అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్ | Sakshi
Sakshi News home page

అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్

Published Sun, Jan 10 2016 9:31 PM

ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు

- స్థానికుల నుంచి తప్పించుకోబోయి తీవ్రంగా గాయపడ్డ దొంగ


హైదరాబాద్: మహిళ మెడలో గొలుసు చోరీచేసేందుకు ప్రయత్నించిన అగంతక చైన్ స్నాచర్ ను స్థానికులు పట్టుకున్నారు. ఆదివారం రాత్రి లంగర్‌హౌస్ బాపూ ఘాట్ సమీపంలోని చోటుచేసుకున్న ఈ సంఘటనలో పారిపోయేందుకు ప్రయత్నించిన అగంతకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు.

బాపూఘాట్ వద్ద రోడ్డుపై  నడుచుకుంటూ వెళుతోన్న మహిళ మెడలోని బంగారు చైన్‌ను లాగేసిన స్నాచర్.. పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే చుట్టుపక్కలవారు అప్రమత్తమై దొంగను పట్టుకునే ప్రయత్నం చేశారు. వాళ్లనుంచి తప్పించుకునే క్రమంలో గాంధీనగర్, ప్రశాంత్‌నగర్‌ల మీదుగా లక్ష్మీనగర్ వరకు పరుగులు తీసిన దొంగ.. చివరికి ప్రహరీగోడకు ఉన్న ఇనుప చువ్వలు గుచ్చుకుని ఆగిపోయాడు. అప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన దొంగను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్నాచింగ్ కు పాల్పడ్డ యువకుడు ఎవరనేది ఇంకా తెలియరాలేదని, కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేస్తున్నామని పోలీసులు చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement