్, రాజ్‌కుమార్ రంగంలోకి దిగి స్నాచింగ్ చేసేవారు. బస్తీలు, కాలనీలలో నాగలక్ష్మి తిరుగుతూ స్కూల్, గుడికి వెళ్లేవారిని, ఇంటి ముందు ముగ్గు వేస్తున్న వారిని గుర్తించి భర్తకు సమాచారం చేరవేసేది. వెంటనే ఒక్కరు..లేదా ముగ్గురూ కలిసి వెళ్లి ‘టార్గెట్’ పూర్తి చేసుకెళ్లేవారు. కడచూపునకు సైతం నిరాకరించిన తల్లిదండ్రులు.... నెల్లూరులో ఉంటున్న తల్లిదండ్రులు ప్రసన్న, మస్తానయ్య కుమారుడు శివ నేరబాట పట్టడంతో అతనిపై ఆశలు వదిలేసుకున్నారు. కాల్పుల్లో చనిపోయాడని తెలిసి కన్నీరుపెట్టారు. అయితే, ఆఖరి చూపు చూసేందుకు నిరాకరించారు. దీంతో పోలీసులు శివ మృతదేహా న్ని కృష్ణానగర్‌లో ఉంటున్న తోడల్లుడు దుర్గాప్రసాద్‌కు అప్పగించగా.. ఇక్కడే ఆదివా రం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఒంటరైన కొడుకు... ఒకపక్క తండ్రి శివ మృతదేహం.. మరోపక్క చూద్దామంటే కనిపించని తల్లి నాగలక్ష్మి... దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వారి ఏకైక కుమారుడు శ్రీను (4)ను చూసి స్థానికులు కన్నీరుపెట్టారు. శివ ఇంట్లో పెరుగుతున్న ఉదయ్‌సాయి (8) తోడల్లుడి కుమారుడని తెలిసింది. రికవరీ కోసం ప్రయత్నాలు... వందలాది గొలుసు చోరీలకు పాల్పడిన శివ గ్యాంగ్ నుంచి సొత్తు రికవరీ చేసే పనిలో పడ్డారు క్రైమ్ పోలీసులు. స్నాచింగ్చేసి తెచ్చిన బంగారాన్ని నాగలక్ష్మి ముత్తూట్, శ్రీరామ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టింది. వీటికి సంబంధించిన రసీదులపై నాగలక్షితో పాటు శివ పేరు కూడా ఉన్నాయి. తాకట్టు పెట్టడమే కాకుండా కొంత బంగారాన్ని వీరు విక్రయించి జల్సా చేసినట్టు విచారణలో తేలింది. ఆ 24 మందీ టార్గెట్... నేరగాడు హైదరాబాద్ రావాలంటేనే దడ పుట్టే విధంగా నిఘా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో సైబరాబాద్ పోలీసులు దానికి తగ్గట్టు కార్యాచర ణ రూపొందిస్తున్నారు. శివ బాటలో పయణిస్తున్న 24మంది కరుడుగట్టిన స్నాచర్లను గుర్తించారు. వారి ఫొటోలు, వివరాలను అన్ని శాంతి భద్రతలు, సీసీఎస్ ఠాణాకు సైబారాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం పంపించి అధికారులను అప్రమత్తం చేశారు. వీరిలో ఏ ఒక్కరు కనిపించినా వెంటనే అరెస్టు చేయాలని సూ చించారు. వీరిలో కొందరిపై 100కు పైగా, మరికొందరిపై 50కి పైగా స్నాచింగ్ కేసులున్నాయి. కాగా శివ గ్యాంగ్ బారిన పడిన మహిళలు అభినందులు తెలుపుతూ ఆది వారం సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు ఎస్సెమ్మెస్‌లు పంపారు. శివ గ్యాంగ్ దాడి లో మూడు నెలల క్రితం గాయపడి అప స్మారక స్థితికి చేరిన రాంగోపాల్ భార్య వా రం రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. కాగా, శివ దాడిలో గాయపడిన ఎస్ఐ వెంకట్ ఆస్పత్రిలో కోలు కుంటు న్నాడు -
దొంగ సొమ్ముతో.. దొర బతుకు!
విలాస జీవితం కోసం శివ నేరాల బాట సాక్షి, సిటీబ్యూరో: జల్సాల కోసం జనాలను దోచేశాడు... ఏడు జిల్లాలను వణికించాడు... వందల కేసుల్లో ఇరుక్కున్నాడు.. ఎనిమిదిసార్లు జైలుకెళ్లాడు... అయినా బుద్ధి మారలేదు.. దొంగసొమ్ముతో దొరలా బతకడానికి అలవాటుపడ్డాడు... దోపిడీ సొమ్ము కోసం ఎంతకైనా తెగించాడు... చివరకు పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు. శుక్రవారం అర్ధరాత్రి శంషాబాద్ ఔటర్ రింగురోడ్డులో చనిపోయిన చైన్‌స్నాచర్ శివ నేరచరిత్ర ఇది.. 2002 నుంచే నేరాలబాట... నెల్లూరు జిల్లాకు చెందిన శివకుమార్ తన ఊరుకే చెందిన నారాయణతో కలిసి 2002లో నేరజీవితాన్ని ప్రారంభించాడు. వీరిద్దరు తిరుపతి, నెల్లూరులోని పలు హాస్టళ్లలలో ఉంటూ సెల్ఫోన్లు, లాప్‌టాప్‌లు, పర్సులు దొంగిలించారు. చివరికి తిరుపతి పోలీసులకు చిక్కి జైలుపాలయ్యారు. విడుదలైన తర్వాత నారాయణ సోదరుడు మండపాటి జగదీష్‌తో కలిసి 2004లో హైదరాబాద్ చేరుకుని యూసుఫ్‌గూడ, ఇందిరానగర్, కృష్ణానగర్‌లలో హాస్టల్స్‌ను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతూ జూబ్లీహీల్స్ పోలీసులకు చిక్కాడు. తర్వాత చంచల్‌గూడ జైల్లో శిక్ష అనుభవించి 2005లో విడుదలయ్యాడు. కృష్ణానగర్‌కు చెందిన నాగమణిని ప్రేమవివాహం చేసుకొని తన మకాంను రాజమండ్రికి మార్చాడు. అక్కడ కూడా నారాయణతో కలిసి నేరాలు చేయసాగాడు. ఈ క్రమంలోనే 2006లో నారాయణ మిర్యాలగూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆ తరువాత తన మకాంను హైదరాబాద్‌కు మార్చిన శివ... జగదీష్‌తో కలిసి మాదాపూర్, కూకట్పల్లి, మియాపూర్‌లలో 42 లాప్‌టాప్‌లు చోరీ చేసి మాదాపూర్ పోలీసులకు చిక్కి చర్లపల్లి జైలుకెళ్లాడు. జైలులో వీరిద్దరికి పాత నేరస్తులు ఎమ్.రాజు, డి.మారుతి పరిచయం అయ్యారు. వారితో కలిసి తరువాత స్నాచింగ్‌లకు శ్రీకారం చుట్టారు. 2009లో స్నాచింగ్‌కు పాల్పడుతూ నెల్లూరు, విజయవాడ, తిరుపతి, వైజాగ్ పోలీసులకు పట్టుబడి 2010లో జైలు కెళ్లారు. అక్కడి నుంచి విడుదలై చందానగర్, కూకట్పల్లి, కుషాయిగూడ, మల్కాజ్గిరి పరిధిలో దోపిడీలు చేస్తూ కేపీహెచ్‌బీ పోలీసులకు పట్టుబడి జైలు కెళ్లాడు. విడుదలైన తరువాత మరో స్నాచర్ రాజ్‌కుమార్ వీరికి జతకలిశాడు. ఈ ముగ్గురు హైదరాబాద్, సైబరాబాద్, మెదక్ జిల్లాల్లో రెండేళ్లలో 300కుపైగా స్నాచింగ్‌లకు పాల్పడి పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేశారు. ఏడు జిల్లాల పోలీసుల గాలింపు.. శివ తన అనుచరులతో కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఏడు జిల్లాలలో వందలాది చోరీలకు పాల్పడ్డాడు.ఎనిమిది సార్లు జైలుకు వెళ్లాడు. ఇతడి గ్యాంగ్‌పై 300లకుపైగా స్నాచింగ్ కేసులున్నాయి. శివ కోసం రెండేళ్ల నుంచి తిరుపతి, వైజాగ్, నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్, సైబరాబాద్, మెదక్ పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దింపారు. చివరకు శుక్రవారం అర్ధరాత్రి శంషాబాద్‌లో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులపై కత్తితో దాడి చేసి పారిపోతుండగా సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయాడు. ఇతని ఇద్దరు అనుచరులు జగదీష్(వైజాగ్), రాజ్‌కుమార్(నెల్లూరు)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జల్సా జీవితం...:నార్సింగ్‌లోని శివ ఇంటిపై దాడి చేసిన పోలీసులు అతడి లగ్జరీ జీవితాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అతడి ఇంటి వద్ద రెండు లగ్జరీ కార్లు, స్కూటీతో పాటు ముత్తూట్, శ్రీరామ్ ఫైనాన్ ్సలో రూ.12 లక్షల విలువైన బంగారు ఆభరణాలు కుదువపెట్టిన రసీదులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తుతో గోవా, ఊటీ, కొడెకైనాల్లలో జల్సా చేసినట్లు తెలిసింది. 90 శాతం స్నాచింగ్‌లు శివ సుమారు 400కుపైగా నేరాలకు పాల్పడ్డాడు. అతడి భార్య నాగలక్ష్మితో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నాం. వారిని విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి. సైబరాబాద్‌లో 2013లో 1,024 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. అందులో 55 శాతం కేసులు ఛేదించాం. 2014లో ఇప్పటి వరకు 600 వరకు చైన్‌స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 50 శాతం కేసుల్లో నేరస్తులను గుర్తించాం. మిగలిన స్నాచింగ్కేసుల్లో 90 శాతం శివ గ్యాంగ్ ప్రమేయం ఉంది. - సీవీ ఆనంద్, సైబరాబాద్ కమిషనర్ -
శివ..ఖతర్నాక్
మహిళలే టార్గెట్‌గా గొలుసు దొంగతనాలు 300 నేరాల్లో నిందితుడు సంపన్న జీవితం పోలీస్ కాల్పుల్లో మృతితో కలకలం ఉలిక్కిపడ్డ నార్సింగివాసులు మణికొండ/గచ్చిబౌలి: అతని పేరు శివ. చూడబోతే టిప్‌టాప్.. నార్సింగిలోని విశాల భవనం ఆవరణలో ఖరీదైన రెండు కార్లు.. ద్విచక్ర వాహనాలు.. ఇంట్లో విలువైన ఫర్నిచర్. తరచూ ఫారిన్ ట్రిప్లతో షికార్లు.. ఇంతటి దర్జా, దర్పం వెలగబెట్టే అతను నెలకు లక్షలార్జించే ఉన్నతోద్యోగి కాదు సుమా.. పేరుమోసిన, కరడుగట్టిన చైన్‌స్నాచర్. ఒకటీ రెండూ కాదు ఏకంగా 300 నేరాల్లో నిందితుడు. శుక్రవారం అర్ధరాత్రి శంషాబాద్ సమీపంలో జరిగిన పోలీసు కాల్పుల్లో ఇతను మరణించిన విషయం తెలిసిందే. ఉలిక్కిపడ్డ నార్సింగివాసులు.. చైన్‌స్నాచర్ కె.శివకుమార్ నివాసం నార్సింగి అని తెలియడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఏకంగా ఠాణాకు 50 మీటర్ల దూరంలోనే నివాసం ఉండడం స్థానికులను నివ్వెరపరచింది. శనివారం ఉదయం సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ శంషాబాద్‌లోని సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం మృతుడి ఇంటిని సందర్శించారు. ఆయనతోపాటు మీడియా హడావిడి కన్పించడంతో విషయం తెలుసుకున్న స్థానికులు కంగుతిన్నారు. విలాసవంతమైన జీవితం గడుపుతూ.. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మాదిరిగా సాఫ్ట్‌గా కన్పించే ఈ వ్యక్తి చైన్ స్నాచర్ అని తెలియడంతో ఆశ్చర్యపోవడం వారి వంతైంది. చేసేది చైన్‌స్నాచింగ్... నెల్లూరు జిల్లాకు చెందిన కె.శివ కుమార్ చేసేది చైన్‌స్నాచింగ్. పోలీసు చరిత్రలో ఎక్కడా ఇప్పటివరకు ఇలాంటి కేసు వెలుగు చూడలేదనే చెప్పాలి. అతనికి రెండు కార్లతోపాటు భార్యకు ఓ స్కూటీ, పిల్లలకు సైకిళ్లు, ఎల్ఈడీ టీవీ, ఖరీదైన సోఫాలు, బెడ్రూమ్లో ఏసీ, బాతింగ్ టబ్, అక్వేరియం తదితర వస్తువులన్నీ చూసి పోలీసులే నివ్వెరపోయారు. భార్యాపిల్లలతో ఇతర రాష్ట్రాలతోపాటు విదేశాల్లోను దిగిన ఫొటోలు సైతం లభించాయి. అతని ఇద్దరి పిల్లలను స్థానికంగా ఉన్న వెస్ట్‌సైడ్ పాఠశాలలో చదివిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. శివ 18 రోజుల క్రితమే నెలకు రూ.8,500 అద్దె చెల్లించేందుకు అంగీకరించి ఈ ఇంట్లో చేరాడని స్థానికులు చెబుతున్నారు. నేరం తీరు ఇలా... ఇంటి ముందు ముగ్గులు వేసే వారు, గుడికి వెళ్లే మహిళలు, స్కూల్ పిల్లలకు టిఫిన్ తీసుకెళ్లే తల్లులను శివ టార్గెట్ చేసేవాడు. తన బైక్‌పై ఒక్కడే వచ్చి స్నాచింగ్ చేసి పారిపోయేవాడు. మరో దొంగ జగదీష్‌తో కలిసి స్నాచింగ్ చేసేటప్పుడు శివ నడుచుకుంటూ వెళ్లి మహిళ మెడలో గొలుసు తెంపుకుని పరుగెత్తుకుంటూ వచ్చి అప్పటికే బైక్‌పై సిద్ధంగా ఉన్న జగదీష్‌తో పారిపోయేవాడు. ఇక జగదీష్, రాజ్‌కుమార్, శివలు ముగ్గురు వేటకు వెళ్లేటప్పుడు మాత్రం కారును ఉపయోగించేవారు. చిరునామా అడిగినట్టే అడిగి స్నాచింగ్‌కు పాల్పడి కారులో పారిపోయేవారు. గత నెలలో అల్వాల్‌లో బైక్‌పై వెళ్తున్న దంపతులపై కూడా దాడి చేసి స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయపడ్డ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఎక్కడైనా పది రోజులే... శివ చాలా తెలివిగా వ్యవహరించే వాడు. ఏ ఇంట్లోనూ 10-15 రోజులకు మించి ఉం డడు. ఈ విధంగా పోలీసుల దృష్టిని మరల్చేవాడు. నార్సింగిలోని ఇంటిలోకి కూడా ఇటీవలే అద్దెకు దిగాడు. ఇంటి సామగ్రిని లారీలో తీసుకెళ్తే పట్టుబడతామని భావించేవాడు. ఇల్లు ఖాళీ చేసే సమయంలో సామగ్రిని అక్కడే వదిలేసి వెళ్లేవాడు. సెల్ నెంబర్లను కూడా వారానికోసారి మార్చేవాడు. సంబరాలు చేసుకున్న మహిళలు.. పోలీసు కాల్పుల్లో గొలుసు దొంగ శివ మరణించాడనే విషయం తెలియగానే నగరంలోని పలు ప్రాంతాల్లో మహిళలు సంబరాలు చేసుకున్నారు. మియాపూర్, మాదాపూర్, కేపీహెచ్‌బీ కాలనీలో మహిళలు స్వీట్లు పంచుకుని, బాణ సంచా కాల్చారు. పత్తాలేని 50 మంది స్నాచర్లు... స్నాచర్ శివ చనిపోయినట్టు మీడియాలో రావడంతో సైబరాబాద్, హైదరాబాద్‌లోని సుమారు 50 మంది కరుడుగట్టిన స్నాచర్లు అజ్ఞాతంలోకి వెళ్లారు. స్నాచర్ల కోసం సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తుండడంతో అనుమానించిన పాత నేరస్తులు ఇతర జిల్లాల్లో షెల్టర్ జోన్లోకి వెళ్లినట్టు తెలిసింది. సైబరాబాద్‌లో అఖీలుద్దీన్, హుస్సేన్ లాంబ, వాసిమ్, ముఖేష్‌కుమార్, దస్తగిర్, సయ్యద్ హాజీ, హబీబ్ మోహసిన్, రెనాల్డ్, ప్రసాద్, రాజశేఖర్, అంబాదాస్ పటేల్, షేక్ సుల్తాన్, జుబీర్ బిన్ సలామ్, గడ్డం శ్రీకాంత్, లయీక్ హుస్సేన్, అబ్దుల్ షేక్, చంద్రశేఖర్‌రెడ్డి, సురేందర్, రేవంత్ లోకేష్, సోహల్ సిద్దిక్, సయ్యద్ అస్లమ్, ఎండీ ఉమర్, అబ్రార్, పండపాటి జగదీష్‌లు పరారీలో ఉన్నట్టు సమాచారం. ఇన్స్పెక్టర్ను పరామర్శించిన.. శివ కత్తితో దాడి చేయడంతో ఇన్స్పెక్టర్ నర్సింహారెడ్డి, ఎస్ఐ వెంకటేశ్‌లు గాయపడ్డారు. వీరు గచ్చిబౌలిలోని హిమగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం సైబరాబాద్ కమిషనర్ ఆనంద్, క్రైమ్స్ ఇన్చార్జి డీసీపీ జానకి షర్మిల, డీసీపీ క్రాంతిరాణా టాటా, ఏసీపీ శ్రీధర్, ఇన్స్పెక్టర్ రమేశ్‌కుమార్ వీరిని పరామర్శించారు. ఎవరికి కూడా ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. శివ శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకుపోవడంతో మరణించాడని ఉస్మానియా మార్చురీ వైద్యులు తెలిపారు. -
శివ లైఫ్ స్టయిల్ చూసి ఖాకీలే షాక్!
హైదరాబాద్ : శంషాబాద్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఎన్కౌంటర్లో మృతి చెందిన చైన్ స్నాచర్ శివ లైఫ్ స్టయిల్‌ను చూసి పోలీసులు షాక్ తిన్నారు. నార్సింగ్‌లో శివ అద్దెకుంటున్న త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్‌లో అతని లగ్జరీ జీవితాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అతడు ఉపయోగిస్తున్న ఫర్నిచర్, ప్లాస్మా టీవీ నుంచి అక్వేరియం వరకూ అన్నీ అత్యంత ఖరీదైనవే. అంతే కాకుండా రెండు లగ్జరీ కార్లుతో పాటు ఓ స్పోర్ట్స్ బైక్, స్కూటీని పోలీసులు సీజ్ చేశారు. దొంగతనాలకు పాల్పడే వ్యక్తి విశాలమైన ఇల్లు, కాస్ట్లీ ఇంటీరియర్స్ చూసిన పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఇక చైన్ స్నాచింగ్‌లకు పాల్పడే శివ ఎవరికీ అనుమానం రాకుండా ప్రవర్తించేవాడు. మూడు నెలలకు ఓసారి ఇల్లు మారేవాడు. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసేకునే అతడు... వారిని అడ్రస్ అడుగుతున్నట్లు నటిస్తూ వారి మెడల్లో నుంచి బంగారు ఆభరణాలు లాక్కెళ్లేవాడు. అప్పటికే మరొకరు కారులో సిద్ధంగా ఉండగా, ఆ వాహనంలో శివ ఎస్కేప్ అయ్యేవాడు. అనంతరం బంగారు ఆభరణాలను అమ్మి భార్యా పిల్లలతో ఇతర రాష్ట్రాలకు విహార యాత్రలకు వెళ్లి విలాసవంతమైన జీవితం గడిపేవాడు. అలాగే తన భార్య ఎకౌంట్లో డబ్బులు వేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు. గతంలో ఓసారి పోలీసులకు చిక్కినట్లే చిక్కి శివ... పరారయ్యాడు. రెండు రోజుల క్రితం కూడా కానిస్టేబుల్‌పై అతడు దాడి చేసినట్లు సమాచారం. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు శివ నివాసాన్ని గుర్తించారు. శివ భార్యతో పాటు మరో ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
రెచ్చిపోతున్న చైన్‌స్నాచర్లు
*మహిళలే లక్ష్యంగా గొలుసు దొంగతనాలు * తాడేపల్లిగూడెంలో వారం రోజుల్లో మూడు ఘటనలు తాడేపల్లిగూడెం రూరల్ : తాడేపల్లిగూడెంలో చైన్‌స్నాచర్లు రెచ్చిపోతున్నారు.. ఒంటిపై ఆభరణాలతో నడిచి వెళ్తున్న మహిళలే లక్ష్యంగా దోపిడీలకు తెగబడుతున్నారు. పట్టణంలో వారం రోజుల్లో వ్యవధిలో మూడు ఘటనలు చోటు చేసుకున్నారుు. గురువారం సాయంత్రం స్థానిక వీకర్స్ కాలనీకి చెందిన శ్రీధర గాయత్రి వాణి తన కుమారుడికి సంగీతం నేర్పించేందుకు తె నుకుల కోటయ్య వీధిలో ఉండే టీచర్ ఇంటికి తీసుకెళ్తుండగా.. వీధిలోకి వెళ్లేసరికి ఎదురుగా మోటార్ సైకిల్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని బంగారు సూత్రాల తాడును లాక్కుపోయూడు. గట్టిగా పట్టుకోవడంతో సూత్రాలు ఆమె చేతిలోనే ఉండిపోయాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం పట్టణంలోని కృష్ణుడు చెరువు వద్ద ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి తెంపుకుపోయూడు. వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో మరో చైన్‌స్నాచింగ్ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. వారంలో వరుసగా మూడు చోరీలు జరగడంతో స్థానిక మహిళలు బయటకు రావడానికే భయపడుతున్నారు. ఈ ఘటనలన్నీ పట్టపగలే జరగడం గమనార్హం. చైన్‌స్నాచింగ్‌లపై పోలీస్ నిఘా పెట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. గుండుగొలనులో ఆభరణాల చోరీ భీమడోలు : ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు బీరువాలోని 4 కాసుల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయూరు. భీమడోలు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ అమీర్ తెలిపిన వివరాల ప్రకారం.. గుండుగొలను గ్రామం వేగిరెడ్డివారి వీధిలో నివాసం ఉంటున్న పోలా సింహాచలం కుమార్తె కుసుమకు వివాహం కాగా, కైకరంలోని అత్తారింట్లో ఉంటోంది. అనారోగ్యంగా ఉండడంతో కొద్దిరోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. బుధవారం రాత్రి మెడలోని బంగారు నానుతాడు, చెవిదిద్దెలతో పాటు ఇతర ఆభరణాలను బీరువాలో భద్రపరిచింది. ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో అర్ధరాత్రి సమయంలో లోనికి ప్రవేశించిన దొంగలు బీరువాలో పెట్టిన బంగారు ఆభరణాలను దోచుకుపోయూరు. ఉదయాన్నే నిద్రలేచిన ఇంట్లోని వారంతా బీరువా తలుపులు తెరిచి ఉండడంతో కంగారుపడి ఆభరణాల కోసం వెతికారు. అనంతరం చోరీకి గురైనట్లు గుర్తించి భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ.. కలకలం
విజృంభించిన చైన్ స్నాచర్లు మహిళల నగలు లాక్కొని పరారీ సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు బాధితుల ఫిర్యాదు హైదరాబాద్, న్యూస్‌లైన్ : చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో చైన్ స్నాచర్స్ విరుచుకు పడి పలువురి మహిళల మెడల్లోంచి బంగారు ఆభరణాలు లాక్కొని పారిపోయారు. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం సృష్టించింది. వివరాలివీ.. చెన్నై నుంచి నగరానికి వస్తున్న చెన్నై ఎక్స్‌ప్రెస్ గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పిడుగురాళ్ల స్టేషన్ దాటింది. అసలే ఆ ప్రాంతంలో రైలు మెల్లగా నడుస్తుండటంతో ఉక్కపోత భరించలేని ప్రయాణికులు విండోసైడ్ కిటికీలను తెరిచారు. ఇంతలో రైలులో ఉన్న కొందరు దుండగులు చైన్ లాగడంతో డ్రైవర్ రైలును నిలిపాడు. అంతే ఒక్కసారిగా చైన్‌స్నాచర్లు విరుచుకుపడ్డారు. 7, 10, 11, 12 బోగీల్లో కూర్చున్న మహిళలకు చెందిన బంగారు ఆభరణాలను లాక్కొని పరారయ్యారు. ఫలితంగా అరగంట ఆలుస్యంగా రైలు నగరానికి చేరుకుంది. బాధిత మహిళలు గురువారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకుని ఘటనపై ఇక్కడి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం గుంటూరు రైల్వే పోలీసులకు బదలాయించారు. బాధిత మహిళలు వీరే! సనత్‌నగర్ సమీపంలోని ఫతేనగర్‌కు చెందిన సంగీతకు చెందిన 12 గ్రాముల బంగారు గొలుసు, సికింద్రాబాద్ బౌద్ధనగర్‌కు చెందిన పుష్పలత మెడలోని 17 గ్రాముల బంగారు గొలుసు, యూసుఫ్‌గూడకు చెందిన లక్ష్మి మెడలోని ఏడున్నర తులాల బంగారు గొలుసు, అదేప్రాంతంలోని నివేదన అనే మరో మహిళకు చెందిన 20 గ్రాముల బంగారు గొలుసును దుండగులు లాక్కొని పరారయ్యారు. కాగా ఘటన జరుగుతున్న సమయంలో రైలులో ఒక్క పోలీసూ కనిపించలేదని బాధితురాలు సంగీత ఆరోపించారు. -
చైన్ స్నాచర్లపై ప్రత్యేక దృష్టి
దక్షిణ ఢిల్లీ డీసీపీ జైస్వాల్ న్యూఢిల్లీ: నగరంలో రోజురోజుకీ మితిమీరిపోతున్న చైన్ స్నాచర్ల భరతం పట్టేందుకు క్రైం బ్రాంచి పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. నేరాలు చేసేందుకు నేరస్తులు అనుసరిస్తున్న మార్గంలోనే వారిని నియంత్రించాలని వ్యూహం పన్నారు. ఈ మేరకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటుచేశారు. పోలీసుల వ్యూహం ఫలించింది. దక్షిణ ఢిల్లీలో సుమారు 50కి పైగా చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడైన గౌరవ్ చిక్నా(24) అనే స్నాచర్‌ను ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందం అరెస్టు చేసింది. అతడి వద్ద ఒక తుపాకీ, రూ. 8 లక్షల విలువచేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (దక్షిణ) బి.ఎస్.జైస్వాల్ మాట్లాడుతూ దక్షిణ ఢిల్లీలో పలుచోట్ల చైన్ స్నాచింగ్ కేసుల నమోదు ఎక్కువయ్యాయన్నారు.నిందితులు ముఖ్యంగా ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారు తేరుకునేలోపే మెడల్లోని చైన్లను లాక్కుపోతున్నారన్నారు. చాలా కేసుల్లో దొంగలు ద్విచక్రవాహనాలపై రోడ్డుకు రాంగ్ సైడ్‌లో వచ్చి ఈ ఘటనలకు పాల్పడుతున్నారు. రాంగ్‌సైడ్‌లో వస్తే దొంగతనం చేసిన తర్వాత సులభంగా తప్పించుకు పారిపోవచ్చని వారి ఆలోచన అన్నారు. దీంతో, దొంగల వ్యూహాలను పరిశీలించిన తర్వాత తాము కూడా అదే మార్గంలో పయనించి, దొంగలను అరెస్టు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు 30 బృందాలను ఏర్పాటుచేశామని, వారికి అతివేగంగా వెళ్లే మోటార్‌సైకిళ్లను అందజేశామన్నారు. ఒక్కో బృందంలో ఇద్దరు పోలీసులు ఉంటారని, వారికి ఆయుధాలు, వైర్లెస్ సెట్లు అందజేశామన్నారు. వీరు బిజీ రోడ్లలో సాధారణ పౌరులుగా తిరుగాడుతూ రోడ్డుపై వెళుతున్న మహిళలపై నిఘా పెడతారన్నారు. ఎట్టకేలకు తమ వ్యూహం ఫలించిందని డీసీపీ తెలిపారు. ఎన్‌హెచ్-8కు సమీపంలోని శంకర్ విహార్ ప్రాంతంలో మహిళ మెడలో చైన్ తెంపుకుపోయేందుకు ద్విచక్రవాహనంపై నుంచి దిగిన గౌరవ్ చిక్నాను తమ పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. అతడివద్ద బుల్లెట్లతో నిండి ఉన్న పిస్టల్, బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నామన్నారు. పోలీసుల ఉనికిని గ్రహించిన రెండో దొంగ జావెద్ బైక్‌పై తప్పించుకు పారిపోయాడని తెలిపారు. నిందితుడిని పోలీసుల పద్ధతిలో విచారించగా జెరెరాకు చెందిన సుమారు 8 మంది సభ్యులున్న బడా గౌరవ్ గ్యాంగ్‌లో తాను కూడా సభ్యుడినని చిక్నా చెప్పాడన్నారు. పలు చైన్ స్నాచింగ్, దొంగతనాలు, హత్య కేసుల్లో నిందితుడైన బడా గౌరవ్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. దీంతో గ్యాంగ్ బాధ్యతలను తాను తీసుకున్నట్టు చిక్నా చెప్పాడని డీసీపీ వివరించారు. గ్యాంగ్ సభ్యులందరూ దక్షిణ ఢిల్లీ, నైరుతి ఢిల్లీ ప్రాంతాల్లో పలు చోట్ల చైన్ దొంగతనాలకు పాల్పడుతుంటారని, కొట్టేసిన దాంట్లో కొంత భాగం తమ నాయకుడు బడా గౌరవ్‌కు అందజేస్తారని వివరించాడన్నారు. కాగా, ముఠాలోని మిగిలిన సభ్యులను కూడా త్వరలోనే పట్టుకుని వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుంటామని జైస్వాల్ చెప్పారు. -
రూ.4.53 కోట్ల బంగారం ‘లాక్కుపోయారు’!
=నగరంలో పేట్రేగుతున్న చైన్‌స్నాచర్లు =నానాటికీ పెరిగిపోతున్న కేసులు సంఖ్య =‘ఉపశమనం’ లభిస్తున్నది సగం మందికే =కట్టడి చేయలేక తలలు పట్టుకుంటున్న పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: చైన్ స్నాచింగ్...పోలీసు దృష్టిలో ఇది ఒక బంగారు గొలుసు చోరీ కేసు మాత్రమే. సా మాన్యుడికి మాత్రం కొన్ని నెలల కష్టార్జీతం... మహిళలకు సెంటిమెంట్. ఎప్పటికప్పుడు తమ పంథా మార్చుకుంటూ సిటీలో రెచ్చిపోతున్న స్నాచర్లు ప్రజలతో పాటు పోలీసులకూ ముచ్చెమటలు పట్టిస్తున్నారు. గతేడాది (2013)లో వివిధ నేరాల్లో నగరవాసులు కో ల్పోయిన మొత్తం రూ.42.66 కోట్లు కాగా... ఇందులో స్నాచర్లు‘లాక్కుపోయింది’రూ. 4.53 కోట్లకు పైగా ఉంది. అంటే... మొత్తం పోయిన సొత్తులో 10.62 శాతం. పోలీసు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న వీరికి కట్టడి చేయడంలో ఘో రంగా విఫలమతువున్న అధికారులు ఏం చే యాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. విద్యార్థులతో సహా కొత్తవారెందరో... స్నాచింగ్ చేసేటప్పుడు, ఆ తర్వాత పట్టుబడే అవకాశాలు తక్కువగా ఉండటం, మార్కెట్లో బంగారం ధరలు జెట్ కంటే స్పీడ్‌తో దూసుకుపోతుండటంతో పాత నేరస్తులే కాదు... కొత్తవారూ స్నాచర్లుగా మారుతున్నారు. ఎలాంటి నేరచరిత్ర లేని వారు, విద్యార్థులు కూడా దురలవాట్లకు బానిసలై స్నాచింగ్‌ల బాట పడుతున్నారు. ఇది పోలీసులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. కొత్త దొంగల వివరాలు, వేలిముద్రలు వంటి సమాచారం పోలీసు రికార్డుల్లో ఉండకపోవడంతో వీరిని గుర్తించడం, పట్టుకోవడం కష్టమవుతోంది. దీంతో పోలీసులకు చిక్కేవరకు నేరాలు చేస్తున్నారు. పోలీసు యాక్షన్... స్నాచర్ల రియాక్షన్... స్నాచింగ్స్‌ను అరికట్టేందుకు పోలీసులు వేస్తున్న ఎత్తులకు స్నాచర్లు పైఎత్తులు వేస్తున్నారు. చోరీలు జరిగే ప్రాంతాల్లో మఫ్టీ పోలీసుల్ని మోహరించడంతో పాటు మహిళా పోలీసులే సాధారణ దుస్తుల్లో నగలు ధరించి వెళ్తూ డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇది గమనించిన దొంగలు పోలీసుల ఎత్తులకు పైఎత్తు వేసి.. తాము స్నాచింగ్ చేయబోయే ప్రాంతంలో ముందుగా తమ ముఠా సభ్యులతో రెక్కీ చేయించి పరిస్థితులను గమనించి తర్వాత పంజా విసురుతున్నారు. కొన్నిసార్లు ఇళ్ల వద్ద ఉన్న మహిళల మెడలోని గొలుసులు తెంచుకుపోతున్నారు. ముఖ్యంగా పశ్చిమ, తూర్పు మండలాలతో పాటు సైబరాబాద్‌లోనూ వీరి బెడద ఎక్కువగా ఉంటోంది. సగం కూడా కొలిక్కిరాని వైనం... అసలే నగరంలో జరుగుతున్న వరుస దోపిడీలు, దొంగతనాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న పోలీసులకు స్నాచింగ్స్ కొత్త తలనొప్పుల్ని తెచ్చిపెడుతున్నాయి. వీరిని పట్టుకోవడం, కట్టడిచేయడంలో సఫలీకృతులు కాలేకపోతున్నారు. గడిచిన మూడేళ్లలో నగర కమిషనరేట్ పరిధిలో 2250 స్నాచింగ్ కేసులు నమోదు కాగా... వీటిలో కొలిక్కి చేరినవి కేవలం 995 మాత్రమే. మిగిలిన బాధితులకు న్యాయం జరగలేదు. 2005లో 332గా ఉన్న స్నాచింగ్స్ సంఖ్య గతేడాది 742కు చేరింది. చిక్కుతున్న నేరగాళ్లకూ కోర్టులో శిక్ష పడేలా చేయడంలో పోలీసులు విఫలం అవుతున్నారు. ఏటా నమోదవుతున్న స్నాచింగ్ కేసుల్లో నేరం నిరూపితమవుతున్నవి 20 శాతానికి మించట్లేదు. ‘దోపిడీ’ నమోదుకు వెనుకడుగు... స్నాచర్స్‌ను పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి పోలీసులు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కోణంలో పోలీసులు ఆలోచిస్తున్న దాఖలాలు లేవు. స్నాచింగ్‌కు పాల్పడి చిక్కిన వారిపై ప్రస్తుతం ఐపీసీలోని 379 (చోరీ) సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తుండటంతో తేలిగ్గా బెయిల్ పొందుతున్నారు. జైలు నుంచి వచ్చి మళ్లీ చోరీలు చేస్తున్నారు. నేరగాళ్లకు తేలిగ్గా బెయిల్ దొరక్కుండా ఉండటానికి ఇకపై స్నాచింగ్ తీరుతెన్నులను బట్టి దోపిడీ కేసు (ఐపీసీ 392) నమోదు చేయాల్సి ఉంది. ఓ వ్యకి పరోక్షంలో అతడికి చెందిన వస్తువును అనుమతి లేకుండా తీసుకుంటే చోరీ. ఆ వ్యక్తిని బెదిరించి, భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా ఎత్తుకుపోతే అది దోపిడీ. స్నాచింగ్ కూడా ఈ కోవకు చెందిన నేరమే కావడంతో దోపిడీగా కేసు నమోదు చేస్తే నిందితుడికి కఠిన శిక్షపడే అవకాశం ఉంది. -
రూ.37 లక్షల నగలు స్వాధీనం
=గొలుసు దొంగల అరెస్ట్ =రెండు బైక్‌లు స్వాధీనం తిరుపతి క్రైం, న్యూస్‌లైన్: తిరుపతి నగరంలో తెల్లవారుజామున మహిళల మెడల్లోని బంగారు గొలుసులను లాక్కెళుతున్న ముగ్గురు చైన్ స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.37 లక్షల విలువ చేసే 1.25 కిలోల బంగారు నగలను, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను గురువారం అర్బన్ ఎస్పీ రాజశేఖరబాబు మీడియాకు తెలిపారు. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం వెళ్లమద్ది గ్రామానికి చెందిన రాసంపల్లి మంగళ శ్రీనివాసులు అలియాస్ శీను అలియాస్ వాసు(32) తిరుపతి నగరం లో పలు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. ఇతను తెల్లవారుజామున ఇళ్లముందు ముగ్గులు వేస్తున్న మహిళలను, మంచినీటి బోర్ల దగ్గర ఒంటరిగా ఉన్నవారిని ఎంచుకునేవాడు. వారి వద్దకు వచ్చి తాను ఎల్ఐసీ ఏజెంటునని ఫలానా పేరు కలిగిన వ్యక్తి చిరునామా కావాలంటూ మాటల్లో పెట్టి మెడల్లోని బంగారు గొలుసులను తెంచుకుని బైక్‌లో పరారయ్యేవాడు. అప్పటికే అతను వైఎస్ఆర్, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో దాదాపు 60 నేరాలకు పాల్పడి 5 సంవత్సరాలపాటు జైలు శిక్ష అనుభవించి ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలయ్యాడు. తిరుపతి నగరంలో 29 చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. ఈ నగలను పెనుగొండ, ధర్మవరం బ్యాంకులలో కుదవపెట్టి విలాసవంతమైన జీవితం గడుపుతుండేవాడు. తిరుపతి క్రైం డీఎస్పీ ఎంవీఎస్.స్వామి, సీఐలు రంగనాయకులు, గిరిధర్, నాగసుబ్బన్న, ఎస్ఐలు ప్రభాకరరెడ్డి, చంద్రశేఖర్‌పిళ్లై, పోలీస్ సిబ్బంది రేయింబవళ్లు శ్రమించి చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న శ్రీనివాసులును అదుపులోకి తీసుకున్నారు. నగలన్నింటినీ రికవరీ చేశారు. అలాగే తిరుపతి టౌన్ రాజీవ్నగర్గాంధీ కాలనీకి చెందిన బి.వెంకటరమణ(23), రాంప్రసాద్(21)ను బుధవారం ఆదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 13 కేసులకు సంబంధించి 14 బంగారు చైన్లను, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో బైక్‌లో వెళ్లి ఒంటరిగా వెళుతున్న మహిళల మెడల్లోని బంగారు గొలుసులను తెంచుకుని వెళ్లేవారు. అలాగే తిరుమలలో పార్వేటి మండపం వద్ద పాత నేరస్తుడు కుంచం మారయ్య(25)ను గురువారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 5 చోరీలకు సంబంధించిన కేసుల్లో సొత్తును రికవరీ చేశారు. నిందితుడు గుంటూరు జిల్లా నల్లచెరువుకు చెందిన వాడిగా గుర్తించారు. ప్రజలు సహకరించాలి దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు జరిగినపుడు ప్రజలు సహకరిస్తే నిందితులను వీలైనంత త్వరగా పట్టుకునే అవకాశం వుందని ఎస్పీ తెలిపారు. బైక్ నెంబరుగానీ, నిందితుడి ముఖ కవళికలను గానీ తెలియజేయాల న్నారు. నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన పోలీసులకు ఆయన క్యాష్ రివార్డులు అందజేశారు. -
కేసుల పెండెన్సీ తగ్గింపుపై దృష్టి
సాక్షి, సిటీబ్యూరో: ఓ అధికారిపై ఉన్న ఒత్తిడి తగ్గితే పనితీరు మెరుగుపడి బాధితులకు పూర్తిస్థాయి న్యాయం చేయగలుగుతారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న సీసీఎస్ డీసీపీ జి.పాలరాజు కేసుల పెండెన్సీ తగ్గింపుపై దృష్టి పెట్టారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధంచేశారు. పోలీసు కమిషనరేట్‌కు నగర నేర పరిశోధన విభాగం గుండెకాయలాంటిది. భారీ మోసాలతో పాటు రూ.30 లక్షల కంటే ఎక్కువ మొత్తంతో ముడిపడిన నేరాలపై ఈ విభాగం నేరుగా కేసుల్ని నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. మరోపక్క స్థానిక పోలీసుస్టేషన్లలో నమోదైన ఈ స్థాయి కేసులను కూడా సీసీఎస్‌కే బదిలీ చేస్తారు. కారణాల విశ్లేషణ, బృందాలు... ఈ స్థాయి కేసుల దర్యాప్తు పెండింగ్‌లో ఉండటానికి పలు కారణాలుంటున్నాయి. కొన్ని సున్నితమైన కేసుల్లో న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవడం దగ్గర నుంచి నివేదికల రాకలో ఆలస్యం, ఫోరెన్సిక్ రిపోర్టులు పొందడంలో జాప్యం, నిందితులు దొరక్కపోవడం వంటిఅనేక కారణాలతో దర్యాప్తు పూర్తి చేసి చార్జ్షీట్లు దాఖలు చేయలేకపోతున్నారు. వీటిని త్వరగా కొలిక్కి తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డీసీపీ పాలరాజు నిర్ణయించారు. తొలుత పెండింగ్ కేసుల జాబితాను రూపొందించి.. అవి ఏ కారణం వల్ల పరిష్కారం కాలేదన్న లిస్ట్ రూపొందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఇది పూర్తయ్యాక ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. ఫోరెన్సిక్ నివేదికల నుంచి పరారీలో ఉన్న నిందితుల అరెస్టు వరకు ఒక్కో పనిని ఒక్కో బృందానికి అప్పగించాలని నిర్ణయించారు. ఈ జాబితాలోని పెండింగ్ కేసులు కొలిక్కి వచ్చే వరకు ఈ బృందానికి మరో పని అప్పగించరు. అలాగే నిర్ధేశించిన సమయంలో పని పూర్తయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. మరోపక్క నగరంలో చైన్‌స్నాచర్లు, ఇతర నేరగాళ్లు విజృంభిస్తుండటంతో క్రైమ్ వర్క్‌ను పెంచాలని డీసీపీ తమ సిబ్బందిని ఆదేశించారు. పటిష్టమైన ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసి నేరగాళ్ల కార్యకలాపాలకు చెక్ చెప్పాలని స్పష్టం చేశారు. అనివార్య పరిస్థితుల్లో సీసీఎస్ అధికారులకు బందోబస్తులు తప్పట్లేదని, అయితే సాధారణ విధులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యజమానులకు చేరుతున్న వాహనాలు... సీసీఎస్ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలరాజు తీసుకున్న తొలి ప్రయోగం మంచి ఫలితానే ఇచ్చింది. చోరీకి గురైన, నగరంలోని వివిధ ప్రాంతాల్లో గుర్తుతెలియనివిగా దొరికిన వాహనాల జాబితాలను అన్ని ఠాణాలకు పంపి సరిచూడమని ఆయా ఇన్స్పెక్టర్లను కోరారు. ఇలాంటివి మొత్తం 894 వాహనాల ఇంజిన్, చాసిస్ నెంబర్లు, ఇతర వివరాలను ఠాణాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచారు. సదరు వాహన యజమానులు ఆర్టీఏ ఆర్సీ పుస్తకంతో స్థానిక పోలీసు స్టేషన్‌లోని ఈ-కాప్స్‌లో ఉన్న వివరాలతో సరి చూసుకుని తమ వాహనాన్ని తీసుకెళ్లే అవకాశం కల్పించారు. ఫలితంగా వారం రోజుల్లో దాదాపు 60 మంది తమ వాహనాల ఆచూకీ కనుక్కుని తీసుకెళ్లగలిగారు. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని పాలరాజు నిర్ణయించారు. -
ఇద్దరు దొంగల అరెస్ట్
గుడిహత్నూర్, న్యూస్‌లైన్ : బైక్‌లు దొంగిలించి, వాటిపై ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో తిరుగుతూ చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు దొంగలను గుడిహత్నూర్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎస్సై ఎల్.వెంకటరమణ కేసు వివరాలు వెల్లడిం చారు. ఆయన కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని యవత్మాల్ సమీపంలోని రారేగావ్కు చెందిన భగత్ అల్పేశ్(29), పాండ్రకవడకు చెందిన సునీల్(23) ఏడాది నుంచి ఆదిలాబా ద్ పరిసర ప్రాంతాలతోపాటు మండలంలో పలుచోట్ల చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. సో మవారం మండలంలోని చింతగూడ ధంపూర్ అటవీ ప్రాంతంలో మోటార్ సైకిల్‌పై అనుమానాస్పద రీతిలో తిరుగుతుండగా విశ్వసనీ య సమాచారం మేరకు పోలీసులు వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా చోరీ సంఘటనలు వెలుగు చూశాయి. బైక్‌లు.. గొలసులు.. గతేడాది నవంబరు 28న ఆదిలాబాద్‌కు చెందిన తోటి పద్మావతి మండలంలోని వాఘాపూర్ బంధువుల ఇంటికి వెళ్తుండగా సీతాగోంది సమీపంలో అల్పేశ్, సునీల్ ఆమె మెడలో ఉన్న తులం బంగారు గొలుసు తెంపుకుని పారిపోయూరు. ఈ ఏడాది జూన్‌లో ఆదిలాబాద్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉపాధ్యాయురాలి మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసు దొంగిలించారు. గత నెల 28న మండలంలోని కొల్హారికి చెందిన సుధాకర్ ముండే మోటార్ సైకిల్‌ను దొంగిలించారు. అదే బైక్‌పై తిరుగుతుండగా పట్టుకున్నామని ఎస్సై తెలిపారు. వీరు మహారాష్ట్ర ప్రాంతంలో మరో బైక్ దొంగిలించారని పేర్కొన్నారు. వీరి నుంచి రెండు తులాల బంగారం, రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొదట వీరు బైక్‌లు దొంగిలిస్తూ అనంతరం వాటిపై తిరుగుతూ చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారని వివరించారు. నిర్మానుష్య ప్రాంతాల్లో చోరీలకు పాల్పడేవారని తెలిపారు. -
గర్ల్ ఫ్రెండ్స్‌తో తిరిగేందుకు చోరీలు
ముషీరాబాద్ న్యూస్‌లైన్: విలాసాలకు అలవాటుపడి చైన్‌స్నాచింగ్స్ పాల్పడుతున్న ముగ్గురు యువకులు ముషీరాబాద్ పోలీసులకు పట్టుపడ్డారు. పోలీసులు వీరి నుంచి 22 తులాల బంగారు నగలు, 3 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ముషీరాబాద్ పోలీసుస్టేషన్లో ఏసీపీ అమర్‌కాంత్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్, డీఐ హసీబుల్హా నిందితుల వివరాలు వెల్లడించారు... పాతబస్తీలోని సత్తార్‌బాగ్ కు చెందిన షంషుద్దీన్ అలియాస్ టిప్పూ, మహ్మద్ ఇలియాస్, జహనుమాలోని చార్చమన్కు చెందిన మహ్మద్ షోయబ్, ఒట్టేపల్లికి చెందిన మీర్జా హయత్బేగ్ స్నేహితులు. వీరంతా ఇంటర్ ఫెయిల్ అయ్యారు. అందరికీ గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. వారితో జల్సాగా తిరిగేందుకు అవసరమైన డబ్బుల కోసం స్నాచింగ్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. పని ఉందంటూ టిప్పూ తన మామకు చెందిన పల్సర్ బైక్‌ను తీసుకెళ్తున్నాడు. స్నేహితులతో కలిసి దానిపై తిరుగుతూ స్నాచింగ్స్‌కు పాల్పడుతున్నాడు. ఏమీ ఎరుగనట్టు మళ్లీ బైక్‌ను తెచ్చి మామకు అప్పగిస్తున్నాడు. ఈ విధంగా మొత్తం 11 గొలుసు చోరీలకు పాల్పడ్డారు. అలాగే మరో బైక్‌ను దొంగిలించి దానిపై తిరుగుతూ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఇలా ఐదు ఠాణాల పరిధిలో 12 స్నాచింగ్స్ చేసి 22 తులాల బంగారాన్ని అపహరించారు. గాంధీనగర్‌లోని కెనరా బ్యాంక్ వద్ద గురువారం పోలీసులు వాహనాలను తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో నెంబర్ ప్లేట్ లని బైక్‌పై వెళ్తున్న టిప్పూ, షోయబ్, హయత్బేగ్లను పోలీసులు పట్టుకున్నారు. విచారణలో నిందితులు స్నాచింగ్స్ పాల్పడుతున్నట్టు ఒప్పుకున్నారు. మరో నిందితుడు మహ్మద్ ఇలియాస్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
పోలీసుల అదుపులో లేడీ చైన్ స్నాచర్
బొల్లారం, న్యూస్‌లైన్: సంపన్న కుటుంబానికి చెందిన యువతి జల్సాలకు అలవాటు పడి మరో యువకుడితో కలిసి గొలుసు దొంగగా అవతారమెత్తింది. ఇప్పటివరకూ స్నాచింగ్ కింగ్‌లుగా పేరొందిన మగవాళ్ల స్థానంలో ఈ కి‘లేడీ’ ఇట్టే రాణించింది. పలువురి మహిళల పుస్తెల తాళ్లను తెంచేసిన మొట్టమొదటి లేడీ చైన్ స్నాచర్‌గా పేరొందింది. సిటీలో హాట్‌టాపిక్‌గా మారింది. గత కొన్ని నెలలుగా ఖాకీలను ముప్పతిప్పలు పెట్టిన ఈమె ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ముంబై ప్రాంతానికి చెందిన ఈ యువతి(22) తన పాత మిత్రుడితో కలిసి హోండా యాక్టివా సాయంతో స్నాచింగ్‌లకు శ్రీకారం చుట్టింది. గతంలో నగరంలో ఉన్న ఈ యువతి తన విద్యాభ్యాసం అనంతరం కొద్ది రోజులు ప్రైవేటు ఉద్యోగం చేసింది. ఆ సమయంలో నగరంలో ఉన్న ఆమెకు పక్కింటి యువకుడితో పరిచయం ఏర్పడింది. సిటీ నుంచి ముంబై వెళ్లిన ఈ యువతి ఇటీవల నగరానికి తిరిగి వచ్చింది. పాత మిత్రుడితో కలిసి సికింద్రాబాద్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. జల్సాలను తీర్చుకునేందుకు ఈ ఇద్దరూ చైన్ స్నాచింగ్‌లను ఆదాయమార్గంగా ఎంచుకున్నట్లు అదుపులో ఉన్న లేడి స్నాచర్ పోలీసులకు తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. యువతితోపాటు పట్టుబడ్డ యువకుడు సంపన్న కుటుంబానికి చెందిన విద్యార్థని తెలిసింది. వీరి నుంచి పోలీసులు 60 తులాల బంగారం రికవరీ చేసినట్లు సమాచారం.