
సాక్షి, హైదరాబాద్ : అభంశుభం తెలియని చిన్నారిపై ఓ వ్యక్తి రాక్షసత్వం ప్రదర్శించాడు. ఆమెను కిడ్నాప్ చేసి అతికిరాతంగా రెండు చేతులు విరిచేశాడు. ఈ ఘటన నగరంలోని లంగర్‌హౌజ్‌లో వెలుగుచూసింది. మూడురోజుల క్రితం వైష్ణవి అనే చిన్నారి కిడ్నాప్‌నకు గురైంది. పక్కీరప్ప అనే వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేసినట్టు తెలిసింది. పాప రెండు చేతులు విరిచేసిన కిడ్నాపర్ అనంతరం ఆమెను వదిలేశాడు. తీవ్ర గాయాలతో చిన్నారి తల్లిదండ్రుల కంటబడింది. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇలాంటి దుస్థితి ఏ చిన్నారికి రావొద్దని, నిందితున్ని కఠినంగా శిక్షించాలని వైష్ణవి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పిచ్చి ముసలాయన తనను కిడ్నాప్ చేశాడని, అనంతరం తీవ్రంగా కొట్టి చేతులు విరిచేశాడని వైష్ణవి చెప్పింది. చిన్నారి ప్రాణాలకు ప్రమాదం లేదని, ఆమె చేతులకు సర్జరీ అవసమా లేక కట్లతోనే నయం అవుందా అనే విషయం ఆదివారం చెప్తామని డాక్టర్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment