సాక్షి,హైదరాబాద్:లంగర్‌హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.మద్యం మత్తులో స్విఫ్ట్‌కారు నడుపుతూ టూ వీలర్‌తో పాటు ఆటోను ఢీకొట్టారు.ఈ ప్రమాదంలో ఇద్దరు నవ దంపతులు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.
టూవీలర్‌పై వెళ్తున్న దంపతులు మొనా(34)& దినేష్(35) అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలు మోనా గర్భవతి కావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతులు మోనా,దినేష్ ఇద్దరిదీ ప్రేమ వివాహం. దినేష్ ఇటీవలే తన పుట్టినరోజు వేడుకల కోసం తన భార్యతో కలిసి లంగర్ హౌస్‌లోని అత్తారింటికి వచ్చాడు.
లంగర్‌హౌస్ నుంచి బంజారాహిల్స్‌కు జూపిటర్ స్కూటీపై బయలుదేరారు. ఈ సమయంలోనే స్విఫ్ట్ కారు ఢీకొట్టింది. మృతులు బంజారాహీల్స్ నంది నగర్ లో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. ఇద్దరు దంపతులు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు.
మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదంలో స్విఫ్ట్ కారు ఢీకొట్టిన ఆటోలో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.గాయపడ్డవారు ఆస్పత్రితో చికిత్సపొందుతున్నారు. కారు డ్రైవర్ పవన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment