langer house police station
-
HYD: లంగర్‌హౌజ్‌లో ‘హిట్ అండ్ రన్’.. దంపతులు మృతి
సాక్షి,హైదరాబాద్:లంగర్‌హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.మద్యం మత్తులో స్విఫ్ట్‌కారు నడుపుతూ టూ వీలర్‌తో పాటు ఆటోను ఢీకొట్టారు.ఈ ప్రమాదంలో ఇద్దరు నవ దంపతులు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.టూవీలర్‌పై వెళ్తున్న దంపతులు మొనా(34)& దినేష్(35) అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలు మోనా గర్భవతి కావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతులు మోనా,దినేష్ ఇద్దరిదీ ప్రేమ వివాహం. దినేష్ ఇటీవలే తన పుట్టినరోజు వేడుకల కోసం తన భార్యతో కలిసి లంగర్ హౌస్‌లోని అత్తారింటికి వచ్చాడు.లంగర్‌హౌస్ నుంచి బంజారాహిల్స్‌కు జూపిటర్ స్కూటీపై బయలుదేరారు. ఈ సమయంలోనే స్విఫ్ట్ కారు ఢీకొట్టింది. మృతులు బంజారాహీల్స్ నంది నగర్ లో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. ఇద్దరు దంపతులు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు.మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదంలో స్విఫ్ట్ కారు ఢీకొట్టిన ఆటోలో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.గాయపడ్డవారు ఆస్పత్రితో చికిత్సపొందుతున్నారు. కారు డ్రైవర్ పవన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
‘డీఎన్ఏ’నా మజాకా!
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షులు ఎదురు తిరగవచ్చు.. కానీ ఆధారాలు మాత్రం ఎప్పటికీ నిజమే చెబుతాయి’ నేర దర్యాప్తులో కీలకమైన ఈ ప్రాథమికాంశం మరోసారి నిరూపితమైంది. లంగర్‌హౌస్ పరిధిలో సోదరిపై అత్యాచారం చేసిన కామాంధుడికి పోక్సో న్యాయస్థానం మంగళవారం జీవితఖైదు విధించిన విషయం విదితమే. ఇందులో బాలిక తల్లి సాక్ష్యం చెప్పకున్నా... తమ కుమార్తెను చెప్పనీయకున్నా... డీఎన్ఏ నివేదికలు మాత్రం నేరం నిరూపించాయి. వీటితో పాటు డాక్టర్ వాంగ్మూలం ఆధారంగా పోక్సో న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చి శిక్ష విధించింది. ఈ కేసు దర్యాప్తులో కీలక భూమిక పోషించిన అప్పటి ఆసిఫ్‌నగర్, ప్రస్తుత సైబర్ క్రైమ్ ఏసీపీ ఆర్జీ శివమారుతిని కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డితో పాటు మహిళా భద్రత విభాగం అదనపు డీజీ షికా గోయల్ అభినందించారు. దారుణానికి ఒడిగట్టిన సోదరుడు.. లంగర్‌హౌస్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు నలుగురు సంతానం. చిన్న కుమార్తె కొన్ని నెలల వయసులో ఉండగానే భర్తకు దూరమైంది. ఈమె కుమారుడు బైక్ మెకానిక్. ఏడో తరగతి చదువుతున్న సోదరిపై ఇతని కన్నుపడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. దాదాపు ఏడాది పాటు ఈ దారుణం కొనసాగించాడు. 2021 మే 20న బాలికలో వస్తున్న మార్పులు గమనించిన ఆమె తల్లి లంగర్‌హౌస్‌లోని ఓ ప్రైవేట్ క్లినిక్‌కు తీసుకువెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఆమె ఆరు నెలల గర్భిణి అని తేల్చారు. దీంతో బాలికను తీసుకుని నిలోఫర్ ఆస్పత్రికి వెళ్లిన ఆమె తల్లి అబార్షన్ చేయాల్సిందిగా కోరింది. కోర్టు ఉత్తర్వులు లేనిదే ఆ పని చేయలేమని వైద్యులు చెప్పడంతో బాధితురాలి తల్లి లంగర్‌హౌస్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన నాటి ఆసిఫ్‌నగర్ ఏసీపీ.. పోక్సో చట్టం కింద నమోదైన ఈ కేసును అప్పటి ఆసిఫ్‌నగర్ ఏసీపీ ఆర్జీ శివమారుతి నేతృత్వంలోని పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు కేసు దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో చార్జ్ట్ దాఖలు చేశారు. దీనికి ముందే బాలిక–ఆమె సోదరుడి నుంచి సేకరించిన నమూనాలకు డీఎన్ఏ పరీక్షలు చేయించి, సారూప్యంగా వచ్చిన ఆ నివేదికను అభియోగపత్రాలకు జత చేశారు. ఈ కేసు పోక్సో కోర్టులో విచారణలో ఉండగా సాక్షిగా హాజరైన బాధితురాలి తల్లి ఎదురు తిరిగింది. పోలీసులకు వ్యతిరకంగా సాక్ష్యం చెప్పింది. కేసు విచారణలో ఉండగానే బాలిక తల్లి తన కుమారుడికి (నిందితుడు) వివాహం చేసింది. పోలీసుల సమన్లు అందుకోకుండా చాలా రోజులు బాలిక వారికి కనిపించకుండా దూరంగా ఉంచింది. ఆ రెండింటి ఆధారంగానే జీవిత ఖైదు... ఘోరం చోటు చేసుకున్న నాటి నుంచి దాదాపు ఏడాది పాటు భరోసా కేంద్రం అధికారులు బాలిక ఆలనాపాలనా చూసుకున్నారు. డీసీపీ డి.కవిత ఈ కేసును క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఆమె తల్లి మాత్రం తన కుమారుడిని రక్షించడం కోసం బాలిక సాక్ష్యం చెప్పకుండా ప్రయతి్నంచింది. ఎట్టకేలకు బాలిక ఆచూకీ కనిపెట్టిన అధికారులు సమన్లు ఇవ్వడంతో ఆమె తల్లి పోక్సో కోర్టుకు తీసుకువచి్చంది. పోలీసుల అభియోగాలకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించింది. అయినప్పటికీ పోలీసులతో పాటు భరోసా కేంద్రం అధికారులు సైతం ఈ కేసు విచారణను కొనసాగించారు. బాలిక– ఆమె సోదరుడి నమూనాలకు సంబంధించిన డీఎన్ఏ రిపోర్టులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్‌తో వాంగ్మూలం ఇప్పించారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా విధించింది. -
లంగర్‌హౌస్‌లో యువకుడు దారుణ హత్య.. ఇటీవలే ప్రేమ వివాహం
హైదరాబాద్: లంగర్‌హౌస్‌లో దారుణ హత్య జరిగింది. కలీమ్ అనే 25 ఏళ్ల యువకుడ్ని దుండగులు కిరాతకంగా గొంతుకోసి చంపారు. ఇతడు ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ ఘటనలో కలీమ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మొత్తం ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కలీమ్ హత్యకు ప్రేమ పెళ్లి కారణమా, లేక వ్యక్తిగత తగాదాలా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: షాకింగ్.. సబ్బు పెట్టెల్లో హెరాయిన్.. రూ.12 కోట్ల డ్రగ్స్ సీజ్.. -
హ్యాండిచ్చిన ప్రియుడు.. కోపంతో రగిలిపోయిన ఆ యువతి కత్తితో..
సాక్షి, హైదరాబాద్: ప్రేమించి మోసం చేశాడని యువకుడిని ఓ యువతి కత్తితో పొడిచిన ఘటన లంగర్‌హౌస్‌లో కలకలం రేపింది. ఘటనపై వివరాలు సేకరించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్న వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ప్రియుడు దూరం పెట్టాడు. తనను మోసం చేస్తున్నాడనే కోపంతో ఆ యువతి కత్తితో దాడి చేసింది. స్థానికులు అప్రమత్తమై ఆ యువకుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. యువతిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. చదవండి: ఫ్యాన్‌కు వేలాడుతూ.. బ్యూటీషియన్ మృతదేహం! వారం తర్వాత.. -
దారుణం : చిన్నారి చేతుల్ని విరిచేసిన కిడ్నాపర్..!
సాక్షి, హైదరాబాద్ : అభంశుభం తెలియని చిన్నారిపై ఓ వ్యక్తి రాక్షసత్వం ప్రదర్శించాడు. ఆమెను కిడ్నాప్ చేసి అతికిరాతంగా రెండు చేతులు విరిచేశాడు. ఈ ఘటన నగరంలోని లంగర్‌హౌజ్‌లో వెలుగుచూసింది. మూడురోజుల క్రితం వైష్ణవి అనే చిన్నారి కిడ్నాప్‌నకు గురైంది. పక్కీరప్ప అనే వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేసినట్టు తెలిసింది. పాప రెండు చేతులు విరిచేసిన కిడ్నాపర్ అనంతరం ఆమెను వదిలేశాడు. తీవ్ర గాయాలతో చిన్నారి తల్లిదండ్రుల కంటబడింది. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇలాంటి దుస్థితి ఏ చిన్నారికి రావొద్దని, నిందితున్ని కఠినంగా శిక్షించాలని వైష్ణవి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పిచ్చి ముసలాయన తనను కిడ్నాప్ చేశాడని, అనంతరం తీవ్రంగా కొట్టి చేతులు విరిచేశాడని వైష్ణవి చెప్పింది. చిన్నారి ప్రాణాలకు ప్రమాదం లేదని, ఆమె చేతులకు సర్జరీ అవసమా లేక కట్లతోనే నయం అవుందా అనే విషయం ఆదివారం చెప్తామని డాక్టర్లు తెలిపారు. -
చిన్నారిపై కిడ్నాపర్ రాక్షసత్వం
-
గొడవ ఆపడానికి వెళ్లిన పోలీసులపై దాడి
సాక్షి, హైదరాబాద్: లంగర్‌హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బాపు ఘాట్ వద్ద ఇరు వర్గాల మధ్య గొడవ జరగుతుండగా.. ఇద్దరు పోలీసులు ఆపడానికి వెళ్లారు. అయితే అక్కడున్నవారు పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో లంగర్‌హౌస్ పీఎస్‌కు చెందిన హోంగార్డ్ ఆమేర్‌కు, నార్సింగి పీఎస్‌కు చెందిన కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. దీంతో వీరిని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
లంగర్‌హౌస్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్ : లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగల్ కా నల్లా పిల్లర్ నెంబర్ 101 సమీపంలోని రింగ్‌రోడ్డు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, యాక్టివా బైక్‌ని ఢీకొట్టిన ఘటనలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. -
భర్త చనిపోయాడనే మనస్తాపంతో..
లంగర్‌హౌస్: భర్త చనిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వృద్ధురాలు(80) భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై జగన్ తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు పట్టణంలో నివాస ముండే జానకమ్మ, వెంకటేశ్వర్లు భార్యభర్తలు. వారి కుమారుడు రాంచందర్ సంవత్సరం క్రితం జీవనోపాధి కోసం నగరానికి వచ్చి లంగర్‌హౌస్ బాపూనగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు.జానకమ్మ భర్త వెంకటేశ్వర్లు గత సంవత్సరం ఆగస్టులో అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి జానకమ్మ లంగర్‌హౌస్‌లోని కుమారుని వద్దనే ఉంటుంది. భర్త బతికి ఉండగానే భార్య చనిపోవాలని, తన భర్తే మొదట చనిపోయాడని జాన కమ్మ తీవ్ర మనోవేదనకు గురయ్యేది. ఇక తాను బతకలేనంటూ అందరికి చెబుతూ బాధపడేది.. పొలం పనులు చూసుకునేందుకు కుమారుడు పది రోజుల క్రితం ఒంగోలు వెళ్లాడు. కోడలు మంగళవారం ఉదయం సంగమం దేవాలయానికి వెళ్లింది. ఇంట్లో ఎవరు లేని విషయం గమనించిన జానకమ్మ రెండతస్తుల భవనం పైకి ఎక్కి అక్కడ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. -
దగ్ధమైన జడ్జి కారు
హైదరాబాద్: ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఆదిలాబాద్ జిల్లా జడ్జి కారు పూర్తిగా దగ్ధమయ్యింది. ప్రమాదం నుంచి జడ్జి తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన శుక్రవారం లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జడ్జి సామ్యూల్ బొగ్గులకుంట నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా కారులో పొగలు రావడంతో డ్రైవర్ ఆపాడు. కొద్ది సేపటికి పొగలు ఆగడంతో కారు స్టార్ట్ చేయగా, మంటలు చెలరేగాయి. జడ్జి, డ్రైవర్ కారు దిగి దూరంగా వెళ్లారు. చూస్తుండగానే కారు కాలి బూడిదయ్యింది. -
చోరీచేసేందుకు ప్రయత్నించిన చైన్ స్నాచర్ మృతి
-
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్
- స్థానికుల నుంచి తప్పించుకోబోయి తీవ్రంగా గాయపడ్డ దొంగ హైదరాబాద్: మహిళ మెడలో గొలుసు చోరీచేసేందుకు ప్రయత్నించిన అగంతక చైన్ స్నాచర్ ను స్థానికులు పట్టుకున్నారు. ఆదివారం రాత్రి లంగర్‌హౌస్ బాపూ ఘాట్ సమీపంలోని చోటుచేసుకున్న ఈ సంఘటనలో పారిపోయేందుకు ప్రయత్నించిన అగంతకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. బాపూఘాట్ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోన్న మహిళ మెడలోని బంగారు చైన్‌ను లాగేసిన స్నాచర్.. పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే చుట్టుపక్కలవారు అప్రమత్తమై దొంగను పట్టుకునే ప్రయత్నం చేశారు. వాళ్లనుంచి తప్పించుకునే క్రమంలో గాంధీనగర్, ప్రశాంత్‌నగర్‌ల మీదుగా లక్ష్మీనగర్ వరకు పరుగులు తీసిన దొంగ.. చివరికి ప్రహరీగోడకు ఉన్న ఇనుప చువ్వలు గుచ్చుకుని ఆగిపోయాడు. అప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన దొంగను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్నాచింగ్ కు పాల్పడ్డ యువకుడు ఎవరనేది ఇంకా తెలియరాలేదని, కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేస్తున్నామని పోలీసులు చెప్పారు.